హే పవన్, మన 'సినిమా పిచ్చోళ్ళు' వాట్సాప్ గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోయావ్? నిన్న మీ ఫేవరెట్ హీరో గురించి నెగటివ్ గా మాట్లాడామని అలిగావా?
లేదబ్బా, COVID వల్ల ఈ వారం బయటికి వెళ్ళడానికి వీల్లేదు, కనీసం ఏదో ఒక రకంగా బయటికి వెళ్లాలని గ్రూప్ లోంచి బయటికి వెళ్ళా
సరే, మళ్ళీ గ్రూప్ లోకి యాడ్ చేస్తాలే నిన్ను.
థాంక్స్, ఇంకేంటి విషయాలు.
ఏం చేస్తాం, నా కంటే నా చేతులే ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నాయి, మాటి మాటికి చేతులు రబ్ చేసుకోవడం వల్ల బొబ్బలు కూడా వచ్చేస్తాయేమో
ఈ మాత్రం దానికే బొబ్బలు వచ్చేస్తాయా నువ్వు మరీనూ.
రాలేదు, కాకపొతే ఈ రోజు నుంచి బట్టలు నేనే ఉతుక్కోవాలి అందుకు వస్తాయేమోనని
వాషింగ్ మిషన్ వాడచ్చుగా
అది సరిగ్గా పని చెయ్యట్లేదు పవన్, ప్రతీ అర నిమిషానికి ఆగిపోతోంది.
అదేంటి, పోయిన సంవత్సరమేగా కొన్నావు.
అవును మొన్నటివరకు పని చేసింది, ఇవాళే పని చేయడం లేదు. వారంటీ ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ ఎత్తేశాక రిటర్న్ ఇచ్చెయ్యాలి.
అవును, అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా కొత్త సిరీస్ ఏమైనా స్టార్ట్ అయిందా?
థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని COVID కొత్త సిరీస్ లు ఆపేస్తే గానీ కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వవేమో. అవును, నిన్న డబ్బు డ్రా చేయడం కోసం బ్యాంకుకి వెళ్లానన్నావ్? ఎటిఎం కి వెళ్లచ్చుగా?
జనాలు సూపర్ మార్కెట్ ల మీదే కాదు, పిచ్చి పిచ్చిగా ఎటిఎం ల మీద కూడా పడి డబ్బు డ్రా చేసుకున్నారు, అందుకని ఎటిఎం లో డబ్బు లేక బ్యాంకు వెళ్ళాను. సినిమాల్లో చూపించినట్లు బాంక్ కొల్లగొట్టడానికి వచ్చిన దోపిడీ దొంగ మాదిరి మాస్క్ వేసుకొని వెళ్ళి డబ్బు తెచ్చుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
అవును నిజమే.
ఈ మాస్క్ ఉండటం వల్ల బ్యాంకు బయట ఉండే సెక్యూరిటీ గార్డు నన్ను గుర్తుపట్టలేదు. 🤣🤣
అందులో విశేషం ఏముంది?
వాడికి నేను అప్పున్నా, డబ్బు లేదని చెప్పి తీర్చకుండా తిరుగుతున్నా, గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ డబ్బు తీసేసుకునేవాడు.
మాస్క్ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నమాట.
ఈ మధ్య ఎప్పుడూ షార్ట్స్ వేసుకొని ఉంటున్నామా, నిన్న బ్యాంక్ కి వెళ్ళడానికి జీన్స్ వేసుకుంటే కంఫర్ట్ గా అనిపించలేదు.
కొంపదీసి ఆ జీన్స్ ప్యాంట్ గానీ వాషింగ్ మెషిన్ లో వేశావా?
అవును, ఎప్పుడో సంవత్సరం క్రితం ఉతికేసింది, ఇప్పుడన్నా ఉతికేద్దామని వేశా.
వెంటనే అది తీసి ఆన్ చెయ్.
అవును పవన్, నిజంగానే ఇప్పుడు పనిచేస్తోంది.
నువ్వు మాత్రం గత ఏడాదిగా షార్ట్స్ వేసుకొని, నిన్నొక్క రోజు జీన్స్ వేసుకుంటే కంఫర్ట్ గా లేదు అన్నావు. మరి, ఆ వాషింగ్ మెషిన్ పరిస్థితీ అదేగా, కొన్నప్పటి నుంచి దానికి నిక్కర్లు, బనీన్లు మాత్రమే ఉతికే అలవాటుంది. ఇప్పుడు జీన్స్ వేస్తె ఎలా? దానికీ హెవీ అనిపించదూ పాపం?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి