ఇవాళ మాస్ ప్రియులని ఉర్రూతలూగించడానికి బాలయ్య అఖండతో బరిలోకి దిగుతున్నారు. అందుకే బాలయ్య సినిమాల మీద ఈ స్పెషల్ ఆర్టికల్.
మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ 'బాలయ్య ఆటంబాంబు లాంటోడు, ఎలా వాడాలో బోయపాటి కే తెలుసు' అన్నాడు. అది ముమ్మాటికి నిజం. బాలయ్య కి ఏ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్ హిట్ ఇవ్వలేడు.
బాలయ్య అనే ఆటంబాంబు ని ఎలా వాడాలో బోయపాటి కే కాక మరో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్స్ కి మాత్రమే తెలుసు, వారెవరో ఇక్కడ విశ్లేషిద్దాం.
కొంత ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే, ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గాండీవం విరిగిపోయింది, అలాగే మాంచి ఫార్మ్ లో ఉన్న యస్వీ క్రిష్ణారెడ్డి బాలయ్య బాబుతో 'టాప్ హీరో' అనే ఒక దిక్కుమాలిన సినిమా తీశాడు. అదే రోజు రిలీజ్ అయిన ఈవీవీ 'ఆమె' సినిమాకి ఏ మాత్రం పోటీ కాలేక పోయింది. రెండు సినిమాల టార్గెట్ ఆడియన్సు వేరైనప్పటికీ ఆమె సూపర్ హిట్టయ్యి 'టాప్ హీరో' టాప్ చిరిగి పోయింది. .
ఆ తర్వాత ఈవీవీ దర్శకత్వం లో గొప్పింటి అల్లుడు అనే సినిమా అటకెక్కేసింది.
యస్వీ క్రిష్ణారెడ్డి, ప్రియదర్శన్ , ఈవీవీ లాంటి వారికి ఈ ఆటంబాంబు ను ఉపయోగించడం చేత కాలేదు, కాబట్టి వీరిని రెడ్ లిస్ట్ లోకి వెయ్యొచ్చు.
అగ్ర దర్శకులుగా పేరొందిన కోదండ రామి రెడ్డి బొబ్బిలి సింహం లాంటి బంపర్ హిట్ ఇచ్చాడు గానీ, నిప్పు రవ్వ, యువరత్న రాణా, ముద్దుల మొగుడు, మాతో పెట్టుకోకు లాంటి ప్లాప్స్ ఇచ్చారు కాబట్టి వీరికీ ఆటంబాంబు ను ఉపయోగించడం చేత కాలేదు అని చెప్పొచ్చు (యువరత్న రాణా - ఈ సినిమా చేసిన విషయం బాలయ్య బాబు హార్డ్ కోర్ ఫాన్స్ కైనా గుర్తుండకపోవచ్చేమో అంత అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా, బాల కృష్ణ ఫ్యాన్ అయిన మా గుప్తా ని తెగ ఏడిపించేవాళ్ళం ఈ సినిమా ప్లాప్ అయిన టైములో, అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది. )
పవిత్ర ప్రేమ, కృష్ణ బాబు లాంటి అట్టర్ ప్లాప్స్ తో ముత్యాల సుబ్బయ్య, పరమ వీర చక్ర అంటూ స్వర్గీయ దాసరి, అది పాండు రంగడు కాదు పాడు రంగడు అంటూ ప్రేక్షకులతో ఛీ కొట్టేలా చేయించిన రాఘవేంద్ర రావు, బంగారు బుల్లోడు తో హిట్ ఇచ్చి దేవుడు సినిమాతో గోవిందా అనిపించినాడు కాబట్టి రవిరాజా పినిశెట్టి ని లిస్ట్ లోంచి కొట్టేయచ్చు.
ఇక గ్రీన్ లిస్ట్ లోకి ఎవరెవరిని వెయ్యొచ్చో చూద్దాం.
మధ్య మధ్య లో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి హిట్ సినిమాలతో ఫామిలీ ప్రేక్షకులని బాలయ్య కి దగ్గర చేసినా శ్రీ కృష్ణా ర్జున విజయం లాంటి సినిమాతో విజయానికి కాస్త దూరమయ్యారు సింగీతం శ్రీనివాస రావు లాంటి క్లాసిక్ డైరెక్టర్. ఈయన ఆటంబాంబుని ఆటం బాంబు లా కాకుండా చిచ్చుబుడ్డి లా వాడి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్సు ని బాలయ్యకి దగ్గర చేశాడు.
డైరెక్టర్ శరత్ లాంటి వారు వంశోద్దారకుడు, వంశానికొక్కడు, పెద్దన్నయ్య లాంటి సూపర్ హిట్లు, సుల్తాన్ వంటి ప్లాప్ ఇచ్చాడు గానీ బంపర్ హిట్ అనబడే సినిమా అయితే ఇవ్వలేకపోయాడు. ఈయన ఆటంబాంబుని ఆటం బాంబు లా కాకపోయినా నాటు బాంబు రేంజ్ లోనైనా ప్రయోగించగలిగాడు.
బాలయ్య కెరీర్ కొత్తలో 'మంగమ్మ గారి మనవడు' సినిమాతో బూస్ట్ ఇచ్చాడు స్వర్గీయ కోడి రామకృష్ణ గారు ఆ తర్వాత మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య లాంటి మంచి హిట్స్ ఇచ్చాడు (ముద్దుల మేనల్లుడు లాంటి ప్లాప్స్ ఉన్నాయి గానీ పెద్దగా బాలయ్య ఇమేజ్ డామేజ్ కాలేదు వాటితో )
తర్వాత బాలయ్య కెరీర్ ని బాగా బూస్ట్ చేసింది మాత్రం బి. గోపాల్ అని చెప్పొచ్చు. ఒకటా రెండా మొత్తంగా నాలుగు మాస్ హిట్స్ ఇచ్చాడు. అవి అలాంటి ఇలాంటి హిట్స్ కాదు - లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు ఒకటికి మించి ఒకటి మాస్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివి అవి. ఇదే గోపాల్ 'పల్నాటి బ్రహ్మనాయుడు' అని కన్నడం లో విష్ణువర్ధన్ హీరోగా వచ్చిన ఒక సినిమాని ఎత్తుకొచ్చి తొడగొడితే కుర్చీ ముందుకొచ్చే సన్నివేశానికి తన క్రియేటివిటీ/పైత్యం జోడించి తొడగొడితే ట్రైన్ ఆగిపోవడం లాంటి కిచిడి యాడ్ చేసి చెత్త సినిమా తీసాడు కానీ ఆ నాలుగు హిట్స్ ముందు దీన్ని మర్చిపోవచ్చు.
ఆ తర్వాత ఇక బాలయ్య పని అయిపోయింది అని అందరూ అనుకునే టైం లో వచ్చాడండీ ఈ బోయపాటి శీను సింహా సినిమాతో, ఆ తర్వాత లెజెండ్ అంటూ దెబ్బకు బాలయ్య ఇంకో పది సంవత్సరాలు హిట్స్ లేకపోయినా బండి లాగించగలడు అనే రేంజ్ లో హిట్ ఇచ్చాడు.
ఇప్పడు అఖండ హిట్టయిందా, బాలయ్య కెరీర్ హీరోగా ఇంకో పదేళ్ళు పెరిగినా ఆశర్య పోవాల్సిన అవసరంలేదు.
పవిత్ర ప్రేమ మా ఊరిలో వంద రోజులు ఆడింది, అది ఫ్లాప్ ఎలా?
రిప్లయితొలగించండిదానికి ముందు మా ఊళ్ళో వంద ఆడిన బాల క్రిష్ణ సిన్మా రౌడి ఇనస్పెక్టర్.
టాప్ హీరో కూడా ఫ్లాప్ కాదు.
అయి ఉండచ్చేమో అజ్ఞాత గారు, నాకు గుర్తున్నంతవరకు నా జ్ఞాపకాల నుంచి వెలికితీసి రాసిన విషయాలు అవి, నేను పొర పడి ఉండచ్చు.
తొలగించండిఇరుకుపాలెమంటారా, కాదేమో, బా.బోయ్ పూర్ గాని లేక మందాపురం గాని అయ్యుంటుంది! బహుశా హిందూపురం దరిదాపుల్లోనిదై ఉండొచ్చు. రౌడీ ఇన్స్పెక్టర్ ఓకే కానీ పవిత్రప్రేమ, టాప్ హీరో చిత్రాలు ఒందేసి రోజులు చూశారంటే?!ఆ చిత్రాల నిర్మాతలు ఇప్పటికైనా ఆ షాక్ నుంచి తేరుకున్నారో లేదో?!:)
తొలగించండిఅనంతపూర్ తెలుసు గానీ ఈ బా..బోయ్ పూర్, మందాపూర్ ఏమిటబ్బా?
