24, డిసెంబర్ 2020, గురువారం

మెంబర్ ఇట్, ప్యూటర్ మీద పెట్టాను మేటోస్

ప్యూజ్డ్ 

బ్రెల్లా 

ఆ హెడ్డింగ్, ఈ పదాలు మీకు అర్థం కావాలంటే మీరు కాస్త ఓపిక చేసుకుని ఇది చదవాల్సిందే. 

మా బుడ్డోడు పుట్టింది పెరిగింది ఇక్కడే ఆస్ట్రేలియాలో. వాడు పుట్టి కాస్త పెరిగేపాటికి ఇంట్లో ఇంగ్లీష్ గోల మొదలైంది. మా అమ్మాయి స్కూల్లో చదువుతోంది కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడటం, నేను కూడా PTE పరీక్షల (వీటి గురించి ఇంకో బ్లాగ్ లో మాట్లాడుకుందాం)  గొడవలో పడి తినడం, తాగడం, వాగడం అంతా ఇంగ్లీష్ లోనే. అప్పట్లో మంగస్థలం అని ఓ సినిమా రిలీజ్ అయితే భలే బాగుంది మన తెలుగు సినిమా అని  అందరూ ఆ సినిమాకి వెళ్తే నేను మాత్రం PTE పరీక్షలు అయిపోయేవరకు తెలుగు రుచి కాదు కదా దాని వాసన కూడా చూడకూడదు అని ఆస్ట్రేలియా గడ్డ మీద గట్టిగా ఒట్టు వేసుకున్నాను.  ఇక్కడ చుట్టుపక్కల పిల్లల్తో కలిసినప్పుడు కూడా మా బుడ్డోడు వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడు. కొన్నాళ్ళకు మాకు అర్థం అయింది ఏమిటంటేఎవరైనా తెలుగులో మాట్లాడితే వాడు అర్థం చేసుకుంటాడు కానీ తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. వాడి ఇంగ్లీష్ కూడా కాస్త తేడాగా అనిపించేది నాకు. 

వాళ్ళ టీచర్స్ లో ఒకరి పేరు 'మాయా' అని చెప్పేవాడు .. సరే ఏ ఇండియన్ టీచెరో అనుకున్నా. ఒకసారి ప్రీ-స్కూల్ కి వెళ్తే ఆమెను చూపించాడు. అంతవరకూ మాయ అంటే ఘర్షణ సినిమాలో స్కూల్ టీచర్ ఆసిన్ లా ఊహించుకుంటే చిన్ని కళ్ళు, చప్పిడి ముక్కు ఉన్నావిడని చూపించాడు.  తరువాత తెలిసింది కొరియన్ టీచెర్ అయిన ఆవిడ పేరు 'సమాయా' అని. 

6 ఆడ్ నెంబరా లేక ఈవెన్ నెంబరా అంటే వెన్ నెంబర్  అనేవాడు, ఈవెన్ నెంబర్ అని మనం అర్థం చేసుకోవాలి దాన్ని. కన్ఫ్యూజ్ ను ఫ్యుజ్ అని, కంప్యూటర్ ని ప్యూటర్ అని, రిమెంబర్ ని మెంబెర్ అని షార్ట్ కట్ లో పలికేవాడు. ఒక పట్టాన అర్థం  అయ్యేది కాదు మొదట్లో. 

ఒకసారి ప్రీ-స్కూల్ లో నేను వాడి హెడ్ మిస్ట్రెస్ తో మాట్లాడుతూ ఉంటే 'హి ఈజ్ హెడ్ అఫ్ అదర్ కిడ్స్ ఇన్ మ్యాథ్స్ ' అంది. మీరు హెడ్ అఫ్ అదర్ టీచర్స్ అని తెలుసు వీడు హెడ్ ఆఫ్ అదర్ కిడ్స్ ఎలా అవుతాడు అని అడిగా. తర్వాత ఆవిడ విడమరచి చెప్తే అర్థం అయింది 'హి ఐస్ అహెడ్ ఆఫ్ అదర్ కిడ్స్ ఇన్ మ్యాథ్స్ ' అని. 

ఇంకో టీచర్ తన బర్త్డే అని స్కూల్ లో పిల్లలకు గిఫ్ట్ ఇస్తే, వాట్ ఐస్ యువర్ ఏజ్ అని అడిగాడట ఆవిడ్ని. వీడు ప్రీ-స్కూల్ లో చేరిన రోజే  ఆవిడకి కూడా మొదటి రోజట స్కూల్లో. ఆవిడకు మెమొరబుల్ మూమెంట్ ఏమిటంటే ఆస్ట్రేలియన్ అయిన తను చిన్నప్పుడు కూడా అదే ప్రీ-స్కూల్ లో చదువుకుందట. ఆవిడకి వీడికి కాస్త బాండింగ్ బాగా ఉండటం వల్ల వయసు 23 అని  చెప్పిందట. 

23 సంవత్సరాల ఆవిడే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది నీకు ఇంకా ఏజ్ ఎక్కువ కదా మరి నీకెందుకు రాదు అని అడుగుతుంటాడు అప్పుడప్పుడు. 

ఒకసారి ఆ టీచర్ తో మాట్లాడాను మా వాడు పదాలు పలికే విధానం గురించి. అప్పుడావిడ 'మీ వాడు మాట్లాడేది కరక్ట్ , మీ ఇండియన్స్ లాగా స్పష్టంగా విడమరచి ప్రతీ పదం పలకాల్సిన అవసరం లేదు' అంది.  

మా అమ్మాయి చదివే స్కూల్ లో ఒక టీచర్ ఉంది. నేనేమో రోజీ అని పలుకుతాను ఆవిడ పేరును.  రోజీ కాదు 'రోజీ' అని సరిచేస్తూ ఉంటుంది మా అమ్మాయి మంచు లక్ష్మి లాగా అదోలా పలుకుతూ. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అయి చావదు. రెండూ ఒకటి లాగే అనిపిస్తూ ఉంటాయి. 

సరేలే వీళ్ళ ఇంగ్లీషే కరెక్టేమో అని సర్దుకుపోతున్నా అప్పటినుంచి. 

ఈ పాటికే మీకు ఈ పోస్ట్ హెడ్డ్డింగ్  '(రి)మెంబర్ ఇట్, (కం)ప్యూటర్ మీద పెట్టాను (ట)మేటోస్' అర్థం ఉంటుంది.  

నాన్నా!  'ఐ వాంట్ నిల్లా ఐస్క్రీమ్, నాట్ దిస్ బెరీ ఐస్క్రీమ్' అంటూ వచ్చాడు  మా వాడు. వీడికి ఇంగిలీసోళ్ళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో వచ్చింది ఇక తెలుగు మాట్లాడేది నేర్పాలి లేదంటే మంచు లక్ష్మి ని మించి పోతాడు కాబట్టి ఈ రోజు నుంచి వాడికి తెలుగు నేర్పాలని ఇదే ఆస్ట్రేలియా గడ్డ మీద ఇప్పుడు గట్టిగా ఒట్టు పెట్టుకుంటున్నాను. 

అవును 'నిల్లా' అదే వెనిల్లా ని, 'బెరీ' అదే స్ట్రాబెరీ ని తెలుగులో ఏమంటారో మీకెవరికయినా తెలిస్తే చెప్తారా? వీలయితే ప్యూజ్డ్ అండ్  బ్రెల్లా ను కూడా డీకోడ్ చెయ్యండి. 

12 కామెంట్‌లు:

  1. హలో హలో హలో "వన్", G'Day.
    బహుకాల దర్శనం. ఎల్లరున్ సుఖులే కదా?

    పదంలో సగం మింగేసి పలకడం ... బాగానే ఉంది ఆస్ట్రేలియన్ల తెలివి 🤔

    మీ టపా చివర్లో మీరిచ్చిన క్విజ్ లో "బ్రెల్లా" అంటే అంబ్రెల్లా (umbrella) అని తెలిసిపోతోంది. "ప్యూజ్డ్" అంటే ?? కన్‌ఫ్యూజ్డ్ (confused) అనా?

    ఆస్ట్రేలియన్లు "టుడై" అంటే టుడే అని అర్ధంట కదా. "చచ్చే" "చావు" లాగా ఉందే ఆస్ట్రేలియన్ ఉచ్చారణ 😢?

    పిల్లలకు సరే, మీకు కూడా అంటుకుందా? కానివ్వండి, ఏ దేశంలో ఉంటుంటే ఆ దేశ పద్ధతులు. మంచిదే.

    ఇంకాస్త తరచుగా వ్రాస్తుండండి "వన్".

    Merry Christmas 🎄 and Happy New Year 👍🙂.

    రిప్లయితొలగించండి
  2. పోస్ట్ సారాంశం బాగా పట్టేసారు ష్టారు. వీళ్ళ ఉచ్ఛారణ మీరన్నట్లు కాస్త తేడా గానే ఉంటుంది లెండి.

    6 నెలల క్రితం 3 గోల్స్ పెట్టుకున్నాను మేష్టారు. అవి రీచ్ కావాలంటే కొన్నిటికి దూరంగా ఉండక తప్పలేదు. అందులో భాగంగా ఈ బ్లాగ్ రైటింగ్ మరియు రీడింగ్ కూడా వదులుకోవాల్సి వచ్చింది.

    ఆ మూడు గోల్స్ లో ఒకటి ఈ వారంలో సాధించగలిగాను. దాని సెలబ్రేషన్ లో భాగంగా కాస్త రిలీఫ్ కోసం ఈ పోస్ట్ రాశాను.

    తరచుగా రాయడానికి ప్రయత్నిస్తాను మేష్టారు. ధన్యవాదాలు.

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. టీఈ పాసయ్యారా తోశం, ఇక ర్మనెంటు సిడెన్సీ ఒక్కటే గిలింది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రిగ్గా వత్సరం యింది జై గారు అదీ అయి. టిజెన్షిప్ చ్చుకోవాలి ఇక.

      తొలగించండి
    2. కంగ్రాట్స్ పవన్ గారూ! ఈ శుభ సందర్భంలో డోనాల్డ్ బ్రాడ్మన్ మ్యూజియం కూడా చూసేయండి.

      తొలగించండి
    3. అమ్మో, covid టైం కదూ. ఇంకో రెండేళ్ళు ఆగి ...

      తొలగించండి
  4. హో, PR వచ్చిందా? అభినందనలు 💐
    పైన మీరు PTE అన్నారు, అంటే ఇంగ్లీషు భాషా పరిజ్ఞాన పరీక్షయా? ఎవడి రూల్స్ వాడివి అనుకోండి గానీ ప్రపంచంలో చాలా దేశాలు స్వీకరించే TOEFL గానీ IELTS గానీ పనికిరావా మీ దేశం వారికి? శ్చర్యం.

    రిప్లయితొలగించండి
  5. ఏదైనా స్వీకరిస్తుంది మేష్టారు, మనది గొఱ్ఱల మంద కదా పక్కనోడు ఏది ఫాలో అయిపోతే మనమూ అదే.

    రిప్లయితొలగించండి
  6. మీకు కొత్త సంవత్సరం ఆల్రెడీ వచ్చేసినట్లుంది కదా. మీకు, మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹🌹. 2021 లో పౌరసత్వం లభించుగాక 👍.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు మేష్టారు. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      తొలగించండి