24, ఫిబ్రవరి 2021, బుధవారం

కొత్తొక వింత పాతొక రోత కాలం కాదిది

మన పాత తెలుగు సినిమాల్లో అడుక్కునే వాళ్ళు ఒక చక్రాల బల్ల పై కూర్చుని చేతులతో తోస్తూఉంటే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. చిరంజీవి దొంగ మొగుడు సినిమా లో ఇలాంటిది యూజ్ చేశాడు. ఇంకా ఖైదీ లో అనుకుంటా సుత్తివేలు యూజ్ చేస్తాడు ఇలాంటిది.  ఇప్పుడా సోది ఎందుకు అంటారా? సరిగ్గా అలాంటి చక్రాల బల్లనే చూశాను మొన్నొక సారి షాప్ కి వెళ్ళినప్పుడు.  పైగా దానికి 'స్కూటర్ బోర్డ్' అని దానికి స్టైల్ గా పేరొకటి.



ఈ మధ్య ఒకసారి మా ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో క్లే పాట్స్ స్టాల్ పెట్టి హెల్త్ కి మంచిది ఈ మట్టి కుండలో వంట వండుకోండి నాన్ స్టిక్ కోటింగ్ మంచిది కాదు అని ఊదర గొట్టేసి సాయంత్రానికి స్టాల్ మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళారు. ధర తక్కువేమీ కాదు ఒక్కొక్కటి 50$ పైనే. నా చిన్నప్పుడంతా ఈ మట్టి కుండల్లోనే శుభ్రంగా వాడుకుతినేవారు. ఆ తర్వాత నాన్ స్టిక్ అనేది రావడంతో మట్టి పాత్రలని, ఇనుప పాత్రలని వదిలేసి నాన్ స్టిక్ కి స్టిక్కయి పోయారు. ఆ మోజు కొంచం తీరి మళ్ళీ ఇప్పుడు మట్టి కుండల వెంట పడుతున్నారు.  

ఒకప్పుడు చక్కగా పెరట్లోనో, సొంత తోటల్లోనో పురుగుల మందులు వాడకుండా పెంచిన కాయగూరలు వాడేవారు. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ అయి వచ్చిన కూరగాయలు కొన్నారు.  ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వెంట పడ్డారు. ఆర్గానిక్ అని చెప్పి గోంగూర 250 గ్రాములు 15$ పెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ కొంటే అదో గొప్ప ఫ్యాషన్ పైగా హై క్లాస్ ఫ్యామిలీ అని ఒక ఫీలింగ్.  సరేలెండి హెల్త్ కి మంచిదే కాబట్టి కొంటే తప్పేమి లేదు. 

ఒకప్పుడు హవాయి చెప్పులు (ఆ రబ్బరు చెప్పులు) వేసుకు తిరిగితే నామోషీ అనేవారు. ఇప్పుడంతా అవే చెప్పులే స్టైల్ గా వేసుకుని తిరుగుతున్నారు, వాటికి బీచ్ స్లిప్పర్స్, thongs, Flip flops అని ఏవేవో పేర్లు పెట్టేశారు రకరకాల రంగుల్లో తయారుచేసి. 

అప్పట్లో ప్యాంట్ పైకి మడిస్తే రిక్షా వాడిలా ఏమిట్రా అని తిట్టేవారు. ఇప్పుడు అదే ఫాషన్. మిస్సమ్మ లో మన ఎన్టీవోడు వేసిన నిక్కర్ల లాంటివి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి షార్ట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. 

మన పాత రాగి సంగటిని రాగి బాల్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంటుల్లో అమ్మేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు చద్ది అన్నం కూడా ఫ్యాషన్ అయినట్లు ఉంది. 



చిన్నప్పుడు బయటి నుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కోండి అని పెద్దవాళ్ళు అంటే వీళ్లది మరీ చాదస్తం అనేవాళ్ళే ఇప్పుడు రుద్ది రుద్ది చేతులు కడుగుతున్నారు COVID దెబ్బకి. 

కాలం ముందుకే కాదు అప్పుడప్పుడూ వెనక్కి పోతుందని అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. కొత్తొక వింత పాతొక రోత అనుకునే కాలం పోయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు ఇప్పుడు. 

6 కామెంట్‌లు:

  1. చద్దన్నంతో పాటు నంచుకోవడానికి ఆవకాయ ముక్క కూడా వేస్తాడా 😁 ? చద్దన్నం రుచి మరిగితే డోనట్స్ అమ్మకాలు పడిపోతాయేమో పాపం 😢🙂? సోకాల్డ్ “ఆర్గానిక్” కూరగాయలంత హాస్యం మరొకటి ఉండదేమో?

    Old is gold అని ఎగదోస్తే వెరైటీగా ఉందనిపిస్తూ డబ్బులు పుష్కలంగా దండుకోవచ్చు కదా. కొత్తదనం చూపించి అమ్మకాలు పెంచకపోతే మరి మొదటి ఉద్యోగంలోనే లచ్చలు లచ్చల జీతం సంపాదించే సోకాల్డ్ MBA కుర్రకారు తమ ఉనికిని సమర్థించుకోవడం ఎలా? అందుకు ఈ పైత్యాలన్నీ (వాటినే వ్యాపారరంగంలో gimmicks అంటారట). సర్వం వ్యాపారమయం, శిష్యా 🤘.

    రిప్లయితొలగించండి
  2. Scooter board హ హ !! భలే ఉంది. విన్నకోట గారు , బాగా అడిగారు. ఆవకాయ ముక్క కూడా వేస్తాడేమో మరి. ప్లాస్టిక్ అంతా ప్రపంచానికి అంటకట్టి ఇప్పుడు global warming అంటూ సోది చెప్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊరగాయ, ఉప్పుమిరపకాయ సెపరేట్ ఐటెం అని చెప్పి ఛార్జ్ చేసినా చేస్తారేమో చంద్రిక గారు

      తొలగించండి
  3. చక్రాల బల్ల అంటే అడుక్కునేవాడు వాడు కూడా కొనడు ఈ రోజుల్లో. అదే స్కూటర్ బోర్డు అంటే అంబానీ మనవడు కూడా ఎగబడతాడు.

    వీలైతే కూరగాయలు ఇంట్లోనో పెరట్లోనో పండించుకోవడం మంచిది. అఫ్కోర్స్ సలహా ఇచ్చాగాని ఆపని నెం చేయట్లేదు లెండి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కూరగాయలు పండించుకునేటంత ప్లేస్ కూడానా ఇప్పుడుండే ఇరుకు ఇరుకు ప్లాట్స్ లో ☹️

      తొలగించండి