12, ఆగస్టు 2021, గురువారం

వర్షం పడిన రాత్రో లేక ఒక బలహీన క్షణమో అది చూసేశాను

తెలియని భాష అని లేదంటే థ్రిల్లర్ మూవీస్ కాబట్టి ప్రతీ డీటెయిల్ అర్థం అవ్వాలని సబ్ టైటిల్స్ పెట్టుకుంటారు కానీ సబ్ టైటిల్స్ చూస్తూ ఉంటే ఆ సినిమాలోని నటీనటుల పేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంజాయ్ చేయలేక పోతారు.  అందుకే అర్థం అయినా కాకపోయినా సబ్  టైటిల్స్ లేకుండానే చూడటానికి ఇష్టపడతాను. తమిళ్ అయితే పూర్తిగా అర్థం అవుతుంది కానీ మలయాళం మీద ఇంకా అంత పట్టు చిక్కలేదు అయినా సరే ఆ భాష లో వచ్చిన సినిమాలు కూడా చూస్తుంటాను ఇష్టంగా. 

యోధ సినిమా చూసినప్పటి నుంచి మోహన్ లాల్ అన్నా, స్వాతి కిరణం/దళపతి సినిమాల నుంచి  మమ్ముట్టి నటన అన్నా బాగా ఇష్టం. అందుకే వారి సినిమాలు మిస్ అవకుండా చూస్తూ ఉంటాను. కొన్ని సార్లు వీళ్ళ సినిమాలో మరీ స్లో మోషన్ లో హీరో ని చూపిస్తూ అవసరం ఉన్నా లేకపోయినా చెవులు చిల్లులు పడేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హోరెత్తిస్తుంటారు అవి కమర్షియల్ పాయింట్ అఫ్ వ్యూ లో ఓకే అని సరి పెట్టుకోవాలి. ఆ మధ్య రాజశేఖర్ తో తీసిన 'కల్కి' సినిమాని  ఈ ఎక్స్ట్రా స్లో మోషన్ సీన్సే దెబ్బతీశాయని నా నమ్మకం. 

దృశ్యం 2 ఎప్పటి నుంచో చూడాలని ఉన్నా, అది సీక్వెల్ అవ్వడం వల్ల అంతగా ఇంటరెస్ట్ లేక చూడకుండా ఉండిపోయాను. సాధారణంగా సీక్వెల్ అనేది డైరెక్టర్ లేదా హీరో హిట్స్ లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడో లేక గల్లా పెట్టెలు నింపుకోవడానికో లేదంటే బ్లాక్ మనీ ని వైట్ చేసుకోవడానికో ప్రయోగించబడే గిమ్మిక్కులు, లేదంటే ప్రేక్షకులను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడమో జరిగినప్పుడు తయారవుతుంటాయి. మన ఇండియన్ హిస్టరీ లో అతి కొద్ది సినిమాలు మాత్రమే ఈ సీక్వెల్ ప్రయోగంలో హిట్టయ్యాయి. 

పైగా మన వెంకీ దృశ్యం2 ని రీమేక్ చేస్తున్నాడని తెలిసి కాస్త మన నేటివిటీ, తెలిసిన ఆర్టిస్టులు అయితే బాగుంటుందని ఆశించి ఆ మలయాళ సినిమాని చాలా రోజులుగా అట్టే పక్కన పెట్టేసాను. 

కథల్లోనో, సినిమాల్లోనే చెప్పినట్లు 'ఒక వర్షం పడిన రాత్రో లేక ఒక బలహీన క్షణమో' తెలీదు కానీ ఏ దిక్కుమాలిన సినిమాలో చూడటం కంటే దృశ్యం 2 చూడటం బెటర్ అనుకున్నా known devil is better than unknown angel అన్నట్లు.  ఒకప్పుడు మళయాళ సినిమాలు అంటే షకీలా సినిమాలో లేదా బూతు సినిమాలు అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉండేది, వాటి డబ్బింగ్ టైటిల్స్ కూడా అలానే ఉండేవి నేను ఈ పెట్టిన టైటిల్ లాగా. గత పదేళ్ళలో మంచి మంచి సినిమాలు రావడం వల్ల ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. పదేళ్ళ క్రితం కూడా కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి కానీ అవి చాలా మందికి చేరలేకపోయేవి అప్పట్లో ఉండే పరిమితుల రీత్యా. 

అసలు కంటే కొసరు ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. దృశ్యం సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడే మొదలవుతుంది ఈ సీక్వెల్.  సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లింగ్ కోసం పెట్టుకున్న పాత్రలు, వాటి మధ్య అనవసరమైన సీన్స్ అనిపిస్తాయి కానీ ఇంటర్వెల్ లో కొన్ని పాత్రల అవసరం , క్లైమాక్స్ లో మరి కొన్ని పాత్రల అవసరం తెలిసిన తర్వాత ఆ కథకుడైన దర్శకుడికి హాట్స్ హాఫ్ చెప్పకుండా ఉండలేము. దృశ్యం సినిమా ఏదో కొరియన్ సినిమా నుంచి ఎత్తుకొచ్చినా కనీసం దృశ్యం 2 లో సొంత ఆలోచనలు జొప్పించి ఆ లోటు పూడ్చారు. కొన్ని సీన్స్ సిల్లీగా అనిపించినా సినిమాటిక్ లిబర్టీ కింద వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ రిపీటెడ్ సీన్స్ లా అనిపించి కొంచెం బోర్ కొట్టిస్తాయి కానీ సినిమా మొత్తంగా చూస్తే బాగుంది.

అంతా తొండి, యు ట్యూబ్ వీడియో లో లాగా టైటిల్ ఒకటి విషయం మరొకటి రాశాను కదూ. 

10 కామెంట్‌లు:

  1. దృశ్యం 2 నాకు నచ్చిందండీ, దొరికిపోతాడేమో అనుకుంటుండగా ట్విస్ట్.లాస్ట్ లైన్ అదుర్స్ అసలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును వాత్సల్య గారు, దాన్ని base చేసుకునే సినిమా అంతా అల్లేసుకున్నారు.

      తొలగించండి
  2. దృశ్యం 2 కి అంత దృశ్యం ఉందంటారా?

    రిప్లయితొలగించండి
  3. మీ పోస్టులో చివరి వాక్యం భలే నవ్వించింది. మీకు మంచి sense of hum𝕠𝕦𝕣 ఉందండి, పవన్ గారు !

    రిప్లయితొలగించండి
  4. పవన్ కుమారా, మీ సిడ్నీలో మళ్ళీ లాక్-డౌన్ పెట్టారా? ఇందాక మా టీవీ ఛానెళ్ళు చెప్పాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మళ్ళీ ఏమిటి మహా ప్రభో, అసలు ఎత్తేస్తే కదా. గత 45 రోజులుగా అదే వ్యధే, ఇంకో రెండు నెలలైనా అనుగ్రహించేలా లేదు కరోనా మాత. రోజుకో 600 కేసులు వస్తున్నాయ్ మేష్టారు.

      తొలగించండి
    2. అయితే the media strikes again అనుకోవాలేమో? చివర్లో ఓ question mark పెడితే సరి ఏ వదంతి నయినా మొదలెట్టచ్చేమో?

      తొలగించండి
    3. అంతే అనుకోవాలి మేష్టారు, కొత్త న్యూస్ ఏదీ లేక పాత న్యూస్ చూపించి ఉంటారు.

      తొలగించండి