'సరిలేరు నీకెవ్వరూ' అనబడే సూపర్ డూపర్ బంపర్ జంపర్ హిట్ తర్వాత అదే అనిల్ రావిపూడి ఈ సారి అదే మహేష్ బాబు ను క్రికెట్ కోచ్ గా చూపిస్తూ 'బేసిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ తో కొత్త మూవీ తీస్తున్నారట. ఆ స్టోరీ ఇదే అయ్యుండచ్చేమో అని నా ఊహ.
ఓపెనింగ్ షాట్ లోనే ... ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ అమెరికా.
అమెరికా మీద గెలవాలంటే ఇండియా కి 42 పరుగులు కావాలి, ఒక ఓవర్, ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంటుంది. చివరి ఆటగాడు అమ్మో! అన్ని రన్నులే అని టెన్షన్ పడి పాడ్ కట్టుకునే లోపే పాడె ఎక్కేస్తాడు గుండె హార్ట్ ఫెయిల్ అయి. మిగతా ఎక్స్ట్రా ఆటగాళ్ళు ముందు రోజు బార్లో బీర్లు ఎక్కువ తాగి ఎవరితోనే దెబ్బలు తిని మంచం ఎక్కి ఉంటారు. ఇక వేరే ఆప్షన్ లేక పైగా తెలుగు సినిమా కథ లో లాజిక్ మిస్ అయి చాలా ఏళ్ళు అయ్యి ఉండటం వల్ల కోచ్ పాడ్స్ కట్టుకొని బాటింగ్ చేయడానికి వెళ్తాడు.
గ్యాలరీ లో అందరూ బాబు.. బాబు.. అని అరుస్తుంటారు ఎంకరేజ్ చేస్తూ. ఒక 6 సిక్సులు కొట్టాక తన సహచర ఆట గాడిని తనతో పాటు తీసుకెళ్తాడు టీ తాగి వద్దాం పద అని. ఇక్కడ ప్రేక్షకులంతా బాబు, బాబు అని అరుస్తూనే ఉంటారు. టీ తాగొచ్చి ఆ చివరి సిక్స్ కూడా కొడతాడు.
ఆ రోజు నైట్ అదే స్టేడియం లో హాలీవుడ్ హీరోయిన్ తో ఒక ఐటెం సాంగ్... కప్పు గెలిచిన సందర్బంగా సంబరాలు చేసుకుంటూ.
కట్ చేస్తే .. ఫ్లైట్ లో ఇండియాకి తిరుగు ప్రయాణం ..అదే విమానం ఎక్కాల్సిన హీరోయిన్ లేట్ అవడం వల్ల విమానం వెనుక పరిగెడుతూ ఉంటుంది. హీరో చెయ్యి ఇస్తే హీరోయిన్ ఎక్కేస్తుంది. అంతే, హీరో చెయ్యి ఇచ్చాడని హీరోయిన్ మనసు ఇచ్చేస్తుంది.
కాసేపటికి ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల లైట్స్ ఆరిపోతాయి, ఫ్లైట్ కూడా ఆగిపోయి మేఘాల్లో ఇరుక్కుపోతుంది. ఫ్లైట్ లో లైట్స్ వెలగకున్నా ఫ్లైట్ అంతా లైటింగ్ ఉండి ఉంటుంది. అది మన హీరో పేస్ లో ఉండే కలర్ అండ్ గ్లామర్ వల్ల అని తెలుసుకున్న హీరోయిన్ రెండో చూపులోనే హీరో మీద వెళ్లి పడిపోయి, చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటా అంటుంది
హీరో మాత్రం అదేమీ పట్టించుకోకుండా, మేఘాల్లో ఇరుక్కున్న విమానాన్ని బయటికి లాగి ఆ టెక్నికల్ ఇష్యూ ని సరిచేస్తాడు. దాంతో హీరోయిన్ మరింత ఇంప్రెస్ అయిపోయి
తెల్లటి బాబు ఓహ్ తెల్లటి బాబు
భలే భలే.. భలే బూరె బుగ్గల బాబు
అని సిగ్గు ఎగ్గూ లేకుండా పాట పాడుతూ ట్రాప్ లో పెట్టడానికి రేప్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది.
