మొన్నా మధ్య నేను ఆఫీస్ కి వెళ్ళే టైం లో మిత్రుడు ఎదురొచ్చి 'ఇంకా నువ్వు అంత దూరం ఆఫీస్ కి నడిచేవెళ్తున్నావా? నడక తగ్గించాలి అని అన్నావ్ నీ న్యూ ఇయర్ రెసొల్యూషన్ లిస్ట్ లో అన్నాడు.
అదే ఎలా అనుకుంటున్నాను?
ఏముంది, సైకిల్ కొను, నడక తగ్గించచ్చు, గో గ్రీన్ అనచ్చు.
ఓకే. సైకిల్, గో గ్రీన్ ఇదేదో బాగుంది అనుకున్నా.
గ్రీన్ అనగానే మొన్న 'స్థిర యోగ హోమం' గురించి స్వామిజీ తో డిస్కస్ చేస్తున్నప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
నీ జాతక చక్రాలు నిశితంగా పరిశీలించిన పిమ్మట నాకు అర్థమైందేమిటంటే, నిన్ను శుక్రుడు వక్ర దృష్టితో, లవుడు నికృష్ట దృష్టితో, కుశుడు క్రూర దృష్టి తో చూస్తున్నాడు నాయనా.
ఈ ప్రపంచంలో ఇంత మంది ఉండగా నన్నే అంతలా ఎందుకు చూస్తున్నారు స్వామీ? వై ఓన్లీ మీ స్వామీ?
ఒక ప్రపంచ ప్రసిధ్ధ క్రీడాకారుడికి కాన్సర్ వస్తే 'ప్రపంచంలో ఇంత మంది ఉండగా నాకే ఎందుకు కాన్సర్ వచ్చింది' అని మీరు దేవుడిని నిందించలేదా అని ఎవరో అడిగితే "ప్రపంచ పోటీల్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు, నాకే ఎందుకు వచ్చింది అని నేను దేవుడిని అడగలేదు, మరి కాన్సర్ వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు వచ్చింది అని దేవుడ్ని ప్రశ్నించడం మూర్ఖత్వం అవుతుంది అన్నాడట", కాబట్టి మూర్ఖ మానవా, నాకే ఎందుకు అని ప్రశ్నించకూడదు.
ఇంతకీ ఎవరు స్వామీ ఆ ప్రసిధ్ధ క్రీడాకారుడు?
అప్రాచ్యుడా,అతనెవరు అనేది అప్రస్తుతం (పైగా నా ఇంటర్నెట్ కూడా పనిచేయడం లేదు గూగుల్ లో చెక్ చేయడానికి)
మరి ఏం చేయమంటారు స్వామీ?
నా హుండీలో దండిగా సంభావన సమర్పించుకోవడమే.
అదెలాగూ తప్పదు, ఇంకేమైనా రెమెడీ చెప్తారేమో అని
అలా అడిగావు చెప్తాను, గ్రీన్ అనగా ఆకుపచ్చ, నువ్వు ఆ వక్ర, క్రూర, నికృష్ట దృష్టి నించి తప్పించుకొని కలకాలం పచ్చగా ఉండాలంటే 'ఆకు పచ్చ' ని ప్రిఫర్ చేయటమే . వేసుకునే దుస్తుల్లో అయినా తినే తిండి అయినా లేదా వాడే వస్తువుల్లో అయినా.
స్వామీజీ కూడా గ్రీన్ అనే అన్నారు, ఈ మిత్రుడు కూడా గో గ్రీన్ అంటున్నాడు కాబట్టి ఈ గ్రీన్ ఫాలో అవుదామని ఆ రోజు సాయంత్రమే మా ఇంటికి దగ్గర్లో ఉండే పెద్ద స్టోర్ కి వెళ్ళా. అక్కడ పనిచేసే స్టాఫ్ లో ఎవరిని అడుగుదామా అని చూస్తుండగా ఫోన్లో తెలుగులో మాట్లాడుతున్న వ్యక్తి కనిపించాడు. మనోడే కదా ఇతన్ని అడుగుదాం అని గ్రీన్ కలర్ సైకిల్స్ ఉన్నాయా? అని అడిగా.
లేవు, ఎందుకలా పర్టికులర్ గా గ్రీన్ ? మరీ గ్రీన్ కలర్ అంటే దొరకదు.
నేను గో గ్రీన్ని ఫాలో అవుదామనుకున్నాను అందుకు.
అర్థం కాలా?
సరే అడిగావు కాబట్టి చెబుతున్నా, నేను మొన్న జనవరి ఫస్ట్ నుంచి కొన్ని రెసొల్యూషన్స్ తీసుకున్నా, అందులో భాగంగా నడక తగ్గించాలి అనుకున్నా. అందుకని సైకిల్ కొంటున్నా అని మిత్రుడికి చెప్పా, అతను సైకిల్ కొంటున్నావా గుడ్ గుడ్ అయితే గో గ్రీన్ అన్నాడు. మరి అతను అంతగా ప్రోత్సహించినందుకైనా గో గ్రీన్ అమలుపరచాలి కదా, అలాగే మా స్వామీజీ కూడా గ్రీన్ అచ్చి వస్తుందని చెప్పాడు దానికి తోడు T.V, సోషల్ మీడియా లోనూ అలాగే సైన్స్ ప్రకారం కూడా గో గ్రీన్ అని ఊదరగొడుతున్నారు కాబట్టి నేను కూడా ఫాలో అయిపోయి కనీసం ముగ్గురిని ఇన్స్పైర్ చేద్దామనుకుంటున్నాను, అలాగే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని ...
గో గ్రీన్ అంటే గ్రీన్ కలర్ సైకిల్ మీద వెళ్లడం కాదని నా అభిప్రాయం.
సరే, ఇప్పుడు షుగర్ లెస్ అంటారు అంటే షుగర్ లేదనే కదా అర్థం ?
అవును
గ్రీన్ టీ అంటే, గ్రీన్ గా ఉండే టీ నేనా?
ఆల్మోస్ట్
మరి అలాంటప్పుడు గో గ్రీన్ అంటే గ్రీన్ గా వెళ్లడమే కదా.
ఇదేదో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లా తిక్క తిక్కగా, పాల్ స్టేట్మెంట్ లా పిచ్చి పిచ్చి గా ఉంది ఎనీహౌ ఇక్కడ ఉన్న సైకిల్స్ లో వెతుక్కోండి అని వెళ్ళిపోయాడు.
అక్కడ ఉన్న వాటిల్లో చివరికి గ్రీన్ కలర్ వైర్ బ్రేక్స్ ఉన్నది దొరికింది, ఇది చాలు గ్రీన్ ఉంది. కాకపోతే వెనుక రెడ్ కలర్ లైట్ ఉంది సైకిల్ కి. గ్రీన్ కలర్ లైట్ ఉండేది లేదా అని అడిగా. అంతే అతను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ అటు వైపు వెళ్ళిపోయాడు.
బైక్ ఆక్సిసరీస్ ఎక్కడ దొరుకుతాయబ్బ, ఐ మీన్ గాలి కొట్టే పంప్, హెల్మెట్ వగైరా అని బోర్డు చూస్తే ఫస్ట్ ఫ్లోర్ అని ఇచ్చారు.
ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి 'Excuse me, where I can get the green colour helmet?' అని అడిగా అటు వైపు తిరిగి ఉన్న వ్యక్తిని.
అతను నా వైపు తిరిగాడు, చూస్తే ఆటను ఇందాకటి తెలుగు కుర్రాడే, ఆ స్టోర్ లో అందరూ ఒకే రకమైన టీ షర్ట్స్ వేసుకోవడం వల్ల వెనక నుంచి గుర్తు పట్టలేకపోయా.
అర్రే ఇందాక అక్కడ నుంచి మిస్ అయ్యావ్?
మీ దెబ్బకు అక్కడి నుంచి పారిపోయి ఇక్కడి కొచ్చా.
ఎంతైనా తెలుగోడివి కదా భలే జోక్ వేశావ్. నాకు గ్రీన్ కలర్ హెల్మెట్ కావాలి?
సరే, warehouse లో ఏమైనా అలాంటి కలర్ హెల్మెట్ దొరుకుద్దేమో తీసుకొస్తా అని చెప్పి కాసేపటికి ఒక గ్రీన్ కలర్ హెల్మెట్ ఇచ్చి పంపించాడు ఒక తెల్లోడితో.
సరే, బట్టల సెక్షన్ సెకండ్ ఫ్లోర్ లో ఉందని అటు వైపు వెళ్ళా.
మళ్ళీ అక్కడా అతనే కనిపించాడు. మీకు గ్రీన్ కలర్ టీ షర్ట్ కావాలి అంతే కదా, తెచ్చిస్తా అని గ్రీన్ కలర్ షర్ట్ తెచ్చాడు.
అలా గో గ్రీన్ ను ఫాలో అయిపోయా.
నేను సైకిల్ మీద వెళ్తున్నాని తెలిసి, మొన్న ఇంకో ఇద్దరు మిత్రులు inspire అయి నాలా వాళ్ళూ సైకిల్ కొంటామన్నారు.
నేను గో గ్రీన్ అన్నాను.
వాళ్లేమో గో ఎల్లో అన్నారు, వాళ్ళ పార్టీకలర్ అదేనట మరి, పైగా నా ఫ్రెండ్స్, ఆ మాత్రం తెలివి తేటలు ఉంటాయి. పాపం ఎల్లో కలర్ సైకిల్, ఎల్లో కలర్ హెల్మెట్ దొరకాలంటే వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారో అని , మా ఇంటి దగ్గర ఉండే షాప్ లో పనిచేసే ఆ తెలుగు కుర్రాడి దగ్గరికే పంపించా.
ఆ రోజు సైకిల్ కొన్నప్పుడు 'గ్రీన్ కలర్ షూస్, ప్యాంటు తెప్పించమని ఆ తెలుగు కుర్రాడ్ని అడిగా', అందుకని నిన్న సాయంత్రం స్టోర్ లోకి వెళ్ళి అతని గురించి అడిగితే అర్జెంటు రిక్వెస్ట్ పెట్టుకొని మరీ మెల్బోర్న్ లో ఉండే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాడట. పాపం ఏం కష్టమొచ్చి పడిందో ఆ కుర్రాడికి. ఎవరి వక్ర దృష్టి పడిందో ఏమో పాపం.