తొలగించండిఇంకో పదేళ్ళు ఈముసలియువరత్నను భరించాలా?
రిప్లయితొలగించండిబాబోయ్.
అంటే అఖండ హిట్టయిందంటారా అజ్ఞాత గారూ, అయితే తప్పదు భరించాల్సిందే.
తొలగించండిఓ సౌండు మోగిందా రీసౌండు పదేళ్లన్న మాట
తొలగించండిఅజ్ఞాత గారూ, ఈ డైలాగ్ భలేగుంది. నెక్స్ట్ బాలయ్య బాబు సినిమాలో పెట్టుకోవచ్చేమో .
తొలగించండిఅయ్యా PK గారూ
రిప్లయితొలగించండిఇది OTT యుగం. మీరు పైన ఉదహరించిన హిట్లు/ఫట్లు pre-OTT విషయాలు. ఇప్పుడు హిట్టా/ఫట్టా అన్నది కరెక్ట్‌గా తేల్చలేము. మీలాంటి అభిమానులు హిట్ అంటే హిట్టు, లేదంటే దాన్ని హిట్ అయ్యేట్లు హైప్ చేస్తారు. ఇది బా.బోయ్ (బాలయ్య-బోయపాటి) సినిమా అయినా ఇంకెవరిదైనా కూడా.
మీ ఎనాలిసిస్ సమంజసమైనదే అజ్ఞాత గారూ, ఈ బాబోయ్ పద ప్రయోగం భలే బాగుంది :)
తొలగించండిబాలకృష్ణ సినిమా హిట్లు, అల్లు అరవింద్ కలెక్షన్ లెక్కలు కరెక్టా బోగసా అనేది చెప్పగలిగినోడు ఎవడూ లేడు, ఆ చిత్ర నిర్మాతలు మాత్రమే మౌనంగా దిగమింగే చేదు మాత్రలు అవి.
తొలగించండిలక్ష్మీ నరసింహా విషయంలో ఇదే జరిగి ఉండచ్చు
తొలగించండిఎవరెన్ని కబుర్లు చెప్పినా చివరికి సినీమా అన్నది మొదట ఒకవ్యాపారం. తరువాతే మరేదన్నా కావచ్చును కాక. వ్యాపారం అన్నాక, లాభనష్టాల గురించే ముందు మాట్లాడాలు. సినిమా నిర్మాణం భారీ పెట్టూబడితో చేసే వ్యాపారం. అందులో లాభం అన్నది వస్తేనే ఆ సినిమా హిట్టు. పెట్టుబడి దెబ్బతింటే ఫట్టు. ఒక్కోసారి సినిమా బాగుందని పేరు వచ్చినా రావచ్చును కాని నిర్మాణవ్యయం అన్నా కిట్టూబాటూ కాకపోతే ఎలా? పేరు కాదు కాసులే ముఖ్యం మరి.
రిప్లయితొలగించండిమీరన్నట్లు లాభం వచ్చిన వాటిని హిట్టు కింద మిగిలిన వాటిని ఫట్టు కింద చేర్చచ్చు శ్యామలీయం గారు.
తొలగించండిమీరన్నట్లు సినిమా అన్నదీ ఒక వ్యాపారమే, కళామతల్లి సేవ లాంటి పదాలు పై పై పూతలు.
పవనూ, ముళ్ళపూడి వారి జోకొకటి ఉంది 🙏👇.
రిప్లయితొలగించండిసినిమా కామెడీయా ట్రాజెడీయా అని అడిగితే ... డబ్బులొస్తే కామెడీ, డబ్బులు రాకపోతే ట్రాజెడీ అన్నాడట ఆ నిర్మాత.
It's all about money, honey అన్నాడు తెల్లవాడు.
Joke బాగుంది మేస్టారు, అయితే టాలీవుడ్ లో ముప్పాతిక శాతం సినిమాలు ట్రాజెడీ అనే అనుకుంటున్నాను.
తొలగించండి