ఫ్లైట్ మేఘాల్లో ఇరుక్కున్నప్పుడు ఆ మేఘాల వెనక దాక్కున్న ఫ్లైట్రేట్ (పైరేట్స్ లాగా ఇదో పద ప్రయోగం) ఒకడు ఈ ఫ్లైట్ లోకి ఎంటర్ అయి ఉంటాడు. వాడి పేరు బులెట్ బాబ్జి, వాడు విమానాల్లో ఎక్కి చోటా మోటా దొంగతనాలు చేస్తుంటాడు. రెండు మూడు కామెడీ సీన్స్ నడిపించిన తర్వాత వాడికి హీరో బుధ్ధి చెప్తాడు.
తర్వాత ఆగ్రా లో ఫ్లైట్ దిగి సరాసరి ఆ చచ్చిన క్రికెటర్ ఇంటికి వెళదాం అనుకునేలోగా ఆ క్రికెటర్ చెల్లిని ఎవరో ఎత్తుకెళ్లాలని వస్తారు ఆ తాజమహల్ సెంటర్లోకి. అక్కడో పెద్ద ఫైట్ సీక్వెన్స్.
క్రికెటర్ చెల్లి ఒక రిచ్ బాయ్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ రిచ్ బాయ్ ని వాళ్ళ నాన్న డబ్బున్న అమ్మాయి (ఇందాక ఫ్లైట్ లో వికారమైన కామెడీ చేసిన హీరోయిన్) తో పెళ్ళి చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఆ క్రికెటర్ చెల్లిని లేపేయమని తన మనుషులని పురమాయించి ఉంటాడు.
దాంతో హీరో ఆ విలన్ భరతం పట్టాలని అనుకుంటాడు. విలన్ బ్యాచ్ తో రెండు పులిహోర కామెడీ సీన్స్, ఇంకో రెండు బిర్యాని ఫైట్స్ తర్వాత క్రికెటర్ చెల్లిని ఆ రిచ్ బాయ్ కిచ్చి పెళ్లి చేసి హీరోయిన్ ని తాను పెళ్లి చేసుకొని విలన్ లో పరివర్తన తీసుకురావడం కోసం అతన్ని తీసుకెళ్ళి ఎక్స్ట్రా ప్లేయర్ ని చేసి బ్రేక్ లో క్రికెటర్స్ కి పాడ్స్, డ్రింక్స్ అందించే పని చేయిస్తాడు.
ఈ మాత్రం కథ చాలు, కావాల్సినంత మసాలా ఉంది కాబట్టి బొమ్మ దద్దరిల్లిపోద్ది, సంక్రాంతి కి రిలీజ్ చేస్తే గల్లా పెట్టె నిండిపోతుంది.
అరరె, ఇంత టాలెంట్ పెట్టుకుని పరాయిదేశంలో కూర్చునున్నారేమిటి మీరు ... హైదరాబాదు వచ్చేసి చిత్రరాజాలు తియ్యక?
రిప్లయితొలగించండి"పరిశ్రమకు మీ అవసరం ఉంది", యంగ్‌మాన్ 👈.
ఫిలింనగర్ పిలుస్తోంది, రా కదలి రా 👋👋.
అంత దృశ్యం నాకు లేదు మేస్టారు, ఏవో పనికిమాలిన కబుర్లు.
తొలగించండిIT పరిశ్రమ లో ఇలా బతికేస్తే చాలు.
"పేదవాడు" గురించి కూడా వ్రాయండి.
రిప్లయితొలగించండిఅలాగే బోనగిరి గారు. సరిలేరు నీకెవ్వరు తో పోలిస్తే ఆ శ్రీమంతుడు గుడ్డిలో మెల్ల.
తొలగించండిసిక్సులు, ఏ "సరి" హీరో అయినా కొడతాడు. మన "బేసి"బాబు, సిక్సులు కాకుండా సెవెన్లు కొట్టి ఆట నెగ్గాలి. అప్పుడు బేసిలేరు నీకెవ్వరు టైటిల్ apt గా ఉంటుంది & న్యూమరాలజి ప్రకారం కూడా సినిమా హిట్ అవుతుంది. :-)
రిప్లయితొలగించండిమీ ఐడియా అద్భుతంగా ఉంది, స్క్రిప్టు లో change చేద్దాం కాంత్ గారు.
తొలగించండి