7, ఫిబ్రవరి 2019, గురువారం

యాత్ర మొదలైంది

ఏమిటోయ్ నువ్వు రెండో బ్రూస్లీ కావాలనుకుంటున్నావా?

కాదు మొదటి జాకీ చాన్ ను అవ్వాలనుకుంటున్నాను. 

ఇలాంటి డైలాగు ఎక్కడో ఈ మధ్యే విన్నట్లు ఉంది కదూ, అవును మీరు ఊహించింది నిజమే, ఇది కథానాయకుడు సినిమాలో A.N.R తో అన్వయించి N.T.R పాత్రకు పెట్టిన డైలాగ్. ఇది జాకీ చాన్ సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో ఎవరో ఎగతాళిగా అంటే అలా సమాధానమిచ్చాడట. మరి  అప్పట్లో N.T.R గారికి కూడా సినిమాల్లోకి రాక మునుపు అంత కాన్ఫిడెన్స్ ఉండేది అని చూపెట్టడానికి ఆ సీన్ పెట్టినట్లున్నారు. 

ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావించానంటే, యాత్ర సినిమా స్టార్టింగ్ సీన్ లో కూడా రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో నేను ముఖ్యమంత్రి ని అవుతాను అనుకునే లాంటి కాన్ఫిడెన్స్ ఎలివేట్ చేసే సీన్ తో ప్రారంభిస్తారేమో మరి.  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సాగించిన పాద యాత్ర ను బేస్ చేసుకొని నిర్మిస్తున్న సినిమా యాత్ర ఇవాళ రిలీజ్ అవుతోంది. మమ్ముట్టి నటిస్తున్నారు కాబట్టి మలయాళం లో కూడా రిలీజ్ చేస్తున్నారేమో తెలీదు మరి. 

అమెరికా లో ఈ సినిమా ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేస్తే,  వైఎస్ అభిమాని ఒకరు 6,116 డాలర్లకు ఈ టికెట్ ను దక్కించుకున్నారట. దీన్ని క్రేజ్ అని కొందరు అంటున్నారు కానీ ఇది పిచ్చేమో అని నా అనుమానం. 

మొన్నొచ్చిన కథానాయకుడు సినిమాకు దీనికి పోలిక పెట్టడం సరి కాదు. అది ఒక వ్యక్తి (కాదు శక్తి అంటారు కొందరు) జీవిత చరిత్ర అయితే ఇది ఒక నాయకుడి పొలిటికల్ జర్నీ లో ఒక ముఖ్యమైన ఘట్టం చుట్టూ అల్లుకున్న కథ. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అని ఇక్కడ గొడవ పడుతున్నారు మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కొందరు. మా N.T.R దేవుడు అంటే, కాదు మా సీమ జనాల కష్టాలను తీర్చాడు కాబట్టి మా Y.S.R దేవుడు అని వాదించుకుంటారు.  కాకపొతే ఇద్దరి ఫొటోస్ పూజ రూముల్లో పెట్టుకున్న అభిమానులను చూసాను కాబట్టి ఒక రకంగా వారికి ఈ ఇద్దరు దైవ సమానులే. 

బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా కూడా ఈ రెండు సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి పోలిక అనవసరం.  'యాత్ర' సినిమాకు 25 కోట్ల బడ్జట్ అంటున్నారు కానీ నాకెందుకో నమ్మశక్యం కావట్లేదు అంత ఖర్చు నిజ్జంగా అయి ఉంటుందా అని నా అనుమానం.

కథానాయకుడు సినిమా బాగుందని చాలా మంది మెచ్చుకున్నా కాసులు రాలలేదు, మరీ అంత క్లాస్ టచ్ బాలకృష్ణ ఇమేజ్ కి సూట్ అవలేదేమో మరి.

ఈ 'యాత్ర' సినిమా ప్రశంసలతో పాటు పైసలు కూడా తెచ్చిపెడుతుందేమో చూద్దాం ఆ దర్శక నిర్మాతలకు. 

36 కామెంట్‌లు:

 1. NTR సినిమానుంచి ఎన్నో స్టైల్స్ బయటికొచ్చాయి. మరి యాత్ర లో ఈ ఫోజు తప్ప ఇంకేమీ రాలేదు. ఈ ఒక్క ఎంగిల్ తప్ప మిగతా ఎంగిల్స్ లో మమ్ముట్టి పెద్దాయనలా కనబడలేదేమో!
  ఇంతకీ సినిమాలో పెద్దాయన పాట ఉందా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంకొన్ని స్టైల్స్ కూడా రిలీస్ చేసినట్లున్నారు సూర్య గారు. నాకు తెలిసి అతను బానే సూట్ అయ్యారు పెద్దాయన క్యారక్టర్ కి.

   తొలగించండి
  2. నాకు తెలిసి పెద్దాయనా అనే పాట వేరే (తమిళ) సినిమాది. తెలుగులో డబ్బింగ్ చేసిన సినిమా ఫ్లాప్ అయింది కానీ పాట మాత్రం వైఎస్ మరణం తరువాత సాక్షి పుణ్యాన హిట్ అయింది.

   సాధారణంగా అప్పటికే జనాదరణ పొందిన పాటలు (ముఖ్యంగా జానపద బాణీ ఆధారిత గీతాలు) సినిమాలలో పొందు పరుస్తారు. ఇటువంటి రివర్స్ కేసులు (సినిమా నుండి జనజీవన స్రవంతికి వెళ్లడం) అరుదే. There are hundreds of examples of the first instance but very few of the second category.

   తొలగించండి
  3. ఈ పెద్దాయనా సాంగ్ గురించి ఇప్పుడే వింటున్నాను జై గారు

   తొలగించండి
  4. పవన్ గారూ, సూర్య గారు తన వ్యాఖ్యలో ఆ పాట సినిమాలో ఉందా అని అడిగారు. నా వ్యాఖ్య దానికి జవాబు/వివరణ.

   తొలగించండి
  5. నేనుకూడా డైరెక్టుగా వినలేదు. ఒకప్పుడు టీవీ9 వారి ఎవరిగోలవారిది కార్యక్రమంలో వినడమే.

   తొలగించండి
 2. #సూర్య గారు, #పవన్ కుమార్ గారు

  ఏమనుకోకండి గానీ అటువంటి సినీఫొటోలను "స్టిల్" (still) అంటారనుకుంటాను (not "స్టైల్").

  ఇక ఈ చిత్రం విషయానికొస్తే : అది ఆ "పెద్దాయన" ట్రేడ్-మార్క్ pose, జనాలు ఆయనకు తేలికగా అన్వయించుకోగలిగే హస్తవిన్యాసం కదా, అందువల్ల పబ్లిసిటీలో ఆ స్టిల్ ను‌ ఎక్కువగా వాడుతున్నారేమో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సరి చేసినందుకు థాంక్స్ మేస్టారు. మీరు కరెక్ట్, వాటిని స్టిల్స్ అనే అంటారు.

   తొలగించండి
 3. #పవన్ కుమార్

  // .... "ఇది పిచ్చేమో అని నా అనుమానం.' //
  హ్హ హ్హ హ్హ totally.

  రిప్లయితొలగించండి
 4. స్వంత వూరి నాయకుడు అభిమానం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఉ. భయోపిక్కు మొదటి భాగం ఫ్లాప్ అవడానికి కారణం ప్రపంచంలో అత్యంత లోకప్రియ బుడతడు లేకపోవడమే అని గుర్తించిన నిర్మాత సదరు బంగారు కొండకు రెండో భాగంలో "సముచిత పాత్ర" ఇచ్చారట. బుజ్జి కోటీశ్వరుడు స్టిల్లులో ఎంత ముద్దొస్తున్నాడో చూసిన "భక్తజనం" వెండి తెరలో ఇంకెంత రాణిస్తాడో అని ఎగబడి చూడ్డం ఖాయం.

   http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=710599

   తొలగించండి
  2. రెండో పార్ట్ లో N.T.R బాల్యం చూపించడం ఏమిటో? ఆ అవసరం ఏముంటుంది?

   తొలగించండి
  3. ఏముంది ఏ ఫ్లాష్ బాక్ సీనులోనో చొప్పించి ఉంటారు.

   తొలగించండి
  4. లక్ష్మీ పార్వతి గారు వ్రాసిన పుస్తక పరిచయం ఎక్కడో చదివాను. దాంట్లో ఎన్ టీ ఆర్ గారి చిన్నప్పటి చిలిపి పనుల గురించి చిలిపిగా వ్రాసారు. రెండో పార్టులోనే లక్ష్మీ పార్వతి గారి ఎంట్రీ ఉంటుంది కదా ఆవిడ బాల రామాయణం అందులో చూపెడతారేమో ?

   తొలగించండి
  5. ఎంత బిల్డప్పు ఇచ్చినా, అసమదీయులతో ఎంత గొప్ప రివ్యూలు రాయించినా, "ఫంకాలతో" ఎంత డప్పు కొట్టించినా "ప్రేక్షక సమాజ దేవాలయం" సంభావన విదల్చలేదు. నిర్మాత-కం-కథానాయకుడికి రెండు నెలల్లో రెండు అట్టర్ ఫ్లాపులతో మైండ్ బ్లాంక్ అయింది. కంగనా రనౌత్ గెటౌట్ చెప్పిమరీ రనౌట్ చేయడంతో దర్శకుడి గుండెలో బేజారు.

   అసలే "నాకంటే జూనియర్ మోస్ట్ ఆర్టిస్ట్" దెబ్బతో సినిమా స్పాన్సర్ పుట్టెడు దుఃఖంలో ముణిగి ఉన్నాడు. నిద్ర పోదామంటే (ఆరు ఘంటలే సుమా) మోడీ/జగన్/కెసిఆర్/మహీ రాఘవ/రాంగోపాల్ వర్మలు పీడకలలుగా వస్తున్నారు.

   మరోపక్క మొదటి భాగంలో భారీగా చేయి కాల్చుకున్న (అంటే వంట కాదండోయ్) బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. రెండో భాగం స్క్రిప్ట్ చూస్తే తల్లి/చెల్లి సెంటిమెంట్ లాంటి ఫార్ములాలు కుదరవు. ఎంత మసి పూసి మారేడు కాయ చేసినా దాచలేని కారం & చేదు నిజాలు పూర్తిగా దాచలేని పరిస్థితి. మామా అల్లుళ్ళ సవాల్ చూపితే మొదటికే మోసం వస్తుంది. వయసు మళ్ళిన భారీ కాయం హీరో నాజూకయిన కన్నెలతో ద్వందార్ధక బూతు పాటలు పాడుతూ చేసే జుగుప్సాకరమయిన వెకిలి వేషాలు మొదటి భాగంలో అయిపోయాయి. కిం కర్తవ్యం?

   ఏడవకండేవకండి ముత్తాతే మళ్ళీ పుట్టాడన్న చందాన పాలపళ్ళు రాలకుండానే పాలు పెరుగు పండ్లు అమ్ముకుంటూ కోటేశ్వరుడయిన మన బుజ్జి పండు ఉన్నాడు. వీడే కుటుంబం/బానర్/కులం/పార్టీ పరువును కాపాడి మళ్ళీ పునర్వైభవం తెస్తాడు, భూకంపం పుట్టిస్తాడు, సూపర్ డూపర్ హిట్టు ఇస్తాడు.

   బచ్చేకో లావో అచ్చే దిన్ బులావో!

   తొలగించండి
  6. బచ్చేకో లావో అచ్చే దిన్ బులావో very nice dialogue Jai gaaru.

   భలే చురకలు అంటించారు కథానాయక పుత్ర రత్నానికి.

   తొలగించండి
  7. లక్ష్మీస్ ఎన్ టీ ఆర్ ట్రైలర్ రిలీజయ్యిందిగా పండగ చేసుకోండి.

   తొలగించండి
  8. నీహారిక గారూ, ట్రైలర్ చూసానండీ భలే కామెడీ పండింది. చూడచక్కని ఆది దంపతుల జంట: వారి అన్యోన్యత చూపించే డ్యూయెట్ పాట ఒకటే తక్కువయినది. మహా ఇల్లాలు గ్లిసరిన్ లేకుండానే లైవ్ టీవీలో కన్నీళ్లు పెట్టుట బాగు బాగు మహుముచ్చట గొల్పినది. భలే మంచి చౌకబేరముగా పుక్కటకే ఇంతటి కళాఖండములు ఆలకించడం దేశప్రజల పూర్వ జన్మ సుకృతం.

   తొలగించండి
  9. తన సౌందర్య రహస్యం ఫలానా సబ్బేనన్నట్టు నా వ్యాఖ్యలకు ఇన్స్పిరేషన్ ఈ కింది వార్తలే:

   https://www.eenadu.net/cinema/mainmorenews/2/2019/02/14/57052/

   https://www.eenadu.net/ap/newsdetails/2/2019/02/14/55910/iam-not-responsible-for-your-tears-says-rgv

   తొలగించండి
 5. ఆ భక్త జన కోటిలో మన రామ భక్తులోరు ఉండకుండా ఉంటారా ? రామ రామ ! వారికి రాములోరి తర్వాత బుల్లి కోటీశ్వరులోరి తాత సెందృలోరే ఆరాధ్య దైవం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పై వ్యాఖ్య వ్రాసినది బండి వారు అనే అనుమానం మీకెలా / మీకెందుకు వచ్చింది రాజారావు మాస్టారూ?

   తొలగించండి
 6. రిప్లయిలు

  1. మందోపనిషత్తు కారణమయ్యుంటుంది :)


   జిలేబి

   తొలగించండి
  2. రాజారావు గారు, వీఎన్నార్ గారు, జిలేబీ గారు,
   మీరందరూ పెద్దలు. ఇలాంటి ఊహాజనితమైన,
   నిరాధార కారణాలతో నాలాంటి చిన్న వారిపై
   నిందలేయడం, తద్వారా ఇతరులతో స్నేహపూరిత
   సంబంధాలు చెడిపోవడానికి దోహదం చేయడం,
   సరి కాదని నా అభిప్రాయం. క్షమించాలి,
   ఆపై మీకే వదిలేస్తున్నాను.
   __/\__ ...

   తొలగించండి
  3. # బండి వారు
   పొరబడుతున్నట్లున్నారు. నేనే ఊహాగానమూ చెయ్యలేదు, నిందలూ మోపలేదు. సదరు వ్యాఖ్య మీరు వ్రాసారనే అనుమానం వారికి ఎందుకొచ్చిందని మాత్రమే రాజారావు గారిని అడిగాను. నా వ్యాఖ్యను మరోసారి చదవండి. 🙏

   తొలగించండి
  4. అసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి తెలియాలి 😊

   తొలగించండి
  5. లొల్లి... లొల్లి జరుగుతోందండీ!!😊

   తొలగించండి
  6. “లొల్లి” ఏమీ లేదు శ్రీ సూర్యనారాయణా.
   బండి వారు కొంచెం నొచ్చుకున్నట్లున్నారు, అందువల్ల చిన్న బుజ్జగింపు కార్యక్రమం. అంతే. దాన్ని లొల్లి అంటే ఎలా?

   తొలగించండి
 7. వీ ఎన్ ఆర్ గారు చవితి చంద్రుడిని చూసారల్లే ఉంది.

  నిన్న శ్యామలీయం గారు ఈరోజు బండి వారు....ఈ అలకలేమిటి మహాప్రభో 💩

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీలాపనిందలండీ నీహారిక గారు, ఏంచేస్తాం, శ్రీకృష్ణుడికే తప్పలేదు. కానివ్వండి, బండి “దొర” మన మిత్రులేగా.

   తొలగించండి
  2. ఇంతకీ ఆపైన అనానిమస్ ఎవరో?!

   తొలగించండి
 8. a anonymas garu yevarite yemti. shamaliyam gari gurinchi andariki telsu. a vishyanni gada ayana cheppindi. ramudi tarvata ayanaku chandrababu garu ishtam ani chepparu. ekkada ayannu oumaninchindekkada. danlo tappemndi, kastanta hasyam hodinchi. intakanna pedda pedda vishyalenno ballgullo yenno jarigiyee. ayannu yennenno koodaa tappu matalannavaruto kuda ayana bagane unnaru. jilebi garu kelakadam avidakado sarada. idedo peda vishaymla podiginchadam anavasaram.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. True, though there's no point for a larger debate in this instance, yet, the record has to be straight.

   Many bloggers consider Mr. Shyamaliyam to be a learned person, though he disguises himself as an 'Undercover Telugu Language Moral Police' of blogs - entering every second blog and preaching unwarranted sermons, like a Messiah, not even leaving small and petty typos in the process, that many a blogger here doesn't truly admire. May be he considers it his blog right.

   It's a known fact that once a madame blogger harshly threatened, called names (wisdom forbids me pronouncing them in here) and warned Mr. Shyamaliyam that she would beat him with a chappal and throw buffalo dung on his face, on a previous occasion, and most of the senior bloggers knew about that murky incident. Strangely Mr. Shyamaliyam is always very very friendly with her (and more friendlier these days). Similarly, the chronicles of Shyamaliyam-Jilebi literary vibes always pop up every now and then, like cat and mouse games. Strangely, Mr. Shyamaliyam never wrote any cursing poems on either of them, and for that matter, had a cursory eye, on so many people who called him names (more so particularly @ Padmarpita blog) on various occasions.

   It now seems that calling him a big devotee of Mr. Chandrababu irked and pained him more than all the above things put together, that he now curses this anonymous blogger with a lengthy poem, just because he pointed out that he is as much devoted to Mr. Chandrababu as he is to Lord Shriram. This whole incident clearly shows and establishes one thing that LEARNED need not necessarily be NOBLE always in their deeds. Jaigottimukkala gaarannaatluga "PALIKINCHEDI' kuda RAAMUDENANI alaanti vaariki appudappudu gurtuku raademo mari !

   "HEY RAM' ! I TRULY WONDER WHETHER THIS DISTRESS CALL ALSO ATTRACTS THE WRATH OF MR. SHYAMALIYAM SIR !
   OMEN ! GOD BE WITH ME, AND WITH HIM, AS WELL.

   తొలగించండి
  2. పిడక అంటే వృత్తం నాయనా ! వృత్తం ఇంకా నేర్చుకోలా ! నేర్చుకున్నాక కొడతా ! నా పేరు వ్రాయడానికి కూడా భయపడతారేమిటీ ?

   తొలగించండి