26, మార్చి 2019, మంగళవారం

బొటానికల్ గార్డెన్ లో ఒక రోజు

ఎన్ని అడుగులు? అని అడిగా. 

ఏమిటా ప్రశ్న? అన్నాడు మిత్రుడు తిరిగి చూస్తూ 

అదే, ఆఫీస్ ఎన్ని అడుగులుంది అని?

ఇది మరీ పిచ్చి ప్రశ్న?

అహ ఏం లేదు ఉదయం నుండి చూస్తున్నా, ఆఫీస్ లో ఈ మూల నుంచి ఆ మూలకు తిరుగుతుంటేనూ, ఆఫీస్ యెంత పొడవుందో కొలుస్తున్నావేమో అనుకున్నా?

ఆ చివర్లో ఉన్న మీటింగ్ రూమ్ లో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్ జరిగింది మా మేనేజర్ తో. 

అందుకేనా అంత బూడిద రాలింది ఆ రూమ్ లో. 

బూడిదా?

జోగి జోగి రాసుకుంటే రాలేది అదేగా. 

ఏడ్చావులే గానీ, ఈ ఆదివారం వెదర్ బాగుంది,  ఫ్రీ గా ఉంటే బొటానికల్ గార్డెన్ కి వెళదాం ఫామిలీస్ తో కలిసి అన్నాడు. 

ఆదివారం రోజు ఉదయాన్నే లేచి... 

"అలారం పెట్టుకొని లేచావో, అలారం పెట్టుకోకుండా లేచావో కూడా చెప్తే బాగుంటుందిగా, నువ్వు నీ సోది, చెప్పేదేదో త్వరగా చెప్పి తగలడు అని" మీరు అనుకుంటున్నారు కాబట్టి సింపుల్ గా చెప్పేస్తా. 

 బ్రెష్ చేసుకొని, బ్రేక్ఫాస్ట్ తిని, పిక్నిక్ బ్లాంకెట్ బ్యాగ్ లో సర్దుకొని బస్సులో ....  

"ఛస్, ఆపు నీ సోది, నువ్వు బ్రెష్ చేసుకున్నది, బ్రేక్ఫాస్ట్ తిన్నది, పిల్లలు పాలు తాగింది ఎవడికి కావాలి, డైరెక్ట్ గా విషయానికి రా" అని మీరు అనుకునే లోపు విషయానికి వస్తా.



బొటానికల్ గార్డెన్ కి వెళ్ళామా, ఆహా! చూడటానికి రెండు కళ్ళు చాలలేదనుకోండి. రెండు వాటర్ లేక్స్, మరో రెండు చోట్ల వాటర్ ఫాల్స్ , వెదురు బొంగులతో కట్టిన బ్రిడ్జ్, అందమైన రంగులలో ఉన్న ఆకులతో కూడిన చెట్లు  ఇలా చూడ్డానికి చాలా బాగుంది. భూమికి చలివేసి, పచ్చటి గడ్డిని బొంతలా కప్పుకొని వెచ్చగా పడుకొని ఉందా?... 

ఛస్, పరుచుకున్న పచ్చదనం, వెచ్చటి బొంత అనే సోది వర్ణనలు ఆపేసి విషయమేదో త్వరగా చెప్పి ముగించు అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి నవ్వించడానికి ఒక చిన్న జోక్ చెప్తాను. చాలా మందికి తెలిసే ఉండచ్చు, కాకపొతే మరో సారి గుర్తుకు తెచ్చుకుంటే పోయేదేమీ లేదు. 

రవీ, ఇంగ్లీష్ లో నెమలి ని ఏమంటారు?

తెలియదు సార్ . 

నిన్ననేగా క్లాస్ లో చెప్పుకున్నాం. 

గుర్తు లేదు సార్ 

వెధవా! అలోచించి గుర్తు తెచ్చుకో? అని జుట్టు పట్టుకొని లాగసాగాడు. 

పీకాకు సార్ , పీకాకు సార్ .. 

అద్గదీ, నా చెయ్యి పడితే గానీ గుర్తు రాలేదు వెధవకి . 

పంది మీద జోక్ కాకుండా, నెమలి జోకే ఎందుకు చెప్పానంటే, నెమలిని అక్కడ చూసాను కాబట్టి.  నెమలి పురి విప్పి ఆడటాన్ని "లక్ష్మీ ప్రసన్న బ్యానర్" అని పేరు పడేటప్పుడు సినిమాలో చూడటం, వాళ్ళూ వీళ్లూ చెబితే వినడమే తప్ప చూడటం డైరెక్ట్ గా చూడటం ఇదే మొదటి సారి, అందుకే ఒక సెల్ఫీ విత్ నెమలి. 


ఇలాంటి నెమళ్ళు బొచ్చెడు ఉన్నాయి ఆ బొటానికల్ గార్డెన్లో. లోపలే కాదు బయట కూడా బోలెడు తిరుగుతూ ఉన్నాయి.

అక్కడ రెస్టారెంట్స్ ఉండవు కనుక ఎవరి ఫుడ్ వాళ్ళే తెచ్చుకోవాలి, లేదంటే అక్కడే ఏదో ఒకటి వండుకోవాలి ఇదిగో ఇలా మేము వండుకున్నట్లు.


ఇక్కడ ఎలక్ట్రిక్ BBQ ఉంటాయి పార్క్స్ లో, కొన్ని ఫ్రీ గానే స్విచ్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, కొన్ని చోట్ల coin వేసి యూజ్ చేసుకునేవి ఉంటాయి.

సో, అలా ఒక రోజు గడిచింది Auburn బొటానికల్ గార్డెన్ లో.

P.S: నెమలి జోక్ మొదటిసారి నా మిత్రుడు చిన్ని చెప్పగా విన్నాను. 

14 కామెంట్‌లు:

  1. అయ్యోపాపం నెమలిని వండేసారా. మిమ్మల్ని చూసి తొడకొడితే మాత్రం (దానిభాషలో పురివిప్పటం) ఇలా దాని తొడలు కాల్చుకుని తినెయ్యడానికి మీకు చేతులెలా వచ్చాయి?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ చమత్కారం బాగుంది సూర్య గారు. ఇలాంటి తప్పులు చేసి సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళే తిప్పలు పడుతున్నారు, మాకు అంత ధైర్యమా?

      తొలగించండి
  2. పోస్ట్ బాగుంది పవన్ గారు. మీకు కళ్ళజోడు వొచ్చిందే! జావాలో కోడీ కోడీ తెచ్చుకొన్నారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ లైకింగ్ నాగేశ్వరరావు గారు. జావా డెఫినిషన్ తెలియక ముందు నుంచే ఈ అద్దాలతో సావాసం చేస్తున్నాను. అవును, నేను Java డెవలపర్ అని మీకెలా తెలుసబ్బా? బ్లాగులో ఎక్కడైనా వాగేశానా?

      తొలగించండి
    2. ప్రోగ్రామర్ అంటే అయితే జావా లేదా డాట్ నెట్ అనే కదా అందరూ అనుకునేది!
      అయితే కెరీర్ లో ముందుకెళ్లాలంటే మాత్రం ప్రోగ్రాం తను రాయకుండా పక్కవాడు రాసేదాకా హింసించడం తెలియాలి.

      తొలగించండి
    3. అంతే అయి ఉండచ్చు సూర్య గారు. ఇక కెరీర్ లో ఎదగడం అంటారా, నావిషయంలో జరగలేదు ఇంకా, ఇప్పటికీ కోడింగ్ చేస్తూనే ఉన్నాను.

      తొలగించండి
  3. మొన్న ఒకావిడ జూ పార్క్ లో జంతువులని చూసి జాలిపడుతూ వ్రాసింది.అడవిలో స్వేచ్చగా ఉండవలసిన వాటిని ఇక్కడ బంధించడం ఏమిటి అనేది ఆవిడ ఉద్దేశ్యం. జువాలజీ లేబ్ లో కప్ప గురించి తెలుసుకోవాలంటే కప్పని కోయాల్సిందే,మనిషి గురించి తెలుసుకోవాలంటే మనిషిని కోయాల్సిందే.. ఏనుగు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏనుగుని చూపించాల్సిందే కదా ? ప్రాక్టికల్ గా చెప్పనిదే ఎవరూ తెలుసుకోలేరు. జూ పార్క్ లో కొన్ని జంతువులని ఉంచినంతమాత్రాన బాధపడనవసరం లేదు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది ఎప్పుడూ నడుస్తూ ఉండే డిబేటబుల్ టాపిక్కే నీహారిక గారు.

      తొలగించండి
  4. Pavan garu, yes, you gave these details, inthe posts you wrote about your Tamil boss and your attempts to do hiring. Me too am a software jeevi.

    రిప్లయితొలగించండి
  5. కొలను ముందు మీ ఫామిలీ... మీరు ముందు, వెనకాల నెమలి - రెండు ఫొటోలు భలే వున్నాయి. మీ కమ్మటి కబుర్లకి అవి బోనస్!

    రిప్లయితొలగించండి
  6. మీ రచనా శైలి, వరవడి బాగున్నవి.

    సదాశివరావు నూతలపాటి

    రిప్లయితొలగించండి