పి.వి నరసింహారావు గారి జయంతి కదా అని అందరూ ఆయన గురించి రాస్తుంటే మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం బళ్ళో దెబ్బలైనా, ఇంట్లో దోశలైనా, గుళ్ళో ప్రసాదాలైనా అని ఆయన మీద ఏదో ఒకటి రాద్దామని అనిపించి మొదలెట్టా కానీ ఆయన గురించి నాకు పెద్దగా తెలీదాయె. సరే మొదలు పెడితే ఏదో ఒకటి రాయొచ్చు అని మొదలెట్టా.
అప్పట్లోనే ఆయన 15 లాంగ్వేజెస్ వరకు నేర్చుకున్నారని విన్నాను. ఇప్పుడంటే చాలా మందికి చాలా లాంగ్వేజెస్ వచ్చు. అంతెందుకు నా బోటి వాడికే తెలుగు, కన్నడ , ఇంగ్లీష్, జావా, సి, సి++ అని బోల్డు వచ్చు. మరి అప్పట్లోనే అన్ని భాషలు అంటే యెంత గొప్ప మరి. అయినా ఎక్కువ భాషలు నేర్చుకోవడం కూడా మంచిదే. హిందీ వస్తే మేనేజర్ మన వాడు అవుతాడు, తమిళ్ వస్తే టీం అంతా మన వాళ్ళే, తెలుగు వస్తే ఇదిగో ఇలా ఎవ్వరికీ ఉపయోగం లేని బ్లాగులు రాసుకోవాలి. అదేం ఖర్మో, నేను ఏ టీం కి వెళ్లినా హిందీ మేనేజర్, అరవ టీం మెంబెర్స్ ఉంటారు. చక్కగా హాయిగా తెలుగులో మాట్లాడలేని పరిస్థితి ఆఫీస్ లో. ఇదేమైనా జాతక ప్రభావమో ఏమో తెలీదు. దీనికి ఉంగరాలో, రంగు రాళ్ళో, గులక రాళ్ళో, జాతకం చెప్పే పంతుల్లో, గుళ్లో దేవుళ్ళో, మీలో ఒకళ్ళో నాకు పరిష్కారం చూపెడతారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను.
పి. వి నరసింహారావు గారు అప్పుడెప్పుడో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెలుసు. చిన్నప్పుడు ప్రధాన మంత్రి కి, ముఖ్య మంత్రికి తేడా తెలీక పరీక్షలో ఏ క్వశ్చన్ వచ్చినా 'N.T. రామారావు' అని రాసేవాడిని. టి.వి లో వార్తలు చూడరా ఇలాంటివి తెలుస్తాయి అని మా నాన్న యెంత తిట్టినా దులిపేసుకొని ఆడుకోవడానికి వీధిలోకి పరిగెత్తేవాడినే కానీ ఈ నాటికీ ఏ రోజూ వార్తలు విన్నది గానీ చూసింది గానీ లేదు అందుకే నా జ్ఞానం ఇట్టా ఏడ్చిందని తెలుసు కానీ ఈ జన్మకింతే అని సరి పెట్టుకోవడమే. ఇక గవర్నర్, రాష్ట్రపతి గురించి అయితే అస్సలు అర్థం అయ్యేది కాదు, వాళ్ళేం చేస్తారో అస్సలు తెలిసేది కాదు, మరి ఇప్పుడు తెలుసా? అని అడక్కండి అది అప్రస్తుతం. ఎందుకంటే మనం ఇక్కడ పి. వి నరసింహారావు గురించి మాట్లాడుకుంటున్నాం.
ఆయన పేరులో ఉండే 'నరసింహా' అనేది బాగా కామన్ నేమ్. మా క్లాస్ లోనే కాదు , చుట్టుపక్కల ఉండే ఇళ్లలోనూ ఆ పేరుతో పది మంది దాకా ఉండేవారు. నరసింహ మూర్తి అని ఒక కుర్రాడు ఉండేవాడు మా కాలేజీ లో. ఎప్పుడూ అమ్మాయిలకి లైన్ వేస్తుండే వాడు అందుకని మర మూర్తి అని పిలిచేవాళ్ళం.
మనుషుల పేర్లే కాదు, ఈ 'నరసింహా' పేరుతో సినిమాలు కూడా చాలా వచ్చినట్లు ఉన్నాయి.
నరసింహా
నరసింహానాయుడు
నర్సింహుడు
లక్ష్మీ నరసింహా
సైరా నరసింహా రెడ్డి
పైన నేను పేర్కొన్న సినిమాల్లో ఒక సినిమా పేరు తుపాకీ కాల్పులు గుర్తుకు తెప్పిస్తే, మరోటి హుస్సేన్ సాగర్ లో దూకిన నిర్మాతని గుర్తుకు తెస్తుంది, అవేంటో మీరే కనుక్కోండి. కాకపోతే మన టాపిక్ అది కాదు కాబట్టి అంతటితో వదిలేద్దాం.
మొత్తానికి నే చెప్పొచ్చేది ఏమిటంటే .... పి.వి నరసింహారావు గారు మన మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగోడు అయి ఉండి కూడా ప్రధాని అయ్యాడు అని అప్పట్లో గొప్పగా చెప్పేవారు అని.
భవిష్యత్తులో మళ్ళీ ఏ తెలుగోడు అయినా ఆ సీట్ లో కూర్చోగలడో లేడో చూడాలి. ఇప్పట్లో అయితే ఆ సూచనలు ఏమీ కానరావట్లేదు.
చిన్నప్పుడు బళ్ళో ఒకడికి 'ఆవు - గడ్డి' మాత్రమే తెలుసు. ఇందిరా గాంధీ గురించి చెప్పమంటే, ఆవిడ ఉండే బంగాళా బాగా పెద్దది, బంగాళా బయట లాన్ లో గడ్డి ఏపుగా ఉంటుంది. ఆవులకు గడ్డి అంటే ఇష్టం ఇలాంటి ఏపుగా పెరిగిన పచ్చి/పచ్చ గడ్డి అంటే మరీ ఇష్టం అని ప్రతీ దానికి తనకు తెలిసిన ఆవు - గడ్డి కాన్సెప్ట్ తో లింక్ చేస్తుంటాడు.
ఆవు - గడ్డి కథ కు నా ఈ బ్లాగ్ పోస్ట్ కి అస్సలు సంబంధం లేదు, ఉందనిపిస్తే అది మీ భ్రమ అని నా మనవి.
// “ నరసింహా' అనేది బాగా కామన్ నేమ్” //
రిప్లయితొలగించండిఅవునండీ, బ్లాగుల్లో కూడా 😎.
ఆ హిందీ వాళ్ళకు, హిందీ / ఉర్దూ ప్రభావం ఉన్నవాళ్లకు చాలా మందికి “నరసింహ” పేరు చెబితే సరిగ్గా తెలిసేడవదు. ఇక ఆ పేరుని పలకమంటేను, వ్రాయమంటేనూ నానా భ్రష్టుత్వం పట్టిస్తారు. మొదట్లో చెప్పడానికి ప్రయత్నించేవాడిని - అది పురాణాల్లో బాగా తెలిసిన దేవుడి పేరే కదా, ఏమిటి అంత కష్టం పలకడానికి - అంటూ. చివరకు ఓ ోమార్గం కనిపెట్టాను. ప్రధాన మంత్రి గారి పేరు తెలుసు కదా అని అడిగేవాడివి (అప్పట్లో). హాఁ, హాఁ, పి వి నరసింహా రావు జీ అనే వారు. ఆ పేరులో “పి” తీసేసి పలకండి, అదే నా పేరు అనేవాడిని. అప్పటికి వాళ్ళకు లైటు వెలిగి హాహాహా హోహోహో అనేవాళ్ళు. అదీ పి.వి. గారితో నాకున్న పోలిక (అంత వరకే) 🙂.
మీ టీంలో lingua franca విషయానికొస్తే Learn Tamil in 30 Days ను నమ్ముకోండి 🙂👍.
అవునండీ, నార్త్ వాళ్ళు నరసింగరావు అంటారు.
తొలగించండిరమణ అనమంటే, రమన్న అంటారు.
ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కూడా మీ పేరే మెదిలింది. బాగున్నాయి మీ అనుభవాలు.
తొలగించండితమిళ్ వచ్చు మేష్టారు. 90% అర్థం కూడా అవుతుంది, కాకపోతే అది మాట్లాడటం మీద ఫోకస్ చెయ్యలేదు ఎప్పుడూ.
మీ టీం మీటింగులు ఇలా 👇 ఉంటాయా పవన్ గారూ (విడియోలోని ఆఖరి ఒకటీ రెండు నిమిషాలు మినహాయించి లెండి) 😀 ?
తొలగించండిTeam meeting 😀
https://youtu.be/cpT1A9RQ8Jk
ఆల్మోస్ట్ అలానే ఉంటాయి మేష్టారు. మేనేజర్ మనవాడైతే మొత్తం నాకేస్తారు ఇలాగే (మేనేజర్లు దయచేసి మన్నించండి) . ఇలాంటివి చాలా చూశాను మేష్టారు. కాఫీ/లంచ్ ఖర్చులు విత్ క్లయింట్ అని చెప్పి ఇలాంటివి మా మేనేజర్ పెట్టగా ఎన్నో చూసాను, తీరా అక్కడ వాళ్ళు లంచ్ లో క్లయింట్ తప్ప భజన బ్యాచ్ మొత్తం ఉంటుంది.
తొలగించండిశంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు (ఆ వీడియో లో మేనేజర్ చక్కని ఇంగ్లీషుతో మేనేజ్ చేస్తాడుగా అలా) ఆ బిల్లులు అప్రూవ్ చేయడం లో వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ వాళ్లకు ఉంటాయి.
Ha ha ha 😁. బిల్లులు, వాటిని పాస్ చేయు / చేయించుకొను కిటుకులు ఒక అంశం.
తొలగించండిరెండు ... మీటింగ్ దాదాపు మొత్తం తమిళంలోనే నడవడం అన్నది నా మొదటి కామెంట్ భావం (మీటింగు నాకైతే ఒక్క ముక్కా అర్థం కాలేదు లెండి 😕). ఎందుకంటే మీ టీంలో అరవలు ఎక్కువ అన్నారుగా మీరు; వాళ్ళ స్వభాషాభిమానం తెలిసినదే కాబట్టి (పక్కనున్న తమిళేతరుల సంగతి పట్టించుకోకుండా) మీ టీం మీటింగులు కూడా అధిక భాగం ఇలా తమిళంలోనే జరుగుతాయా అని అనుమానం కలిగింది ఆ వాట్సప్ లో వచ్చిన విడియో చూడగానే. అదన్నమాట సంగతి 😁😁.
అబ్బో ఆ గోల వినలేము మేష్టారు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే (కనీసం ఆఫీస్ వరకైనా) ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ భాష లోనే మాట్లాడుకుంటారు ఎక్కడైనా.
తొలగించండికనీసం నెలకో సారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మీ అరవ గోల* ఆపండి క్లైంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు అని మేనేజ్ మెంట్ బతిమాలుకుంటుంటూ ఉంటుంది (మొదట్లో హెచ్చరించే వారు కానీ ఎన్ని సార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు బతిమాలుకుంటున్నారు)
*అరవ గోల అని క్లైంట్స్ కంప్లైంట్ చేయరు గానీ 'నేటివ్ లాంగ్వేజ్' లో మాట్లాడుకుంటున్నారు అని అంటారు. ఆ నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడే బ్యాచ్ ఎవరో తెలిసినా వారిని డైరెక్ట్ గా హెచ్చరించరు అందరినీ రూంలోకి తోలుకెళ్ళి బతిమాలుకుంటారు.
వాళ్ళ వాళ్ళ భాషాభిమానం గురించి తమిళులు, బెంగాలీలు ఎటువంటి దూషణ ఛీత్కారములను లెక్క చెయ్యన్నట్లే ఉంటారు.
తొలగించండిఓహో, బెంగాలీ వాళ్ళదీ తమిళుల దారే అన్నమాట. బెంగాలీ వాళ్లకు కూడా భాషాభిమానం ఎక్కువేనంటారా మేష్టారు? ఇదెప్పుడూ వినలేదు మరి.
తొలగించండిబాగా ఎక్కువ.
తొలగించండిదాన్ని గురించి చెప్పడానికి “అభిమానం” కన్నా కూడా పెద్ద పేరేదో ఉందనుకుంటాను కానీ గుర్తు రావడం లేదు.
భవిష్యత్తులో తెలుగువాడు ప్రధానమంత్రి ..
రిప్లయితొలగించండి.. ప్చ్..చాలా కష్టమనుకుంటా!!!
ఇకపోతే..
.. నాక్కూడా "ఆవు-గడ్డి" కధ ఏమాత్రం గుర్తురాలేదు సుమా!!! 😃
రవికిరణ్ గారూ, చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఏమీ లేదు.
రిప్లయితొలగించండియమగోల సినిమాలో డైలాగు గుర్తు తెచ్చుకోండి..
ఏం డైలాగ్ అది బోనగిరి గారు, కాస్త విడమరచి చెప్పండి, అసలే ట్యూబ్ లైట్ ఇక్కడ.
తొలగించండిమీరు హ్యుమరసం తో వ్రాసే పద్ధతి బాగుంటుంది పవన్ గారు.
రిప్లయితొలగించండిమన సినిమాలలో సింహాలు పులులు ఎక్కువే.
నిన్న పరేశ్ రావల్ త్వీటర్ లో అన్నమాట -
We Should Start Calling Actors As 'Entertainers' And Our Army and Police As 'Heroes' for Our Next Generation To Know The Actual Meaning Of Real Heroes !🦁🐯🐀🐇
అంతా మీ అభిమానం బుచికి గారు.
తొలగించండిపరేష్ రావెల్ గారి ట్వీట్ 100% కరెక్ట్.
రిప్లయితొలగించండిడోనాల్డు ట్రంప్ పైన వ్యాసం వ్రాయండీ :)
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకుందట, అట్టా ఉంది మీ వ్యవహారం జిలేబి గారు. సరేలే ఏదైతేనేం 'ఆవు-గడ్డి' లాజిక్ తెల్సు కాబట్టి ఎవరి మీదైనా రాసేయగలను.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసూర్య,
రిప్లయితొలగించండిమీకు తెలుగు బ్లాగేదన్నా ఉందా? ఇప్పుడు active గా లేనిది.
ఒక కామెంట్ కనిపిస్తే దాన్ని పట్టుకుని దాని బ్లాగులోకి వెడితే "తెలుగు తంబి"telugutambi.blogspot.com
అనే బ్లాగులోకి తీసుకు వెళ్ళింది. బ్లాగర్ పేరు సూర్య అని ఉంది (but no profile). సరే, మిమ్మల్ని అడుగుదామని పవన్ బ్లాగులో ఈ కామెంట్ పెడుతున్నాను.
"తెలుగు తంబి" బ్లాగ్
తొలగించండిడిటెక్టివ్ నర్సన్ :)
జిలేబి
😎
తొలగించండియుగంధర్, పెర్రీ మేసన్ ల తరానికి చెందిన వాళ్ళం కదా 😎
విన్నకోట వారు, మీకు పెర్రీ మేసన్ పుస్తకాలు ఇంకా చదవాలని ఉంటే, అవన్నీ పీడీయఫ్ రూపంలో నా దగ్గర ఉన్నాయి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితప్పకుండా శ్యామలరావు గారు, థాంక్యూ. మేసన్, హోమ్స్ కథల అప్పీలే వేరు కదా.
తొలగించండిశ్రమ తీసుకుని నాకు మెయిల్ చెయ్యగలిగితే కృతజ్ఞున్ని.
సూర్య,
రిప్లయితొలగించండిపైన నేను కోరిన వివరణ ఇవ్వనే లేదు మీరు. కానీ ఆ “తెలుగు తంబి” బ్లాగులో నీహారిక గారి లేటెస్ట్ కామెంటుకు మీ పేరుతో వచ్చిన జవాబు (ఒక హామీ) కనబడుతోంది. మీరు వారే అనుకోవాలా? “Nation wants to know” 🙂.
పవన్ తో మొన్ననేదో client comfort అన్నట్లున్నారు కదా, అది బ్లాగులకూ వర్తిస్తుంది, ఎందుకంటే బ్లాగర్లకు పాఠకులే కదా clients 🤘.
తొలగించండిఏమండోయ్ విన్నకోటవారు
Client comfort లాగా మీరున్ను ఓనర్/ సర్వర్ comfort కొరకు ఓ బ్లాగ్ మొదలెట్టరాదుస్మీ :)
జిలేబి
అయ్యా విన్నకోటవారూ, నేషన్ వాంట్స్ టు నో ఆ? మీకు తెలుసుకోవాలని ఉందని చెప్పరాదూ? మధ్యలో నేషన్ ని ఎందుకు ఇన్వాల్వ్ చెయ్యడం?!☺️
తొలగించండిఅవునండి ఆ బ్లాగు నాదే. అప్పట్లో ఏ పేరుతో దుకాణం పెట్టాలా అని ఆలోచించి సడెన్ గా మెదడుకి తట్టిన పేరుతో రిజిస్టర్ చేసేసా. అయితే తెలుగు బ్లాగు పేరులో తమిళ వాసన ఉండటం ఇప్పుడేందుకో నచ్చట్లేదు!
ఎందుకంటే ఆరవ వాళ్ళ అరుపులు వినడం తప్ప అరవంలో మాట్లాడటం నాకు రాదు. పైపెచ్చు అప్పట్లో (నా బ్లాగు రిజిష్టర్ చేసాక అనుకోండి) ఒక అరవాయన ఇప్పటి తెలుగు ముఖ్యమంత్రిమీద అభిమానంతో పోస్టులు వేస్తూ ఒకానొక సందర్భమున షర్టు లేకుండా ఫోటో కూడా ప్రచురించుకుని సల్మాన్ ఖాన్ కే షాకిచ్చారు! నా బ్లాగుపేరులో అరవ పదమున్న నాకునూయట్టి తింగరితనమేయున్నదని చదువరులనుకొందురేమోనని కించిత్ శంక ఒకవైపు!
ఎందరో మహానుభావులు బ్లాగులు రాసి అలరిస్తుండగా కామెంటుల వందనాలకే టైం సరిపోతోంది. ఇక నాకు రాయడం కుదరట్లేదు!
సూర్య,
తొలగించండిAt last. మిస్టరీ వీడింది. థాంక్స్.
అర్నాబ్ గోస్వామి అనే టీవీ పర్సనాలిటీ రాజం ఒకరు వెలుగొందుతున్నారు. వారు మహా బీభత్సంగా నిర్వహించే టీవీ షో రాజం పేరు "Nation Wants to Know". మరి మీ బ్లాగు సంగతి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనదే👍🙂.
"Nation Wants To Know"
మేష్టారు, మొత్తానికి జిలేబి గారు అన్నట్లు డిటెక్టివ్ అని ప్రూవ్ చేసుకున్నారుగా.
తొలగించండిసూర్య గారు, బ్లాగ్ పేరుదేముంది, మీరు రాస్తూ ఉండండి.
తొలగించండి🙂👍 పవన్.
రిప్లయితొలగించండి// “........ ఓ బ్లాగ్ మొదలెట్టరాదుస్మీ :)” //
రిప్లయితొలగించండి“జిలేబి” గారు, పైనే సూర్య గారి ఈ ఉవాచ
// “ఎందరో మహానుభావులు బ్లాగులు రాసి అలరిస్తుండగా కామెంటుల వందనాలకే టైం సరిపోతోంది. ........! “//
చూశారుగా? వారి అభిప్రాయమే నా అభిప్రాయం 🙂.
పవన్, కులాసాయే కదా??? మీ దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోందని వార్తలు. జాగ్రత్తగా ఉండండి 👍.
రిప్లయితొలగించండిఅవును మేష్టారు, మా పక్క రాష్ట్రం విక్టోరియా లో బాగా పెరిగి పోయింది. కాస్త జాగ్రత్త గానే ఉన్నాం. Thanks ఫర్ ది కేర్.
తొలగించండి