26, నవంబర్ 2019, మంగళవారం

పొరుగింటి పుల్లగూరకు కాస్త పులుపెక్కువైంది

మూడేళ్ళ క్రితం మణిరత్నం కాఫీ తాగుతూ దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు. 

"ఇంతకీ ఏదైనా  కొత్త సినిమా తీసే ఆలోచనలో ఉన్నారా?" అడిగింది సుహాసిని. 

కథ ఏమి తట్టట్లేదు అందుకే ఆలోచిస్తున్నా.  

ఓకే బంగారం లాంటి ట్రెండింగ్ యూత్ స్టోరీస్ తియ్యండి మళ్ళీ రామాయణం, మహాభారతం జోలికి వెళ్లకుండా.  

ఇంతలో T.V లో పాట వస్తోంది. ఆ పాట అయిపోగానే సుహాసిని గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా రూంలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. 

ఆ తరువాత ఒక కథ రాసుకొని 'చెలియా' అనే సినిమా తీశాడు. ఆ సినిమా తీయడానికి టీవీ లో చూసిన ఆ పాటే ఇన్స్పిరేషన్ ఇచ్చింది.

ఆ పాట ఏంటంటే తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనే తీసిన 'సఖి'  సినిమా లోని 'కలలై పోయెను నా జీవితం' అనేది.  ఆ పాట లో హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వెళ్ళి చివరికి ఎక్కడో మెడికల్ క్యాంపు లో ఉన్న తనను కలుస్తాడు.

ఇక 'చెలియా' సినిమా కూడా అంతే, ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టేసి హీరోయిన్ తో గొడవ పడిన హీరో  చివరకి ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడో మెడికల్ క్యాంపు లో కలుస్తాడు. ఆయన అన్ని సినిమాల్లో లాగానే హీరోయిన్ ని అద్భుతంగా చూపించారు కానీ మొహం మీద మీసాలు లేని కార్తీ ని చూడటమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.  సినిమా మరీ బాలేదా అంటే బాగుంది అది కూడా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ వరకే ఆ తర్వాతంతా బోర్. ఈ మధ్య మణి గారి సినిమాలంటే భయం వేస్తోంది చూడాలంటే, అంత చెత్తగా ఉంటున్నాయి మరి ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఓకే బంగారం మూవీ మాత్రం ఇంకా చూళ్ళేదు. అదెలా ఉందో చూడాలి.

జనతా హోటల్ అనే మళయాళ డబ్బింగ్ సినిమా కూడా చూశాను. ఏదో అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన టైములో ఏదో ఆ టైటిల్ కలిసి వచ్చేట్లు పెడితే కాస్త క్రేజ్ వస్తుంది అనుకొని జనతా హోటల్ అని పెట్టి ఉంటారు అనుకొని ఆ సినిమా వైపు చూడలేదు. మొన్న ఏ సినిమా దొరక్క ఆ సినిమా చూశాను యు ట్యూబ్ లో. 

ఆ సినిమాలో నాకు ముందుగా నచ్చిన విషయం మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు నాకు బాగా నచ్చిన సినిమా అయిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' గుర్తుకు వస్తూనే ఉంది. సరే ఆ రెంటిలో ఏ సినిమా మ్యూజిక్ ఒరిజినల్ అయి ఉండచ్చు అని గూగుల్ లో గాలిస్తే రెంటికీ గోపి సుందరే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసింది.  గోపి సుందర్ మలయాళం సినిమా అయిన 'ఉస్తాద్ హోటల్' లోని background మ్యూజిక్ నే 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లో చాలా వరకు రిపీట్ చేసాడు అని అర్థమైంది రెండింటిలోనూ ముస్లిం ఫామిలీ background ఉండటం ఒక కారణం కావచ్చు. నాకు ఆ రెండు సినిమాలు నచ్చడానికి కథ ఒక కారణం అయితే రెండోది పాటలు, background మ్యూజిక్. మూడోది అందులో నటించిన నటీనటులు. ఆ సినిమా చూశాక అర్రే, ఇన్ని రోజులు జనతా హోటల్ లాంటి మంచి సినిమా మిస్ అయ్యానే అనిపించింది. 

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలేవి అని నెట్లో వెదికితే అందులో చాలా వరకు ఈ మధ్య కాలంలో  నేనెప్పుడూ వినే పాటలు, నాకు నచ్చిన పాటలు అతను కంపోజ్ చేసినవే అని తెలిసింది. అందులో కొన్ని మజ్ను, నిన్ను కోరి, ఊపిరి, మజిలీ, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు లోని సినిమా పాటలు. 

ఒకే సంవత్సరంలో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత కూడా ఉందట ఇతని ఖాతాలో. 

ఇక నేను రుచి చూసిన పొరుగింటి పుల్లగూరలో బాగా పులుపు ఎక్కింది jackpot అనబడే మరొకటి. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ యాక్షన్ సినిమా. యాక్షన్ అని ఎందుకు అన్నానంటే రెగ్యులర్ తెలుగు, తమిళ హీరోల్లాగానే జ్యోతిక కూడా విపరీతమైన బిల్డప్ లతో ఫైట్స్ చేస్తుంది కాబట్టి. మైండ్ లెస్ కామెడీ అంటారు కదా అలాంటి సినిమా ఇది. మొదటి సగం కాస్త కామెడీ గా బానే ఉంటుంది రెండో సగం బాగా సాగదీయడంతో నీరసం వచ్చేస్తుంది. సగం సినిమా చూసేసి మిగతాది చూడకపోవడం బెటర్ మన F2 సినిమా లాగా. 

18 కామెంట్‌లు:

  1. మిత్రమా అసలే రోజులు బాలేవు. తెలుగు భాషాభిమానులు ఎడాపెడా గగ్గోలు పెడుతున్న తరుణంలో మీరు పరాయి భాష సినిమా గురించి రాసి వాళ్ళను రెచ్చగొట్టడం అవసరమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారూ, అంతే నంటారా? అయినా నేను పులుపు ఎక్కువైందని అన్నాను కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు లెండి.

      తొలగించండి
  2. ఇటుపక్కోడి సినిమా తప్ప పడమటి పక్కోడి సినిమాలు చూడరా? అదేనండీ హాలీవుడ్డు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేదు మేష్టారు బాగా తక్కువ. ఏ సినిమాలు చూసినా నేను, మా ఆవిడ కలిసే చూస్తాము. తనకు ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా అర్థం కావు అంత ఇష్టమూ ఉండవు. నాకిష్టమే గానీ(అంటే నాకేదో పేద్ద అర్థం అవుతాయని కాదు) నేనొక్కడినీ ఇంకో రూంలో కూర్చొని చూడాలి పిల్లలకీ, మా ఆవిడకి డిస్టర్బన్స్ కలక్కుండా, అందుకని చూడను.

      తొలగించండి
    2. సూర్య గారూ! సినీఫీల్డ్లో మీరు డైలాగ్ రైటర్ గా బాగా క్లిక్ అవ్వొచ్చు.

      తొలగించండి
    3. కొంటె డైలాగులు వ్రాయడానికైతే మరీనూ 😃👍.
      (jk 🙂).

      తొలగించండి
  3. మీ దేశపు సినిమాలు కూడా చూస్తుంటారా? మధ్యాహ్నం "Un-Indian" అనే సినిమా చూశాను hotstar లో. Screen Australia వారి productionట. Inter-racial marriage అనే themeతో తీసిన చిత్రం. దీంట్లో హీరో ఎవరో (తెల్లవాడు) తెలిస్తే ఆశ్చర్యపోతారు. చూడండి. సంభాషణలు నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు 🙁. ఆస్ట్రేలియన్ accent కన్నా అమెరికన్ ఉచ్చారణే నయమనిపించింది. మీరంతా ఎలా నడిపిస్తున్నారో ఏమిటో రోజూ?

    అన్నట్లు ఈ సినిమా కథ మొత్తం మీ ఊరు సిడ్నిలోనే జరుగుతుందండోయ్. ఆ లొకేషన్స్ అన్నీ మీకు పరిచయమైనవే అయ్యుంటాయి. సహజంగానే నాకైతే అవేవీ తెలియవనుకోండి ... సిడ్నీ హార్బర్ లో ఉన్న ఆ iconic building ఒక్కటి మాత్రం గుర్తు పట్టగలిగాను.

    కథ పెద్ద గొప్పగా ఏం లేదు లెండి, ఏదో హిందీ సినిమా చూస్తున్నట్టే ఉంది నాకు అర్థమైనంత వరకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ సినిమా తీసింది మన ఇండియన్ కాబట్టి మీకు హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఆస్ట్రేలియా ఢిల్లీ లాగా మేష్టారు, ఇక్కడ specific గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ లేదు, అంతా అమెరికా వెళ్ళి అక్కడే నటిస్తుంటారు. ఢిల్లీ వాళ్ళు ముంబై వెళ్లి నటించినట్లు. (నా ఎనాలిసిస్ రాంగ్ అయి ఉండచ్చు బట్ నాకు తెలిసిన ప్రకారం ఇంతే ). ఇక్కడి వాళ్ళు తీసి బాగా హిట్టయిన సినిమాలు తక్కువే.

      మన శ్రీశాంత్ లాగా బ్రెట్ లీ కూడా సినిమాల్లో ఒక అడుగు వేసాడు లెండి.

      మన ఘన శక్తి నక్షత్రం ఆరెంజ్ మూవీ మొత్తం సిడ్నీ సిటీ లోనే తీశారు.

      తొలగించండి
    2. Uninhabited, Black Water లాంటి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఆస్ట్రేలియా వారు నిర్మించినవే. Troy సినిమాలో Prince Hector పాత్ర పోషించిన Eric Bana ఆస్ట్రేలియనే. అయినా మీరన్నది కరక్టే ... ఆస్ట్రేలియన్ నటీనటులు వెళ్ళి హాలీవుడ్ లో నటించడమే మామూలేమో (అవకాశాల దృష్ట్యానేమో బహుశః)?

      తొలగించండి
  4. అదేదో “Coronavirus” విజృంభిస్తోందిట గదా మీ దేశాల వైపు? జాగ్రత్తగా ఉండండి పవన్☝️.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హెచ్చరించి నందుకు ధన్యవాదాలు మేష్టారు. అవును రెండు మూడు కేసులు నమోదయ్యాయి ఇక్కడ అని విన్నాను.

      తొలగించండి
    2. పవన్,
      కరోనా వైరస్ భయం మూలాన భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసిందని ఇవాళ్టి (12-03-2020 Deccan Chronicle) వార్త 👇 . కాబట్టి భారతదేశానికి వచ్చే ఉద్దేశం ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి వేచి యుండాలి.

      "Covid-19 scare : India suspends all tourist visas till April 15"

      తొలగించండి
    3. ఇంకో అయిదారు నెలల వరకు అలాంటి ప్లాన్స్ లేవు మేష్టారు. సమాచారం ఇచ్చినందుకు థాంక్స్.

      తొలగించండి
    4. పవన్ & విన్నకోట వార్లకు గమనిక: సస్పెండ్ చేసింది విదేశీయుల టూరిస్ట్ వీసాలు మాత్రమే. ఇందుమూలాన భారత పాసుపోర్టు దారులకు ఎటువంటి ఇబ్బంది లేదు.

      తొలగించండి
    5. Quite right జై, అయితే మన బ్లాగుమిత్రులలో ఎవరికి ఏ దేశపు పాస్‌పొర్ట్ ఉందో (పవన్ భారతీయుడే లెండి ... ఇంకా) మనకు తెలియదు కదా. కాబట్టి జనరల్ గా వారికి గాని, అక్కడ వారి స్నేహితులకు గానీ పనికొస్తుందని షేర్ చెయ్యడం జరిగిందన్నమాట ఆ సమాచారాన్ని.

      పనిలో పనిగా ఈ క్రింది ప్రభుత్వ హెచ్చరికను గూడా జనాలు గ్రహించండి. ఈ రోజు (13-03-2020) Deccan Chronicle (Hyd) daily లో వచ్చిన వార్త ---> వచ్చినవారిని ఏప్రిల్ 15 వరకూ తిరిగి వెళ్ళడానికి అనుమతించరట, భారత ప్రభుత్వం అన్ని international flightsనూ ఆపేస్తోందట.

      (Disclaimer : ఇవన్నీ వార్తాపత్రికలలో వచ్చిన వార్తలు, నాకేమీ సంబంధం / బాధ్యత లేదు. ప్రయాణం చేయదలుచుకున్నవారు సరైన పరిస్ధితి, రూల్స్, విమానాల గురించి తామే వాకబు చేసుకోవాలి.)

      "Tourist visas on hold from Mar 13"

      తొలగించండి
    6. Disclaimer అదుర్స్ గురువు గారూ!

      తొలగించండి
  5. చెలియా నాకు బాగా నచ్చిన సినిమా అండీ.. దాని గురించి ఎప్పటి నుండో రాయాలని అనుకుంటూ వాయిదా వేస్తున్నాను. మీరు సఖి పాటతో పోల్చి భలే తేల్చేశారు చదవగానే ఫక్కున నవ్వేశాను :-) ఓకే బంగారం బాగానే వుంటుందండీ చూడండి. ఉస్తాద్ హోటల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఉంటుంది. గోపీ సుందర్ పాటలు నాక్కూడా ఇష్టమండీ.. బావున్నాయ్ మీ సినిమా కబుర్లు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు వేణూశ్రీకాంత్ గారు.

      తొలగించండి