కొన్నేళ్ళ క్రిందట, బ్రతుకు తెరువు కోసమో లేదంటే వారి కళను ప్రదర్శించడం కోసమో కొందరు ఒక గ్రూప్ గా చేరి ఊరూరా తిరుగుతూ పల్లెల్లో డ్రామాలో లేదంటే వీధి నాటకాలో ఆడుతూ ఉండేవారు. అలా ఒక డ్రామా బ్యాచ్ ఒక ఊరిలో మకాం వేసి కాస్త చీకటి పడ్డాక ప్రదర్శన మొదలెట్టింది.
జనం బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు డ్రామాలో.
కాసేపాటికి ఒక చిన్న రెడ్డి గారు వచ్చారు. అరేయ్ ఫలానా రెడ్డి గారు వచ్చారు అని ఆయన మనుషులు హడావిడి చేసి కూర్చోవడానికి ఒక కుర్చీ వేసి, డ్రామా మళ్ళీ మొదట్నుంచి మొదలెట్టండి అని ఆర్డర్ వేసేశారు.
మొదటి నుంచి డ్రామా మొదలు.
డ్రామా యమా జోరుగా సాగుతోంది, బోర్ అని ఫీల్ అయినవాళ్లు, పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. ఇంకాసేపటికీ మరో రెడ్డి గారు వచ్చారు ఆయన రాచ కార్యక్రమాలేవో ముగించుకొని.
అరేయ్ ఫలానా రెడ్డి గారు వచ్చారు అని ఆయన మనుషులు హడావిడి చేసి కూర్చోవడానికి ఒక కుర్చీ వేసి, డ్రామా మళ్ళీ మొదలెట్టండి అని ఆర్డర్ వేసేశారు.
మళ్ళీ మొదటి నుంచి డ్రామా మొదలు.
యెంత లేట్ వస్తే అంత గొప్ప అనే అహంకారం ఉన్న మరో పెద్ద రెడ్డి సగం డ్రామా అయ్యాక వచ్చాడు.
మళ్ళీ ఈ పెద్ద రెడ్డి గారి మనుషుల డ్రామా కింద మొదలు, అసలైన డ్రామా మళ్ళీ పైన మొదలు. దీంతో తెల్లారినా ఆ డ్రామా అయిపోలేదట. అప్పట్నుంచీ ఈ 'రెడ్డొచ్చె మొదలాడు' సామెత వాడుకలోనికి వచ్చిందట.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ డ్రామా ఆర్టిస్టుల ప్లేస్ లో నేను ఉన్నాను కాబట్టి.
గత మూడు నెలల్లో ముగ్గురు వ్యక్తులు మారారు మా ప్రాజెక్ట్ లో. యేవో కొన్ని కారణాల వల్ల రిజైన్ చేయడం, మళ్ళీ కొత్త వాళ్ళు రావడం జరుగుతోంది ప్రాజెక్ట్ లో.
మొదటి వ్యక్తి జాయిన్ అయి స్వాగత సత్కారాలు అందుకున్న వారం తర్వాత, 'డిసెంబర్ లో నేను 6 వీక్స్ లీవ్స్ ప్లాన్ చేసుకున్నాను, టికెట్స్ కూడా 6 నెలల క్రితమే బుక్ చేసుకున్నా ఇండియా వెళ్ళడానికి' అని చావు కబురు చల్లగా చెప్పారు.
ప్రాజెక్ట్ తొందరగా ముగించాలి కాబట్టి అన్ని లీవ్స్ అంటే కష్టం అని మానేజ్మెంట్ ఇంకో కొత్త వ్యక్తిని తీసుకువచ్చారు.
ఆ వ్యక్తి కూడా చేరిన రెండు వారాల్లోపే resign చేసేశారు (I.T పరిభాషలో 'పేపర్స్ పెట్టారు' ).
ఇప్పుడు మూడో వ్యక్తి జాయిన్ అయ్యారు.
ఇలా కొత్త టీమ్ మెంబర్ జాయిన్ అయినప్పుడల్లా వారికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యడం ( I.T పరిభాషలో 'K.T ఇవ్వడం'), వాళ్ళ access requests రైజ్ చేయడాలు ఇలా మళ్ళీ కథ మొదలు.
మానేజ్మెంట్ ఏమో మొదటి రోజు నుంచే వాళ్ళ దగ్గరి నుంచి ప్రొడక్టివిటీ expect చేస్తుంది ఇక్కడేదో మేము ఇటుకలు పేర్చే పనో, లేదంటే గోడౌన్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ పనేదో చేస్తున్నట్లు. నా ఉద్దేశం ఆ పనులని చులకన చేస్తున్నట్లు కాదు కానీ, కొత్త టీం మెంబర్ కాస్త ప్రాజెక్ట్ అర్థం చేసుకొని పని మొదలెట్టడానికి కనీసం ఒక వారం పట్టుద్ది.
మానేజ్మెంట్ ఏమో మొదటి రోజు నుంచే వాళ్ళ దగ్గరి నుంచి ప్రొడక్టివిటీ expect చేస్తుంది ఇక్కడేదో మేము ఇటుకలు పేర్చే పనో, లేదంటే గోడౌన్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ పనేదో చేస్తున్నట్లు. నా ఉద్దేశం ఆ పనులని చులకన చేస్తున్నట్లు కాదు కానీ, కొత్త టీం మెంబర్ కాస్త ప్రాజెక్ట్ అర్థం చేసుకొని పని మొదలెట్టడానికి కనీసం ఒక వారం పట్టుద్ది.
కాస్త ఈ కొత్త టీమ్ మెంబర్ అయినా కొద్ది నెలలు కుదురుకుంటే పర్లేదు లేదంటే మళ్లీ 'రెడ్డొచ్చె మొదలాడు'.
రిప్లయితొలగించండికాస్త ఈ కొత్త మెంబరైనా ..
జలకాలాటలలో గలగల పాటలలో యేమి హాయిలే హలా :)
రాహుకేతువుల రాశి మార్పు కారణమై వుంటాది :)
జిలేబి
Thanks for your comment Jilebi gaaru.
తొలగించండిఏయ్ జిలేబి. అసలు టపాకు నీ వాక్యకు ఏమైనా సంబంధం ఉందా. అసలు. ఈ పిచ్చి పద్యాలు వాక్యలు రాసి ఎందుకు బ్లాగులోళ్ళను సంపకతింటావు
తొలగించండి'సంపకతింటావు' ఈ యాస విని శానా రోజులైనాది. భలే భలే Anynomous గారు.
తొలగించండిPutt’s law: Technology is dominated by two types of people, those who understand what they do not manage and those who manage what they do not understand.
రిప్లయితొలగించండిగుడ్ పాయింట్!
తొలగించండిI never heard this law, Thanks for letting us know about this law Jai gaaru.
తొలగించండిఇదే సూత్రం కాస్త తేడాతో Dilbert principle పేరుతో (most incompetent engineers are promoted to management) కూడా ఉంది. టెక్నాలజీ అర్ధం చేసుకో(లే)ని వ్యక్తులకు ప్రమోషన్లు వచ్చి వారే ప్రాజెక్టులను మానేజీ చేస్తే మీరు రాసిన తరహా సమస్యలు వస్తాయని అంటారు.
తొలగించండిDisclosure: I am a manager myself, not a technical person :)
అయితే మీరు సుబ్బారావే అన్న మాట 😊. మేమైతే మా మేనేజర్ ఎవరైనా అలాగే పిలుచుకుంటాం, ఆ పేరు పెట్టి తిట్టుకున్నా అతన్నే తిడుతున్నట్లు అర్థం కాదు కనుక, దానికి తోడు నాకు ఎప్పుడూ నార్త్ ఇండియన్స్ మేనేజెర్సే. ఒక సారి మాత్రం ఒక తమిళియన్.
తొలగించండిఏదో సరదాకి రాశాను నొచ్చుకోకండి జై గారు .
మీరు డిల్బర్ట్ కామిక్స్ చదువుతారా? అందులో PHB (Pointy Hair Boss) & Wally అని ఉంటారు. నాకు వాళ్ళిద్దరితో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో అన్న మీమాంస కనుక నొచ్చుకునే ఆస్కారమే లేదండీ.
తొలగించండిhttps://dilbert.com/
లేదు మేష్టారు, నాకు ఇంగ్లీష్ అంటే కాస్త ఎలర్జీ (సరిగ్గా అర్థం అయి చావదు, ఇలా అంటే బాగోదు కాబట్టి ఎలర్జీ అనే ముసుగేశా).
తొలగించండికుదిరితే ఆ డైలీ కామిక్ ఫాలో అవండి: ఆఫీసులలో ఎదురయ్యే సమస్యలను కామెడీగా చూపిస్తుంది. అంత కఠినమయిన ఇంగిలిపీసు ఉండదు లెండి.
తొలగించండిPHB అనేవాడు పరమ మొద్దు & తలతిక్క బాసు కాగా Wally పనిదొంగ.
అయితే వాకే మేష్టారు. ఫాలో అయిపోతా.
తొలగించండి
రిప్లయితొలగించండి---టెక్నాలజీ అర్ధం చేసుకో(లే)ని వ్యక్తులకు ప్రమోషన్లు వచ్చి వారే ప్రాజెక్టులను మానేజీ చేస్తే
ఏమండీ జై గొట్టివారు
అంటే పవను గారికి టెక్నాలజీ రాదనా !
జిలేబి
జిలేబి గారు మీ వాఖ్య ఫలించి నేను కూడా త్వరగా మేనేజర్ అయిపోతే బాగుండు.
తొలగించండిజై గారి ఉద్దేశ్యం అది కాదండీ, ఆయన ఆయన గురించి చెప్పుకొచ్చారు.
# పవన్ కుమార్ గారు,
రిప్లయితొలగించండిరకరకాల principles ఉన్నాయండి 🙂. మీ తరం వారు విన్నారో లేదో తెలియదు. మచ్చుకి కొన్ని ఇక్కడ చూడండి.
==========
Peter Principle (by Laurence Peter) 👇
"People in a hierarchy tend to rise to their "level of incompetence" ".
------------------
Parkinson's Law (by C.Northcote Parkinson) 👇
"Work expands so as to fill the time available for its completion"
-------------------
Murphy's Law 👇
"Anything that can go wrong will go wrong".
===========
అవునూ, పైన చెప్పిన డ్రామా బ్యాచ్ ఉదంతం మీ ఊరిలో జరిగిందా ... రెడ్డి గారూ 🙂?
తొలగించండిఏమండీ విన్నకోట గారు
ఇన్డైరెక్టు గా పీటర్ ప్రిన్సిపల్ గట్రాలు పవను గారికి అప్లై అవుతోందని అంటున్నారా ?
జిలేబి
అబ్బెబ్బే 🤗 . ఈ తరం వారికి కాస్త జనరల్ నాలెడ్జ్ లో ఆసక్తి కలిగిద్దామనే సదుద్దేశం, అంతే సుమండీ 😉.
తొలగించండి.
నరసింహా రావు గారు, మీరు అన్ని laws గురించి జ్ఞానోపదేశం చేసినందుకు ధన్యవాదాలు. కాకపొతే అవి అర్థం అయింటే బాగుండు. అసలే నేను ఇంగ్లీష్ లో కూసింత వీక్.
తొలగించండిమా ఊర్లో ఏంటి అన్ని ఊర్లలోనూ అప్పట్లో జరిగే ఉంటాయి ఇలాంటి భాగోతాలు.
జిలేబి గారు ఏంటో ఇవాళ నా మీద దండయాత్ర మొదలెట్టినట్లున్నారు 😊
తొలగించండి// "అసలే నేను ఇంగ్లీష్ లో కూసింత వీక్." //
తొలగించండినమ్మబుల్ గా లేదు 🙁
ఎందుకు నమ్మబుల్ గా లేదు నరసింహా రావు గారు, ఐ యామ్ నిలదీస్పయింగ్?
తొలగించండిహ్హ హ్హ హ్హ, ఇప్పుడు నమ్ముతాను 😀👍.
తొలగించండిజిలేబీ మాతా నమో నమః
రిప్లయితొలగించండిమదీయ వ్యాఖ్య మరల పరిశీలించ అభ్యర్థన. టెక్నాలజీ బొత్తిగా తెలీని (నా బోటి) వ్యక్తులు ఎవరికీ అర్ధం కానీ టక్కు టమారా మాటల గారడీలు (దీన్నే management principles లేదా jargon అని కూడా అందురు) వాడి అందరినీ బుట్టలో వేసుకొని పదోన్నతులు పొందెదరు. అటువంటి వారలు తమ తలతిక్క యాజమాన్య శైలితో టెక్నాలజీ బ్రహ్మాండముగా తెలిసిన పవన కుమారుల వంటి నిపుణులకు కడు కష్టములు చేకూర్చెదరు. బాసుల వలన కలిగిన ఇబ్బందుల గురించి సదరు ఇంజనీర్లు బ్లాగులు రాసెదరు.
నా వ్యాఖ్యముల వక్రీకరించి నాపై నీలాపనిందలు వేసి నాకు పవనుల వారితో తగువు పెట్టించుట తమకు భావ్యమేనా మాతాశ్రీ? మీ నారద నీతికి కొంగొత్త బలిపశువుగా అల్పుడనయిన నన్నే ఎంచుకొనుట నా తలరాత.
జై గారూ, మీరు నన్ను అనలేదని అర్థం అయింది లేండి, అపార్థాలు ఏమీ రావు.
తొలగించండిమీ ఈ గ్రాంధిక భాష నాకు భలే నచ్చింది మేష్టారు
రెడ్డచ్చే మొదలాడు నుంచీ మర్ఫీస్ లా వరకు మంచి చర్చ లేవదీశారు పవన్. ఇలాంటి కబుర్లు విని చాలా రోజులవడంతో బాగా ఎంజాయ్ చేశాను.
రిప్లయితొలగించండినాదేమీ లేదు ఇందులో YVR గారు, జ్ఞానమంతా జై గారిది అలాగే నరసింహా రావు గారిది.
తొలగించండి
రిప్లయితొలగించండిమిమ్మల్ని వ్రాయండి వ్రాయండి అని చెప్పిన నాకు, కామెంటే సమయం కూడా చిక్కడంలేదు పవన్ గారు. కానీ మీ బ్లాగుచదవటం మాత్రం ఆపట్లేదండోయ్. మీకథ చదివాను. ముగ్గులు, నాట్యాలు అన్నీ చూసాను. మీ’ కురుక్షేత్ర యుద్ధం’ చాలా బావుంది.ఇదిగో ఇప్పుడు ఈటపా కూడా బావుంది. బావుంది ఉపమానం.
మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు చంద్రిక గారు.
తొలగించండిసరదాగా వున్నాయి మీ కబుర్లు, పవన్‌గారు :)
రిప్లయితొలగించండిThanks for the comments Lalita gaaru
తొలగించండి