24, డిసెంబర్ 2018, సోమవారం

గాజు గ్లాస్ పగిలిపోద్దా లేక మెరిసిపోద్దా?

ఇంతకీ ఈ సారి మనం గెలుస్తామా?  సాయంత్రం టీ తాగుతూ మిత్రుడిని అడిగా. 

ఖచ్చితంగా, మేమంతా అండగా ఉండి గెలిపిస్తాం అన్నాడు. 

అయితే  సిడ్నీ లో జరిగే టెస్ట్ మ్యాచ్ కు వెళ్తున్నావన్న మాట. 

నేను గెలుస్తాం అన్నది మా జనసేన పార్టీ గురించి, నీ బోడి క్రికెట్ ఎవడికి కావాలి. 

అంత ధీమానా మీ పార్టీ గెలుస్తుందని? ఒకవేళ గెలవకపోతే?

గెలవకపోతే సాయం చేస్తాం, అదే గెలిస్తే న్యాయం చేస్తాం. ఇదే మా సిద్ధాంతం అన్నాడు టీ తాగుతున్న గ్లాస్ పైకెత్తి. అదేంటి నీ కప్పు ఏమై పోయింది, గాజు గ్లాస్ లో టీ తాగుతున్నావ్ అని అడిగా.

ఇది మా పార్టీ సింబల్ అన్నాడు.

నిన్నటి వరకు స్టేటస్ సింబల్ అని అదేదో పోష్ గా ఉండే టీ కప్పు లో తాగే వాడివి.

ఇవాల్నుంచి టీ అయినా, నీళ్లయినా, మందయినా ఈ గాజు గ్లాస్ లోనే . అంతే కాదు నీక్కూడా ఒక గాజు గ్లాస్ కొన్నాను, రేపటి నుంచి నువ్వూ దాంట్లోనే తాగు.

దాంతో పాటు ప్లేట్ కూడా కొనాల్సింది దాంట్లోనే తినేవాడిని, ఎనీ హౌ, గ్లాస్ కొనిచ్చినందుకు థాంక్స్

ఒట్టి థాంక్స్ సరిపోదు, నువ్వు కూడా నాలుగు గ్లాసులు కొని నలుగురికి ఇవ్వు, ఆ నలుగురిని ఇంకో నలుగురికి ఇవ్వమని చెప్పు 

ఏంటి, స్టాలిన్ సినిమానా?

ఏమైనా అనుకో, దెబ్బకు జనాలకు మా పార్టీ సింబల్ గుర్తుండిపోవాలి.   అంతే కాదు ఆంధ్రా లో ప్రతీ టీ కొట్టు వాళ్లకు మా పార్టీ సింబల్ ఉండే గాజు గ్లాసులు ఫ్రీ గా ఇస్తున్నాం.

ఎవరి జేబుల డబ్బుల్లోంచి

మా జేబుల్లోంచే, మా దేవుడి కోసం ఆ మాత్రం చేయలేమా?

అభిమానులు మీరు ఏమైనా చేస్తారు, కానీ నిలకడ లేని మీ దేవుడి మీదే అనుమానం, ఆయన మాటలు నీటి మూటల్లా, ఆవేశం ఐసు ముక్కల్లా అనిపిస్తున్నాయి.

ఆయన మాటలు నీటి మూటలు కాదు, బులెట్ లోంచి దూసుకు వచ్చిన తూటాలు. ఆయన ఆవేశం ఐసు ముక్క కాదు చల్లారిపోవడానికి అదో మండుతున్న నిప్పు కణిక. 

అంటే ఆయన గెలిస్తే జనాల సమస్యలన్నీ తీర్చేస్తాడంటావ్?

ఆయన గొడుగు లాంటోడు, నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం రక్షణ కలిగిస్తాడు అంతే కానీ సమస్యలన్నీ తీర్చేస్తాడానను. 

ఏమో మరి. మొదలు పెట్టిన సినిమా నే సరిగ్గా పూర్తి చేయడు. చివర్లో ఏదో హడావిడిగా షూటింగ్ కానిచ్చేస్తాడు అల్లాంటి వాడు మరి ఈ పార్టీ ని నిలుపుకుంటాడా,ఎన్నికల్లో నిలుస్తాడా, అభిమానులను గర్వOగా తలెత్తుకునేలా చేస్తాడా అన్నదే ప్రశ్న. 

ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించిబరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ థృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.


ఆటంకాలకు భయపడి ఏ పనిని మొదలుపెట్టలేరు నీచులు.
పనిని మొదలెట్టి, విఘ్నాలు కలిగితే వదలిపెట్టేవారు మధ్యములు.

ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో ఎదుర్కొని మొదలుపెట్టినకార్యాన్ని వదలకుండా పూర్తి చేస్తారు ధీరులు. 

మరి పవన్ కళ్యాణ్ గారు యే కేటగిరీ లో చేరుతారో ఆయనే నిర్ణయించుకోవాలి. (గారు అనకపోతే అల్లు అర్జున్ గారికి మా చెడ్డ కోపం వచ్చేస్తుంది మరి ). 

తర్వాత మా వాడు ఈ కింది మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశాడు నాకు. అందులోని ఎనాలిసిస్ యెంత వరకు నిజమో గానీ, ఆ రాసిన వారికి hats off.  

జూదంలో భార్యని ఒడిన ధర్మరాజు గోప్పోడు
కానీ జనం కోసం కుటుంబాన్ని వదిలిన వాడు మాత్రం చెడ్డోడు...

తండ్రి కోసం అడవులకెళ్ళిన రాముడు గోప్పోడు..
ధర్మం కోసం కష్టాలు కోనితెచ్చుకున్నోడు చెడ్డోడు..

అహింస కోసం రాజ్యం వదిలిన బుద్దుడు మంచోడు
జనం కోసం తన వృత్తిని వదిలేసిన వాడు చెడ్డోడు..

సత్యం కోసం భార్య,బిడ్డలను అమ్మిన హరిశ్ఛంద్రుడు గోప్పోడు..
అదే సత్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వాడు మాత్రం చెడ్డోడు..

ఆనాడు రాముడికి ధర్మం తోడురాకపోవచ్చు

ధర్మరాజుకి ధర్మం గుర్తు రాకపోవచ్చు 

హరిశ్ఛంద్రుడికి సత్యం సహయపడకపోవచ్చు

బుద్ధుడికి అహింస అండ లేకపోవచ్చు..

కానీ మా దేవుడికి మాత్రం మేమున్నాం...

కష్టం ఆయన కాంపౌండ్ దరిచేరకుండా కాపలా కాస్తాం....

ధర్మమైనా  ■ అధర్మమైనా
నీతైనా.     ■ న్యాయమైనా...
హింసైనా.  ■అహింసైనా...

చావైనా , బ్రతుకైనా ఆయనకి అండగా మేముంటాం.
మా జీవితాంతం ఆయనకి ఋణపడి ఉంటాం....

ఎందుకంటే.....

మదమెక్కిన వాడు టీడీపీ తో నడుస్తాడు......

మత్తులో ఉన్నవాడు వైస్సార్ కాంగ్రెస్ తో నడుస్తాడు...

మార్పు కోరుకున్న వాడు జనసేన తో నడుస్తాడు....

#మదం #కొద్దిరోజులు #ఉంటుంది..

#మత్తు #ఇంకొద్ది #రోజులు #ఉంటుంది...

#కానీ #ఆయన #మీద #అభిమానం #చచ్చే #.వరకు #ఉంటుంది.

అందుకే మేము ఆయన తో జీవితాంతం ఉంటాం.....

12 కామెంట్‌లు:

 1. గాజుగ్లాసు సంగతేమో కానీ మీ బ్లాగ్ మాత్రం ఇంటరెస్టింగ్ పోస్టులతో మెరిసిపోతూ వుంటుంది, పవన్‌గారు!

  రిప్లయితొలగించు
 2. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు లలిత గారు.

  రిప్లయితొలగించు
 3. నేను ఇప్పటికిపుడు మార్పు కోరుకోవడం లేదు. తెలంగాణాలో ఉన్నా కదా మదం ఎక్కేసింది.ఒకరిని ఎంతకాలమైతే అనుకరిస్తామో అంతకాలం మనం సొంత ఆలోచనను కోల్పోతాం !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. Thanks for the comments నీహారిక గారు. ఎవరిని తిట్టారో ఎవరిని పొగిడారో అర్థం కావటం లేదండీ.

   తొలగించు
  2. మదమెక్కిన వాడు టీడీపీ తో నడుస్తాడు......

   మత్తులో ఉన్నవాడు వైస్సార్ కాంగ్రెస్ తో నడుస్తాడు...

   మార్పు కోరుకున్న వాడు జనసేన తో నడుస్తాడు....

   తొలగించు
  3. తెలంగాణాలో కేసీఆర్ గెలిచారు.
   ఆంధ్రాలో చంద్రబాబు గారు గెలవాలి.

   ఇప్పటికిపుడు మార్పు అనవసరం.

   ఏ రాజకీయం తెలియదనే కదా వైఎస్ జగన్ ని వద్దు అనుకున్నాం.

   కాంగ్రెస్,బీజేపీ లకు ఆంధ్రాలో స్థానం లేదు.

   కొన్నాళ్ళపాటు తెలంగాణాని అనుకరించక తప్పదు.

   తొలగించు
  4. థాంక్స్ నీహారిక గారు, ఇప్పుడు అర్థం అయింది మీరు ఎం మాట్లాడుతున్నారో.

   తొలగించు
 4. niharika medm garu please read this as it may put some light to enhance your solid support to mr chandrababu, since you are of the opinion that he is the most able administrator of the country.

  https://epaper.sakshi.com/1958663/Andhra-Pradesh/30-12-2018#clip/35304529/e2fd9cc1-3928-43ef-9e40-e0d6902aa1f5/548.5714285714286:878.9029166666667

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అసలు ఒక వార్త చదివినపుడు ఎలా అర్ధం చేసుకుంటారు అనేది వివిధ రకాలు.
   కమీషనర్ అన్నారు కానీ అతని పేరు లేదు. సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడిగారికి అనుకూలంగా వ్రాస్తారా ?

   యూ సీ లు పంపలేదని ఎప్పట్నుంచో చెపుతున్నారు. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ప్రభుత్వంలో ఖర్చయ్యే ప్రయి పైసా అధికారుల చేతిమీదుగానే జరగాలి.

   ఈ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రుల చేతిలో కేవలం వాగ్దానాలు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. అమలుచేసే బాధ్యత అధికారులదే !

   ఆ కమీషనర్ వాడి గొయ్యి వాడే తవ్వుకుంటే ఎవరేమీ చేయలేరు.

   తొలగించు
  2. oho ee vaartha mekala ardhamayyinda? comisioner peru ledu ganaka meeru ee varta angikarincharanna mata. u c lu pampaledani eppatnuncho bjp vallu, central govt. vallu chebutunnaru kani ippudu sakshathu a p resident comisionar chebutunnaru ante bjp vallu cheppedi corect annamata.
   oka vishayam miru telusukovali. adhikarulu prati pani mukhyamantri, mantrulu chebitene chestaru. adi ippati paristiti. kadu anukunna adhikarulu yem chestunnaro yem cheyyatledo telusukune tirika leni mukhaymantri mee drustilo maha samardhudu krinde lekka. yedu vela kotla dabbu adhikarlu claim cheyakapote, rashtranni munchestunte, kallu moosukune mukyamantri enta samardhudo meere samardhinchali. yedu vela kotlu claim cheyani asamardha comisioner tapunte ventane atanni suspende chesi tagina charyalu tisukovali kada samardha mukyamantri garu?
   abhimanam undatam tappuledu kani chestunna tappulni oppuluga samardhincha choose meelanti abhimanula valle vallaku vaalu chese tappulu tappulanipinchadam ledu. really a pitiable state.
   nijamga adi tappudu varta ayite vurikune mukhyamantri kadu chandrababu garu.
   partikalakekki, media kekki avatali vallanu allari pette rakam. ayina ee varta tappudu varta ani ap govt. kandiste nenu na abhiprayani venakku teesukuntanu. let us see how the govt. reacts to the news.

   తొలగించు
 5. పచ్చచొక్కాని,చేతిని గిలాస్న యేసికోని జగనన్న పట్టుకెల్తాడు.

  రిప్లయితొలగించు