7, మే 2019, మంగళవారం

విలయ విధ్వంసానికి బీజం పడ్డ రోజు

స్థలం: మంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్. 
సమయం: దుర్ముహూర్తం, 2018. 
జరిగిన సంఘటన: 2019 లో జరగబోయే విలయ విధ్వంసానికి బీజం పడ్డ రోజు. 

బ్రేక్ టైం లో రచణ్ జిమ్ లో exercise చేస్తున్నాడు.  అవి ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లోనే, ట్విట్టర్ లోనే అప్లోడ్ చేస్తోంది ఉప్మానస. 

ఒరేయ్ అబ్బాయ్! ఈ సినిమా ఎలాగూ దెబ్బేసేలా ఉంది. ఈ సినిమాలో నటన, గిటన అంటున్నారు అది నీ వల్ల కాదు.  అయినా అందంగా ఉండే మన గానార్జున కోడల్ని హీరోయిన్ అంటే మంచి గ్లామర్ కురిపిస్తుందనుకున్నా. ఇక్కడేమో గేదలు కడుగుతూ, అంట్లు తోముతూ మసి గొట్టుకు పోయినట్లు చూపిస్తున్నఆ మసంత మొహం.. ఇవన్నీ చూస్తుంటే అసలు గ్లామర్ కనిపించట్లేదు ఈ సినిమాలో. కుసుమార్ ను నమ్ముకుంటే నట్టేట ముంచేసేలా ఉన్నాడు. నా మాట విని మనకు అచ్చొచ్చిన మాంచి మాస్ మసాలా సినిమా ఈ మంగస్థలం రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చేయడానికి రెడీ చేసి పెట్టుకోవడం మంచిది.

అంతే అంటారా డాడ్.

అంతేరా అబ్బాయ్, 150 సినిమాల అనుభవంతో చెప్తున్నా వినుకో.

మరి ఏ డైరెక్టర్ అయితే మంచి మాస్ సినిమా తీస్తాడు. V.V వాజమౌళి ని పట్టుకుంటే?

ఏదో ఆయన వల్లే నీ కెరీర్ లో నిఖార్సయిన 'గమధీర' అని అప్పట్లో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. మనకి ఇప్పటికిప్పుడు ఫాస్ట్  గా సినిమా తీసే వాడు కావాలి, అతనేమో ఇంకో రెండేళ్లు సినిమా తీస్తూనే ఉంటాడు. అయినా మనం అడగ్గానే మనతో సినిమా తీసే రేంజ్ లో లేడు. వీలయితే ఫ్యూచర్ లో ఆయన కరుణిస్తే చేద్దువులే . 

టపోరి గజన్నాథ్ ఉన్నాడుగా, భలే ఫాస్ట్, ముప్పై రోజుల్లో తీయగలడు.

అదేమైనా హిందీనా, తమిళా, ముప్పై రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా? అన్నట్లు, అలాంటి బుక్ చదివి యెంత హిందీ నేర్చుకోగలమో, ఆ టపోరి జగన్నాథ్ సినిమా నుంచి కూడా అంతే కలెక్షన్స్ తెచ్చుకోగలం.

హిందీ అని గుర్తుచెయ్యొద్దు డాడ్, బంజీర్ సినిమా గుర్తొస్తే మంజీరాలో దూకేయాలి అనిపిస్తది.

జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందమే, మరి నీకేమో అంత సీన్ లేదు. తెలుగులోనే ఇప్పటిదాకా సరిగ్గా దిక్కు లేదు గానీ హిందీకి పోయావ్.

అబ్బా, వదిలేయ్ డాడ్. మరి, S.S. సినాయక్ తో అయితే.

నాలాగా బాగా outdated సరుకు అతను. expire అయిన మెడిసిన్స్ వాడటం యెంత డేంజరో ఇలాంటి వాళ్లతో సినిమా కూడా అంతే డేంజర్.

మరి ష్రిక్ అయితే బాగా తీస్తాడేమో?

మరీ అంత క్లాస్ మనకు నప్పదు.

వితిక్రం?

అజ్ఞాన వాసి దెబ్బకు ఇంకా మీ బాబాయే కాదు, చూసిన జనం కూడా ఇంకా కోలుకోలేదు.

నుశీ బ్లాక్ల అయితే?

వద్దురా బాబూ, మందమైన వాడు, వెస్లీ అని మనిద్దరం బోల్తా కొట్టాం అతనితో కలిసి. మళ్ళీ అవసరమా?

మాస్ కు అడ్రస్ లాంటి వాడైన యోబపాటిని పిలిపించు. అతనైతే దండగమారి వంశ హీరోతో హింసా, భజండ్ లాంటి మాంచి మాస్ సినిమాలు తీసినట్లు మన తడికెల వంశంతో కూడా మంచి మాస్ సినిమా తీస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఆవు లాగా పిండేసి మంచి మ్యూజిక్ రాబడతాడు.

మంచి చాయిస్ డాడ్. అందుకే నిన్ను గెమాస్టార్ అనేది అందరూ. సరే అలాగే పిలిపిస్తాను. 

                                                                   ************

సమయం: 10 జనవరి 2019
స్థలం: ఒకటని కాదు "విలయ విధ్వంస రామ" సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల
జరిగిన సంఘటన: సునామీలు, తుఫాన్లే కాదు, ఇలాంటివీ వస్తుంటాయని వచ్చిన హెచ్చరికలు ఖాతరు చేయకుండా పోయిన జనాల హాహాకారాలు. 

                                                                ****************

సమయం: ఇటీవల ఒకరోజు రాత్రి 9:30, శుక్రవారం
స్థలం: ఆస్ట్రేలియాలో ఒక ఇంట్లో
జరిగిన సంఘటన: గర్వం అణిగిన రోజు

యెంత చెత్త సినిమా అయినా కన్నార్పకుండా చూస్తానని నాకు భలే గర్వం ఉండేది. అలాంటి నా గర్వాన్ని ఈ సినిమా అణిచేసింది. హాట్స్ ఆఫ్ టు యోభపాటి ఫర్ సచ్ ఏ గ్రేట్ మూవీ. 

ఇంటర్వెల్ తర్వాత నేనెళ్ళి పడుకుంటాను అని నిద్రపోయింది మా ఆవిడ. మరుసటి రోజు ఉదయం అడిగింది ఇంటర్వెల్ తర్వాత కథ ఏంటి? అని. 

ఒకే మాటలో చెప్పాను. ఇంటర్వెల్ తర్వాత మొదలెట్టిన ఫైట్ సినిమా ఎండ్ కి ఆపేశాడు అని.

అవార్డు సినిమాల గురించి శివాజీ గణేశన్ గారు చెప్పే వారట 'ఒక వ్యక్తి సముద్రంలో పడవ వేసుకుని బయల్దేరతాడు, వెళ్తుంటాడు, వెళ్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా' అని. 

ఈ సినిమా స్టోరీ కూడా అలాగే ఉంటుంది. 'హీరో ఫైట్ మొదలెడతాడు, చేస్తుంటాడు, చేస్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా'. మరి ఇలాంటి డబ్బా సినిమాలను ఏ కేటగిరి లో చేర్చాలబ్బా?

P.S: ఈ పోస్ట్లోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం, కల్పితం, కల్పితం. 

65 కామెంట్‌లు:

 1. నాగార్జున ఇలా చెప్పాడు, అవార్డ్ సినిమాల గురించి - "చెంప మీద చెమట కారడం పా...వుగంట చూపించాలి. నా వల్ల కాదు."

  రిప్లయితొలగించండి
 2. మీ బ్లాగ్ చదువుతున్నాం కదా అని ఎంత ఉద్యోగం లేకపోతేమటుకు అన్ని యాడ్సా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది మాత్రం నా చేతిలో లేదు నీహారిక గారు, గూగుల్ వాడి ఆటోమేటిక్ రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేశా.

   తొలగించండి
 3. ఈ కథలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు. కల్పితం, కల్పితం, కల్పితం.
  -------------------------------
  నమ్మాం, నమ్మాం, నమ్మాం :-P

  ఏదో ఇంటర్నెట్టులో దొరికింది ఈ తవిక.

  రచణ్,

  చెప్పుకోవడానికి "గమధీర" సినిమానిచ్చావ్
  చూసుకోవడానికి "మ్యారెంజ్" సినిమానిచ్చావ్
  తిట్టుకోవడానికి "బచ్చ" సినిమానిచ్చావ్
  టేస్టు మారిందని చెప్పడానికి "భృవ" సినిమానిచ్చావ్

  కానీ, ఎదుకయ్యా "భయోపాటికి" డేట్లిచ్చావ్..

  అయినా సరే .. నువ్వు నాకు నచ్చావ్ ..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాకీ తవిక భలే నచ్చింది శ్రీకాంత్ గారు. అదెందుకో నాకు చిన్నప్పటినుంచి కవితల కన్నా తవికలు అంటేనే ఇష్టం. కనీసం తవికలు చదివితే నవ్వొస్తుంది. అఫ్ కోర్స్ నా రేంజ్ ఇంతే కాబట్టి కవితలు అర్థం చేసుకొనే కెపాసిటీ లేదనుకోండి.

   తొలగించండి
 4. ** కవితలు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు**
  "మీది తెనాలే, మాది తెనాలే .. మనది తెనాలే" :-)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంతోషం, మీదీ తెనాలి అయినందుకు 😊

   తొలగించండి
  2. జాగ్రత్త మేస్టారూ, పెద్ద పెద్దోళ్లే చిక్కుల్లో పడుతున్నారు ఆ పదం వాడి.

   తొలగించండి
  3. మీ టూ చిక్కులకు సమాధానం.. #MenToo
   ఆల్రెడీ ఆన్‌లైనులో ఒకటి అరా జనాలు దానిగురించి మాట్లాడారు.
   ఎంతో టైం పట్టదు అందరూ అర్థం చేసుకోవడానికి.. :-)

   తొలగించండి
  4. Thanks for letting me know Srikanth gaaru. ఇప్పుడే వినడం ఈ పదం గురించి #MenToo

   తొలగించండి
  5. Have a look at this latest news...

   https://timesofindia.indiatimes.com/tv/news/hindi/its-time-to-begin-a-mentoo-movement/articleshow/69226675.cms

   This will begin, one day or other day. That's for sure...

   తొలగించండి
  6. పవన్,
   #MeToo పదం వాడిన వాళ్ళు చిక్కుల్లో పడరు. వాడబడిన వాళ్ళు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. నేను ఆ పదం వాడిన వాడను కాబట్టి ... నో భయం 😎.

   అఫ్కోర్స్ #MenToo కూడా బాగుంది. ఆ ఉద్యమం పుంజుకోవాలి.

   తొలగించండి
  7. విన్నకోట గారూ,
   ఖచ్ఛితంగా "పుంజు"కుంటుంది, తప్పుడు కేసుల "పెట్ట"లకు ముకుతాడు పడుతుంది. ఇది గ్యారంటీ ఒక రోజు :-)

   తొలగించండి
  8. తెనాలి వాళ్ళు ఇంతమంది ఉన్నారా ? ఏటిగట్టు దాటి వచ్చారంటే మా ఊరు వచ్చేస్తుంది. భయపడకుండా, నిద్రపోకుండా సినిమా మొత్తం చూసారుగా గర్వం ఎక్కడ అణిగింది ? రాతి గుండెలు కాదూ ? Men Too...

   తొలగించండి
  9. గుర్తు రావడం లేదు కానీ మొన్న మోడీ ఏదో విషయంలో మీటూ అన్నారని ఆయనను ఎవరో తారామణి మీరు కూడానా అన్నట్లు గుర్తు విన్నకోట నరసింహారావు గారు

   తొలగించండి
  10. ఏదో ఒక సీన్ అయినా బాగుండదా అని మొత్తం భరించాను నీహారిక గారు.

   తొలగించండి
 5. ఈ భయపెట్టి అనబడే దర్శకుడికి ఇటీవల గోదారి ఆవిష్కారాలు అనే షార్ట్ ఫిలిం ఇస్తే ముప్పై నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు. దానితో పోలిస్తే విలయ విధ్వంస మారా లాంటి సినిమాలు గుడ్డిలో మెల్ల అనుకోవాలి. గర్వాన్ని చంపినా మనిషిని మిగిల్చాడు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరన్నది కరెక్టే జై గారు, 'భయపెట్టి'😊 గారి దెబ్బకు బతికి బయటపడినందుకు సంతోషించాలి.

   తొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. దభ్ర సినిమా తర్వాత ఈ భయోపాటి గారి చిత్ర రాజాలు ఏవీ అంతగా చూడాల్సినివి కావు అని నాకో గాఠి నమ్మకం. ఆ నమ్మకమే నన్ను కాపాడింది ఈ సంక్రాతి కి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఘోటక బెమ్మీలం.. మాకూ అస్ బధలు లేవులెండి. లేని పెళ్ళాన్ని తిట్టినా ఏమీ అవదు.

   నోట్: పైనున్న పెద్దాయన (Madhav Kandalie) ఎవ్వరో నాకు తెల్వద్. ఏదో నీహారిక గారు చెప్పింది ఫన్నీగా అనిపించి రిప్లై ఇస్తున్నా అంతే!!

