5, ఫిబ్రవరి 2019, మంగళవారం

కురుక్షేత్రం ముగిసింది

డిసెంబర్ లో మొదలైన స్కూల్ సమ్మర్ హాలిడేస్ లాస్ట్ వీక్ తో ముగిశాయి. దాదాపు ఆ 45 రోజులు మా ఇద్దరి పిల్లల అల్లరితో ఇల్లంతా కిష్కింధాకాండే. 

మా అబ్బాయికి  ఎటాక్  చేయడం తెలుసు. మా అమ్మాయికి కనీసం డిఫెండ్ చేసుకోవడం కూడా తెలీదు, ఎటాక్  చేయడం గురించి పక్కన పెడితే. కాబట్టి mostly వార్ వన్ సైడ్ నుంచే మొదలవ్వుద్ది.

మాములుగా అయితే క్రిశ్మస్ షట్డౌన్ అని ప్రతీ సంవత్సరం రెండు వారాలు ఫోర్స్డ్ లీవ్స్ ఉండేవి మాకు ఆఫీసులో. కాకపొతే ఈసారి ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ టైట్ గా ఉండటం వల్ల ఆ రెండు వారాలు కూడా నేను ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చింది.

సో మొత్తం ఆ 40 రోజులు పిల్లల ఇద్దరి గొడవలతో ఇల్లు కురుక్షేత్రమే. నేను ఆఫీస్ కి వెళ్తుండటం వల్ల మా ఆవిడేమో ఆ కురుక్షేత్రం లో అభిమన్యుడిలా ఇరుక్కు పోయింది.

రోజంతా వాళ్ళ అల్లరి భరించడం

సాయంత్రాలు పార్క్ కి తీసుకెళ్లడం

రాత్రి అయ్యేప్పటికీ కాస్తో కూస్తో తన B.P రైజ్ అవ్వడం

ఇదే తన దినచర్య అయిపొయింది. ఏమైతేనేం పోయిన వారంతో కురుక్షేత్రం ముగిసింది, మా అమ్మాయి మళ్ళీ స్కూల్ కి వెళ్లడం మొదలైంది కాబట్టి.

పిల్లల అల్లరి ఒక్కొక్కరిది ఒక్కో లెవెల్ లో ఉంటుంది. 

మా ఊర్లో, బంధువుల అబ్బాయి ఒకడు విపరీతంగా అల్లరి చేసేవాడు, దాంతో రోజూ వాడికి బడిత పూజ చేసేవారు, ఒక రోజు ఇలాగే వాళ్ళ నాన్న పూజ మొదలెట్టబోతుంటే, ఆగు నాన్నా! అని గట్టిగా అరచి మూలనుండే  వేట కొడవలి తీసుకొచ్చి 'రోజూ ఇలా కొట్టే కంటే ఒకే ఒక దెబ్బ వెయ్, తల యెగిరి పడాల' అన్నాడట.  మహా అంటే మూడేళ్లు కూడా నిండని ఆ కుర్రోడు అలా అనేప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు వాడి నాన్నకు. ఎంతైనా సీమ బుడ్డోడు కదా, వాడి రక్తం లో వేడి అలానే ఉన్నట్లుంది. 

మా ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక మూడేళ్ళ కుర్రాడి అల్లరి గురించి చెప్పాడు. ఆ కుర్రాడి తాత వీళ్ళింటికి వచ్చాడట, ఆయనకేమో రోజూ T.V లో 'అన్నదాత'  లాంటి ప్రోగ్రాం ఏదో చూడటం అలవాటట. ఆ మనవడు కూడా ఆయనతో పాటూ కూర్చొని రోజూ చూసేవాడట.

వారం తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మ మధ్యాహ్నం కాసేపు కునుకు తీసి లేచేటప్పటికి కిచెన్ లో చేటలో పోసి పెట్టిన బియ్యాన్ని రైతులు పొలంలో చల్లినట్లు ఇల్లంతా చల్లుతున్నాడట,  వారం రోజులు T.V లో అన్నదాత చూసిన ఎఫెక్ట్ వల్ల. 

నా ఫ్రెండ్ ఒక తెలుగమ్మాయి, మొన్నొక సారి మాట్లాడుతూ వాళ్ళ మూడేళ్ళ అబ్బాయి అల్లరి గురించి చెప్పింది. ఫోన్ కనపడటం లేదని ఇల్లంతా వెతుకుతూ "నా ఫోన్ కనపడటం లేదు చూశావా" అని అడిగితే దానికి బాత్ చేయిస్తున్నానమ్మా అన్నాడట. 

బాత్ చేయించడమేమిట్రా అంటే

రా మమ్మీ అని నీళ్ళ బకెట్ లో ఉన్న ఫోన్ చూపాడట.

ఇక మా ఎదురింటి కుర్రాడయితే వాళ్ళ మమ్మీ కొట్టడానికి చెయ్యి ఎత్తితే, ఫోన్ చేసి పోలీస్ రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తాడట.

సో, మా అబ్బాయిది ఆ రేంజ్ అల్లరి కాదు కానీ, దేవుడి గంట తీసుకొని అది మోగించుకుంటూ ఐస్ క్రీం, ఐస్ క్రీం అని ఇల్లంతా తిరగడం, మ్యూజిక్ అని చెప్పి స్టీల్ గిన్నెలు ప్లాస్టిక్ గిన్నెలు ముందేసుకుని గరిటలతో వాటి మీద కొడుతూ శబ్దాలు చేయడం, హనుమంతుడిలా ఈ సోఫా నుంచి ఆ సోఫా కి గెంతడం, మంచం మీద ఎగరడం లాంటి పనులు చేస్తుంటాడు. ఉదయాన్నే నాతో పాటే నిద్ర లేవడం అలవాటు మా బుడ్డోడికి, అప్పటినుంచే మొదలవుద్ది వీడి అల్లరి. వీడు యెగిరి దూకుతూ ఉండటం వల్ల, ఆ శబ్దానికి నిద్ర పట్టక క్రింద ఫ్లాట్ వాళ్ళు, పక్క ఫ్లాట్ వాళ్ళు ఉదయాన ఏడు గంటలకే లేచొచ్చి మా ఫ్లాట్ డోర్ కొడుతూ ఉంటారు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పడానికి. 

పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఉన్నట్లే, పిల్లల అల్లరి కంట్రోల్ చేయడానికి పన్నెండు సూత్రాలు కాదు కదా కనీసం ఒక్క సూత్రం కూడా లేదు, వాళ్ళ అల్లరిని భరించడం, లేదంటే వాళ్ళతో కలిసి ఎంజాయ్ చెయ్యడం తప్ప కంట్రోల్ చేయడం కష్టం. 

అయినా రాముడు మంచి బాలుడు టైపులో పిల్లలు ఉంటే పెద్దయ్యాక చెప్పుకోవడానికి పెద్ద విశేషాలంటూ లేని రాముని బాల్యం లాగా ఉంటుంది, అదే అల్లరి కృష్ణుడిలా ఉంటే, చెప్పుకోవడానికి ఎన్నో బాల్య విశేషాలు ఉంటాయి. 

నేను సాయంత్రం ఇంటికి వెళ్ళగానే, మా ఆవిడ కూడా ఆ యశోదమ్మలా మా ముద్దుల అల్లరి బాల కృష్ణుడి ముచ్చట్లు నాతో చెప్పుకొని మురిసిపోతూ ఉంటుంది. 

చిన్ని కృష్ణుడి వేషంలో మా బుడ్డోడు (రెండేళ్ల క్రితం ఫోటో)

9 కామెంట్‌లు:

 1. మావారి అల్లరి భరించలేక వాళ్ళ అమ్మ కంట్లో కారం వేస్తానని బెదిరించేది అట ! నువ్వు వేసేది ఏంటి నేనే వేసుకుంటాను అని ఆయనే కారం పోసేసుకుని ఆయనే ఎదురు తిట్టేవారట...ఆయనని కంట్రోల్ చేయలేక పైకెళ్ళిపోయింది. మా అబ్బాయిని మాత్రం చాలా కంట్రోల్ గా పెంచారు. ఎందుకంటే ఆయనకి సౌండ్ ఎలర్జీ, చిన్నపిల్లలు కూడా డీసెంట్ గా బిహేవ్ చేయాలని కోరుకుంటారు. ఎవరి చిన్నతనం వాళ్ళకు గుర్తుండదు కాబోలు ! బుడ్డోడు సూపర్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అప్పట్లో పిల్లలు అంత అల్లరి చేసేవారు కాదనుకుంటా, కాబట్టి మీవారిది మరీ హై రేంజ్ అల్లరి అన్నమాట.


   మా బుడ్డోడి ఫోటో నచ్చినందుకు మీకు ధన్యవాదాలు నీహారిక గారు

   తొలగించండి
 2. మూడేళ్ళ పిల్లాడు కత్తిచ్చి నరకమంటున్నాడా?
  ఈ బ్లడీ రాయలసీమ మైండెసెట్ ఉంది చూసారూ.. అంతేనండి!

  అన్నట్టు డైలీ విశేషాలు చెప్పడానికి సాయంత్రం వరకూ ఎదురు చూడటం దేనికి? "Family album easy photo &video sharing application" ని ఇంస్టాల్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎప్పటికపుడు ఆల్బమ్ లా ఫోటోలు చూసుకోవచ్చు. ఫోటో టైం స్టాంప్ ని బట్టి నెలలవారీగా సంవత్సరాలవారీగా గ్రూప్ చేస్తుంది కాబట్టి పాత ఫోటోలు వెతుక్కోవడం కూడా ఈజీ. మీరు జతచేసిన కుటుంబ సభ్యులుమాత్రమే చూడగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీమ వాళ్ళు అంతే సీమ వాళ్ళు అంతే :)

   పక్కన కూర్చొని చెబితేనే హాయిగా ఉంటుంది కదా ఫోన్ లో కంటే అందుకు సాయంత్రమే సరైన సమయం సూర్య గారు.

   మీరు చెప్పిన షేరింగ్ application ట్రై చేస్తా, థాంక్స్.

   తొలగించండి
  2. @ సూర్య గారు,
   మూడేళ్ళ పిల్లాడు ఏమయినా చేస్తాడు. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు కేసీఆర్ గారిలాగా బూతులు తిట్టడం కామన్ ...మీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళని గమనించండి.ఫిబ్రవరిలో పుట్టినవాళ్ళకు ఆరోగ్యం సరిగా ఉండదు, చిరాకుతో బూతులు తిడుతూ ఉంటారు. మూడేళ్ళ పిల్లవాడు అమ్మని బూతులు తిట్టడం నేను చూసాను. తెలంగాణా వాళ్ళు, రాయలసీమ వాళ్ళే కాదు ఎవరయినా ఫిబ్రవరిలో పుట్టినవాళ్ళు తిడుతూనే ఉంటారు.

   తొలగించండి
  3. నీహారిక గారు, మూడేళ్ళ పిల్లవాడు తల్లిని బూతులుతిట్టటమా! కలికాలం! కొన్ని దశాబ్దాలక్రిందట ఒకరోజు మాస్నేహితుడు ఒకాఅయన ఇంట్లో అతిథిగా ఉన్నాను. ఉదయం ఆతని కొడుకు నాలుగైదేళ్లవాడు చెల్లిని బూతులుతిట్టటం విని విస్తుపోయాను. అసలు షాక్ ఆతరువాత వచ్చింది. మాస్నేహితుడు నా ఆశ్చర్యాన్ని గమనించి మాయింట్లో అందరమూ ధారాళంగా బూతులు మాట్లాడతాం అన్నాడు! ఐతే ఆయన ఆఫీసులోనూ ఇతరత్రానూ బయట ఎక్కడా ఎన్నడూ బూతులు మాట్లాడడు నాకు తెలిసినంతవరకూ.

   తొలగించండి
 3. ఇదేదో ఆలోచించాల్సిందే. బహుశా వాలెంటైన్స్ డే ఫిబ్రవరిలో ఉండబట్టే "ప్రేమంటే బూతు" అనే నమ్మకం ప్రబలిందా? ఏమోమరి!!

  రిప్లయితొలగించండి
 4. అంతటి కురుక్షేత్ర వ్యూహకర్త ఈ వెన్న తినే చిన్ని కృష్ణుడా?

  రిప్లయితొలగించండి