8, ఫిబ్రవరి 2021, సోమవారం

కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం

హలో, మాట్లాడేది పవనేనా?

అవును నేనే 

మేము RMS డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. 

సారీ, నేను MCA తోనే చదువు ఆపేసాను, ఇప్పుడు MS చేసే ఆలోచన లేదు. 

Roads and Maritime Services డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. లాస్ట్ ఇయర్ మీరు కార్ రివర్స్ చేస్తూ ఫలానా నెంబర్ వెహికల్ ని గుద్దేశారు. అది మేము ఓల్డ్ రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఉంటే బయటపడింది. మీరు దానికి ఇంతవరకు ఫైన్ చెల్లించలేదు. ఓవరాల్ గా మీరు 1240$ చెల్లించాలి. మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెయ్యండి ఈ రోజు బిజినెస్ క్లోజ్ అయ్యే లోపు. లేదంటే రేపు ఉదయాన్నే పోలీసులు మీ డోర్ తట్టాల్సి వస్తుంది. 

డోర్ తట్టాల్సిన అవసరం లేదండి, మాకు ఇంటర్ కామ్ ఉంది అందులో మా యూనిట్ నెంబర్ ఎంటర్ చేసి # సింబల్ ప్రెస్ చేయమని చెప్పండి. 

అంతే, అవతలి వాడు టక్కున ఫోన్ కట్ చేశాడు. 

ఇలాంటి ఫేక్ కాల్స్ ఇక్కడ చాలా కామన్ గా వస్తుంటాయి. మీరు ఇల్లీగల్ గా వీసా ప్రాసెస్ చేయించుకున్నారు, కాబట్టి మీకు అరెస్ట్ వారెంట్ తప్పదు, వెంటనే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కి ఫలానా అమౌంట్ కట్టి అప్లికేషన్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మీరు టాక్స్ ఎగ్గొట్టారు మీరు ఇంత అమౌంట్ వెంటనే కట్టేయండి అని స్కాం కాల్స్ వస్తుంటాయి. 

ఇలాంటి ఫోన్స్ రాగానే  చాలా మంది భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేశారు. 2019 లో ఇలాంటివి చాలా ఎక్కువై గవర్నమెంట్ టీవీల్లో రేడియోల్లో కూడా అవేర్నెస్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. 

నాకు మాత్రం కొంచెం కూడా భయం వెయ్యలేదు ఆ కాల్ వచ్చినప్పుడు..ఎందుకంటే నా మొహానికి కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి. 

మాది చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం అవ్వడం వల్ల (ఇప్పుడేదో హై క్లాస్ ఫామిలీ అనుకునేరు ఇంకా అదే ఏడుపే) బైక్ ఉండేది కానీ కారు ఉండేది కాదు కాబట్టి బైక్ డ్రైవింగ్ మాత్రమే నేర్చుకున్నాను. 

ఆ తర్వాత M.C.A పూర్తి చేసి I.T జాబ్ వెలగపెట్టేటప్పుడు ఇప్పుడే కదా సంపాదన మొదలైంది అప్పుడే అప్పు పెట్టి కార్ కొనడం అవసరమా అనుకున్నాను. 

కొన్ని సంవత్సరాలకి చేతిలో కొంత డబ్బు పడింది. అసలే మనకి సినిమా పిచ్చి కదా, సినిమా వాళ్ళు ఏమి చెప్పినా బాగా ఎక్కేస్తుంది. ఒక సారి మురళి మోహన్ ఏదో ఇంటర్వ్యూ లో మాటాడుతూ మీ దగ్గర కారు కొనగలిగిన డబ్బు ఉన్నా బైక్ కొనండి చాలు.  బైక్ కొనగలిగిన డబ్బు ఉన్నా సైకిల్ కొనండి, సైకిల్ కొనగలిగిన డబ్బు ఉన్నా తోపుడు బండి కొని దాని మీద ముంత కింద పప్పు అమ్ముకుని బతకండి (కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని మీరు అర్థం చేసుకోవాలి) అని 'డబ్బులన్ని ఖర్చుపెట్టక దాచుకోండి నాయనా' అనే ఒక ఉపదేశం ఇచ్చాడు. అది బాగా పట్టెయ్యడం వల్ల కార్ కొనగలిగే స్తోమత ఉన్నా కారు కొనలేదు (ఓహో అయితే బైక్ కొన్నావా?  అని మాత్రం అడగకండి. బైక్ కొనడమో లేక  తోపుడు బండి కొని దాని మీద శెనక్కాయలు అమ్ముకోవడమో కాదు కాన్సెప్ట్ ఇక్కడ, మనం కార్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం) 

ఆ తర్వాత ఇంకాస్త డబ్బు సంపాదించాక, ఈ బెంగుళూరు ట్రాఫిక్ లో కార్ డ్రైవ్ చేసే నరకం కన్నా అదే బెంగుళూరు లో ఏదో ఒక థియేటర్ లో కన్నడ సినిమా చూడటం ఎంతో కొంత బెటర్ అని డిసైడ్ అయి కార్ కొనలేదు. 

ఆఫ్ఘనిస్తానో , పాకిస్తానో ఏదో ఒక దేశానికి onsite పంపిస్తామని ఆఫీస్ లో చెప్పడం వల్ల  ఈ టైం లో కార్ కొనడం అవసరమా అని అప్పుడూ కార్ కొనలేదు. 

నాకుండే ఫ్రెండ్స్ కి కూడా అప్పట్లో కారు ఉండేది కాదు కాబట్టి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు, అనిపించలేదు కూడా. 

అలా స్వదేశంలో  నా చుట్టుపక్కల నాకెప్పుడూ కారు కూతలే వినిపించలేదు. 

6 కామెంట్‌లు:

 1. కారు కూతలంటే ఇయ్యా.. నేనింకా మా "కారు" సారు కే.సీ.యారు మాట్లాడిన మాటలనుకున్నా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాకూ పాలిటిక్స్ కీ శానా దూరం లెండి శ్రీకాంత్ గారు. దాని స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ టైం వేస్ట్ చేసి ఉంటే మన్నించగలరు.

   తొలగించండి
 2. మీ టపా హెడ్డింగ్ చూసి పరాయిదేశంలో కారు కొన్న సంబరమేమో, ఇక పౌరసత్వం ఒకటే బాకీ కదా అనుకున్నాను. ఇంతకీ కారు కొన్నారా లేక మురళీ మోహన్ చెప్పిన సలహా అక్కడ కూడా ఫాలో అయిపోతున్నారా 🙂?

  బెంగుళూరులో థియేటర్ లో కన్నడ సినిమా చూడడం .... హ్హ హ్హ హ్హ, సూపర్ 👌😁😁.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సలహాను కాస్త customise చేసుకుని ఫాలో అయ్యాను మేస్టారు.

   థాంక్స్ ఫర్ రీడింగ్.

   తొలగించండి
 3. Animals gurinchi Telugu lo chaduvukodaniki tganimalstelugu.blogspot.com chudandi

  రిప్లయితొలగించండి