   తొలగించండి
  3. ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటారు, వెంటనే పెళ్ళి చేసుకోండి శ్రీకాంత్ గారు. ఎప్పటికైనా ఒక తోడు అవసరం కదా.


   అసలే ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేను, అందుకే ఆ సలహా.

   తొలగించండి
  4. అనగనగా ఒక కుర్రాడు గారూ, ఆ మాత్రం జాగ్రత్త లేక నేను దెబ్బైపోయాను. అవును నాకూ దభ్ర సినిమా నచ్చుతుంది.

   తొలగించండి
  5. // “వెంటనే పెళ్ళి చేసుకోండి శ్రీకాంత్ గారు” //
   Sadism పవన్ గారూ ☝️.

   తొలగించండి
  6. ఈ బ్రహ్మీలు పదేళ్ళనుండీ బ్రహ్మీలుగానే ఉండిపోయారు. మోదీ బ్రతకడం లేదా ? ఎలాగోలా బ్రతికేయండి.

   తొలగించండి
 8. # Srikanth
  మీరన్న ఆ “పెద్దాయన” Madhav Kandalie గారు కూడా ఒక బ్లాగరేనండి. “అనగనగా ఓ కుర్రాడు” అనే బ్లాగ్.
  https://anaganagaokurradu.blogspot.com/
  ———————
  పైన నీహారిక గారు చెప్పినది ఒక వాట్సప్ జోక్ లెండి. చంద్రమోహన్ అనే బ్లాగర్ గారి “అంతా సౌందర్యమే” అనే బ్లాగ్ లో వచ్చింది.
  http://anthasoundaryame.blogspot.com/2019/04/blog-post_25.html
  ———————
  // “ఘోటక బెమ్మీలం” //
  అదృష్టవంతులు / తెలివైనవారు 👌. Try and remain one 😀😀 (jk) .

  రిప్లయితొలగించండి

 9. # Srikanth
  తప్పకుండా పుంజుకోవాలి, ముక్కుతాడు పడవలసినవారికి తప్పక పడాలి. ఎందుకంటే మిటూ ఉద్యమాన్ని కక్ష సాధింపుకో, తమకి ప్రచారం తెచ్చుకోవడానికో, బెదిరించి అవకాశాలు నొల్లుకోవడానికో కొందరు వాడుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

  ప్రముఖులు ఈ రోజులలో ఆడవారితో మాట్లాడాలంటేనే జంకుతున్నారు అనిపిస్తే తప్పేం లేదు. మిటూ మొదలవకముందే 2013 లోనే కేంద్రమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా గారు మహిళలను పర్సనల్ సెక్రెటరీగా పెట్టుకోవడానికి కూడా భయంగా ఉంది అన్నారట. ఈ క్రింది లింక్ చూడండి 👇.

  https://www.thehindu.com/news/national/farooqs-remarks-on-women-trigger-row/article5430818.ece

  రిప్లయితొలగించండి
 10. విన్నకోటగారూ,

  అలాంటివి ఎన్నో ఉన్నాయి. సుప్రీం కోర్టు జడ్జిమీద పడ్డ కేసు తరువాత, ఆడవారిని పనిలో పెట్టుకోవద్దని డిసైడ్ చేసుకుంటున్నారట అక్కడి జడ్జీలు. ఇలాంటివి ఇది వరకు కూడా చదివాను. స్టూడెంట్లు పెట్టిన కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, ఎవరైనా స్టూడెంత్ వస్తే.. తలుపు పూర్తిగా తెరిచి మాత్రమే వారితో మాట్లాడుతున్నారట. ఇక మీదట, మగవారికి CC Camera ఒక్కటే శ్రీరామ రక్ష అనుకుంటా ! అవి కూడా ఓ 20యేల్ల తరువాత MeToo అనేవాల్ల నుండి రక్షించలేవ్ ! ఒక్కటే రక్షిస్తుంది. ఇలాంటి వాటికి భయపడడం కాదు, మీదికి వచ్చినప్పుడు పరువుపోతుంది, తొక్క పోతుంది అని ఫీలవ్వకుండా ఎదుర్కోవడం. సినిమా యాక్టర్ "అర్జున్ (మన జంటిల్‌మన్)" లాగా ధైర్యంగా పోరాడాలి. సుభాష్ ఘాయ్ కూడా గట్టిగానే పోరాడాడు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు మగవారికి అంతగా సపోర్టు లేదనుకోండి. ఆడవారు మీటూ అనగానే వారికి మద్దతు తెలపడం తప్ప మరేమి చేసినా నువ్వూ "ఆ రేపిస్టుల్లో" ఒకడివి అవుతాం అనడమే ప్రస్తుతం ట్రెండ్. ఈ సోషల్ బ్లాక్‌మైల్ నుండి భయపడాలంటే మగవారికి కొంత టైం పడుతుంది

  రిప్లయితొలగించండి
 11. #MenToo:Law Used for vendetta in many break-ups, say HCs

  https://m.timesofindia.com/india/law-used-for-vendetta-in-many-break-ups-hcs/articleshow/69242870.cms

  ఇంకో కోర్టు తీర్పు. దుర్వినియోగం మంచిదే, దాని వల్ల "భయం" పెరుగుతుంది అనే వాల్లున్నారు. ఈ తరహా "భయం" అనేక ఉధ్యమాలు చేసి, కష్టపడి సాధించుకున్నవి కొన్ని ఉన్నాయి. వాటికే ఎసరు తెస్తుంది ఒక రోజు. ఆ విషయాన్ని వాల్లు గమనించట్లేదు.

  ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే.. ఎంతో సరదా పోస్టులో ఈ సీరియస్ కామెంట్లు పక్క దారి పట్టించడమే కాదు, పంటి కింద రాళ్ళలా అనిపించినా అనిపిస్తాయి కొంత మందికి :-)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మేమెందుకు ఆపుతామండీ...కష్టపడి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం. మీరు కూడా కష్టపడి Men Too అనాలి.

   తొలగించండి
  2. అస్సలు ఆపకండి, అదేగా మేము చెప్పేది కూడా. కాకపోతే, మిస్-యూజు చేసినోళ్ళకి దబిడిదిబిడి చేసేయడం మాత్రం మా పని.

   తొలగించండి
  3. Creaseలో లేకుండా game ఎలా ఆడతారండీ ?
   మిస్ యూస్ చేయాలన్నా అసలు ఆటలో అరటిపండు అయినా అవ్వాలి కదా ? బ్రహ్మీలు safe...🐒

   తొలగించండి
 12. Boyapati is in my negative list like RGV. So I don't watch their films.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంకా మీ లిస్ట్ లో యేయే డైరెక్టర్స్ పేర్లు వున్నాయో చెప్తే ఫ్యూచర్ లో జాగ్రత్త పడతా బోనగిరి గారు

   తొలగించండి
  2. బోనగిరి గారి నెగటివ్ లిస్టును పాటిస్తే మీకు చూడ్డానికి సినిమాలు మిగిలవమో పవన్ గారూ! సపోస్ ఆయన కె. విశ్వనాథ్ & రాజమౌళి తప్ప వేరే దర్శకుల బొమ్మలు చూడొద్దంటే మీకు గిట్టుబాటు అవుతుందా?

   తొలగించండి
 13. కె.విశ్వనాథ్ గారు ఓకే. రాజమౌళి కూడా అంత పగలదీసిందేమీ లేదు. మగధీర, యమదొంగ, ఈగ వంటి అర్థంపర్థం లేని సినిమాలు తీసి .... బోలెడంత పేరు, డబ్బు మూట కట్టుకున్నాడు అంతే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బోనగిరి గారి కంటే మీ లిస్టు ఇంకా "కఠినం" గురువు గారూ. వారానికి ఒకటో రెండో సినిమాలు చూసే అలవాటున్న "కలాపోసకులు" మిమ్మల్ని నమ్ముకుంటే కష్టమే :)

   తొలగించండి
  2. మీరన్నట్లు వీళ్ళ లిస్ట్ పాటిస్తే తెలుగు సినిమాలేవీ చూడకుండా ఉండాల్సి వచ్చేట్లు ఉంది జై గారు.

   నరసింహారావు గారు అన్నట్లు, నాకూ రాజమౌళి సినిమాలు అంత ఇష్టం ఉండవు, మరీ లౌడ్ గా అనిపిస్తాయి.

   తొలగించండి
  3. ఎవరి లిస్ట్ వాళ్ళే తయారు చేసుకుంటే మంచిదేమో పవన్ గారూ

   తొలగించండి
  4. // “నరసింహారావు గారు అన్నట్లు, నాకూ రాజమౌళి సినిమాలు అంత ఇష్టం ఉండవు ..” //

   చూ “షా” రా, మరి 😎

   తొలగించండి
  5. ఎవరి లిస్టు వాళ్ళ ఇష్టం కాని, నా లిస్టులో ఇంకా పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, బొమ్మరిల్లు భాస్కర్, రవిబాబు కూడ ఉన్నారు.

   తొలగించండి
  6. బోనగిరి గారు, మెహర్ రమేష్ ని కూడా కలుపుకోండి మీ లిస్ట్ లో, లేదంటే బాధపడతాడు. అతను ఈ మధ్య సినిమాలు ఏవీ తీస్తున్నట్లు లేదనుకోండి.

   తొలగించండి
  7. బోనగిరి గారూ, ఆర్. నారాయణ మూర్తి పేరు మీ లిస్టులో చేర్చకపోవడం ఆశ్చర్యకరం.

   తొలగించండి
 14. @ Pavan Kumar Reddy Rendeddula,
  కేసీఆర్ గారి పాత ప్రసంగాలు పెట్టుకుని వినండి. భలే టైం పాస్. సామెతలు బోనస్.

  రిప్లయితొలగించండి
 15. బోనగిరిగారికి మెదడు(ఆలోచనాస్త్రం) ఉన్న డైరెక్టర్స్ నచ్చదల్లే ఉంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా నెగిటివ్ లిస్టులో ఉన్న వాళ్ళకి మెదడు ఉందని మీరు అనుకుంటున్నారా?

   తొలగించండి
  2. మీకెందుకు నచ్చలేదో ఒక పోస్ట్ వ్రాయండి.ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ? ఎలా ఉండాలి ? అది కూడా వ్రాయండి.అక్కడ చర్చిద్దాం.

   తొలగించండి
 16. అయ్యబాబోయ్! మీరు ఈ సిన్మా చూశారూ అంటే మీకు సిన్మాలు చూడడంలో పరమ-వీక్షక-వీర-చక్ర ఎవార్ద్ ఇవ్వాలిందే, పవన్‌గారు!

  రిప్లయితొలగించండి
 17. మళ్ళీ అదే అంశం తెచ్చాననుకోవద్దు. పైన #Men Too ఉద్యమం గురించి కొంత చర్చ జరిగింది కదా. నిన్నటి (20-05-2019) "ఆంధ్రజ్యోతి" (Hyderabad City) దినపత్రికలో పేజ్.7 "నవ్య" సెక్షన్ లో "#Men Too అంటే తప్పేంటి?" అని ఒక వ్యాసం వచ్చింది. దీపికా నారాయణ్ భరద్వాజ్ అని ఒక మహిళ మగవారి హక్కులను సమర్థిస్తూ వెలిబుచ్చిన ఆసక్తికరమైన తన అభిప్రాయాలు. తప్పక చదవండి.

  May her tribe increase.

  #Men Too అంటే తప్పేంటి?

  రిప్లయితొలగించండి
 18. Beware of the women who pretend to be "Men's Voice" in the present world. The reality is different here !

  రిప్లయితొలగించండి
 19. అలా అంటారా? అయితే ఈ బాట నిండా ల్యాండ్-మైన్స్ ఉన్నట్లున్నాయే? ఇదేదో డేంజరపాయంలా ఉంది. నిజమే గనక అయితే ... స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని పెద్దలు అన్న మాట గుర్తు పెట్టుకోవాలేమో ఎల్లవేళలా 😳?

  ఎనీవే, మీరన్న రియాలిటీ గురించి ఒకటిరెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును శ్రీకాంత్ గారు, నాకూ అర్థం కాలా.

   తొలగించండి
  2. "స్త్రీ బుద్ధి ప్రళయాంతకం "అనగా స్త్రీ తన బుద్ధితో ప్రళయాన్ని కూడా అంతమొందించగలదు అని అర్థం.

   తొలగించండి
 20. పర్టిక్యులరుగా కొంత మంది గురించి రాయడం అంటే కొరివితో తల గోక్కోవడమే. కానీ, స్వయంగా .. "కొంత మంది" స్త్రీల దగ్గరకి వెల్లి తమ బాధను మొర పెట్టుకున్న వారు అక్కడ తమకు దొరికిన "సానుభూతి"ని చూసి, తరువాత .. ఇతర పురుష హక్కుల కార్యకర్తల దగ్గర వెలబోసుకున్న గోడు, స్వయంగా "SIFF" లీడర్లే కొంత మంది వెలుబుచ్చిన అభిప్రాయాలు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కొన్ని .. చెప్పగలం. ఏమైనా నిజం నిలకడ మీద తేలుతుంది. వెయిట్ అండ్ సీ..

  రిప్లయితొలగించండి