పోయిన వారం కాన్సెప్ట్ పరంగా పోలికలు ఉన్న రెండు తమిళ సినిమాలు చూశాను. రెండూ 'టైం లూప్' మీద బేస్ అయి తీసిన సినిమాలు పైగా జస్ట్ ఒక్క వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఒక దాంట్లో నోటెడ్ యాక్టర్ అయిన శింబు హీరో అయితే మరొక దాంట్లో ఒక కొత్త హీరో. అతని నటన చూసిన తర్వాత అతని పేరు కనుక్కోవాలన్నఆసక్తి కూడా కలగలేదు.
ఆ రెండు సినిమాలలో మొదట రిలీజ్ అయింది 'జాంగో' అయితే రెండవది శింబు హీరోగా వచ్చిన 'మానాడు'. దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి డబ్బింగ్ కూడా చేసి 'లూప్' అనే పేరుతో కొన్ని ట్రైలర్స్ కూడా వదలి ప్రమోషన్స్ మొదలు పెట్టినట్లు ఉన్నారు కానీ లాస్ట్ మినిట్ లో దీన్ని తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేద్దాము అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేసినట్లు ఉన్నారు. కాకపోతే ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అన్న అనుమానం నాకయితే బలంగా ఉంది చూద్దాం ఏమవుతుందో.
రెండు సినిమాలు పర్లేదు కానీ 'మానాడు' కాస్త బోరింగ్ గా అనిపించింది అవే అవే సీన్స్ సినిమా అంతా రిపీట్ అవుతూ ఉండడం ఈ చికాకుకు కారణం. 'జాంగో' మీద అదే ఫీలింగ్ కలిగింది, దానికి తోడు హీరో ఏ సీన్ లో ఏ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెడుతున్నాడో అర్థం కానంత ఘోరం గా ఉండటం మరింత చిరాకు తెప్పించింది. కాకపోతే 'జాంగో' సినిమాలో తెలివిగా హీరోయిన్ మీదే స్టోరీ నడవడం వల్ల హీరోయిన్ ఆటోమేటిక్ గా సినిమాలో భాగం అయింది, 'మానాడు' సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి యాడ్ చేసినట్లు అనిపించింది గానీ ఆ క్యారెక్టర్ లేకపోయినా ఆ సినిమా కథ నడుస్తుంది.
ఈ రెండు సినిమాలకు హాలీవుడ్ మూవీ 'ఎడ్జ్ అఫ్ టుమారో' ఇన్స్పిరేషన్ అయి ఉండచ్చు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.
kennedy club అని మూడేళ్ళ క్రితం తమిళ్ లో తీసి ఈ మధ్యే తెలుగు లోకి డబ్ చేసిన సినిమా చూశాను. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లల కబడ్డీ పోటీలకు సంబంధించిన కథ. దాదాపు ఆ సినిమా కాన్సెప్టు లానే ఈ మధ్యే మన తెలుగులో గోపీచంద్ హీరోగా 'సీటీ మార్' అనే సినిమా వచ్చింది. kennedy club కాస్త లో కాస్త రియాల్టీ అనిపించే సీన్స్ ఉంటాయి ఇక ఫుల్లీ కమర్షియలైజ్డ్ అయిన 'సీటీ మార్' గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
ఆ మధ్య మొగలిరేకులు ఫేమ్ 'సాగర్' హీరోగా 'షాదీ ముబారక్' అనే సినిమా వచ్చింది. నాగార్జున కొడుకు అఖిల్ హీరోగా 'ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని కూడా దాదాపు అదే కథ తో తీస్తున్నామని తెలిసి స్టోరీ లో కాసిన్ని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేశారట. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూడలేదు కాబట్టి పూర్తిగా కామెంట్ చేయలేను కానీ కాన్సెప్ట్ పరంగా రెండూ ఒకటే అని విన్నాను
స్టూవర్టుపురం నాగేశ్వర్రావు కథతో కూడా ఓ రెండు సినిమాలు సమాంతరంగా తయారవుతున్నట్లు ఈ మధ్యే తెలిసింది. ఇంకా వెనక్కి వెళ్తే కొండపల్లి రాజా, భరత్ అని ఒకే కథతో రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో విచిత్రం ఏమిటంటే మొదటి దానిలో సుమన్ సెకండ్ హీరో అయితే రెండవ దాంట్లో సుమన్ మెయిన్ హీరో, నాగబాబు సెకండ్ హీరో.
ఇదే టైంలూప్ కాన్సెప్ట్ తో ఆహా లో కుడి ఎడమైతే అనే సిరీస్ కూడా వచ్చింది. లూప్ కదా, సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అందులో కూడా.
రిప్లయితొలగించండిఈ సినిమా గురించి వినలేదు, తెలిపినందుకు ధన్యవాదాలు మాధవ్ గారు
తొలగించండిPlay Slots: Play Slots Online For Fun | JTG Hub
రిప్లయితొలగించండిTry the 태백 출장샵 free Play Slots games at JTG Hub - 여수 출장샵 Play for Fun, 경주 출장안마 No 춘천 출장샵 Download 사천 출장샵 or Registration Required! No sign-up or download required!