17, డిసెంబర్ 2018, సోమవారం

జీవితం అంటే ఇంతే

ఓ నాలుగైదు నెలల క్రితం అనుకుంటాను, చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోతోంది. కొత్త ప్రాజెక్ట్ కోసం చకోర పక్షి లా ఎదురు చూస్తున్న సమయంలో 

మా సుబ్బారావు* నన్ను పిలిచి

నాలుగు రెస్యూమ్స్ పంపిస్తా 

నలుగురు టీం మెంబెర్స్ ని ఫార్మ్ చేసుకో 

నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది

అన్నాడు. 


(ఆహా ఏమి నా భాగ్యము! నాలుగు రెస్యూమ్స్ లోంచి నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలట. ధర్మ ప్రభువులు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాల. అయినా నాకర్థం కాదు కానీ ఈ సుబ్బారావులు అందరూ ఇలాగే ఉంటారా?

సుబ్బారావులు! మీరు భుజాలు తడుముకోకండి )

అది కాదు సుబ్బారావ్! ఆ నలుగురు ఇండియా నుంచి, నేను ఇక్కడి నుంచి పనిచేయడం వల్ల కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళను ఇక్కడికి పిలిపిస్తే బాగుంటుందేమో.  

ఐడియా బాగుంది కానీ చిన్న చేంజ్, నువ్వే ఇండియా వెళ్ళు అప్పుడు వాళ్ళతో కలిసి పని చేసుకోవచ్చు. కోఆర్డినేషన్ సరిగ్గా ఉంటుంది అన్నాడు. 

అబ్బే! కోఆర్డినేషన్ కష్టమేమీ కాదు, నేను మానేజ్ చేసుకుంటాను అని ప్రాజెక్ట్ దొరికింది అన్న ఆనందంలో విధి నా వైపు వక్ర చూపు చూస్తోందని తెలీక ఆనంద తాండవం చేశాను. (విధి అంటే నిధి లాగా ఓ అమ్మాయి అనుకుంటున్నారా ఏమిటి ? కాదు విధే)

మరుసటి రోజు వేడి వేడి కాఫీ తాగుతూ 'యడ్డ్యూరప్ప ఒక్కరోజులోనే సి.ఎం సీట్ నుంచి దిగిపోయాడట పాపం' అనే సబ్జెక్టు మీద కొలిగ్స్ తో వేడి వేడి  చర్చల్లో ఉన్నప్పుడు, సుబ్బారావు వచ్చి బడ్జెట్ లేక ప్రాజెక్ట్ కాన్సుల్ అయింది. కాబట్టి 

ఓ  నాలుగు వారాల  టైం తీసుకో

తట్ట బుట్ట ,పెట్టె బేడ సర్దుకో

బెడ్డు, ఫ్రిడ్జ్ లాంటివి Gumtree* లో సేల్ కు పెట్టుకో

నీ రెస్యూమ్ H.R కు పంపుకో

ప్రాజెక్ట్ ఏది దొరక్క పొతే ఇండియా వెళ్ళిపో

అన్నాడు

జీవితమంటే ఇంతే ..

రెస్యూమ్స్ ఫిల్టర్ చేసే స్థాయి నుంచి రెస్యూమ్స్ పంపించే  స్థాయికి పడేస్తుంది

జాబ్ ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్ నుంచి జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చే రేంజ్ కి తోసేస్తుంది

సింపుల్ గా చెప్పాలంటే ఎత్తి కుదేస్తుంది , ఉతికి ఆరేస్తుంది, ఐరన్ చేసి మడత పెట్టేస్తుంది, మళ్ళీ చించి అతికిస్తుంది , అతికించి చించేస్తుంది. 

పర్మనెంట్ రెసిడన్సీ కోసం  ట్రై చేయకుండా ఆరున్నర్ర సంవత్సరాల నుంచి వీసా మీదే ఉన్నావా ?  నీకు ఇలా జరగాల్సిందే అని మనసు హెచ్చరించింది. 

టెంపోరరీ వర్క్ వీసా మీద ఉండటం వల్ల నేను పని చేస్తున్న కంపనీకే బుద్దిగా బద్దుడనై ఉండాలి. బయట జాబ్స్ వెతుక్కోవడం చాలా కష్టం. కాలమతి గా ఉండటం వల్ల ఎదురయిన సమస్య ఇది కాబట్టి, కాలమతిలా ఇప్పటికిప్పుడు ప్రమాదకర స్థితి నుంచి బయటపడాలి అని నేను పని చేస్తున్న కంపెనీ లో తెలిసిన వారందరికీ రెస్యూమ్ పంపించాను.

ఒకరోజు ఇంటర్వ్యూ కి రమ్మని ఒక క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు వెల్మురుగన్ అంటే అరవోడు*, అరచి గీ పెట్టినా మనల్ని తీసుకోడు, ఆశలకు సమాధి కట్టేసుకోవచ్చు అని తెలిసీ వెళ్ళాను. 

ఏ లాంగ్వేజ్ వచ్చు నీకు?

జావా , సి++,  Tibco, webmethod , HTML , XML , PLSQL ,డాట్ నెట్, ఇంటర్ నెట్ , ఫిష్ నెట్, మస్కిటో  నెట్ ఇలా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని  లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది. 

హౌ అబౌట్ తమిళ్ లాంగ్వేజ్ ?

ఐ డోంట్ నో 

"దెన్ వుయ్ డోంట్ నీడ్ యు" అని డిసైడ్ అయిపోయి 'వుయ్ విల్ లెట్ యు నో ' అన్నాడు. 

సకల టెక్నికల్  లాంగ్వేజెస్ నేర్చుకున్నా, తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోవడం వలన  జరిగే నష్టం గురించి అప్పుడే తెలుసుకున్నా. 

ఇంకో క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు వెంకట రావు, అరే మన తెలుగోడే* 

ఏ లాంగ్వేజ్ వచ్చు నీకు ?

జావా , సి++, డాట్ నెట్, Tibco, webmethod , HTML , XML , PLSQL ,హైబర్నేట్, స్ప్రింగ్ , సమ్మర్ , వింటర్ ఇలా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని  లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది.  అంతే కాదు తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చు. 

#@$@#$, ^^!*&^& వచ్చా ?

అదొక్కటే రాదు. బట్ ఛాన్స్ ఇస్తే నేర్చుకుంటా 

సారీ, వుయ్ డోంట్ నీడ్ యు. 

తెలుగు పీతల కథ అప్పుడెప్పుడో విన్నాను కానీ, అది నిజం అయి ఉండచ్చు అని అనుకున్నదిఆ రోజే.  చచ్చినా అరవోళ్లలో ఉండే ఐక్యమత్యం  మన తెలుగు వాళ్ళలో ఉండదు అని నిర్దారించుకున్నా.

అలా ఏ ప్రాజెక్ట్ లో చోటు దొరకక  ఇబ్బంది పడుతూ,  ఒక రోజు ఉదయం ఆఫీస్ లో అడుగు పెట్టగానే నిధి నన్ను చూసి నవ్వింది. (ఇక్కడ నిధి అంటే అమ్మాయే, H.R డిపార్ట్మెంట్ )


తర్వాత నా దగ్గరకొచ్చి "వెళ్ళి సుబ్బారావ్ ని కలువు, కాన్సల్ అనుకున్న ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవబోతోంది" అంది. 

ఇంతలో ఫోన్ 

GumTree లో ఫ్రిడ్జ్ 100$ లకు సేల్ పెట్టారు, ఫ్రీ గా ఏమైనా ఇస్తారా? అని అవతల నించి వాయిస్ 

నువ్వు తెలుగు వాడివా? అన్నాను 

అవును 

అయితే చచ్చినా ఇవ్వను అని ఫోన్ పెట్టేసాను. తర్వాత వెల్మురుగన్ నుంచి కాల్ వచ్చింది. 

హే బ్రో! దిస్ ఈజ్ వేల్, వెల్మురుగన్ 

ఎస్ వెల్మురుగన్ 

GumTree లో ఫ్రిడ్జ్ 100$ లకు సేల్ దా పెట్టి పూడ్చితివి కదా, 10$ లకు ఏమైనా ఇస్తివా?

లేదు, ఇవ్వను ఇవ్వలేను, నిన్ననే ఒక కాకి వచ్చి ఎత్తుకెళ్లింది. పెట్టెయ్ ఫోన్ అన్నాను. పదము 
అర్థం 
సుబ్బారావు 
 మేనేజర్ కు ఏదో పేరు ఉండాలి కాబట్టి అది పెట్టుకున్నాను
సుబ్బారావు అనే పేరు గల వ్యక్తుల మనోభావాలను కించపరిచి ఉంటె సారీ
GumTree 
ఆస్ట్రేలియన్ వెర్షన్ అఫ్ quicker. పాత వస్తువులు అమ్మే/కొనగలిగే ఆన్లైన్ మార్కెట్ 
కాలమతి
 మూడు చేపల కథ లో ఒక చేప పేరు.  
అరవోడు
అరవము అరవము అని అంటూనే అరుస్తూ ఉండేవాడు
పక్కన ప్రధాని కూర్చుని ఉన్నా దూరంగా ఒక తమిళ్ వాడు ఉన్నాడంటే వాడితోనే మాటలు కలిపేవాడు.  
తెలుగోడు 
తెలుగోడితో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడు.
యూనిటీ విషయం లో అందరికన్నా ఒక మెట్టు కింద ఉండేవాడు.


