ఇంకో ఐదేళ్లు ఆస్ట్రేలియాలోనే ఉండటానికి నేను ఒక హోమం చేయదలిచాను. ఈ 'స్థిర యోగ హోమం' చేస్తే చాలట, ఇంకేమి చేయకపోయినా ఆస్ట్రేలియాలోనే ఉండచ్చని బొంగు భగవానంద స్వామి అలాగే గొట్టం గోవింద స్వాముల వారు ఉపదేశించారు. కాబట్టి అట్టి వారి ఉపదేశాన్ననుసరించి నేను ఈ హోమం చేయ ఉపక్రమించితిని.
నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా, నేనే కాదండి ఇంకో పిచ్చాయన కూడా ఉన్నాడు ఆయన పేరే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. ఈయన గారికి గుమ్మడికాయంత జ్ఞానం తో పాటు వేపకాయంత వెర్రి కూడా ఉన్నట్లుంది.

కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తానే కారణమని, తాను దగ్గరుండి కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేసినందు వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పడిపోయేందుకు త్వరలోనే మరో రాజశ్యామల యాగం చేయబోతున్నట్లు ప్రకటించారు.
విచిత్రం కాకపొతే ఈయన పూజ చేస్తేనట కేసీఆర్ ఇంకో ఐదేళ్లు పదవిలో ఉంటారట, బాబు గారికి ఇకపై పదవీ యోగం ఉండదట.
ఇంకొక పిచ్చోడు ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను ఇండియా కి రావద్దని తానే చెప్పానని తన మాటకు విలువ ఇచ్చే ట్రంప్ భారత పర్యటనకు ఇప్పటిదాకా రాలేదని అంటాడు. ఇప్పుడు తాను తలచుకుంటే ట్రంప్ను ఏపీకి తీసుకువచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ... సింగిల్ పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా ట్రంప్ పర్యటన మొత్తం ఖర్చు ని తానే భరిస్తానని ఏవేవో కథలు చెప్తూ ఉంటాడు.
ఇంకో తింగరి వెధవ ఉన్నాడు ఆయనేమో కేబినెట్లో మహిళలకు ఎందుకు అవకాశమివ్వలేదు అని అడిగితే ‘‘మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..’’ అంటాడు.
ఇంకో అహంకారి ఏమో 'అగ్ర కులాలకు చెందిన మాకు పదవులు కావాలి కానీ దళితులు మీకెందుకు పదవులు' అంటాడు.
ఇలా ఎవరు పడితే వాళ్లు కామెడీ చేయడం, తల తిక్కగా మాట్లాడటం వల్లే జనాలు సినిమాలు చూడటం తగ్గించినట్లున్నారు, కావాల్సినంత కామెడీ పైసా ఖర్చు లేకుండా దొరకడం వల్ల.
బ్రహ్మానందం లాంటి కమెడియన్ కూడా ఇంతకు ముందులా ఎందుకు వెలిగి పోలేకపోతున్నారంటే సినిమాల్లో కంటే బయటే పాల్ లాంటి వాళ్ళు అద్భుతమైన కామెడీ పండిస్తున్నారు కాబట్టి.
చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండే ఒక అంకుల్ చెవి పై భాగం పూర్తిగా కట్ అయి ఉండేది. కారణం ఏమిటి అని అడిగితే, నేను హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఒక విమానం నా చెవి పక్కగా దూసుకుపోయింది అని మా చెవిలో పుచ్చకాయలు పెట్టేవాడు. పిల్లలం కదా అది నిజమై ఉంటుందేమో అని అనుకునేవాళ్లం. ఇప్పుడు తలచుకుంటే మమ్మల్ని వెర్రి పప్పులను చేసాడు అని అనిపిస్తుంది. మరి ఇంకా హోమాలు, స్వామిజీలు అంటూ నమ్మేవాళ్ళను ఏమనాలో నాకు తెలీదు.
అయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే కామెడీ చెయ్యట్లేదు, నిజ్జంగానే స్థిర యోగ హోమం చేసే ఏర్పాట్లలో బిజీ గా ఉంటాను ఇంకో మూడు నెలలు, కాబట్టి తక్కువగా రాస్తుంటాను. ఒకవేళ ఈ హోమం సత్ఫలితాలు ఇస్తే అప్పుడు తెలియజేస్తా హోమం చేయాల్సిన వివరాల గురించి.