25, నవంబర్ 2018, ఆదివారం

అన్నము, బ్రెడ్ పకోడి అయింది

ఈ ముడి విప్పుతావేమో చూడు  అంది మా ఆవిడ 

మన ఇద్దరి మధ్య ఆ బ్రహ్మ వేసిన ముడి విప్పడం ఎవ్వరివల్ల  కాదు

చాల్లే నీ పంచ్ లు, ముడి విప్పమని నేనన్నది ఈ స్కిప్పింగ్ రోప్ కి

ఆ ముడి విప్పడానికి నేను తంటాలు పడుతుంటే, మా బుడ్డోడు ఆ తాడు లాగడానికి ట్రై చేస్తున్నాడు.

నో నాన్నా! అలా లాక్కోకూడదు, అందరూ నిన్ను 'బ్యాడ్' అంటారు అన్నాను

ఇప్పటికీ మించిపోయింది లేదు, అనీష్ అనే పేరు మార్చేసి 'గుడ్' అని పెట్టు, అప్పుడు అందరూ 'గుడ్' అనే పిలుస్తారు అంది.

నాకూ పంచ్ వేసేసావా? అన్నాను

పంచులు తర్వాత,  పప్పు, అన్నము లోకి నంచుకోవడానికి పకోడ చేస్తాను అని మా ఆవిడ కిచెన్ లోకి వెళ్ళింది.

ఇంతలో మా మిత్రుడి ఫోన్

ఇవాళ సిడ్నీ లో క్రికెట్ మ్యాచ్ ఉందిగా, వెళ్లట్లేదా ?

లేదు, అంబీ అదే మన అంబరీష్ పోయారుగా అందుకే బాధతో వెళ్ళలేదు

అంతలేదు గానీ, అసలు విషయం చెప్పు

వెళ్లింటే బాగుండు, కనీసం సచిన్ ను చూసి ఉండచ్చు

ఇంకా సచినేమిటి, ఆయన టైం అయిపోయింది క్రికెట్ లో

సరేలే కనీసం సెహ్వాగ్ ని అయినా చూసి ఉండేవాడిని వెళ్లి ఉంటే

అర్థమైంది మహానుభావా నువ్వు క్రికెట్ చూడ్డం మానేసి ఏళ్ళు అయిందని, అది సరే గానీ హాయిగా క్రికెట్ చూడ్డం మానేసి 'బ్లాగ్' అంటూ అంత కష్టపడి రాయడం అవసరమా ?

కష్టపడే కాదు ఇష్టపడి కూడా. అయినా కష్టపడకుండా వచ్చేదంటూ ఉంటే అది ముసలితనమే. అది వచ్చే లోగా కష్టపడి ఏదో సాధించాలని  తపన అంతే. 

డైలాగ్ బాగుంది రజనికాంత్ కు పంపించు, తన సినిమాలో పెట్టుకుంటాడు.

సరేలే ఇప్పుడెందుకు ఫోన్ చేసావ్ ?

'నేను N.T.R మూవీ లో ఒక రోల్ చేస్తున్నాను' అన్నాడు 

ఏ రోల్

అడవిరాముడు లో అప్పారావ్ వేసిన రోల్

అడవిరాముడు లో అప్పారావ్ రోలా? అదేం క్యారెక్టర్ ?

అదే అడవిలో ఉండే జనాల్లో మొదటి వరసలో ఉంటాడే అతని రోల్

అంటే ఇప్పుడు నువ్వు కూడా ఆ గుంపు లో మా బాలకృష్ణ వెనుక ఉంటావన్నమాట.

అవును, N.T.R సినిమా తప్పకుండా చూడు అని ఫోన్ పెట్టేసాడు మావాడు.

ఏంటో ఈ క్రిష్! ఒక సారి శ్రీదేవి అంటాడు, ఇంకోసారి సావిత్రి అంటాడు మరోసారి జయ ప్రద, జయ సుధ కేరక్టర్స్ అంటాడు ఇంకోసారి నాగేశ్వర రావు అంటాడు. ఏదో పల్లెల్లో రికార్డింగ్ డాన్స్ చేసినట్లు అందరూ తలా కాసేపు వచ్చి డాన్స్ చేస్తారో ఏమో, మొత్తానికి సినిమా తీస్తున్నాడో, రికార్డింగ్ డాన్స్ తీస్తున్నాడో అర్థం కావట్లేదు. 

పకోడి రెడీ అంది ప్లేట్ లో పెట్టిశనిగ పిండి లేదన్నావ్?

అందుకే బ్రెడ్ తో చేసాను

బ్రెడ్ కొద్దిగానే ఉంది కదా

అవును అది కొంచెమే ఉందని దానికి కొంచెం అన్నము కూడా కలిపేసి చేశాను అంది  

అసలే ఈ బ్రెడ్ అంటే పేసెంట్స్ తినే ఫుడ్ అని నా ఫీలింగ్, దానికి తోడు ఏవేవో కలిపి కలగాపులగం చేసేసావ్.

క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో, టమేటా, ఆనియన్ వేశానంతే. తిను, బానే ఉంటుంది

ఏమో అనుకున్నా కానీ పకోడ టేస్ట్ చాలా బాగుంది. అయినా వంట చేసేవాళ్లకు తెలుసు వంట ఎలా వండాలో.  క్రిష్ కూడా మంచి వంటగాడే కాబట్టి ఎన్ని కేరక్టర్స్ పెట్టినా సినిమా బానే తీస్తాడు లే అనుకున్నా.

8 కామెంట్‌లు:

 1. // “శనిగ పిండి హెల్త్ కి మంచిది కాదు” //
  ————————
  🤔🤔🙁🙁
  అదేమిటి పవన కుమారా? ప్రొటీన్లు సమృద్ధిగా గల శనగపిండి హానికరం అని ఎప్పుడూ వినలేదే నా పరిమిత జ్ఞానంలో 🤔🤔 (అతి దేనికైనా మంచిది కాదు లెండి. అంతే గానీ సంప్రదాయ దినుసుల వాడకం పూర్తిగా మానేస్తారా ?).

  శనగపిండి లాభాల గురించి ఈ క్రింది లింక్ ఒకసారి చూడరాదూ వీలున్నప్పుడు?

  https://www.practo.com/healthfeed/how-healthy-is-besan-gram-flour-3514/post

  (పకోడీలో స్వీట్ కార్న్ / బేబీ కార్న్ మరచిపోయినట్లున్నారు 😀😀. అసలు టీవీ వంటల ప్రోగ్రాముల చూడద్దని అంటుంటాను నేను 🙂. సర్లెండి నాకెందుకు. మా కంచాలలోకి తొంగిచూసే అధికారం నీకెవరు ఇచ్చారు అంటూ ఇప్పుడు ఎవరైనా నా మీద దాడి మొదలెట్టకముందే ఇక్కడితో ఆపేస్తాను 🙂)
  —————
  మీ స్నేహితుడికి వచ్చిన సినిమా ఛాన్స్ గురించి వింటే ఎప్పుడో చదివిన జోకొకటి గుర్తొచ్చింది. తనకి సినిమా ఛాన్స్ దొరికిందని ఉత్సాహంగా చెబుతున్నతన్ని “ఏం వేషం?” అని అడుగుతాడు అతని స్నేహితుడు. మొహానికి మాస్క్ తగిలించుకుని వేసే వినాయకుడి వేషం. చాలా సీన్లల్లో కనిపిస్తాను తెలుసా ... అంటాడు ఆ ఔత్సాహిక నటుడు 😀😀. మీ స్నేహితుడికి వచ్చిన అవకాశం దీనికన్నా నయమే లెండి 😀.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తప్పు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు :) సరి చేశాను నరసింహా రావు గారు. మీ జోక్ బాగుంది :)

   తొలగించండి
 2. శనగపిండి మంచిది కాదు అని ఏ "కుక్కబుద్ధి" ఉన్నవాడు చెప్పాడో కానీ మావారు కర కరలాడే పకోడీ, బజ్జీలూ తినడం మానేసారు. బంగారం లాంటి భర్తని పోగొట్టుకున్నందుకు సుమలతని ఓదార్చడం మానేసి పకోడీలు వండుకుని తింటున్నారా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా లాంటి మిడి మిడి జ్ఞానం ఉన్నవాడే భోధించి ఉంటాడు నీహారిక గారు. వాడిని క్షమించేయండి. ఇక ఓదార్చడం అంటారా మన పెద్ద హీరొస్ అందరూ ఓదార్చారుగా, అందుకే మేము తల దూర్చలేదు :)

   తొలగించండి
  2. శ్రీదేవి, సుమలత ఇద్దరూ మనసు చూసి పెళ్ళిచేసుకున్నవాళ్ళండీ ! వారి వారి భాగస్వాములకు తీరని లోటు. అంబరీష్ లాంటి మంచిమనిషికి ఆత్మ శాంతి కలిగితీరుతుంది.

   తొలగించండి
 3. మైదా కూడా వాడకూడదంటున్నారు. మైదా లేకుండా మైసూర్ బజ్జీలు,రవ్వదోశ ఎలా చేయడం ? పిజ్జాలూ బర్గర్లు మాత్రం తినొచ్చా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చాలా మంచి ప్రశ్న అడిగారు నీహారిక గారు. ఇక సమాధానం ఏమిటంటే మంచి న్యూట్రీషనిస్ట్ ని సంప్రదించడమే. :)

   తొలగించండి
  2. మైదా బదులు గోధుమపిండి వాడవచ్చని కొంతమంది పాకశాస్త్ర నిపుణుల ఉవాచ నీహారిక గారూ. ఈ క్రింది లింక్ చూడండి.

   https://www.sanjeevkapoor.com/Articles/Can-wheat-flour-be-substituted-for-refined-flour.html

   తొలగించండి