వ్యాపార ప్రస్థానం - బీజం పోస్ట్ కి ఇది కొనసాగింపు
..... అలా బెంగళూరు లో ఎగ్ దోశ కి అంటుకున్న దోషం పెరిగి పెరిగి పెద్దదై పోయింది. తర్వాత బెంగుళూరు నుంచి సిడ్నీ కి వచ్చిన మరుసటి రోజు నా రూమ్ మేట్ తో హోటల్ లో బ్రేక్ఫాస్ట్ టైం లో ...
ఏంటి? ఎగ్ దోశ దొరకదా? బర్గర్ తో సరి పుచ్చుకోవాలా? 'బర్గర్ ఈజ్ నాట్ మై ప్లేట్ అఫ్ బ్రేక్ఫాస్ట్' అని గట్టిగా అరవాలనిపించింది. కాకపోతే పక్కన ఇద్దరు అరవోళ్ళు అరవంలో అరుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక నేను అరచినా ఎవరికీ వినపడదు అని అరవడం విరమించుకొని బర్గర్ ని కోక్ లో ముంచుకొని తిన్నా.
అలా సిడ్నీ లో ఎక్కడ వెదికినా ఈ ఎగ్ దోశ దొరకలేదు. ఏదో ఇండియన్ రెస్టారెంట్స్ లో ఉంది అంటే ఉంది అని కానీ మెనూ లో కూడా చేర్చేవారు కాదు. సిడ్నీ లో ఈ ఎగ్ దోశ కి స్పేస్ ఉందనిపించి, ఎన్నాళ్లు ఈ ఇష్టం లేని సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలి. ఇక చాలు ఇంతటితో ఆపేసి నా జీవిత ధ్యేయం అయిన బిజినెస్ వైపు వెళ్లాలని డిసైడ్ చేసుకున్నా.
మీ FKC లో కాస్త చోటిస్తే ఒక పక్క నేను దోశలు వేసుకుంటా, నాకు వచ్చిన ప్రాఫిట్ లో 30% నీకిస్తా అని అడిగా మా ఇంటి పక్కన ఉండే FKC చికెన్ వాడిని. వాడు కాదు కూడదు అన్నాడు. అలాగా, మీ ఓనర్ ని పిలువు వాడితో మాట్లాడాలి అన్నా. నేనే ఈ ఫ్రాంచైజ్ ఓనర్ ని అన్నాడు, మరైతే మీ షాప్ మీదున్న ఆ గెడ్డం తాత ను పిలువు ఆయనతోనే డైరెక్ట్ మాట్లాడుతా నా డీల్ అన్నాను. ఆ ముసలాయన చనిపోయి చాలా కాలం అయింది తమరు దయచేయండి అని చెప్పాడు. 'నేను అతని బిజినెస్ ని దెబ్బకొట్టి పైకి ఎదుగుతాననే భయం' అతని కళ్ళలో క్విన్టాలలో చూడటం నా కాన్ఫిడెన్స్ ని టన్నుల కొద్దీ పెంచింది.
ఇదే సీన్ మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్ , ప్రిడొమినోస్ పిజ్జా షాప్ లోనూ రిపీట్ అయింది.
ఇక ఇలా కాదని నా ప్రోడక్ట్ ని నేనే పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యా. ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ నేను తయారు చేసిన ఎగ్ దోశలు అవి తినని వారికి దోశలు ఫ్రీ గా పంచిపెట్టా. ఫ్రీ గా వచ్చిన దోశలు కాబట్టి అందరూ లొట్టలేసుకుని తిని మేము తినే బర్గర్, పిజ్జా ల కంటే పది రెట్లు టేస్టీ గా ఉందని మెచ్చుకున్నారు.
నాలో కాన్ఫిడెన్స్ పెరిగి, ఒకరి మీద డిపెండ్ అవకూడదు అనుకున్నా అదుగో అప్పుడు ఫ్లాష్ అయిందే ఈ 'మిస్టర్ ఎగ్ దోశ'. అదే పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నా షాప్ కి లోన్ ఇచ్చేవాళ్ళు దొరక్క, కత్తి లాంటి ఐడియా అమలుచేశా. 'కరోనా టైములో రష్మిక మందాన వాడిన మాస్క్' అని వేలం పాట పెట్టి పది డాలర్ల మాస్క్ ని లక్ష డాలర్స్ కి అమ్మేశా.
ఆ వచ్చిన డబ్బులతో 'మిస్టర్ ఎగ్ దోశ' స్టార్ట్ చేశా, రెండే నెలల్లో FKC, మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్, ప్రిడొమినోస్ సేల్స్ పడిపోయి నా కాళ్ళ బేరానికి వచ్చారు బ్లాంక్ చెక్ ఇచ్చి. బట్, నేను వారిని ఛీ కొట్టాను, దాంతో కొన్ని రోజులకే వారు రోడ్డున పడ్డారు.
అక్కడక్కడ బెగ్గింగ్ చేస్తూ కనిపిస్తారు కదా వాళ్ళంతా ఈ FKC, మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్ , ప్రిడొమినోస్ ఫ్రాంచైజ్ ఓనర్స్ మరియు షేర్ హోల్డర్స్. అప్పుడప్పుడూ మా 'మిస్టర్ ఎగ్ దోశ' షాప్ కి వచ్చి ఫ్రీ గా ఎగ్ దోశ తిని వెళ్ళమని చెప్పాను వాళ్ళకి.
మా మిస్టర్ ఎగ్ దోశ రుచి తిరుపతి లో తిన్న ఎగ్ దోశ రుచికి సరిపోకపోవచ్చు, కానీ ఇది నా ప్రయత్నం అంతే. తాజ్ మహల్, శ్రీదేవి, బాల సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎగ్ దోశ ఇవంతా unique pieces, మళ్ళీ సృష్టించడం అసాధ్యం.
చెత్తగా ఉండే పీజ్జాలు, బర్గెర్స్ ప్రపంచం లో ఏ మూలకు వెళ్లినా దొరుకుతున్నాయ్, కానీ రుచికరమైన ఎగ్ దోశ వాసన చూద్దామన్నా దొరకడం లేదు. కాబట్టి ఇకపై ఆస్ట్రేలియా లోనే కాదు అమెరికా, ఆఫ్రికా, అండమాన్ నుంచి జింబాబ్వే వరకు నా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తా. COVID చేరని places ని కూడా మా మిస్టర్ ఎగ్ దోశ చేరుతుంది. COVID ప్రపంచాన్ని చుట్టేయడానికి మూడు నెలల టైం పట్టి ఉండచ్చు కానీ నా 'మిస్టర్ ఎగ్ దోశ' సామ్రాజ్యాన్ని ఇంకో ముప్పై రోజుల్లోనే విస్తరిస్తా.
ఆరు ముప్పై ..
ఆరు ముప్పై కాదు, ముప్పై రోజుల్లో ..
నాన్నా, టైం ఆరు ముప్పై అయింది, స్కూల్ కి రెడీ అవ్వాలి.
అరే మా అమ్మాయి! నిన్ను ఈ స్టేజి మీదకు రానిచ్చారు అని చూస్తిని కదా, నేనున్నది బెడ్ మీద. అంటే రాత్రి 'మిస్ ఇండియా' సినిమా చూసి పడుకోవడం వల్ల వచ్చిన కలా ఇది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి