11, నవంబర్ 2018, ఆదివారం

వాన భోనాలు - నేను 'నాని', మా వాడు 'శర్వానంద్'

వాన భోనాలకు వెళ్తున్నారటగా అని పొద్దుటే ఫోన్ లో మిత్రుడు 

వాన భోనాలు, ఎండ భోనాలు ఏమిటి? నువ్వు నీ ఇంగ్లీష్ మీడియం చదువులు. వన భోజనాలు అని సరిగ్గా పలుకు 

ఆ అదే, వాటికే వెళ్తున్నారటగా 

అవును, వస్తావా ?

చచ్చినా రాను, అది తెలుగు దేశం పార్టీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నది 

అయితే ఏం?

నేను ఆ పార్టీ కాదు 

నేనూ ఆ పార్టీ కాదు, అంత మాత్రం చేత రావద్దని వాళ్ళేమి చెప్పలేదు 

అయినా సరే, నేను రాను, నువ్వూ వెళ్లొద్దు 

తెలుగు వాళ్ళు అందరూ కలవడానికి అరెంజ్ చేసిన కార్యక్రమం అది. వాళ్ళేమి తెలుగు దేశం భావాలు రుద్దరు నీ మీద. వీలయితే నువ్వూ ఒక "చెయ్యి" వెయ్యి, లేదంటే వదిలేయ్.  పోయేవాడిని నన్నెందుకు చెడగొడతావ్. పైగా వాళ్ళేమీ డబ్బులు కూడా అడగటం లేదు వాళ్ళ పార్టీ కి డొనేట్ చెయ్యమని. 

నిన్న ఆదివారం వన భోజనాలకు వెళ్ళడానికి ముందు నా మిత్రుడితో జరిగిన ఫోన్ సంభాషణ అది. 

ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా తెలుగు దేశం పార్టీ వాళ్ళు వన భోజనాలు ఒక పార్క్ లో ఏర్పాటు చేశారు . ప్రతీ ఏడాది సంక్రాంతి సంబరాలు, ఎన్టీయార్ జయంతి, వన భోజనాలు అని మూడు కార్యక్రమాలు జరుపుతారు.  2017 లో నేను పాల్గొన్న ఎన్టీయార్ జయంతి వేడుకల గురించి ఒక పోస్ట్ ఇదివరకే రాశాను.

ఈ సారి నేనువన భోజనాలకి వెళ్ళాను కానీ, అక్కడే పార్క్ లో కిడ్స్ ఆడుకోవడానికి  ప్లే ఏరియా ఉండటంతో మా అమ్మాయి అటు పరిగెత్తింది, మా బుడ్డోడు కూడా వాళ్ళ అక్క వెంటే వెళ్ళాడు, ఇక నేను కూడా వాళ్ళను ఫాలో అయిపోయాను. ఇక్కడ  పిల్లలను ఎత్తుకుపోయే సంఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయి కాబట్టి పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దాంతో పేరుకు వన భోజనాలకు వెళ్ళాను కానీ అక్కడ వాళ్ళు కండక్ట్ చేసిన గేమ్స్ లో పార్టిసిపేట్ చెయ్యలేదు.  of course భోజనాలు మిస్ కాలేదనుకోండి. భోజనాలు ప్రొవైడ్ చేసిన అలాగే మిగిలిన ఐటమ్స్ ప్యాక్ చేసి ఇచ్చిన కాకతీయ ఇండియన్ రెస్టారెంట్ వారికి ధన్యవాదాలు.  

మా పిల్లలు ఆ పార్క్ లో బాగా ఆడుకున్నారు ముఖ్యOగా ఇసుకలో. 



మా బుడ్డోడు మహానుభావుడు సినిమా లో 'శర్వానంద్' టైపు. వాడి చేతికి ఏది అంటుకున్నా వెంటనే చెయ్యికడుక్కునేస్తాడు అందుకే ఇసుకను చేతితో ముట్టుకోకుండా స్పూన్ ని ఇసుకలో ముంచి ఆడుకున్నాడు. ఇసుకలో ఆడుకోవడం మంచిది అని నేనూ మా అమ్మాయి ఎంత చెప్పినా వాడు వినలేదు. 




హలో పవన్! ఎలా ఉన్నావ్? అని పిలవడం తో అటు వైపు తిరిగాను. ఎవరో ఒక వ్యక్తి అద్దాలు, హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. 

అతనెవరో గుర్తుకు రాలేదు. కానీ నేను కూడా హలో! అన్నాను. 

వన భోజనాల దగ్గర కనపడకపోతే రాలేదేమో అనుకున్నాను అన్నాడు. ఇంతలో వాళ్ళ అబ్బాయి అతన్ని అటు వైపు లాక్కెళ్లాడు. 

మీ వాడి పేరు? అని అడిగా 

అర్జున్, మీ వాడి కంటే నెల చిన్నవాడు అని చెప్పి అటు వైపు వెళ్ళాడు 

యెంత ఆలోచించినా అతనెవరో గుర్తుకు రావడం లేదు. నేను ఏదైనా తొందరగా మర్చిపోతుంటాను 'భలే భలే మగాడివోయ్' సినిమా లో 'నాని' లా 😟😟😟😟😟

చేతికి ఇసుక అంటినట్లుంది మా బుడ్డోడికి, శర్వానంద్ లా చేతులు కడిగేసుకుంటున్నాడు నీళ్లతో.  😃😃😃😃😃



2 కామెంట్‌లు: