9, జూన్ 2020, మంగళవారం

లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా??


లాభయ్య బాబు, విరంజీవి అనే ఇద్దరు పేద్ద నటులు ఒక చోట సమావేశమయ్యారు.  గత కొద్ధి రోజులుగా వీరిద్దరి మధ్య వైరం రకోనా కన్నా వేగంగా పెరుగుతోందని అన్ని సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు విని కరోనా వైరస్ లాగా దీన్ని కూడా తుంచేయాలని వారిద్దరూ నడుం వాల్చారు. 

ఇప్పటికిప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని లోకానికి ఎలుగెత్తి చాటాలని నిర్ణయించుకున్నారు. 

నేను నిన్నే అరవై క్రాస్ చేశాను మహా అయితే ఇంకో అరవయ్యేళ్లు (నిజ్జంగా నిజం లాభయ్య బాబే అలా అన్నారట ఒక ఇంటర్వ్యూ లోమాత్రమే హీరోగా నటించగలను అనిపిస్తోంది

నేను కూడా  మధ్యే 65 కి దగ్గరయ్యా, నా స్టార్ డం (??)  తో బాక్స్ ఆఫీస్ ని ఇంకో పాతికేళ్ళు  మాత్రమే గడగడ లాడించగలనుకాబట్టి మనం ఎన్ని సినిమాలు చేస్తే కళామతల్లికి అంత సేవ చేసినట్లు

మౌళిరాజా ను పెట్టుకుందామా మన సినిమా తీయడానికి?

మనం కాదు, ఆయనకి ఇప్పుడున్న ఫేమ్ కి మనం ఆయన్ని పెట్టుకునే సీన్ లేదు, ఆయనకి అనిపిస్తేనే మనల్ని పెట్టుకుంటాడు. 

మా బ్లడ్డు, బ్రీడ్ అలాగే మేము తినే బ్రెడ్డు మా రేంజ్ వేరు, అలాంటిది మాకు అంట సీన్ లేదంటావా?

అయినా ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాని పూర్తి చేయడానికే సంవత్సరం పడుతుంది, మనకు కుదరదు. 

మరి వితిక్రమ్ ని ట్రై చేద్దామా?

అతనూ అంతే, మరి నీతో మాంచి హిట్స్ తీసిన బోయటపా?

పెద్ద పెద్ద ఫైటింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తాడు, ఈ కరోనా టైములో అవి షూట్ చేయడానికి టైం పడుతుంది. వినాషక్ ని ట్రై చేద్దామా?

వినాషక్ మన లాంటి ముదురు హీరోలను చూసి ఇన్స్పైర్ అయి ఈ వయసులో కూడా యాక్షన్ హీరో అవ్వాలనుకొని ఒక సినిమాలో హీరో గా చేస్తూ బిజీ గా ఉన్నాడు కాబట్టి వీలుపడదు. 

కరోనాకాలం లో కూడా సినిమా చుట్టేసిన నిర్జీవి మాత్రమే ఇప్పటికిప్పుడు సినిమా తీయగలడు అని ఆయన్ని వెళ్లి కలిశారు. 

మీ ఇద్దరినీ కలిపి సినిమా తీయాలంటే నా లాంటి వాడే సరైన వ్యక్తి. సైరా, శాతకర్ణి కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసినట్లు ఒక కాల్పనిక కథ రాసుకుందాం రెండు సినిమాల్లోని కొన్ని సీన్స్ తీసుకొని నా స్టైల్ ఎడిటింగ్ టచ్ ఇస్తాను. మిగతాది నేను కొంత తీసి అతికిస్తాను. అలాగే వాళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేసే నార్త్ ఇండియన్ క్యారెక్టర్ లో మియతాబ్ ని తీసుకుందాం. తనకి నేను యెంత చెప్తే అంత, నా మాట వింటాడు

మా బుడ్డోడు, రచణ్, విజయ్ గదేవన్ కలిసి నటిస్తున్న RRR సినిమా స్టోరీ లా అనిపిస్తోంది నువ్వు చెప్తున్న కథ వింటుంటే

మరీ మంచిది, బాగా కాంట్రవర్సీ అవుతుంది, నాకు, నా సినిమాకి అదే పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది, నాక్కావలసింది కూడా కాంట్రావర్సీనే. మన కథకు RRR అని కాకుండా SSS ( సైరా శాతకర్ణి సమరం) అని పెట్టుకుందాం. ఇక కథ ప్రకారం హీరోయిన్ గా లాభయ్య బాబు పక్కన ఒక ఫారిన్ పిల్లని తీసుకోవాలి కాబట్టి 'యమా పాలకోవా' ని తీసుకుందాం, మొన్న నా S.G.T , నిన్న నా ఐమాక్స్ సినిమాలో భలే నటించింది

కానీ కోక, రైక అని నా మార్క్ పాట ఒకటి ఉండాలి

యమా పాలకోవా కి అలాంటి పాట సెట్ అవదు, నేను ఇంకో పాట రాసి సెట్ చేస్తా

సరే పాట ఇప్పుడు బాగా పాపులర్ అయినా దిస్ శ్రీశ్యామ్  తో పాడిద్దాం

అవన్నీ అవసరం లేదు, నేను బాగా పాడగలను మొన్నీ మధ్యే రకోనా సైరస్ మీద ఒక పాట పాడా, అది బాగా పాపులర్ అయింది.  

సరే లాభయ్య బాబు పక్కన యమా పాలకోవా ని తీసుకుంటున్నారు కాబట్టి నా పక్కన మన దేవిశ్రీ కూతురు నాజ్వి ని తీసుకోండి, మా జోడి చూడ్డానికి బాగుంటుంది

విషయం నాకొదిలేయ్, గజలోక వీరుడు మతిలేని సుందరి సినిమాలో ఒక రెండు పాటలు తీసుకుని ఎడిటింగ్ చేసి దేవిశ్రీ బదులు దేవిశ్రీ కూతురు డాన్స్ చేసినట్లు ఎడిటింగ్ చేయిద్దాం. ఇలా త్వరగా సినిమా చుట్టేస్తే లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో విడుదల అవుతున్న మొదటి సినిమా మనదే అవుతుంది

అదీ ఈ రోజుకి నాకు తట్టిన తలా తిక్క ఆలోచన నిన్న నిర్జీవి ఇంటర్వ్యూ చూసాక. మరి అలాంటి సినిమా నిజంగానే వస్తే నరసింహనాయుడు + ఇంద్ర అంత హిట్ అవుతుందో లేక ఒక్క మగాడు + మృగరాజు అంత ఫట్టు మంటుందో చూడాలి.  

32 కామెంట్‌లు:

 1. "రామా ఎక్ విగ్గు లా" లాంటి సూపర్హిట్ రోతలు పాడిన మహాయాగకుడు ఇప్పుడు "శవ కంకరీ" అనే టంగసాల పాట్లను పునర్విడుదల చేయడంతో దురదభిమానులకు దండుగే దండుగ. ఎవరు పిలిచినా మానినా, ఇవ్వాళ తెగులు మినిసా గర్హించదగ్గ తద్దినం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు జై గారూ, శివ అన్న దైవవాచకాన్నే శవగా మార్చే మహాత్ములయ్యారు మీరు. ఇంక మీ చేతిలో పడి ఘంటసాల ఖూనీ ఐపోవటంలో ఆశ్చర్యం ఏముంది లెండి.కానివ్వండి కాదేదీ తిట్టు కనర్హం మీకు!

   తొలగించండి
  2. మంచి పాటను ఖూనీ చేసినోడిని వదిలేసి నన్నంటే ఎట్లా సార్!

   తొలగించండి
  3. శివుడు శవాలుండే స్మశానంలొనేకదా నివశిస్తాడు.. ఇంత చిన్న విషయం ఎలా మిస్సయ్యారండీ శ్యామలీయంగారూ? లేక పూతలేసుకోవడం మీబాచ్చి మాత్రమే చెయ్యాలంటారా?

   తొలగించండి
  4. జై గారు, ఒక కొత్త విషయం దొరికిందే పోస్ట్ రాసుకోవడానికి.

   తొలగించండి
  5. క్షమించాలి శ్యామలీయం గారు, అనవసరంగా దేవుడిని మధ్యలోకి లాగినందుకు. జై గారు ఏదో ఫ్లో లో అలా అని ఉంటారు.

   తొలగించండి
  6. ఎవరి మనోభావాలు ఎందుకు ఎట్లా దెబ్బ తింటాయో ఓ పట్టాన తెలువటలేదు. పోనీ శివుడు దేవుడేమో మరి ఘంటసాల కూడా అంతేనా?

   దెబ్బ తిన్నాయే అనుకుందాం, దానికి "తిట్టు" అనే బిరుదు ఇచ్చినందుకు మా మనోభావాలు గాయపడతాయి కదండీ!

   తొలగించండి
  7. ఎవరిక్కడ మనో-భావాలూ, బాలసుబ్రమణ్యం భావాలూ దెబ్బతీసింది?
   అరే, ఇక్కడ దెబ్బతిన్నది కేవలం ఘంఠసాల బావాలూ, పింగలి భావాలు మాత్రమే ...
   మనో-భావాలు ఎవ్వరూ తీయలేదు ..

   తొలగించండి
  8. నాగూరు బాబుకు ఎందరు బావలు ఉన్నారో తెలువదు మిత్రమా.

   తొలగించండి
  9. బాగున్నాయి మీ తెలుగు పదాల ఆటలు.

   తొలగించండి
  10. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా 12 "భావ"లే నండి. ఆయా "భావ"లకు ఏఏ మరదల్ల అను"గ్రహాలు" తిష్ట వేసుక్కూర్చుంటాయి అన్నదాన్ని భట్టి ఉంటుందట, దీనెబ్బ"జీవితం". మిత్ర గ్రహమా, శతృగ్రహమా అని అబ్బో పేద్ద, కొరకరాని"సైన్సు".

   తొలగించండి
  11. శ్రీకాంత్ గారూ, మీ వ్యాఖ్యలో ఒక్క భావం అర్ధం అయితే ఒట్టు! కాకపొతే
   భావి తరానికి బాటలు తీరే కొన్ని భావనలు చెప్పక తప్పడం లేదు.

   భువన భవనానికి అందీ అందనంత ఎత్తులో & బావిలో కప్పలు చేదలేనంత లోతుగా ఉంది మీ భాష్యం.

   నా వంతు ఉడతాభక్తిగా ఇంకొన్ని "మంచి" పాటల ఖూనీ:

   1. నూతిలో తోసేసి చెప్పు బావా
   2. భావాలు సైయ్యా, ముదురోళ్ళు సైయ్యా
   3. బావ బావ భావా, ఏమే ఏమే బాలా
   4. బ బ బ భావ గారూ, "బావు"న్నారా

   PS: 12 భావాలు రాద్దామనుకున్నా, ఎందుకో ఈ రోజు జాతకబలం "బావుం"డక నాలుగిటితో కామా (మన ఇంటావంటా ఫుల్ స్టాపు లేదు!) పెడుతున్నా. తత్తిమ్మావి బావాపిక్కు సీక్వెళ్లలో రాస్తాను, అన్యధా "భా"వించవద్దు.

   తొలగించండి
  12. ముందుగా ఒక మాట.. సరదాగా రాసిన పోస్టు కాబట్టి,నేనూ సరదాగా కామెంట్లెట్టాను.
   పనిలో పనిగా మా పచ్చ బ్యాచ్చుకి కొన్ని చురకలు తగిలించానుకోండి అది వేరే విషయం.

   నాకు అర్థమయ్యింది ఏమిటంటే మీకు జ్యోతిష్య శాస్త్రం మీద బొత్తిగా అవగాహన లేదు.
   "భావా"లను మీరు "బావ"లుగా మార్చేసిన తరువాత నేను కూడా సరదాగా, జ్యోతిష్య శాస్త్రములోని "భావం"లను "బావ"లుగా మార్చేశాను.

   జ్యోతిష్య శాశ్త్రం ప్రకారం పన్నెండు భావాలు.
   https://www.selfrealisation.net/UK/VedicAstrology/bhavas.php

   అందులో ఏ భావములో ఏ గ్రహం ఉంటుంది అనేది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకు 12వ భావం తీసుకోండి అది వ్యయ భావం. ఆరవ భావం తీసుకోండి అది శతృభావం. వాటిలో రాహువు కేతువు ఉంటే కొంత లాభం. శని ఉంటే మరింత లాభం (ఆరవ భావములో). అలా కాకుండా బృహస్పతి ఉంది అనుకోండి.. శతృవులే శతృవులు. ఎనిదవ భావం దుష్ట స్థానం. అక్కడ ఏ గ్రహమూ మంచి ఫలితాలివ్వదు. ఇలా సాగిపోతుంది.

   సో, భావాలను "బావ"లుగా చేసి, గరహాలను "మరదల్లుగా" మార్చి, వారి అను"గ్రహం" ఏ భావములో ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి (శతృ భావమా, మిత్ర భావమా అని) ట్రై చేశాను. కొన్ని గ్రహాలు కొన్ని భావాలకి మిత్ర గ్రహాలు, మరికొన్ని భవాలకి శతృ గ్రహాలు.

   మీకు వెరైటీగా అనిపిస్తే తప్పు నాది కాదు. ఇది నిజంగానే కొరకరాని కొయ్యలాంటి సైన్సు.. :-)

   ఏదో సరదాగా నాకున్న నాలెడ్జిని మిక్సు చేసి పదాల ప్రయోగం చేసింది. అంతే !

   తొలగించండి
  13. @Srikanth M:

   "మీకు జ్యోతిష్య శాస్త్రం మీద బొత్తిగా అవగాహన లేదు"

   100% correct! నాకు కొద్దిగా అవగాహన ఉన్న కొన్ని సబ్జెక్టులలో (ఆఫ్ కోర్స్ అవీ కొంచం కొంజం స్వల్ప థోడా తేడాగానే వచ్చు) జ్యోతిష్యం పొరబాటున కూడా రాదు. వాస్తు, న్యూమరాలజీ, ఆయుర్వేదం, యోగం, వ్యాకరణం, ఛందస్సు లాంటి విషయాలలో కూడా నేను -273.16 C (అనగా బండి సున్నా) అని గర్వంగా (!) చెప్పగలను.

   On a more serious note: మీ పదప్రయోగం వినూత్నంగా ఉంది. Excellent wordplay mixing similar sounding words with a touch of irony & irreverence!

   తొలగించండి
  14. రాకపోవడమే మంచిలేండి. లేకపోతే... మనజాతకం తప్ప పెతోడి జాతకంచెప్పాలనే దురద మొదలౌతుంది. ఎంత గోక్కుంటే అంత సమ్మగాఉంటుంది.

   తొలగించండి
  15. ఆయుర్వేదం, యోగా విషయములో మీ మనసు కొంత మార్చుకోవడానికి ట్రై చేయండి. అవి నిజమైన శాస్త్రాలు. వాటికి బోలెడన్ని సైంటిఫిక్ ప్రూఫులు కూడా ఉన్నాయి.

   తొలగించండి
  16. ఆ రెండూ మనకు కనపడే సత్యాలు. కానీ "నేను పూజలు చేసి గ్రహాల్ని తిప్పేస్తా! వాటి ప్రభావాన్ని చుట్టేస్తా!" అంటూ కామెడీ పలుకులు పలికే చిలకలమీదే నా సెటైర్లు.

   ఆయుర్వేదంలో పిప్పిపన్ను గురించి వింటుంటే ఏం మాట్లాడాలో అర్ధం కాదు.. "అది వాడండి..
   ఇది వాడండి.. పంట్లోనుంచి పురుగు రాలి కిందపడుతుందీ".. పంట్లో పురుగుండదని ఏ చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతారు.. ఏతా వతా నేనెప్పుడైనా చెప్పెడేంటంటే.. మన గ్రంధాల్ని ఇలాంటి మూర్ఖులే తగలబెడుతున్నారు. అది కూడాసంస్కృతి పేరుతో.. ప్రశ్నించినొడికి, దేశభక్తిలేదు.. హైందవవ్యతిరేకి..
   .

   తొలగించండి
  17. చిరుడ్రీంస్ గారూ,

   అబ్బో ఇలాంటి చెత్తకు లోటులేదులెండి మన దగ్గర, మన వేదాల్లో అన్నీ ఉన్నాయహే అనే వాల్లదగ్గరనుండి, మూఢనమ్మకాలలో కూడా సైన్సును చూడగలిగే జనాలకు హద్దులు లేవు. నాకు యోగా, ఆయుర్వేదం ఇష్టం, జ్యోతిష్యం మాత్రం నేను నిజమని నమ్మను, అబద్దమని కొట్టి పారేయలేను. దానికి నా కారణాలు నాకున్నాయి. చెప్పాలంటే నాకు అదో పజిల్‌లా తయారయ్యింది. నాలో ఉన్న "శాస్త్రీయతను ఛాలెంజి చేసే లెవెల్లో". ఫేక్ గాల్లను వదిలేస్తే, నిజంగా జ్యోతిష్యాన్ని బాగా అధ్యనం చేసిన వాల్లు కొన్ని చెప్పగలరా? మరికొన్ని ఊహించగలరా అని అనుమానం వచ్చేంత. మొదట్లో నేను జ్యోతిష్యాన్ని అస్సలు పట్టించుకునే వాన్ని కాదు. కానీ, కొన్ని చూసిన తరువాత మాత్రం ఏదైన లింకుందా అనిపిస్తుంది. కాకపోతే, ఇవి కేవలం వ్యక్తిగత అనుభవాలు, శాస్త్రీయంగా ప్రూవ్ చేయగలిగినవి కావు. కాబట్టి, పూర్తి స్థాయిలో జ్యోతిష్యాన్ని సమర్ధించలేను.

   నాకు సంబందించింత వరకూ ఏదైనా డిబేటబుల్. కానీ, కాలేది ఎక్కడంటే.. సెలక్టివ్‌నెస్. కొంత మంది "సిద్దాంతాల రాద్దాంతాలతో" చేసే సెలక్టివ్ శాస్త్రీయ దృక్పధాలు, సెలక్టివ్ మేధావితనాలు, వాల్లకు కొంచెం "కారం" రాయడానికి అప్పుడప్పుడూ త్రాసును అటువైపు వంచుతాము. అప్పుడే కొంత మంది మేధావులు నిద్రలేస్తారు. మమ్మల్ని జడ్జి చేసి పారేస్తారు. నువ్వో "హిందూత్వ అతివాదివి" అని. యాధావిధిగా ఆరోపణలు ప్రత్యారోపణలు.

   నాకు వేదాలంటే ఇష్టం, వాటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. "అన్నీ దానిలోనే ఉన్నాయని చెప్పను కానీ, దానిలో ఉన్నది తీసుకోండి, ప్రస్తుతం ఉన్న ఙ్ఞానముతో వాటిని పరీక్షించి, పనికొస్తాయా పనికి రావా అన్నది డిసైడ్ చేసుకోండీ" అని మాత్రమే నేను చెబుతాను. వేదాలు బాపనోళ్ళు రాశారు, బాపనోళ్ళు మమ్మల్ని ఇంతకాలం తొక్కేశారు, వారికి చెందింది ఏదైనా సరే మేము వ్యతిరేకిస్తాం అనే వెర్రి జనాలను నేను వ్యతిరేకిస్తాను.

   సొంత డబ్బా ఎక్కువైనట్టుంది, ఆపేస్తున్నాను.

   తొలగించండి
  18. వేదాల్ని పరీక్షించే జ్ఞానం ఈకాలపు సైన్సు పిపీలానికుందా? నువ్వు హైందవవ్యతిరేకివి.. పాకిస్తాన్ సప్పోర్టర్వి(ప్రపంచంలో మాకు కనపడే దేశం అదొక్కటే మరి).

   తొలగించండి
  19. నాకైతే ఇంత వరకూ అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. బహుషా నాకు వేదాల మీదున్న అభిమానం అటువైపు వారికి కూడా నా రాతల్లో అర్థమయ్యుండొచ్చు.

   తొలగించండి
  20. దేశంలో చాలామందిని ఇలా దేశద్రోహులు, పాకిస్తాన్ సప్పోర్టర్లు అన్నార్లేండి.

   తొలగించండి
 2. Ha ha. Really funtastic write up pavan garu.

  నిర్జీవి. రామా ఏక్ విగ్ లా. Super.

  బుల్ బుల్ పాడిన శివ శంకరి పాట విన్నాను. Ok అనిపించింది. Some improvement is there. Surprised at his audacity to choose that difficult song.

  తాతీ లిద్దరు కలిసి సినిమా చేస్తే కేకో కేక.

  రిప్లయితొలగించండి
 3. నాకళ్ళల్లో... నుంచి శివశంకరి వరకు.. బాలయ్యలో చాలా డెవలప్మెంట్ కనిపించింది... ఇది నా అభిప్రాయం..

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. పాకిరేవుకు పాపం బాగా గపిలినట్టుంది..
  కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చేయాలి.
  ఇద్దరులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు, ఇక్కడ..
  బేసిగ్గా గాడిద .. ఎచ్చులుకు పోయి కుక్కలా మొరగడం మాత్రమే

  గార్ధభ స్వరాన్ని విన్న చాకలివాడు ఏమి చేశాడో కూడా తెలుసుకుని ఉంటే బావుండేది, అనవసరంగా గాడిదను వెనకేసుకుని వచ్చి.. ఒక మంచి " నీతి కథను" చెడగొట్టేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "ఆ బతుకు కూడా కొంపలోని వారి పలుకుబడితో అనే విషయం.. జనానికి తెలుసు"

   అబిడ్స్ బాలకృష్ణ 60 ఎంఎల్ థియేటర్ గురించి ఎంచక్కా సరిపోయే వ్యాఖ్య రాసిన దురదభిమాన పరమాణువు చాకిరాయిరేవు. ఇంకెవడినో కొట్టబోయి విసిరినా రాయి తారకానికే "భూ"మరాంగ్ కొట్టింది ఖర్మ కాలి!

   బావా ఒక పెగ్గు ఇచ్చుకోవా ప్లీస్, ఇయ్యకుంటే బెల్లం కొట్టిన కొండలా గమ్మునుండే ఎవడో ఒక బకరాను పట్కోని "షూటింగ్" మొదలెట్టాల్సిందే.

   మో"ఢీ" నా సలహా అడగట్లేదని వాపోయే "భా"వ ఒకవైపు, పేరంటానికి పిలువలేదని కుళ్ళి చచ్చే సాలెగాడు ఇంకోపక్క. కుటుంబం మొత్తం ఇట్ల పిట్లా తిని బతికేస్తున్నారేమిటి చెప్మా.

   తొలగించండి
  2. బుల్ బుల్ ' నీ లీల పాడెదా దేవా '
   ' శంకరా నాద శరీరా పరా ' పాటలు పాడితే బాగుంటుంది. విని తరిస్తాము.

   పాడమని నన్నడగ తగునా. పదుగురెదుటా పాడనా

   పాట ఆగిందా నీ సీటు గోవిందా

   పాడు. డాన్స్ ఐ సే డాన్స్.
   తొలగించండి
  3. నా తరఫున ఇంకొన్ని బోణి ముత్యాలు:

   5. భావవని పావలా అడగతగునా పేకాటలో భావలా
   6. నీ గోల ఆడెద భావా

   తొలగించండి
 6. బుల్ బుల్ అనుకుల అభిమానులు

  శివానంద లారీ కాలర్ ట్యూన్ పెట్టుకోండి. ఎప్పుడైనా మనసుకు కష్టం కలిగితే బుల్ బుల్ ఏ మాయం చేశావే , లేక పోతే సితారా హమారా పాటలు చూడండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

  రిప్లయితొలగించండి
 7. జగన్ లక్షకోట్ల అవినీతి కాస్తా 40 వేల కోట్లకి తగ్గిందేమీ? ఇంకొకల్లని అరెస్ట్ చేస్తే వెయ్యికోట్లకి తగ్గిద్దేమో!

  రిప్లయితొలగించండి