ఎందుకో తెలీదు కానీ చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు విన్నందుకో ఏమో ఆయన పాటలంటే బాగా పిచ్చి. దానికి తోడు ఇళయరాజా గారి మ్యూజిక్ కూడా ఆ పాటలు వినడానికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చేది. అప్పుడపుడు పాటల్లో ఆయన పాడే విధానం కాస్త అతి అనిపించేది కానీ తన గొంతు బాగా నచ్చేది.
ఇక నాగూర్ బాబు (మనో) అప్పుడప్పుడు పాడేవారు కానీ ఇతనిది బాలు గారికి కాపీ గొంతులా ఉండటం వల్లనేమో అంత నచ్చేది కాదు.
ఇక మోహన్ బాబు ఎక్కువగా జేసుదాసు గారితో పాటలు పాడించుకునే వారు. ఆయన గొంతు కూడా నచ్చేది. అంతులేని కథ లోని 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' ఇప్పటికీ ఎప్పటికీ నచ్చే పాట.
మధ్యలో కృష్ణ ఏదో ఒక సింగర్ ని తెచ్చినట్లు ఉన్నాడు బాలు గారికి పోటీగా, కానీ అతను క్లిక్ అయిన దాఖలాలు లేవు.
ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ వరకూ నాకు నచ్చుతుంది కానీ ఆయన పాడితే నచ్చేది కాదు. కాకపోతే ఆ తర్వాత తరం సంగీత దర్శకులంతా వారే పాడటం మొదలెట్టారు.
నాకు తెలిసి A.R రెహ్మాన్ తో ఈ ట్రెండ్ బాగా ఊపు అందుకుందనుకుంటాను. ఆ తర్వాత చక్రి, R.P పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వారు తెలుగు పాటలను పాడి ఇంకొంచం భ్రష్టు పట్టించారు.
ఇక తరం మారే కొద్దీ చాలా మంది గాయకులు వచ్చారు కానీ, ఎవరూ పెద్ద క్లిక్ అవ్వలేదు. మధ్యలో ఉదిత్ నారాయణ అనే హిందీ సింగర్ వచ్చి పాటలు పాడటంతోటే తెలుగు పాటల పతనం పూర్తిగా మొదలైంది అని నా ఫీలింగ్. మన బాలు కూడా అక్కడ హిందీ సినిమాల్లో పాడినప్పుడు వారికి కూడా ఇదే ఫీలింగ్ వచ్చి ఉండచ్చు అనుకుంటాను. అప్పట్లో 'నా మది నిన్ను పిలిచింది' అంటూ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు 'ఆరాధన' సినిమా లో పాడినప్పుడు ఎందుకు ఈయన ఏదో పట్టి పట్టి పాడుతున్నాడు పాటను ముక్కలు ముక్కలు విడగొట్టినట్లు అనుకునే వాడిని. మరి ఆ పాట అలాగే పాడాలని పెట్టారో ఏమో తెలీదు, ఆ సినిమా కూడా చూళ్ళేదు ఎప్పుడూ.
హిందీలో సోను నిగమ్ పాటలు బాగా నచ్చేవి. 'ముంగారు మలే' అనే కన్నడ సినిమాలోని హిట్ సాంగ్ తో నిర్మాతలు అతనితో పాడించుకోవడం కోసం క్యూ కట్టారు. ఆ దెబ్బకు అతను బెంగుళూరు లో పదెకరాలలో ఒక పెద్ద బంగాళా కొనేసి ఉంటాడని నా ఫీలింగ్.
ఇక లేటెస్ట్ గా అందరూ సిద్ శ్రీరామ్ వెంట పడ్డారు, నాకెందుకో అతని కంటే రైల్లో అడుక్కుంటూ పాడేవాళ్ళ గొంతే బాగుంటుంది అని అనిపిస్తుంది అతను తెలుగు పాటను ఖూనీ చేసి పాడే విధానం చూస్తే.
ఇక వీరందరికి పెద్దన్న లాంటి ఘంటశాల గారి పాటలు వింటుంటే హాయిగా ఉంటుంది. కాకపోతే ఆయన పాటలో ఏదో తేడా ఉంటుంది అని అనిపించేది నాకు చిన్నప్పటినుంచి. అదేమిటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనేది మాత్రం అంతు చిక్కేది కాదు.
నేను M.C.A చదివే రోజుల్లో దాని అంతు చిక్కింది మా శీను భయ్యా వల్ల. ఏముంది? నోట్లో తాంబూలం వేసుకొని పాడినట్లు ఉంటుంది అన్నాడు, అర్రే అవును కాదా అని నాకూ అనిపించింది.
ఘంటశాల అభిమానులకు క్షమాపణలు, ఇలా అన్నందుకు. జస్ట్ సరదాకే.
అంత గొప్ప గాయకుడు అయిన ఘంటశాల గారి ఎన్నో పాటల్లో, ముఖ్యమైనది, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేది 'శివ శంకరీ' పాట. అలాంటి పాటను పాడి, బాలయ్య బాబు పుట్టిన రోజు కానుకగా అభిమానులకు అంకితం చేసినట్లు ఉన్నాడు. సరేలే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తున్నాడు అని మెచ్చుకోవచ్చు కానీ ఈ పాట కాకుండా ఏదైనా సింపుల్ గా ఉండే పాట అయి ఉంటే బాగుండేదేమో. అయినా ఈ విషయం విన్నందుకే నాకు మతి పోతోంది. ఇక ఆ పాట విని ఉంటే?
ఎవరక్కడ, తక్షణమే థాయిలాండ్ ప్రధాని కె. ఏ. పాల్ తో నా మీటింగ్ ని ఊహాన్ లో ఏర్పాటు చేయండి, దానికి న్యూజిలాండ్ రాష్ట్రపతి నాగబాబుని, లాస్ ఏంజిల్స్ మేయర్ నిత్యానందని కూడా ఆహ్వానించండి. గబ్బిలాల అప్పడాలను, బొద్దింకల బోండాలను స్నాక్స్ గా తయారుచేసి ఉంచండి.
అమ్మో! వద్దులే ఆ ఊహే భయంకరంగా ఉంది. కాకపోతే చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు, లోకేష్ బాబు పాడనందుకు బతికిపోయాం బాలయ్య బాబు బదులు. కానీ లోకేష్ బాబు కూడా పాడితే, అప్పుడు బాలయ్య బాబు బాగా పాడారు అనే ఫీలింగ్ వచ్చేది చిన్న గీత పక్కన పెద్ద గీత లాగా.
తన తండ్రిగారి క్రమ"తిక్క"న అందరికీ రావాలని పుత్రికా రత్నం, పుట్టిన్రోజున తండ్రిగారి ఫ్యాన్సందరినీ దీవించించిందట.
రిప్లయితొలగించండిదున్నపోతుకు ముందు నిలబడకూడదు, గాడిదకు వెనక నిలబడకూడదు.. బుల్ బుల్‌కి మాత్రం ఎటూ ఉండకూడదు. దగ్గరుంటే ఎక్కడ తంతాడో ఫ్యాన్సుక్కూడా తెలీదు, దూరంగా ఉంటే.. ఏం పాడతాడో ఘంటసాలకు కూడా తెలీదు.
భేషు భేషు
తొలగించండిబుల్ బుల్ శివానంద లారీ సర్వీస్. ఇళయరాజా మంచి సంగీత దర్శకుడే కానీ అతను పాడితే బిచ్చగాల్లు పాడినట్లు ఉంటుంది.
రిప్లయితొలగించండిసిద్దు శ్రీరామ్ పేడి గొంతు అనిపిస్తుంది.
మామా ఏక్ విగ్ లా. అడిగింది నా బట్టతలా.
అమెరికాలో ఇంగ్లీష్ ప్రేమ. ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ. అమ్మడూ ఏయ్ అమ్మడూ.
ఏ చాయ్ ఖరీదులో చీపు రా భాయ్.
మాస్టారూ మెగాస్టారు మంచి లెక్చరు ఇచ్చారు.
ఏక్ పెగ్ లా, ఎహ్ భాయ్ చటుక్కున తాగరా ఛాయ్ లాంటి వరకే ఆగిపోతే బాగుండు ఈ హీరోలు. మరీ క్లిష్టమైనవి ఎన్నుకోకపోతే చాలు
తొలగించండిహ్హ హ్హ, పవన్ గారూ, బాలకృష్ణ ఆ పాట పాడటంతో ప్రపంచం నాలుగు చెరగులా తెలుగు ప్రజలు బాగా "హర్ట్" అయినట్లున్నారు కదా 😀.
రిప్లయితొలగించండిఎవరెస్ట్ ఎక్కాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగితే because it is there అని సమాధానమిచ్చాడట ఒక పర్వతారోహకుడు. అలాగ ఆ పాటే ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగితే బాలకృష్ణ because it is there అన్నా అంటాడేమో? మొత్తానికి సాహసవంతుడు అని మాత్రం ఒప్పుకోవాలి 😀.
ఇక ఇతర భాషల గాయకులతో తెలుగులో పాడించడం ఒకప్పుడు చాలా ... చాలా అరుదుగా జరిగేది. అయితే మీరు ఉదహరించిన ఆ రఫీ గారి పాట కన్నా చాలా ముందే 1950ల దశకంలోనే "సంతానం" చిత్రంలో "నిదుర పోరా తమ్ముడా" అనే పాటను లతా మంగేష్కర్ గారి చేత పాడించారు. యాస లేకుండా చక్కగా పాడింది.
నిదుర పోరా తమ్ముడా (లతా మంగేష్కర్)
ఇప్పుడంటారా పరాయిభాషా గాయకులతో తెలుగులో పాడించడం పెద్ద ఫాషన్ అయిపోయినట్లుంది. దీనికి కారణాలు నా బుర్రకయితే తోచడం లేదు. తెలుగు వారయిన మంచి ఔత్సాహిక గాయకులు లేరనీ అనలేం. మరి మన "గాన గంధర్వుడు" గారు తరచూ చెప్తుండే ... కళకు సరిహద్దులు లేవు, భాషా భేదాలు లేవు ... లాంటి పడికట్టు మాటలతో సరిపెట్టుకోవాలేమో మనం? ఏమయినప్పటికీ ఈనాటి పరాయిభాషా కుర్రకారు గాయకులు (స్టూల్ మీద ఒక కాలు స్టూలుకి సగం పైన, రెండో కాలు కింద పెట్టి కూర్చుని పాడుతూ) చేసే ఉచ్చారణా ఖూనీని భరించవలసిన అగత్యం ఈకాలపు తెలుగు ప్రేక్షకులకు పట్టింది (జేసుదాసు లాంటి సీనియర్ మహాగాయకుల గురించి కాదు లెండి).
మీరీమధ్య బ్లాగుల్లో నల్లపూస అయిపోయారు ... పోస్టులు గాని, కామెంట్లు గానీ. లాక్-డౌన్ లో work from home ఒత్తిడి ప్రభావమా?
కరెక్టే, పాట ఉండేది పాడటానికే కదా, లాజిక్ ప్రకారం కరెక్టే మరి మేష్టారు.
తొలగించండిజనరేషన్ గ్యాప్ అనుకుంటా మేష్టారు, ఈ మధ్య కొత్త సినిమా పాటలు నచ్చట్లేదు. పైగా ఒక సాహిత్యం లాంటివి అస్సలు ఉండట్లేదు, సగం పైగా వేరే భాషా పదాలే. అక్కడ ఇక్కడ ఉండే కొన్ని పాటల్లోని తెలుగు మాటలని కూడా ఖూనీ చేస్తున్నారు పర భాషా గాయకులు.
నిజమే మేష్టారు, లాక్ డౌన్ ఎఫెక్ట్ కి పని ఒత్తిడి బాగానే పెరిగింది, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పని పెరిగింది. గూగుల్ క్లాస్ రూమ్ అని అసైన్మెంట్స్ ఇస్తారు, అవి కొన్ని అర్థం కాక మా అమ్మాయి నాకు పని పెడుతూ ఉంటుంది.
ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి కొంత రిలీఫ్ దొరికింది ఇప్పుడు.
Because it is there-PEAKS mastaru. Navvaleka chachanu.
తొలగించండి(Super emoji ela pettalo telvadu sir) Super. Because he is there-we pogudutam ante-PEAKKUNE VALLU PEAKKOVACHU.