మూడు నెలలుగా application architecture, design అంటూ డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తున్నఎఫెక్ట్ పై టేబుల్. 23 కామెంట్‌లు:

 1. Ha ha ha. Life is like that అని తెల్లోడు ఊరికే అనలేదు 😀. “జీవితమంటే అంతులేని ఒక పోరాటం” అని మన సినిమా పండితులు కూడా సెలవిచ్చారు కదా. సుబ్బారావులు, వేల్మురుగన్లు తగులుతూనే ఉంటారు మరి.

  అయినా, ఇన్నాళ్ళుగా PR కోసం అప్లై చెయ్యకపోవడమేమిటి పవన కుమారా? ఆలస్యం చేసే కొద్దీ వయసు parameter కు వచ్చే పాయింట్లు తగ్గుతాయి కదా. ఇకనైనా త్వరపడండి 👍. విదేశాలకు బయల్దేరే ముందు చాలామంది .. ఆ, నేను అక్కడేమీ సెటిలై పోను, ఓ పదేళ్ళుండి తిరిగొచ్చేస్తాను .. అని ఇంట్లోవాళ్ళకి చెప్పి విమానం ఎక్కుతారు లెండి. అలాగ మీకు కూడా స్వదేశానికి తిరిగి వచ్చేసే ఆలోచన గానీ ఏమన్నా ఉందా?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ ద కామెంట్స్ నరసింహా రావు గారు. మొదట్లో ఇండియా కు తిరిగి వెళ్దామనే అనుకున్నాను కానీ తర్వాత పిల్లలు కాస్త పెద్ద అయ్యాక ఆ విషయం మళ్లీ ఆలోచించవలసి వస్తోంది.

   అవునండి age 40 దాటితే points తగ్గుతాయి కాబట్టి త్వరపడాలి.

   తొలగించు
 2. మీ టేబులు బావుంది. తెలుగోడి నిర్వచనం ఇంకా బావుంది. ఇన్ని భాషలొచ్చి మీరు అవస్థ పడుతున్నారంటే నమ్మశక్యంగా లేదు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అన్యగామి గారు. టైమ్ బాగోనప్పుడు ఇబ్బందులు తప్పవండి.

   తొలగించు
 3. 'అరవోడు' 'తెలుగోడు'
  క్యారక్టర్ ఆర్టిస్ట్ లు మనకు తెలిసిన ఆర్టిస్ట్ లే
  అయినప్పటికీ క్యారక్టర్ ని ఇంచక్కగా
  నిర్వచించడం ... వహ్వా ...
  వీరతాళ్ళు ... తప్పట్లు ...
  (అన్నట్లు తప్పట్లకి pc lo ఈమోజీ
  ఎలా పెట్టాలో somebody plz tell)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పీసీ లో ఎమోజీలు ఎలా పెట్టాలి ?

   ఇదివరకు నాకు బ్లాగర్లు నేర్పే ప్రయత్నాలు చేసారు కానీ నాకు రాలేదు.(అపుడు నా సెల్ లో ఎమోజీలు లేవు) సింపుల్ గా 🦁 గారి ఎమోజీలను కాపీ పేస్ట్ చేసేసా(ఆయనెక్కువగా ఎమోజీలు వాడుతుంటారు) కాబట్టి మీకు కనిపించిన ఎమోజీలను కాపీ చేసి పేస్ట్ చేసెయ్యండి.

   తొలగించు
  2. ఆరోజుల్లో నీహారిక గారు emoji లు బాగానే పెడుతున్నారు, కిటుకు పట్టుబడిందేమోలే అనుకున్నాను. నేను పెట్టిన emoji లను కాపీ చేసుకునేవారా? గోరం, గోరం 😡. రావట్లేదని అడిగితే మళ్ళా క్లాస్ చెప్పేవాళ్ళం కదా ... ఈసారి గురుదక్షిణ తీసుకుని 🙂. సర్లెండి, emoji లు పెట్టడంలో ఇప్పుడు మీకే చెయ్యి తిరిగినట్లుంది good.

   తొలగించు
  3. గోరం గోరం కాదు "ఘోరం ఘోరం"🙂

   తొలగించు
 4. Oh, I am sorry పవన్ కుమార్. మీరీ టపా ఏదో సరదాగా వ్రాసారనుకున్నాను. నిజంగానే ఉద్యోగ సంబంధిత చికాకుల్లో ఉన్నారని అనుకోలేదు. “అన్యగామి” గారు సూక్ష్మగ్రాహి, ఇట్టే గ్రహించేశారు.

  మీ ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయని ఆశిస్తాను, All the best 👍. బోలెడంత అనుభవం కలవారు కాబట్టి సమస్య ఉండకూడదు (HR నిధి నవ్విందన్నారు కదా, అంటే ఈపాటికే అంతా సవ్యమైపోయుంటుంది 🙂). ఎనీవే శుభకామనలు.

  (ఏమనుకోకండి, సరదాగా చెబుతున్నాను గానీ ... చాలా భాషలు తెలుసు, ఆ భాష ఒకటే తెలియదు అంటే 1970వ దశాబ్దపు ఒక పాత సినిమాలోని .... సినిమా పేరు మర్చిపోయాను .... అలనాటి హాస్యనటుడు రాజబాబు సీన్ ఒకటి గుర్తొస్తోంది. అతన్ని పోలీస్ ప్రశ్నిస్తూ తెలుగు తెలుసుగా అంటే ఆ, తెలుగు వాడినే అంటాడు రాజబాబు; డు యూ నో ఇంగ్లీష్? ఎస్; హిందీ మాలూమ్? మాలూమ్; తమిళ్ తెరియుమా? తెరియుం; కన్నడ గొత్తా? అదొకటే కొత్త అంటాడు రాజబాబు 😀)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఇంకో ఆరు నెలల వరకు మళ్లీ ఇబ్బంది లేదండీ.

   ప్రస్తుతానికిఇంకో ఆరు నెలల వరకు మళ్లీ ఇబ్బంది లేదండీ.

   రాజబాబు గారి డైలాగ్ బాగుందండి నరసింహా రావు గారు

   తొలగించు
  2. సంతోషం. All is well that ends well 🙂.
   ఈ ఆర్నెల్ల లోపే అశ్రద్ధ చేయక PR అప్లికేషన్ పని కూడా పూర్తి చేసెయ్యండి సాధ్యమైనంత త్వరలో ☝️. గుడ్ లక్ 👍

   తొలగించు
  3. థాంక్స్ మేస్టారు. ఆ పని మొదలెట్టాను. మీ దీవెన ఫలిస్తే సంతోషం.

   తొలగించు
 5. @nmrao bandi
  ఈ బ్లాగ్ స్వంతదారుడే ఒక కంప్యూటర్ నిపుణుడు, మీరడిగిన దానికి మీకు సలహా ఇవ్వగలిగిన వ్యక్తిన్నూ. ఈలోగా PC లో emoji లు పెట్టడానికి ఈ క్రింది వ్యాసం ఉపయోగపడుతుందేమో చూడండి 👇.

  Emojis on pc

  రిప్లయితొలగించు
 6. నటుడు విశాల్ ని అరెష్టు చేసారు అని మీరు విని ఉంటారు. ఒక తెలుగువాడు నిర్మాతల మండలికి పోటీ చేయడానికి అనర్హుడని రాధిక ఆరోపించినపుడు తెలుగోడు ఒక్కడూ మాట్లాడలేదు గానీ విశాల్ గెలిచాడు.
  తమిళ సీరియల్స్ తెలుగులో ఎంతో పాపులర్ అయ్యాయి. రాధిక తమిళ అమ్మాయి అని మనం సినిమాలు చూడడం మానేసామా ? మీరిచ్చిన తెలుగోడి నిర్వచనం మాత్రం నిజమని మరోసారి నిరూపితం అయింది.తెలుగోడికి తమిళులు చుక్కలు చూపిస్తున్నారు.


  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అవును నీహారిక గారు. మీరన్నది అక్షరాలా నిజం.

   నా అనుభవాల నుంచి నేను అబ్సర్వ్ చేసిందే రాశాను.

   తొలగించు
 7. mee writing talent bavundi...meeku job poyina india ki vachi short films ki stories raasukovachu..

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నా శైలి (అని రాసుకోవచ్చా) మీకు నచ్చి నందుకు ధన్యవాదాలు మేస్టారు .మీరు భలే ఊహించారు. కొన్ని షార్ట్ స్టోరీస్ కూడా రాసి పెట్టుకున్నాను. ఎప్పటికైనా తీయాలని. (దాంతో పాటు ఒక సినిమా స్టోరీ కూడా). మీరు నవ్వకండి, ఏదో తపన అంతే. తీయగలనో లేదో తర్వాత విషయం.

   మీరు కూడా బ్లాగ్ maintain చేసినట్లున్నారు. నాకు కామెడీ అంటే పిచ్చ istam. చదివి తీరుతా మీ బ్లాగ్ కూడా.

   తొలగించు
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు