2, డిసెంబర్ 2018, ఆదివారం

ఆ వార్త చదివి సంబ్రమాశ్చర్యాలకు లోనైన జనం

ఒకప్పుడు ఈగలు,దోమలు, చీమలు దూరడానికి కూడా ఖాళీ లేకుండా ఉండే డైరెక్టర్ వి.వి వినాయక్ ఆఫీస్ ఇప్పుడు ఎనుములు, ఏనుగులు కూడా తిరిగేటంత ఖాళీగా ఉంది.

ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించడంతో ఫోన్ ఎత్తి  "అన్నయ్యా! మీకు 'ఠాగూర్', చరణ్ కి 'నాయక్' లాగా మీ అల్లుడుకీ మంచి హిట్ సినిమా ఇచ్చే పూచీ నాది. మీరంత బ్రతిమాలాడాల్సిన అవసరం లేదు' అని పోన్ కింద పెట్టి

రండి రండి, ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా మంచి సబ్జక్ట్స్ ఉన్నాయ్ తీద్దాం అనేంతలో వాళ్లిద్దరూ వేగంగా వినాయక్ వైపు దూసుకువచ్చారు.

కళ్ళు తెరచి చూస్తే ఏదో పాడుబడ్డ బిల్డింగ్ లో ఉన్నట్లు అర్థమైంది వినాయక్ కు. ఎదురుగా ఒక బియ్యము బస్తా కదులుతున్నట్లు కూడా అనిపించింది.


బాగా కళ్ళు తెరచి చూస్తే అది  బియ్యం బస్తా కాదని ఆల్మోస్ట్ అదే షేప్ లో ఉన్న వ్యక్తి అని అర్థం అయింది. 

కాస్త మత్తు వదలగానే అతన్ని గుర్తుపట్టి  'బాబూ! నన్నెందుకు మీ మనుషులు ఎత్తుకొచ్చారు' అన్నాడు అతని పక్కన నిల్చొన్న ఇద్దరినీ చూసి.

నేను ప్రసూతి అవ్వాలనుకుంటున్నాను. ఏదో ఒకటి చేసి నన్ను వెంటనే ప్రసూతి చెయ్యి. 

ప్రసూతి చెయ్యడమా? అన్నాడు  సంబ్రమాశ్చర్యాలకు లోనైన వినాయక్

నువ్వు తెలుగులో వీక్ అనుకుంటా, ప్రసూతి అంటే పాపులర్

అది ప్రసూతి కాదు బాబూ ప్రఖ్యాతి , నువ్వు మీ మామయ్య కంటే ఘనుడివి తెలుగు మాట్లాడటంలో. అయినా మీరు ఆ పనికి నా సలహా తీసుకోవడమేమిటి ?

నేనూ మా నాన్న గారిని ఫాలో అవుదామనుకున్నాను. ఆయన అంతే.  రాజమౌళి, బోయపాటి లాంటి దర్శకులను సలహాలు అడుగుతుంటారు.

సలహా అంటే ఇప్పటికిప్పుడు కష్టం మరి

'చెన్న కేశవ నాయుడు' అనే టైటిల్ పెట్టి మా మామయ్య తో సినిమా తీసే అవకాశం ఇప్పిస్తా.

సరే, ఈ పని చేయండి, మీరు బాగా పాపులర్ అవుతారు అని ఒక సలహా ఇచ్చాడు.

బాబూ! ఇదేదో చిరంజీవి సినిమా లో స్టోరీ లాగా అనిపిస్తోంది అన్నారు పక్కనున్న ఇద్దరూ ఒకేసారి.

అయితే ఖచ్చితంగా మన ప్లాన్ హిట్, ఫాలో అయిపోతాను అని ఎవరికో ఫోన్ చేసాడు.

అప్పటికప్పుడే  కెనడా లో ఫేమస్ అయిన టాప్ 3 సర్వే సంస్థల అధిపతులు కిడ్నాప్ అయ్యారు. అందులో apolitical సంస్థ CEO కూడా ఒకరు. 

మరుసటి రోజు ఉదయం - ఢిల్లీ :

"అబ్బాయిగారు పేపర్ చూసినప్పటి నుంచి సెరిలాక్  తినటం లేదు, కనీసం పాలు కూడా తాగడం లేదు మేడం, అలిగినట్లున్నారు"  అని పని మనిషి ఆ ఇంటి పెద్దావిడకి రిపోర్ట్ చేసింది.

తన బిడ్డ ఎందుకు అలిగాడో కనుక్కోవడానికి అబ్బాయిగారి రూమ్ కి వెళ్ళింది ఆ మేడం. 

