15, జులై 2019, సోమవారం

ఇంద్రధనస్సు లో రంగులెన్ని?

ఇవాళ లంచ్ కి బయటికి వెళ్తున్నా, నువ్వు రా ప్లీజ్. 

లేదు బ్రో, నేను లంచ్ తెచ్చుకున్నా. నువ్వెళ్ళు 

పర్లేదు రా, నీ లంచ్ బిల్ నేనే పే చేస్తా. 

కిషోర్ తో వెళ్తావుగా ఎప్పుడు, తనను తీసుకెళ్ళు ప్లీజ్ 

తనకు మీటింగ్ ఉందట. 

సరే పద వెళదాం. నడిచా, కార్లోనా?

కార్లోనే వెళదాం, బయట ఎండ ఎక్కువగా ఉంది. 

                              *******************

అరే ఎందుకంత స్లో గా వెళ్తున్నావ్? చూడు ఆ కార్ వాడు ఓవర్టేక్ చేసి మనకంటే ముందుకు వెళ్ళాడు. 

ఫర్లేదు లే బ్రో. 

                                                        ******************

కార్ ఎందుకు స్లో చేసావ్ మళ్ళీ ?

ఊరికే?

ఈ సారి వెనుక ఏ కార్ రాలేదు కాబట్టి సిగ్నల్ ముందున్న నిలబడ్డ కార్ మాదే అయింది.  గ్రీన్ సిగ్నల్ పడ్డా కార్ ని ముందుకు పోనివ్వలేదు ఫ్రెండ్. 

బ్రో, గ్రీన్ సిగ్నల్ పడింది ఎందుకు ఇంకా ఆగి ఉన్నావ్? 

గమనించలేదు 

                                                        ***********************

మళ్ళీ స్లో చేసావ్ కార్, ఇప్పుడర్థమైంది నాకు.  నువ్వెందుకో సిగ్నల్ వస్తే కార్ స్లో చేస్తున్నావ్?

సరే, దాచడమెందుకు చెప్పేస్తా. నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది. 

అంటే?

అంటే నాకు రెడ్ అయినా, గ్రీన్ అయినా, ఆరంజ్ అయినా ఏ కలర్ అయినా బ్లాక్ గానే కనపడుతుంది. నేను కలర్స్ మధ్య డిఫరెన్స్ గుర్తించలేను. 

ఏంటి జోకా?

లేదు, నిజం. అందుకే కార్ లో ఎప్పుడూ ఒంటరిగా పోను, నాకు తెలిసిన వారిని తోడుగా తీసుకెళ్తా. ఒక వేళ ఎవరూ తోడు లేకుండా  ఒంటరిగా వెళ్లాల్సి వస్తే, సిగ్నల్ వచ్చేప్పుడు కార్ స్లో చేస్తా, దాంతో నా వెనక ఉన్నోడు ఓవర్టేక్ చేసి వెళ్తాడు. దాన్ని బట్టి నేను మూవ్ అవుతా, వాడు ఆగితే నేను ఆగిపోతా, వాడు సిగ్నల్ క్రాస్ చేస్తే నేనూ సిగ్నల్ క్రాస్ చేస్తా. 

                                               ***********************

ఇది ఒక దాదాపు సంవత్సరం క్రితం జరిగిన సంఘటన.   

ఈ కలర్ బ్లైండ్నెస్  గురించి చెప్పాలంటే మనకు ఇంద్రధనస్సు ఏడు రంగుల్లో కనపడితే వారికి ఇంద్రధనస్సు అంతా ఒకే రంగు లో కనపడుతుంది. 

ఈ కింది పిక్చర్ చూపించి అందులో కనపడుతున్న అంకెలు గురించి చెప్పమంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్లు చెప్పలేరు, కారణం వారికి అంతా ఒకే రంగులో ఉండటమే వల్ల. 


ఈ కలర్ బ్లైండ్నెస్ లో కూడా తేడాలు ఉంటాయి, మా ఫ్రెండ్ కి ఉన్నది ఎక్స్ట్రీమ్ అంటే 95%. సాధారణంగా 20-25% ఉన్నవారు కొద్దిగా డిఫరెన్స్ కనుక్కోగలరు రంగుల్లో. 95% ఉన్నవారు అస్సలు కనుక్కోలేరు. 

EnChroma అనే కంపనీ వాళ్ళు చాలా ఏళ్లుగా ప్రయత్నించి కలర్ బ్లైండ్నెస్ ను పోగొట్టే గ్లాస్సెస్ తయారుచేశారు. ఈ కలర్ బ్లైండ్నెస్ గ్లాస్సెస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాయి గాని, ఇప్పటికి అవి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలెట్టాయట ఆ కంపనీ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ వలన. 

ఇప్పుడు తను అవి పెట్టుకుని రంగుల్లో తేడా గుర్తించగలుగుతున్నాడు. ఒంటరిగా కార్ లో వెళ్లగలుగుతున్నాడు. సో హ్యాపీ ఎండింగ్. కాకపొతే ఈ గ్లాసెస్ రేట్ కాస్త ఎక్కువ, అతనికి 750 $ దాకా ఖర్చయింది (offcourse గ్లాస్సెస్ రేంజ్ కాస్త ఎక్కువ తక్కువ ఉండచ్చు, దానికి ఉపయోగించిన ఫ్రేమ్స్ బట్టి ). కాకపొతే అతను సిగ్నల్స్ క్రాస్ చేసినప్పుడు కట్టిన ఫైన్స్ తో పోలిస్తే ఈ అద్దాల ధర తక్కువే. 

ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారేనట. 

ఇంద్రధనస్సు లో రంగులెన్ని? అని ఎవరినైనా అడిగితే ఒకటి అని  వారి నుంచి సమాధానం వస్తే ఆశ్చర్యపోకండి. 

14 కామెంట్‌లు:

  1. EnChroma వారికి మానవాళి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రత్యేకించి నా కొలీగ్ లాంటి వాళ్ళు. ఇవాళ కార్ లో ఒక రౌండ్ వేసొచ్చి నేను కలర్స్ ఫైండ్ చెయ్యగలుగుతున్నాను అని సంతోషంగా చెప్పాడు, అప్పుడే దీని మీద ఒక పోస్ట్ రాయాలి అనిపించింది.

      తొలగించండి
  2. వర్ణ అంధత్వం అంటే ఎరుపు ఆకుపచ్చ మధ్య తేడా తెలియకపోవడం అనుకుంటానే.మిగతా రంగుల మధ్య కూడా తేడా గుర్తు పట్టలేరా?

    అయినా కలర్ బ్లైండ్ నెస్ ఉంటే సిగ్నల్స్ ని రంగుబట్టి కాకుండా పొజిషన్ బట్టి గుర్తుపడితే సరిపోతుందేమో? ఉదాహరణకి ఒకట్ల స్థానం లో ఉన్న లైట్ వెలిగితే ఎరుపు, పదుల స్థానం పసుపు, వందల స్థానం అయితే ఆకుపచ్చ ఇలా.
    ఒక దేశం లో ఉన్నంతవరకు లైట్ల వరుసక్రమం ఒకేలా ఉంటుందని అనుకుంటా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేదండీ సూర్య గారు, నా కొలీగ్ దీనికి ప్రత్యక్ష సాక్షి.
      ఇక సిగ్నల్స్ విషయంలో కూడా ఏ సిగ్నల్ వెలుగుతోంది, ఏది మారుతోంది అనే విషయం అతను ఆబ్జర్వ్ చేయలేడు. ఇప్పటికీ 3 సార్లు క్రాసింగ్ fines కట్టాడు. అతను PR కాదు కాబట్టి అతని లైసెన్స్ కాన్సిల్ చెయ్యలేదు. Points తగ్గించలేదు.

      ఈ పోస్ట్లో ఇచ్చిన పిక్చర్ లో ఒక్క నంబర్ కూడా చెప్పలేక పోయాడు, గ్లాసెస్ పెట్టుకొని ట్రై చేస్తే 4 మాత్రమే కరెక్ట్ గా చెప్పాడు.

      తొలగించండి
    2. సూర్య గారూ, ప్రపంచం మొత్తం ఒకటే లైట్ల క్రమం (red on top, amber in middle, green at bottom) ఉంటుంది. అంబర్ లైట్ ప్రవర్తనలో కాస్త తేడాలు ఉన్నాయి: ఉ. చాలా దేశాలలో అంబర్= రెడ్ వార్ణింగ్ సిగ్నల్ కానీ భారత్ R-A-G-A-R సీక్వెన్స్ వాడుతుంది.

      కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారికి ఫ్లాషింగ్ లైట్స్ కూడా సమస్య. Flashing red= stop, look & go; flashing amber= yield. ఇటువంటి సిగ్నల్స్ దగ్గర రంగు ఏమిటో తెలీకపోతే చాలా కష్టం.

      రోడ్ పెయింటింగ్స్ & లేన్ మార్కింగ్ రంగు కూడా చాల ముఖ్యం. For example, crossing a double yellow line is a serious traffic violation in many jurisdictions.

      పార్కింగ్ పేవుమెంట్ పెయింట్లు కూడా కలర్ కోడెడ్. Of course these may be accompanied by written signs (e.g. "fire lane") but color is often the primary (or only) indicator.

      పవన్ గారూ, మీ మిత్రుడికి కలర్ టెస్ట్ పాస్ కాకుండా డ్రైవర్ లైసెన్స్ ఎలా వచ్చిందో నాకు అర్ధం కావడం లేదు. ఆస్ట్రేలియాలో ఈ టెస్ట్ లేదా లేక out-of-country లైసెన్సా?

      తొలగించండి
    3. మేరా భారత్ మహాన్ జై గారు. మీరే ఊహించుకోండి డ్రైవర్ లైసెన్స్ గురించి.

      తొలగించండి
    4. "మేరా భారత్ మహాన్"

      ఆస్ట్రేలియాలో వర్క్ వీసా మీద ఉన్నవారికి భారత డ్రైవర్స్ లైసెన్స్ సరిపోతుందా, కాస్త ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో అయితే చెల్లదు. The license issued by the home country authorities is valid only if the driver is traveling on a visit visa.

      తొలగించండి
    5. PR ఉన్నవాళ్లు ఇండియన్ లైసెన్స్ యూజ్ చేయకూడదు కానీ, టెంపొరరీ వర్క్ వీసా మీద ఉన్నవాళ్లు భేషుగ్గా యూజ్ చేయొచ్చు.

      తొలగించండి
    6. పవన్ గారూ, thanks for the info.

      కాలిఫోర్నియాలో DMV appointment చాలా సమయం పడుతుంది కనుక ఆ రాష్ట్రంలో హెచ్1/4-బీ వీసా వారికి హోమ్ కంట్రీ లైసెన్స్ & DMV appointment చూపించి తాత్కాలిక స్థానిక లైసెన్స్ పొందే అవకాశం ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాలలో ఈ సౌకర్యం లేదు.

      తొలగించండి
  3. భారతదేశంలోనే International Driving Permit తీసుకుని వెళ్ళచ్చు అనుకుంటాను (ఎలాగా? మేరా భారత్ మహాన్).అయితే అది ఒక సంవత్సరం వరకే చెల్లుతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలో .... నాకు తెలియదు 🙂.
    ఆ పర్మిట్ ను అవతలి దేశంలో అధికారులు, రెంటల్ ఏజెన్సీలు అంగీకరించడం అన్నది వారి ఇష్టమేమో తెలియదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ, IDP కేవలం హోమ్ కంట్రీ లైసెన్స్ యొక్క తర్జుమా మాత్రమే. It is not a driver license, but a translated version of your home country driver license in an internationally approved format. It is valid for one year or the date of home country license expiry (whichever is earlier).

      అమెరికాలో పర్యాటకులకు (e.g. B-1) IDP లేదా ఆంగ్లంలో ఉన్న లైసెన్సులు చెల్లుతాయి. IDP must be accompanied by a valid passport bearing a valid visa stamp establishing the status.

      నేను చాన్నేళ్ళు IDP తీసుకొని డ్రైవ్ చేసాను. ఆతరువాత భారత లైసెన్స్ కూడా చెల్లుతుందని తెలిసి మానేసా. ఎక్కడా ఇబ్బంది కాలేదు.

      యూకే, కెనడా, ఐరోపా, middle east దేశాలలో కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

      తొలగించండి
    2. Thanks for the clarification జై గారూ.
      అయితే నా భారత లైసెన్స్ తో ఈసారి అమెరికాలో కారు నడిపేస్తాను 😎 .... కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనుకుంటూ. కానీ, ముందు ఆ yield వగైరా బోర్డులు అర్థం చేసుకోవాలి ... ఎందుకంటే మన మహాన్ భారత్ రోడ్ల మీద అవతలి వాహనానికి yield అయ్యే అలవాటు లేదు కదా 😀😀

      తొలగించండి
    3. ఇన్నేళ్ళలో నాకెప్పుడూ ఈ కుడి-ఎడమ తిరకాసు కష్టం కాలేదు గృరువు గారూ. మీరు దేవదాసు స్పూర్తితో (అనగా DUI) అని ఉండుంటే మాత్రం అది వేరే విషయం.

      నా మట్టుకు నాకు పారలెల్ పార్కింగ్ & ఇంగ్లాండ్ రౌండబౌట్ తప్ప ఇంకే విషయాలలో ఇబ్బంది అనిపించలేదు.

      విమానం దిగిన మొదటి రోజు జెట్లాగ్ ఉంటుంది కనుక ఆ ఒక్క రోజు షటిల్ వసతి ఉన్న ఎయిర్పోర్ట్ హోటళ్లలో దిగి డ్రైవింగ్ అవాయిడ్ చేస్తాను.

      DMV manual (highway code in UK) అంటూ రూల్సు పుస్తకాలు చదివి, కొన్ని రోజులు పక్క సీట్లో "చూచి నేర్చుకొని", అవసరమయితే రెండు మూడు ప్రాక్టికల్ క్లాసులు (~ $ 50-100/session కొంచం ఖర్చే కానీ ప్రయోజనకరం) తీసుకుంటే చాలు.

      తొలగించండి
  4. అయ్యో! Color blindness వున్నవాళ్ళకి ఎంత కష్టం కదా!?

    రిప్లయితొలగించండి