// “ Because it is there-PEAKS mastaru. Navvaleka chachanu.” //
తొలగించండి🙂🙂
పవన్ గారూ, కాస్త off-topic అయినా మీకు సామెతలు & అవ్వాటి మూలాలు గురించి బాగా తెలుసు కనుక అడుగుతున్నా. "తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు" అనే నానుడి కాస్త వివరిస్తారా థాంక్స్.
రిప్లయితొలగించండిhttps://twitter.com/VSReddy_MP/status/1270710918821736448
ఆ సామెత వినడమే కానీ, దాని పుట్టు పూర్వోత్తరాలు తెలీవండి జై గారు. మనదంతా వేలి ముద్ర చదువులు తెలుగు విషయంల.
తొలగించండిశాస్త్రి గారే దీనికి జవాబివ్వగలరేమో మరి.
ఈ సందర్భంలో “శాస్త్రి గారు” ఎవరు, పవన్?
రిప్లయితొలగించండిక్షమించాలి, శర్మ గారు అనబోయి.. పొరపాటు.
తొలగించండిYou mean మన “కష్టేఫలి” శర్మ గారు? తప్పక వివరించగల సమర్థులే వారు no doubt.
తొలగించండిఅసలిదంతా ఎందుకు, ఆ సామెతనుపయోగించిన ఆ రెడ్డి గారినే అడిగితే పోలా? 🙂
శర్మ గారు ఈ మధ్య బ్లాగుల్లో కనపడడం లేదు.
తొలగించండిఅన్నట్టు, పాడుతా తీయగా కార్యక్రమంలో చిన్న పిల్లల్ని కూడా చీల్చి చెండాడే బాలు గారు బాలయ్య పాటు మీద తన అమూల్యమైన అభిప్రాయం ఇంకా చెప్పాలేదా?
రిప్లయితొలగించండిపాట మీద
తొలగించండిఅలా ఎలా అభిప్రాయం చెప్పేస్తారు? ఆ రంగంలో తన మనుగడ సంగతి కూడా ఆలోచించుకోవాలి కదా.
తొలగించండిఅభిప్రాయం చెబితే తంతాడని భయపడుంటాడు..
తొలగించండిబాలాయ్యతో తన్నిచ్చుకోవాలన్నా... అదృష్టం కలిసి రావాలట!
తొలగించండిబుల్ బుల్ పైసా వసూల్ డైలాగ్స్.
తొలగించండినేనంతే, కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్లీ చంపుతా.
తూ క్యా రే హౌలే ��
Twitter Trends in Hyderabad, India - Trendsmapwww.trendsmap.com › IN_HYD_qkkvqq
తొలగించండి4 days ago - Ee movie chusaka Police ante ela vundali Oka annayya ante yela vundali Oka koduku yela vundali Main ga husband ante ilage vundali Anipinhae ... మీ నాన్న గారు బాగున్నారా అని అడగటానికి, నియమ్మ మొగుడు బాగున్నాడా అని అడగటానికి చాలా తేడా ఉందిరా లంబ్డీ కొడకా. ... Man With Golden Heart Man Defined “Royality” One & Only God Of Masses No Body Can Reach Him Proud NBK Cult Fan Happy Birthday Legend ..
యెస్ యెస్ నో బాడీ కెన్ రీచ్ హిం - ట్రూ ట్రూ- ఎల్లాడా ఒక్క తన్ను తిన్నాడే హహహ ఇదో కధానాయక మహానాయక పంఖాల వ్యధ
తొలగించండిబ్లాగులలో బూతులు రాయడం పాత ట్రెండు. సినిమా టీజర్లలో బూతులు వాడడం కొత్త బీబీ పోకడ!
తొలగించండిఇక తన్నించుకోవడం అంటారా, షూటింగ్ ప్రాక్టీసుకు బెల్లం కొట్టిన కొండ లక్క గమ్మున పడుండడానికి సిద్దమయిన దురదభిమానులు కొదవా ఏమిటి?
"బావా ఎక్ హిట్టు లా" అని ఎంత మొత్తుకున్నా "ఆ ఒక్కట్టీ అడక్కు" జవాబు వస్తుందేమిటి చెప్మా. ఇదే కొనసాగితే మోక్షజ్ఞో దైవాంశో ఎవడో ఒకడు రంగప్రవేశం చేయాల్సిందే.
మీకో నిజం చెబుతాను నమ్మండి. మహానాయకుడు రిలీజైనప్పుడు మొదటిరోజు మొదటి ఆట దగ్గర్నుంచి రోజు మొత్తంలో ఒక్క హాలులో కూడా, ఒక్క షో కూడా సగం టికెట్స్ కూడా అమ్ముడు పోలేదు.(courtesy bookmyshow) ఈ రంకెలేసే ఈ వీరాభిమానులంతా ఏ కలుగులో దాక్కున్నారో మరి.నిజానికి నాకెంతో బాధనిపించింది, బాలయ్య గురించి కాదు, సినిమా కొనుక్కుని నిండా మునిగిన బయర్స్ గురించి. కథానాయకుడు నష్టాలు కొంతైనా పూడ్చమని వాళ్ళు వేడుకుంటే, మహానాయకుడు ఫ్రీగా ఇస్తానని చెప్పి మోసం చేసి మళ్లీ డబ్బులు గుంజినట్లు పేపర్లలో అప్పుడే వార్తలు వచ్చాయి.
తొలగించండిఇప్పుడే ఒరిజినల్ విన్నాక ధైర్యం చేసి బాలయ్య పాట కూడా విన్నాను.
రిప్లయితొలగించండిగుంటూరు డాట్టారు అప్పట్లో చెప్పినట్టు బాలయ్య చాలా కష్టపడ్డాడు కానీ అవసరమా అనిపించింది.
Mitrulaki vignapti balakrishna notnunchi jivitamlo modatisariga ee patalo padina leka palikina prati padamu ardhamaindi.; Manchini pogadandi positive side chudandi. negative 100 unna oka manche kada goppa. Akkadevaro ma akkya okavida kakarakaya lanti kaburlu cheppi milanti bala baditulla chedugudu tathukoleka coments anni piki paresi darjazaga yemi yeraganattu samksaravantamyan soap to ruddukuni talatala merisipotundi. Adollu kadupu chenchukodaniki tappa inkenduku panikostaru anna animutyalu palike vadu jatiratnam (?) ani pogidi tarinchi murisipoindi. Shotinglo bootlamida dust undani andarimundu helper boyni edchi kottina balaya babu enta samskaravantudo ententa sugunabiramudo varnincindio okasari ma akkiya kaburlu kakarakalu vini tarinchipondi. Intlo panimanishi hatyaku guraite, dead body ni vakitlo datukuntu shoting ki velina manavatavadi ma balaya. Jai balaya jaijai balaya.
రిప్లయితొలగించండిMa akkiya enta NISPACHAPATO telusukondi.
అయ్యా అది ఆయన ఇష్టం, ఇష్టం ఉన్న వాళ్ళు (ఉంటె) వింటారు, లేని వాళ్ళు వినరు, ఆయన ఆయన శ్రమ తో, ఆయన డబ్బులు తో సరదాగానే సీరియస్ గానో, ఓ పాత పాట పాడి పడేసారు. అదేదో కాని పని అయినట్లో, చేయకూడని పని చేసినట్లో జనాలు అందరూ గోల చేయటం అవసరమా?
రిప్లయితొలగించండిఆయన ఈ పనితో పాటు నృసింహ స్తోత్రం మొత్తం చదివి వినిపించారు ఇంటర్వూలో, దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎవరూ? సినెమా హీరో లలో ఈ మాత్రం తెలుగు మీద పట్టు, తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు ఏ భేషజాలు లేకుండా చెప్పే హీరో లు ఈయన కాక ఎవరో చెప్పండి.
ఇక ఆయన చేసిన సహాయాలు, తను కష్టపడే తత్త్వం, కల్మషం లేని మెంటాలిటీ గురించి ఎందరో సినిమా ఫీల్డ్ వాళ్ళు, బయట వారు స్వచ్చందం గా ముందుకు వచ్చి ఇప్పుడు ఆయన పార్టీ అధికారం లో లేకపోయినా చెప్పారు, శుభలేఖ సుధాకర్ దగ్గరనుండి, శివాజీ రాజా వరకు. ఈయనలో ఇన్ని మంచి కోణాలు ఉన్నాయా అని ఎవరూ ఎందుకు మాట్లాడరు?
ఇవాళ్టి రోజున తెలుగు సినెమా ఫీల్డ్ లో ఫుల్ టైం రాజకీయ నాయకుడి గా, ఓ 500 బెడ్స్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా, అదీ ఏ కేన్సర్ ఆసుపత్రి కి స్టాండర్డ్ లో తీసిపోని దానిగా తీర్చిదిద్దుతూ తను చైర్మన్ అయినతరువాత, ఇంకో ప్రక్క ఫుల్ టైం సినిమా హీరో గా, మరో ప్రక్క ప్రొడ్యూసర్ గా ఎంతమంది పని చేయగలుగుతున్నారు అదీ 60 ఏళ్ల వయసులో సినెమా హీరో లలో?
తండ్రి ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, అక్క కేంద్ర మంత్రి, తానూ అన్న మంత్రి, తానూ 2 సార్లు MLA, ఇంతకాలం గా అవినీతి మురికి అంటని వారు ఎంతమంది ఉన్నారు?
ఇక ఈయన మీద ఏడుస్తున్న బ్యాచ్ అంతా, 16 నెలలు జైలు కూడు తినివచ్చిన A1 గాడి అభిమానులు అవటం విడ్డురం కూడాను. ఇక నేను ఈయన పాట వినలేదు, వినాలన్న ఇంటరెస్ట్ కూడా లేదు.
తనతో సినిమా తీసిన దర్శకుడు పూరీ గురించి అడిగితే ఇడ్లీ ఉప్మా అని వెటకారం చేసిన వాడు, పుట్టినరోజు నాడు ఇంటికి వచ్చిన అతిథులను భూములు పంచుకున్న వాల్లు వచ్చారే అని అవమానించిన బుల్ బుల్ ముచ్చట్లు ఎందుకు చెప్పవు.
తొలగించండిఅతడు మహిళలు గురించి అసభ్యంగా వాగితే ఎప్పుడైనా అది తప్పు అని అనుకుల భజన బాచి చెప్పిందా.
బుల్ బుల్ సినిమాల్లో ఏ వైవిధ్యం లేకుండా కంగాళీగా ఒకే మూసలో చెప్పే డైలాగులు ఫుల్ కామెడీ.
చెత్త వాగుడుతో అహంకారంతో ఉక్రోషంతో బుల్లబ్బాయి ఎంత అవమానించిన మంచి హృదయం తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ సంస్కారం కలిగిన వ్యక్తి చిరంజీవి.
ఇప్పుడు మీ బాధ... బాలయ్య పాట పాడినందుకా లేక ఇంతకుముందు తను చేసిన తప్పులు... అభిమానులు ఎన్ననందుకా?
తొలగించండినా అభిప్రాయం లో శివానంద లారీ పాట బుల్ బుల్ ఉత్సాహంగా తనకున్న పరిమితి లో బాగానే పాడాడు. అయితే అది కామెడీ ట్రాలింగ్ చేయడం తప్పేమీ కాదు.
తొలగించండిఅనుకుల బాచి అతను ఏదో గొప్ప ఉదాత్తమైన వ్యక్తి అని భజన చేయడం, అతని దొర అహంకార మాటలు చేతలు కూడా పొగడటం లేదా సైలెంట్ అవడం విమర్శ చేయవలసిందే.
శివానంద ‘లహరి’ అండీ (“లారీ” కాదు) 🙂.
తొలగించండిలేదు సార్. తేడా సింగ్ శివానంద లారీ అనే పాడినాడు. ఎక్కువ శాతం పాట తేడాగా ఉన్నా అక్కడక్కడ బాగుంది. He has improved.
తొలగించండిఏది లారీ ఏది బస్సు జేసీ బ్రదర్స్ మాత్రమే చెప్పగలరు!
తొలగించండికేశినేని నాని మీద మీకు సానుభూతి ఉన్నట్లుంది ఆయన్నొదిలేశారు ఏక్ సే భడ్కర్ ఏక్
తొలగించండిPuri on Balayya, don't spread Sakshi news
తొలగించండిhttps://www.youtube.com/watch?v=eAolMrMKtE0
https://www.youtube.com/watch?v=q409EDK2ma8
రేపు "తొత్తు పలుకులు"లో చూడాలి... దేశమంతా నాశనమైపోతున్న బిల్"డప్పు"లు.
రిప్లయితొలగించండి