ఇదే కారణం అని అతను వాళ్ళమ్మకు పేపర్ అందించాడు. 

వెంటనే ఆవిడ ఆ పేపర్ మీదున్న న్యూస్ చదివి, పగలబడి నవ్వి ఆంధ్రా కి ఫోన్ చేసింది విషయం కనుక్కోవడానికి.


అదే రోజు రాత్రి:

apolitical సంస్థ CEO మళ్ళీ కిడ్నాప్ చేయబడ్డారు.

మరుసటి రోజు ఉదయం - ఢిల్లీ:

పనిమనిషి అబ్బాయి గారి రూమ్ శుభ్రం చేయడానికి లోపలికి ఎంటర్ అయింది.

నిన్నటి పేపర్ కిందపడి  ఉండటం చూసింది . అబ్బాయి గారు ఆ పేపర్ చూసి ఎందుకు అలిగారా అని కారణం తెలుసుకోవడానికి ఆతృతగా ఓపెన్ చేసి చూస్తే

"apolitical సంస్థ  విడుదల చేసిన జాబితా ప్రకారం 20 మంది ప్రతిభావంతమైన యువ నేతల్లో లోకేష్ ఒకరు" అనే వార్త  ఆమె కళ్ళను ఆకర్షించింది.పేపర్ ని అక్కడి నుంచి తీసేయబోతుంటే, ఆవిడ కళ్ళు రోజు పేపర్ మీద పడ్డాయిఅందులోని వార్త చదివి ఆవిడ మూర్ఛపోయింది

apolitical సంస్థ  విడుదల చేసిన డీటైల్డ్ జాబితా ప్రకారం   "ప్రపంచంలోని ప్రతిభావంతమైన యువ నేతల్లో రాహుల్ గాంధీ టాప్ 1" అనేదే తాజా వార్త

10 కామెంట్‌లు:

 1. మీరు టైటిల్ ఈరకంగా మార్చండి. "ఈవార్త చదివి జనాలు షాక్ తగిలి క్రిందపడి టపటపా కొట్టుకున్నారు". నిజంగానే చాలా ఫన్నీ న్యూస్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీరన్న టైటిల్ దీనికి యాప్ట్ అన్యగామి గారు. కాకపోతే మన బాలయ్య బాబు, హరికృష్ణ గారు మరణించినప్పుడు 'మరణ వార్త విని సంబ్రమాశ్చర్యాలకు లోనైన జనం' అనే మాట వాడారు, అందుకనే నేను క్యాచీ గా ఉంటుందని వాడాను.

   Thanks for your comment Anyagaami gaaru.

   తొలగించు
  2. Just for your reading fun if you have not already seen it.

   https://bhaanodhayam.blogspot.com/2018/12/blog-post.html

   తొలగించు
 2. భాష కోసం భలే మోడల్ ని ఎంచుకున్నారు గదా పవన కుమారా 😀

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ కామెంట్స్ కి ధన్యవాదాలు నరసింహా రావు గారు. వ్యంగ్యం కురిపించాలంటే బాలయ్య గారి భాషే కరక్ట్.

   తొలగించు
 3. నవ్విపోదురు గాక మాకేంటి సిగ్గు /
  నవ్వండి నవ్వండి ఎవడికెహె సిగ్గు
  మా తెలివితేటల మురిసి మా వేపు మొగ్గు
  జనముండ మేమేగ ఎన్నికల దర్జాగ నెగ్గు
  ఎన్నికల పిదపవ్వు మీ మొహము బొగ్గు

  మా తెలివితేటలకు మహ మురిసి మొగ్గీ
  వోటేయు జనముండ ఎన్నికల దర్జాగ నెగ్గీ
  ఊరేగుతామండి ముసిముసిగ మేమెక్కి బగ్గీ
  ఆపైన మీ మోము మసిబారి బొగ్గేయు సిగ్గన్నదొగ్గి
  అహహా ...

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాగుంది మీ కవిత వారి సిగ్గులేని తనాన్ని ఎండగడుతూ రావు గారు.

   తొలగించు
  2. ఏమోనండీ పవన్ కుమార్ గారు,
   సంభ్రమాశ్చార్యాల దెబ్బకు గురైన నేను
   తిట్టానో పొగిడానో కూడా అర్ధమై చావడల్లా ... !

   తొలగించు
  3. పోగుడుతూనే తిట్టారేమో అనుకుంటాను రావు గారు.

   తొలగించు