21, ఫిబ్రవరి 2019, గురువారం

స్థిర యోగ హోమం

ఇంకో ఐదేళ్లు ఆస్ట్రేలియాలోనే ఉండటానికి నేను ఒక హోమం చేయదలిచాను. ఈ 'స్థిర యోగ హోమం' చేస్తే చాలట, ఇంకేమి చేయకపోయినా ఆస్ట్రేలియాలోనే ఉండచ్చని బొంగు భగవానంద స్వామి అలాగే గొట్టం గోవింద స్వాముల వారు ఉపదేశించారు. కాబట్టి అట్టి వారి ఉపదేశాన్ననుసరించి నేను ఈ హోమం చేయ ఉపక్రమించితిని.

నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా, నేనే కాదండి ఇంకో పిచ్చాయన కూడా ఉన్నాడు ఆయన పేరే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. ఈయన గారికి గుమ్మడికాయంత జ్ఞానం తో పాటు వేపకాయంత వెర్రి కూడా ఉన్నట్లుంది.కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తానే కారణమని, తాను దగ్గరుండి కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేసినందు వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పడిపోయేందుకు త్వరలోనే మరో రాజశ్యామల యాగం చేయబోతున్నట్లు ప్రకటించారు.

విచిత్రం కాకపొతే ఈయన పూజ చేస్తేనట కేసీఆర్ ఇంకో ఐదేళ్లు పదవిలో ఉంటారట, బాబు గారికి ఇకపై పదవీ యోగం ఉండదట.

ఇంకొక పిచ్చోడు ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను ఇండియా కి రావద్దని తానే చెప్పానని తన మాటకు విలువ ఇచ్చే ట్రంప్ భారత పర్యటనకు ఇప్పటిదాకా రాలేదని అంటాడు. ఇప్పుడు తాను తలచుకుంటే ట్రంప్ను ఏపీకి తీసుకువచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ... సింగిల్ పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా ట్రంప్ పర్యటన మొత్తం ఖర్చు ని తానే భరిస్తానని ఏవేవో కథలు చెప్తూ ఉంటాడు.

ఇంకో తింగరి వెధవ ఉన్నాడు ఆయనేమో కేబినెట్లో మహిళలకు ఎందుకు అవకాశమివ్వలేదు అని అడిగితే ‘‘మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..’’ అంటాడు.

ఇంకో అహంకారి ఏమో 'అగ్ర కులాలకు చెందిన మాకు పదవులు కావాలి కానీ దళితులు మీకెందుకు పదవులు' అంటాడు.

ఇలా ఎవరు పడితే వాళ్లు కామెడీ చేయడం, తల తిక్కగా మాట్లాడటం వల్లే జనాలు సినిమాలు చూడటం తగ్గించినట్లున్నారు, కావాల్సినంత కామెడీ పైసా ఖర్చు లేకుండా దొరకడం వల్ల.

బ్రహ్మానందం లాంటి కమెడియన్ కూడా ఇంతకు ముందులా ఎందుకు వెలిగి పోలేకపోతున్నారంటే సినిమాల్లో కంటే బయటే పాల్ లాంటి వాళ్ళు అద్భుతమైన కామెడీ పండిస్తున్నారు కాబట్టి.

చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండే ఒక అంకుల్  చెవి పై భాగం పూర్తిగా కట్ అయి ఉండేది. కారణం ఏమిటి అని అడిగితే, నేను హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఒక విమానం నా చెవి పక్కగా దూసుకుపోయింది అని మా చెవిలో పుచ్చకాయలు పెట్టేవాడు. పిల్లలం కదా అది నిజమై ఉంటుందేమో అని అనుకునేవాళ్లం. ఇప్పుడు తలచుకుంటే మమ్మల్ని వెర్రి పప్పులను చేసాడు అని అనిపిస్తుంది. మరి ఇంకా హోమాలు, స్వామిజీలు అంటూ నమ్మేవాళ్ళను ఏమనాలో నాకు తెలీదు.

అయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే కామెడీ చెయ్యట్లేదు, నిజ్జంగానే స్థిర యోగ హోమం చేసే ఏర్పాట్లలో బిజీ గా ఉంటాను ఇంకో మూడు నెలలు, కాబట్టి  తక్కువగా రాస్తుంటాను. ఒకవేళ ఈ హోమం సత్ఫలితాలు ఇస్తే  అప్పుడు తెలియజేస్తా హోమం చేయాల్సిన వివరాల గురించి. 