😀😀 ఆ కుర్రాడు ఊరొదిలి పారిపోయేలా చేశారా? మీరు సామాన్యులు కాదండీ 🙂. అవునూ, మీరు పని చేస్తున్న కంపెనీకి గానీ మెల్బర్న్ లో గానీ బ్రాంచ్ గానీ లేదు కదా? మీరు కూడా అక్కడికి గానీ మారితే ఈ సారి ఆ కుర్రాడు దేశమే వదిలి పారిపోవచ్చు 😀?
రిప్లయితొలగించండిఅక్కడా ఉంది, పోనీలెండి కుర్రాడు కొన్ని రోజులు కుదురుగా ఉండనీ అని వదిలేశా. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు.
తొలగించండిపాకిస్థాన్ జెండా కూడా గ్రీన్ !
రిప్లయితొలగించండిమీ సైకిల్ సూపర్ !
గో గ్రీన్ !
ఆ జెండా గ్రీన్ అని నేనెట్టుకు తిరిగానంటే నాకు దండ పడిపోద్ది నీహారిక గారు. సైకిల్ నచ్చినందుకు థాంక్స్.
తొలగించండిమీ ఇంకో రెజల్యూషన్ పాటించి హాపీగా డ్రైవింగ్ నేర్చుకుంటే ఇన్ని తిప్పలు వచ్చేవి కావు. అంతగా గ్రీన్ కావాలంటే హైబ్రిడ్ కార్ కొంటే సరిపోయేది.
రిప్లయితొలగించండిఈ హోమం సక్సెస్ అయితే చేయబోయే మొదటి పని కార్ డ్రైవింగ్ నేర్చుకోవడమే జై గారు.
తొలగించండిహోమానికి సంభావన ఇచ్చుకున్నాక డ్రైవింగ్ లైసెన్సుకు దుడ్డులు మిగుల్తాయో లేదో :)
తొలగించండిఆ కారుకు కూడా గ్రీన్ రంగు వేయిస్తాడేమో పవన్ కుమార్ 😀😀.
రిప్లయితొలగించండిఒకప్పుడు young man, go east అనేవారు. దాన్ని పాటించి ఆస్ట్రేలియా వెళ్లిన పవనుల వారు ఇప్పటి go green నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు!
తొలగించండితప్పకుండా గ్రీన్ కార్ కొంటా, గ్రీన్ కార్ దొరక్కపోతే మీరన్నట్లు గ్రీన్ కలర్ పెయింట్ వేయిస్తా నరసింహా రావు గారు.
తొలగించండి'యంగ్ మెన్, గో ఈస్ట్' ఈ మాట ఫస్ట్ టైం వింటున్నా జై గారు.
తొలగించండిగ్రీన్ కారు కావాలా గ్రీన్ కార్డు (ఆస్ట్రేలియాలో PR card అంటారనుకుంటా) కావాలా?
తొలగించండి"Young man, go east" అన్నది బ్రిటిష్ రాజ్ సమయంలో ఇంగ్లాండు యువకులకు సలహా. సామ్రాజ్యవాద దేశపౌరులు భారత్ & ఇతర ఆక్రమిత దేశాలకు తరలి వెళ్తే బోలెడు డబ్బు సంపాదించుకొవొచ్చని దీని తాత్పర్యం.
కాలిఫోర్నియాలో బంగారం దొరికిన దరిమిలా అమెరికాలో (ఇందుకు భౌగోళిక ఆపోజిట్టుగా) young man, go west అనే నినాదం ఉండేది.
నాకు కొత్త విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు జై గారు. PR కావాలి ఫస్ట్, అదుంటే కార్ కొనడం పెద్ద కష్టం కాదు మేష్టారు
తొలగించండిభూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఈస్ట్ వైపునుంచే పోవచ్చు.
రిప్లయితొలగించండిఅన్నట్లు సైకిల్ కి అలాంటి ఇలాంటి గాలి కొట్టించొద్దు. గ్రీన్ హౌస్ గాలి మాత్రమే కొట్టించండి!!
మీరొక్కరే కొనుక్కుంటే సరిపోద్దా?శ్రీమతి గారికి కూడా పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళడానికి ఎలక్ట్రిక్ బైసికిల్ కొనండి.
తప్పకుండా సూర్య గారు, గ్రీన్ హౌస్ గాస్ మాత్రమే కొట్టిస్తాను 😀
తొలగించండిమీరు గ్రీనుగా పది కాలాలపాటు గ్రీను లాప్టాప్ మీద గ్రీను పోస్టులు రాస్తూ వుండండి.
రిప్లయితొలగించండిమీ దీవెనకు అలాగే చదివి కామెంట్స్ పెడుతున్నందుకు ధన్యవాదాలు లలిత గారు.
తొలగించండి