21, ఆగస్టు 2021, శనివారం

దియా - దివ్యమైన సినిమా

నా  MCA ఫ్రెండ్ ఈ సినిమా చూడమని రెకమండ్ చేస్తే నటీనటులు ఎవరో తెలియకపోయినా చూద్దాం అని నిన్న రాత్రి డిసైడ్ అయ్యాము.  కాసేపటికే సినిమా బాగా ఆకట్టుకుంది. ఎంతగా లీనం అయ్యామంటే ఒకానొక సీన్ లో నేను, మా ఆవిడ ఇద్దరం ష్.. అనేశాం అదేదో నిజంగా మా కళ్లముందే జరుగుతున్నట్లు, అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేదని. 

సినిమా అంటే తెర నిండా నటీ నటులు, సెట్టింగ్స్, పాటల్లో భారీతనం అక్కర్లేదు అనిపించింది సినిమా  చూస్తున్నంతసేపు. హడావిడి లేకుండా ఉండే ప్లెసెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరొక అసెట్. 

సినిమాలో మొత్తంగా ఒక పది పాత్రలు ఉంటాయి. ఒక్క పవిత్రా లోకేష్ తప్ప మిగతా నటులను చూడటం ఇదే మొదటి సారి. మూడు ప్రధాన పాత్రదారుల నటన బాగుంది,  ముగ్గురిలో ముందుగా చెప్పాల్సింది ఆది క్యారెక్టర్ ప్లే చేసిన నటుడి గురించే. అతన్ని చూస్తే ఆకలి రాజ్యం టైం లో యంగ్ కమల్ హాసన్ ను చూసినట్లు అనిపించింది అతని హెయిర్ స్టైల్, హైట్ కమల్ హాసన్ నే గుర్తుకు తెచ్చాయి నా వరకైతే.  

లెక్కల మేష్టారు లెక్కల పరీక్ష లో ఫెయిల్ అయ్యాడే అనిపిస్తుంది చివర్లో ఆది క్యారెక్టర్ చూశాక.  అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడ్డట్లు అనే సామెత గుర్తొస్తుంది. సాధారణంగా తమిళ్ సినిమాల ఎండింగ్ ఇలాగే ఉంటుంది. చివర్లో ఈ సినిమా డైరెక్టర్ ని తమిళ్  డైరెక్టర్ పూనాడేమో?

'సమస్యలు లేకుండా అదేం జీవితం అండీ' అని ఆది చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. అది అక్షర సత్యం. ఇదొక్క డైలాగ్ అనే కాదు ప్రతీ  డైలాగ్ బాగుంటుంది. ప్రతీ సీన్ ఈ సినిమా కథలో మనం ఊహించగలిగినదే అయినా  ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. నాకైతే చాలా వరకు ఈ సినిమా కథ 'అందాల రాక్షసి' సినిమా  కథనే పోలి ఉందనిపించింది. 

కన్నడ లో తీసి, పోయిన సంవత్సరం రిలీజ్ చేసిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే  కన్నడ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో షూటింగ్ కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్ మూడో తేదీ రిలీజ్ చేయబోతున్న టైములో 10 రోజుల ముందు యూ ట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ పెట్టారంటే,  something fishy అనిపించి గూగుల్ లో ఈ సినిమా గురించి సెర్చ్ చేస్తే యేవో ఫైనాన్సియల్ సెటిల్మెంట్ ఇష్యూస్ నడుస్తున్నట్లు తెలిసింది.    

సరే మన తెలుగులో 'డియర్ మేఘ' ని ఎలా కుక్ చేశారో చూద్దామని అందుబాటులో ఉన్న రెండు మెతుకులను (అదేనండి ట్రైలర్)  రుచి  చూస్తే కాస్త మసాలాలు యాడ్ చేసి రిచ్ నెస్ కోసం కాసిన్ని డెకొరేషన్స్ కూడా చేసినట్లు ఉన్నారు తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్లు. 

కాబట్టి హడావిడి లేని సినిమా చూడాలంటే యూట్యూబ్ లో ఉన్న 'దియా' చూడండి లేదూ మాకు మసాలా యాడ్ చేసిన వెర్షన్ కావాలనుకుంటే 'డియర్ మేఘ' రిలీజ్ వరకు వెయిట్ చెయ్యండి. ఛాయస్ మీదే.  

Final verdict: నీ  ఊపిరి ఇంకా తగులుతూనే ఉంది దియా సూప్....కాదు కాదు దియా సూపర్. 

4 కామెంట్‌లు:

  1. మీ MCA ఫ్రెండ్ చెప్పాడని మీరు చూశారా “దియా” సినిమా? మీరు చెప్పారని నేను చూశాను. “మన్మధుడు”, “సంతోషం” చూసినట్లుంది - చివరిలో ఒక ట్విస్ట్ తోనూ, క్లైమాక్సు తేడాతోనూ. ఇంతకీ ఇది కన్నడ చిత్రమా? ఆ డబ్బింగ్ ఆర్టిస్టులెవరో గానీ ఒంట్లో ఊపిరి లేనట్లుగా డబ్బింగ్ చెప్పారు. వాల్యూమ్ పెంచిన కొద్దీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గోల పెరగడమే కానీ మాట వినబడదే? ఇక మంచి పని కాదని తెలిసినా కుర్చీ టీవీకి దగ్గరగా వేసుకుని కూర్చుని ప్రయత్నించాను. ఆ యూట్యూబ్ వాడేమో సబ్-టైటిల్స్ పెట్టడు.

    సరే, ఇంతకీ చెప్పదలుచుకున్నదేమిటంటే కొత్తదన మేమీ లేని కథ. అయితే క్లైమాక్సు మాత్రం చాలా సాహసంగా వ్రాశాడు రచయిత. సర్లెండి, ఓ సారి చూడచ్చు. అయితే ఓసారే చూసినా మీ Final Verdict “తగులుతూనే” ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డైలాగ్స్ అవీ చాలా క్లియర్ గా వినపడ్డాయి మేష్టారు మాకు. మీరు పొరపాటున పైరసీ ప్రింట్ చూసారా ఏమిటి? కొన్ని duplicate prints పెట్టారు. ఒరిజినల్ ప్రింట్ ఫ్రీ గానే దొరుకుతుంది. నాకు ఆ సినిమా pleasant గా తీయడం నచ్చింది మేష్టారు హడావిడి లేకుండా, పైగా లో expectations to చూడటం వల్ల నచ్చింది అనుకుంటా.

      తొలగించండి
  2. అవును, Pleasant గా తీసిన చిత్రం అనడంలో సందేహం లేదు. మీరన్నట్లు వెర్రిమొర్రి పాటలు, ఓ 50 మందిని వెనకేసుకుని అనవసరమైన “మెగా” డాన్సులు, రక్తసిక్త పోట్లాటలు లేవు. That’s true. బహుశః డైలాగులు సరిగ్గా వినబడక పోవడంతో నాకు కొంచెం విసుగనిపించి ఉండచ్చేమో లెండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగ్గా అలాంటి సినిమాని ready చేసే పనిలో ఉన్నారు బాబీ అనే director తో కలిసి మా బాస్.. వాల్తేర్ వీరయ్య అని అనుకుంటున్నారట టైటిల్. టైటిల్ నాకే నచ్చలేదు, ఇక ఈ జనరేషన్ కుర్రాళ్ళు అటు వైపు కూడా చూడరేమో.

      తొలగించండి