Robert Chesebrough, ఇతని పేరు మనలో చాలా మంది విని ఉండరు కానీ, మన దినచర్య లో భాగంగా, ప్రత్యేకించి చలి ప్రాంతాల్లో నివసించేవారికి ఈ పేరుతో ఒక అనుబంధం ఉండే ఉంటుంది.
రాబర్ట్ తన కెరీర్ మొదట్లో తిమింగళాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆయిల్ నుంచి కిరోసిన్ ను రిఫైన్ చేసే కెమిస్ట్ గా అమెరికా లో పనిచేసేవాడు. Titusville అనే ప్రాంతంలో పెట్రోలియం ను కనుగొనటంతో ఇతను చేస్తున్న పని useless అయిపోవడంతో అతను jobless అయిపోయాడు. కాకపోతే అతని క్యూరియాసిటీ అతన్ని మూలాన కూర్చోనివ్వలేదు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి పెట్రోలియం నుంచి ఏదైనా పనికొచ్చే ఉత్పత్తులు తయారు చేయొచ్చా అనే ప్రయోగాలు మొదలెట్టాడు. అతని ప్రయోగాలు ఫలించి పెట్రోలియం జెల్లీ అనే మెటీరియల్ ని తయారు చేశాడు.
తనను తాను ఒక Guinea Pig లా మలుచుకున్నాడు. (Since the 1800s, Guinea pigs have been used in laboratories to study nutrition, genetic, toxicology and pathology. Guinea pigs have done more than their fair share to contribute to medical science and to the health and well-being of humans and animals worldwide) తన చర్మం పై చాకుతో గాట్లు పెట్టుకున్నాడు, ఒంటి పై ఆసిడ్ పోసుకున్నాడు, చర్మాన్ని నిప్పుతో కాల్చుకున్నాడు. ఆ గాయాలను మాన్పగల శక్తి ఆ జెల్లీ కి ఉందా లేదా అని తెలుసుకోవడానికి తను తయారు చేసిన జెల్లీ ని అప్లై చేశాడు. అలా ప్రయోగాలు చేస్తూ అలాగే పెట్రోలియం వాసన రాకుండా ఉండే ఆ జెల్లీ లాంటి మెటీరియల్ తయారు చేయడానికి అతనికి పట్టింది పదేళ్లు.
దాన్నే vasaline అనే పేరుతో అమ్మబోతే ఎవరూ కొనలేదు, షాప్ వాళ్ళు కూడా కొనడానికి ముందుకు రాలేదు ఒంటి మీద నయమైన ఆ గాయాల మచ్చలను చూపినా. మళ్ళీ రోడ్డున పడ్డాడు తన ప్రయోగం సత్ఫలితాలివ్వక.
ఇక ఇదే చర్యలను రోడ్ల పక్క తన షాప్ ని తెరిచి అందరి ముందు తన చర్మాన్ని కోసుకోవడం, నిప్పుతో, ఆసిడ్ తో కాల్చుకోవడం లాంటివి లైవ్ డెమో చేసి చూపించాడు, వాటిపై vasaline పూశాడు, ఆ vasaline తో నయమైన పాత గాయాల మచ్చలను ప్రూఫ్ గా చూపించాడు. ఫ్రీ సాంపిల్స్ పంచి వాడమని కోరాడు. అతని ప్రయత్నం వృధా కాలేదు, కొద్ది రోజులకు దాని ప్రభావం తెలిసి జనాలు మెడికల్ షాప్స్ లో వాటి గురించి అడగడం మొదలెట్టారు, గతంలో ఇతన్ని పట్టించుకోని మెడికల్ షాప్ వాళ్ళు ఇతని ఇంటి ముందు క్యూ కట్టారు. ఇక తర్వాతది చరిత్రే, చెప్పనవసరం లేదు vasaline మన జీవితాల్లో ఎలా భాగమైందో.
ఈ చరిత్ర అంతా 1870 లో జరిగింది. ఎప్పుడో జరిగిన చరిత్రే కావచ్చు కానీ ఎప్పటికీ నిలిచి ఉండే విజయ యాత్రే.
ఈ చరిత్ర అంతా 1870 లో జరిగింది. ఎప్పుడో జరిగిన చరిత్రే కావచ్చు కానీ ఎప్పటికీ నిలిచి ఉండే విజయ యాత్రే.
ఇది ఇవాళ నాకు నేను గుర్తుకు తెచ్చుకున్న విజయం, నాలో మరింత స్ఫూర్తి నింపుకోవటానికి.
పోయిన వారం వెంట వెంటనే రెండు ఎదురు దెబ్బలు అదీ ఒకే రోజు, రెండేళ్ళ నా శ్రమను బూడిదగా మార్చేసిన రోజు. అందులో ఒకటి ఏకంగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని దెబ్బ కొట్టేది. నేనస్సలు ఊహించని ఈ ఎదురు దెబ్బకి దభేల్ మని కింద పడిపోయా, తిరిగి లేచి పరిగెత్తడానికి కావాల్సిన స్థైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నా.
ఫీనిక్స్ అనబడే ఒక కాల్పనిక పక్షి గురించి మీరు వినే ఉంటారు. అగ్ని లో తన ప్రాణాలను కోల్పోయినా తిరిగి ఆ బూడిద నుంచి ప్రాణం పోసుకొని పైకెగురుతుంది.
ప్రస్తుతానికి ఈ రెండు దెబ్బలు నా ప్రమేయం లేకుండానే నన్ను దెబ్బదీశాయి, కోలుకోవడానికి నాకు నాల్రోజులు పట్టింది. విధి, లక్కు, తొక్క, తోటకూర అని చేతులు ముడుచుకొని కూర్చోదలచుకోలేదు. సంవత్సరం కావచ్చు రెండేళ్లు కావచ్చు, ప్రయత్నాన్ని ఆపేది మాత్రం లేదు. కొత్త రెక్కలు తొడుక్కుంటున్నా ఫీనిక్స్ పక్షి లా మళ్ళీ ఎగిరి నా లక్ష్యాన్ని చేరుకోవడానికి .
Very Good, Pavan garu!! Wishing you all the best in your endeavors.
రిప్లయితొలగించండిThanks for your support YVR gaaru.
తొలగించండిThat’s the spirit 👌. Never say die. All the best 👍.
రిప్లయితొలగించండిYes, Never Say Die.Thanks for your support Narasimhaa Rao Gaaru.
తొలగించండినిలిచి పోరాడు , విజయం మీ కాళ్ల వద్దకు చేరుతుంది .
రిప్లయితొలగించండిఆ విజయం త్వరలో అందుతుందని ఆశిస్తున్నాను రాజా రావు గారు.
తొలగించండిమరో రెండుకిలోల రాయలసీమ రాగిసంకటి (మీ కుటుంబం మొత్తానికి దిష్టితీసి) మిమ్మల్ని దెబ్బతీసినవాళ్ళకి పార్సెల్ చేయండి.
రిప్లయితొలగించండి👍👍👍
ఇదేదో బానే ఉంది నీహారిక గారు, అట్నే జేస్తా.
తొలగించండిఅన్నింటికీ బదులిస్తున్నారుగాని అసలేం జరిగిందో చెప్పట్లేదు. అతడు సినిమాలో ఎమ్మెస్ నారాయణలా ఉంది మా పరిస్థితి. "అసలేం జరిగింది. ఏం జరుగుతోంది. ఏం జరగబోతోంది? మాకు తెలియాలి. తెలిసితీరాలి"అని అరవాలనిపిస్తోంది.
తొలగించండిమీ పాటికి మీరు మసాలా దోశ తింటూ ఉండండి సూర్య గారు, నా ఏడుపుకు కారణమేమిటో మీకు త్వరలో తెలియజేస్తాను
తొలగించండి...... “మాడిపోయిన మసాలాదోశ” ........ 😀😀😀
తొలగించండితిందామంటే మసాలా దోశ దొరకదు. అది నాసమస్య. కొంతమందికి ఇదసలు సమస్యే కాదు!
తొలగించండిLooks like everyone has their own problems 😀
తొలగించండిక్షమించాలి. ఏం జరిగిందో చెప్పకపోతే అదొక సమస్యా కాదా అన్నది మాకెలా తెలుస్తుంది?కొన్నిసార్లు మీకు సమస్యగా అనిపించేది వేరొకరికి సమస్యగా అనిపించకపోవచ్చు.
రిప్లయితొలగించండిఫీనిక్స్ గురించి హరిపుత్ర సినిమాలో (అదేనండీ హారీ పాటర్ అంటారు తెలుగులో) చూపించారు.
ఒకపని చెయ్యండి. పాతరోజుల్లో పళ్ళు తోముకునేందుకు వాడే పళ్లకర్ర ఒకటి తీసుకోండి. మర్రిదైతే మంచిది, పవర్ ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని దెబ్బతీసినవారి వైపు చూపిస్తూ "అవద కేదవ్రా" అనండి. దెబ్బకి ఫినిష్.
మీరన్నది నిజమే సూర్య గారు. ఒకరి పెద్దగా అనిపించే సమస్య ఇంకొకరికి చాలా చిన్నదిగా అనిపించచ్చు.
తొలగించండిఒక వేళ నెక్స్ట్ మొంత్ జగన్ C.M కాలేకపోయాడని అతను బాధపడుతుంటే అది నాకు చాలా చిన్న విషయం గా అనిపించచ్చు. కానీ అతనికి అది చాలా పెద్ద సమస్య. మళ్ళీ ఇంకో ఐదేళ్లు లేదంటే జీవితాంతం కూడా ప్రతిపక్షంలో కూర్చోవలసి రాయచ్చు. నెక్స్ట్ టైం కు మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో తెలీదు. సో, నా రేంజ్ కి నాకొచ్చిన సమస్య కూడా అంతే పెద్దది.
మీరు చెప్పిన మంత్రం ఏదో పవర్ఫుల్ గా ఉంది పాటించేస్తాను సూర్య గారు.
వై ఎస్ ఆర్ అలా అనుకుంటే 30 సం లు ప్రయత్నించేవారే కాదు. తల్లిదండ్రుల పాపంలో పిల్లలకూ వాటా వస్తుంది. నేను పాపం చేయలేదు కదా అని అనుకోకూడదు. ఆస్థులు తీసుకుంటున్నపుడు వాస్థులూ పనిచేస్తాయి. దేవుడొచ్చి జగన్ సమస్య తీర్చేస్తాడనుకుంటున్నారు. దేవుడు రాడు ఇక్కడి ప్రజలే రావాలి.
తొలగించండిఅధికారం శక్తిమంతుల చేతుల్లోకి వెళ్ళేందుకే ఇష్టపడుతుంది. ఆ శక్తి పేరే అత్మశక్తి !
ఆ శక్తి పేరే ఆత్మశక్తి !
తొలగించండిపాలిటిక్స్ లో వందేళ్లయినా ప్రయత్నిస్తూ ఉండచ్చు, కానీ నా విషయంలో ఏజ్ చాలా ముఖ్యం నీహారిక గారు. ఏం చేసినా perticular ఏజ్ వచ్చేవరకే. ఆ తర్వాత wastage కిందే consider చేస్తారు.
తొలగించండిAgeని Wast-
తొలగించండిAgeఅన్నా,Vint-
Ageఅని మీరు ప్రూవ్ చేస్తార్లెండి ��
Nice one YVR gaaru.
తొలగించండిSometimes life's going to hit you in the head with a brick. Don't lose faith. I'm convinced that the only thing that kept me going was that I loved what I did. - Steve Jobs
రిప్లయితొలగించండిPavan garu, you WILL bounce back, pl. keep going. Your sense of humor is another big asset you have, will help you tide through difficult times.
Thanks for your support Nageswara Rao gaaru.
తొలగించండిAll the best Pavan garu
రిప్లయితొలగించండిThanks Jai gaaru
తొలగించండిMy Best of Best Wishes for you & your family, Pavan garu!
రిప్లయితొలగించండిThanks Lalitha gaaru.
తొలగించండి