28 కామెంట్‌లు:

 1. ఆస్ట్రేలియాలో ఐదు ఏళ్లు ఉంటే చాలా ? తర్వాత ఏం చేద్దామని ? పాల్ లాగా పాకిస్థాన్ గానీ వెళ్తారా ? క్లారిటీ గా ఉంటేనే హోమాలు ఫలిస్తాయి.

  రిప్లయితొలగించండి
 2. హోమం ఎఫెక్ట్ ఐదేళ్లు మాత్రమేనట నీహారిక గారూ, దానికీ expiry date ఉందట, కాబట్టి మళ్లీ హోమం చేయడ మే. లేదంటే స్వామీజీలు బ్రతికేదెలా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది మరీ సీసనల్ బిసినెస్ (3 months in 5 years) కాబోలు. అడపాతడపా బెంచీ మీద కూచున్నా ఏడాదికో రెండేళ్లకో ప్రాజెక్ట్ దొరికే "ఐటీ పక్షులే" కాస్త నయ్యం.

   తొలగించండి
  2. మధ్య మధ్యలో ఇంకా ఏవేవో హోమాలు ఉంటాయి లెండి వాళ్లకు, మన కన్నా బిజీ people వాళ్ళు

   తొలగించండి
 3. >>బాబు గారికి ఇకపై పదవీ యోగం ఉండదట>>>
  పదవీ యోగం ఎవరికి దక్కుతుందో అదైనా క్లారిటీ ఉందా స్వామికి ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్లారిటీ రావాలంటే లగడపాటి సర్వే రావాల్సిందే!

   తొలగించండి
  2. మొన్నటి ఉత్తుత్తి సర్వేలా కాకుండా ఈ సారైనా నికార్సైన సర్వే వస్తే బాగుండు జై గారు

   తొలగించండి
  3. అది మాత్రం ఏ స్వాముల వారు ఇప్పుడే చెప్పరు, ఎవరో ఒకరు పదవిలోకి వచ్చేక నేనప్పుడే చెప్పాను అతను వస్తాడని అని చెప్పే దొంగ స్వాములు తయారవుతారు నీహారిక గారు

   తొలగించండి
  4. పవన్ గారూ, మొన్నటికీ ఇప్పటికీ స్పాన్సర్ మారలేదు కనుక మీ కోరిక నెరవేరకపోవోచ్చును. కాకపొతే అట్టర్ ఫ్లాప్ సినిమా సీక్వెల్ మీద (వీరాభిమానుల మినహా) ఎవరికీ ఆశలు ఉండవు.

   తొలగించండి
  5. విశ్వనాధ్ గారి సినిమా ఫ్లాప్ అయ్యిందని తరువాత సినిమా చూడడం మానేస్తామా ? ఆంధ్రా ప్రజలు ఆ మనిషి చరిత్ర చూసి ఓటేస్తారు. ఎవరెన్ని హోమాలు చేసినా (నేను చెపుతున్నాగా) చంద్రబాబు గారే మళ్ళీ గెలుస్తారు.

   తొలగించండి
  6. ఉత్సాహం కొద్దీ నిన్నా ఈ రోజూ బుక్మైషో మహానాయకుడు బుకింగ్స్ గమనించాను. చాలా ఆశ్చర్యంగా నిన్నగాని, ఇవాళ గాని ఒక్కటంటే ఒక్క థియేటర్ లో కూడా, ఒక్క షో కి కూడా టికెట్స్ పూర్తిగా సేల్ కాలేదు. ఇది చాలా వింతైన విషయం. కనీసం టీడీపీ పార్టీ వాళ్ళు టికెట్లు తీసుకున్నా మొదటి రోజు అమ్మకాలు బాగుండాలి. మొదటిరోజు మొదటి షో కూడా నిండలేదంటే పార్టీ వాళ్ళు కూడా ఆసక్తి చూపకపోవడం బాధాకర విషయం.This is not a criticism but a genuine disappointment.

   తొలగించండి
  7. అవును జై గారూ, మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు కనపడటం లేదు.

   తొలగించండి
  8. పవన్ గారూ, మొదటి భాగం చతికిల పడేసరికి ఆహా ఓహో అంటూ రివ్యూలు రాసినవారు మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలీక దిక్కులు చూసారు. ఇప్పుడు రెండో భాగం అడిగే నాథుడు లేకుండా పోయాడు.

   PS: నా ఈ వ్యాఖ్యలు "దంధా ఆక్టోపస్" జగడాలమారి జరాపాగల్ సర్వేల గురించి. మూడు నెలలో వరసగా మూడో ఫ్లాప్ ఇచ్చిన విగ్గు హీరో గుర్తుకు వస్తే నా బాధ్యత కాదు.

   తొలగించండి
  9. మీ వరస చూస్తుంటే అర్జున్ రెడ్డి హిట్ అయిందని కేసీఆర్ గెలిచారని భావిస్తున్నట్లుంది.
   శ్రీరామరాజ్యం తరువాత బాలకృష్ణ సినిమాలు ఆడడం లేదు. సినిమాలు ఆడడంలేదని మంచు లక్ష్మి నటించడం ఆపేస్తుందా ?

   తొలగించండి
  10. విశ్వనాథ్ సినిమాలు, అర్జున్ రెడ్డి, బాలకృష్ణ, మంచు లక్ష్మి, మీ అనాలసిస్ సూపర్ నీహారిక గారి

   తొలగించండి
 4. మీ నమ్మకానికి అల్ ది బెస్ట్ నీహారిక గారు.

  రిప్లయితొలగించండి
 5. ఇక్కడ నేను సిడ్నీ లో అబ్సర్వ్ చేసిన ప్రకారం అయితే ఈ రెండో పార్ట్ చూడాలనే ఉత్సాహం చాలా తక్కువ మంది లో ఉంది అనానిమస్ గారు


  చరిత్రను కాస్త వక్రీకరించి చూపడమో లేదంటే పూర్తిగా చూపడం లేదనో ఎక్కడో అసంతృప్తి ఉన్నట్లుంది సినీ ప్రియులకి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండో పార్ట్ ట్రైలర్, రివ్యూ చూసా. ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మూడో పార్ట్ ట్రైలర్ కూడా చూసా. వర్మ ట్రైలర్ ఆసక్తికరమైనది.

   తొలగించండి
  2. మూడో పార్ట్ నాసిరకంగా తీసినా కథ పరంగా అదే జనాలను ఆకట్టుకోవచ్చేమో.

   తొలగించండి
 6. మీ స్థిరయోగయాగం పూర్తయ్యి మీరనుకున్న ఐదేళ్లు ఎక్స్టెన్షన్ రాగానే చెప్పండి. యూ.ఎస్.లో మెక్సికన్ల చేతా, హెచ్1బి వీసాలు కోసం తంటాలు పడుతున్న ఇండియన్ల చేత చేయించేద్దాం. మాంఛి ఫ్యూచరు,రాబడీ వున్న కెరీరు. ఆ తర్వాత ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేస్తుంది కూడా😁

  రిప్లయితొలగించండి
 7. మంచి ఐడియా మేష్టారు, ఈ సాఫ్టు వేర్ జాబ్స్ ని నమ్ముకునే బదులు ఆ బిజినెస్ మొదలు పెట్టడం మంచిదే. ముందు నా హోమం సక్సెస్ అవుద్దో లేదో మరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ హోమం ఏదో హోమ్ లాండ్ ఆఫీసులో చెయ్యండి. ఫలితం త్వరగా వస్తుంది!

   తొలగించండి
  2. హోమ్ లాండ్ ఆఫీసు? అర్థం కాలేదు సూర్య గారు.

   తొలగించండి
  3. సూర్య గారు అమెరికా వాసి అని నాకు అర్థమైంది 😀.
   మీ హోమానికి ఆల్ ది బెస్ట్ 👍😀. మీ పి.ఆర్. / సిటిజన్ షిప్ ఆఫీసు వారిని మీ హోమానికి ఆహ్వానించండి. ఆ పొగకు, మంత్రాలకు ఉక్కిరిబిక్కిరయ్యి మీ పి.ఆర్. వెంటనే శాంక్షన్ చేసేస్తారు 😀😀.

   తొలగించండి
  4. థాంక్స్ నరసింహారావు గారు. మీరన్నట్లు చేస్తే బెటర్, త్వరగా ఇచ్చేయచ్చు వాళ్ళు.

   తొలగించండి
 8. మీ స్థిరహోగయోమం హడావిడిలో బ్లాగ్ పోస్టులు తగ్గిస్తే ఆట్టే ఫలితం వుండదు...అది చేస్తూ వుండాలి, ఇవి రాస్తూ వుండాలి.

  రిప్లయితొలగించండి