1, ఏప్రిల్ 2019, సోమవారం

సెల్ఫీ పిచ్చి ఏంటో ఆస్వాదించక

పదిహేనేళ్ల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ... "మిమ్మల్ని ప్రేక్షకులు ఇంకో ముప్పయ్యేళ్లయినా చూస్తూనే ఉంటారు సర్" అంది. 

అప్పుడు చిరంజీవి గారు కథ లాంటి ఒక కల్పితాన్ని చెప్పారు. 

తిరుమలలో దర్శనానికి క్యూలో వచ్చిన భక్తులు కొందరు, కొద్ది సేపు కూడా మమ్మల్ని మా స్వామిని చూడనీయకుండానే పక్కకు తోసేస్తున్నారు అని గొడవ పెడితే ఒక వంద మంది పరమ భక్తుల్ని సెలెక్ట్ చేసి మీ ఇష్టం మీరు ఇక్కడయెంత సేపైనా స్వామిని చూస్తూ ఉండి పోవచ్చు మీకు ఇక్కడే సకల సౌకర్యాలు కల్పిస్తాం అన్నారట ఆలయ కార్యకర్తలు. 

ఇంకేముంది ఆ వంద మంది భక్తులు భలే! భలే! అని తెగ సంతోషించారట. 

గంట సేపటి తర్వాత ఆ కౌంట్ యాభై మందికి తగ్గిందట 

ఇంకో అరగంటకి ఇరవై కి చేరిందట

ఇంకో అరగంటకి ఐదు కి చేరిందట 

సాయంత్రానికి అక్కడ ఒక్కరు కూడా లేరట. 

అలాంటి వెంకటేశ్వర స్వామినే పట్టుమని పది గంటలు కూడా చూడలేదు అలాంటిది, ఆఫ్ట్రాల్ నన్ను ఇంకో ముప్పయ్యేళ్లు ఎవరు చూస్తారు? అని ఆ యాంకర్ తో అన్నారు 

సో, అందంగా, ఆకర్షణీయంగా ఉంది కదా అని ఏదైనా ఎక్కువ సేపు చూడలేం, నేను కూడా దీనికి మినహాయింపు కాదు.  నెమలి పురి విప్పింది కదా అని దాన్నే పది నిముషాల పాటు చూస్తూ కూర్చోలేను.  ఆ మెమోరీస్ ని మైండ్ లో, వీలయితే ఫోన్ లో బంధించుకొని బయల్దేరడమే.

"సెల్ఫీ పిచ్చి ఏంటో ఆస్వాదించక" అన్నాడు ఒక వ్యక్తి ఫేస్బుక్ లో బొటానికల్ గార్డెన్ లో ఒక రోజు పోస్ట్ కు స్పందిస్తూ. దీన్ని సింపుల్ గా వదిలేయచ్చు, కాకపొతే ఆ విషయం గురించి కాస్త ఆలోచించినప్పుడు చిరంజీవి ఇంటర్వ్యూ గుర్తొచ్చింది, ఇది ఒక పోస్ట్ గా రాస్తే బాగుంటుంది అనిపించి రాశా.  నేనేదో నెగటివ్ కామెంట్స్ తట్టుకోలేక రాసిన పోస్ట్ కాదు, నెగటివ్ గా అయినా సరే పాజిటివ్ గా అయినా సరే కామెంట్స్ తప్పక స్వీకరిస్తాను. అప్పుడప్పుడూ కామెంట్స్ అనేవి మరింత డిస్కషన్ కు కారణమవుతాయి, దాని వలన మరిన్ని కొత్త విషయాలు నాకు తెలుస్తుంటాయి. 

సెల్ఫీలు, ఫోటోల వల్ల కొన్ని కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. మొన్న రాత్రి చీకట్లో ఫోటో తీశానా, తర్వాత చూసుకుంటే తెలిసింది ఆ ఫోటోలో రెండు స్టార్ట్స్ కూడా ఉన్నాయని.  ఇదిగో అదే ఆ ఫోటో

2 Stars found when I took a picture in the night,
can somebody tell me how to inform this to NASA :)
ఈ రెండు కొత్త స్టార్స్ గురించి NASA వాళ్లకు  తెలియజేయాలి, వాళ్ళను ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీకెవరికైనా తెలిస్తే నాకు తెలియజేయరూ ప్లీజ్?

9 కామెంట్‌లు:

 1. ఓ రెండు కేజీల స్వీట్ దిష్టి తీసి నాసాకి పంపండి. వాళ్ళే మీ దగ్గరకి పరిగెత్తుకుని వస్తారు.
  ఎంత ముద్దుగున్నారో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పటికే తీయని దిష్టి అంటూ లేదు మా ఆవిడ, ఇక ఇది చదివిందంటే ఈ దిష్టి కూడా తీసేస్తుంది పిల్లలకి.

   తొలగించండి
 2. ఆస్ట్రేలియాలో ఇండియన్ డ్రెస్సింగ్ బాగుందండీ !
  కొంతమంది ఎక్కడికెళితే అక్కడి డ్రెస్సింగ్ ఫాలో అవుతారు కదా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎప్పుడూ ఇండియన్ డ్రెస్సింగ్ కాదు కానీ అప్పుడప్పుడూ ఇలా, నీహారిక గారు.

   తొలగించండి
 3. కొన్ని ఫొటోలవల్ల ఉపయోగం ఉందని మీరు చెప్పిన మాటని నేను నమ్ముతున్నాను. చీకట్లో మీనక్షత్రాలు అద్భుతంగా ధగధగలాడిపోతున్నాయి.

  రిప్లయితొలగించండి
 4. మెచ్చినందుకు ధన్యవాదాలు అన్యగామి గారు.

  రిప్లయితొలగించండి
 5. మీ నక్షత్రాలు చీకటికే కాదు వెలుగులకే వెలుగు!

  రిప్లయితొలగించండి