ఎప్పుడూ మిడిల్ క్లాస్ ఫామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫామిలీస్ ఉండే ఏరియా లో చెత్త ఎత్తేసే ఒక మున్సిపాలిటీ వర్కర్ ను సెలబ్రిటీస్, హయ్యర్ క్లాస్ ఫామిలీస్ ఉండే పోష్ ఏరియా లోని ఇళ్లల్లో చెత్త ఎత్తేసే పని అప్పగించారు.
అబ్బో గొప్పోళ్ళు ఉండే ఏరియా అనుకొని సంతోషంతో సంకలు గుద్దుకొని వెళ్ళాడు ఆ వర్కర్. చివరికి అక్కడా అలాంటి చెత్తే ఎదురైంది, కాకపొతే స్లం ఏరియా లో ఉండే చెత్త అన్నం, దోశ, ఇడ్లీ ముక్కలతో వాసన వస్తే, పోష్ ఏరియా లో పాచిపోయిన పాస్తా, పిజ్జా, బర్గర్ ముక్కలతో కంపు కొడుతోంది.
ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి, అసలు విషయానికి వద్దాం. మొన్న ఒక సినిమా పెద్దాయన, ఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అని, ట్విట్టర్ ఏదో గొప్ప ఆలయం లాంటిదన్నట్లు సెలవిచ్చాడు.
ఓహో, అది నిజంగానే జ్ఞాన సముద్రమేమో, నిజంగా జ్ఞానం అలల్లా ఎగసి పడుతుంటుంది కాబోలు అని పెద్ద బకెట్ తో జ్ఞానం తోడుకుందాం అనుకుని ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత తెలిసింది అది ఆ పెద్ద మనిషి అభిప్రాయం, అపోహ అంతే కానీ అంత సీన్ లేదని తేలింది.
అలా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కొందరు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఫాలో అయ్యాను. అందులో కొన్ని మాత్రమే ఇంట్రస్ట్ అనిపించే విషయాలు ఉన్నాయి. మెజారిటీ అంతా నాకు చెత్తే అనిపించింది.
ట్విట్టర్ లో మహేష్ బాబు ఏమో పారిస్ లో ఫ్యామిలీ టైం అని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెడతాడు. మరో సారి, మా అమ్మ పుట్టిన రోజు అని వాళ్ళ అమ్మ గారి ఫోటో పెడతాడు. మా ఆవిడ బోలెడు కష్టపడి ఒక అవార్డ్ సంపాదించుకుంది అని రామ్ చరణ్ వాళ్ళావిడ ఫోటో పెడతాడు. శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ ఖండిస్తున్నాం అని పలువురు ప్రముఖులు పోస్ట్ పెడతారు.
మరి పేస్ బుక్ లో కూడా అంతేగా, అక్కడ మహేష్ అయితే ఇక్కడ హరీష్ అనే వ్యక్తి మేము మంత్రాలయం వెళ్ళాము అని వాళ్ళ ఫామిలీ ఫొటోస్ పెడతాడు. మా అమ్మాయికి స్టేట్ లో 5th రాంక్ వచ్చింది దీవించండి అంటారు పేస్ బుక్ లో మనకు బాగా తెలిసిన సురేష్ అయినా రమేష్ అయినా. కాకపోతే నేను అబ్సర్వ్ చేసినంతవరకూ ఇవే విషయాలను పేస్ బుక్ లో సామాన్యులు కాస్త కవితాత్మకంగా అయినా చెప్తారు.
అక్కడ ఆ మున్సిపాలిటీ వర్కర్ కి ఇక్కడ నాకూ జ్ఞానోదయం అయ్యిందేమిటంటే, ఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అయితే ట్విట్టర్ ఒక కాస్ట్లీ ఫిష్ షాప్ అని, ఎక్కడైనా చేపలు సంపాదించుకోవాలంటే ఆ చేపల కంపు భరించక తప్పదని అది షాప్ లో అయినా మార్కెట్ లో అయినా.
సోషల్ మీడియా సమస్తం
రిప్లయితొలగించండిఏదో ఒక షేర్-మహోత్సవం!
భలే చెప్పారు లలిత గారు
తొలగించండిఆయనెవరో చెప్పగానే లగెత్తుకెళ్ళి అకౌంట్ తెరిచారా?రామ్ గోపాల్ వర్మ ఉండేది ట్విట్టర్ లోనే అన్న విషయం మరిచిపోయినట్లున్నారు.
రిప్లయితొలగించండిఆ మాత్రం తెలివే నాకుండి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా సూర్య గారు
తొలగించండిఅన్నా! మరి బ్లాగులేంటో చెప్పలేదేం?
రిప్లయితొలగించండిబ్లాగులు కూడా అంతే తమ్ముడు, మనం తెలివిగా choose చేసుకోవాలి.
తొలగించండికాదేదీ బ్లాగ్ పురాణాలు/పూరణలు/రణాల కు అనర్హం !
తొలగించండికరెక్ట్ గా చెప్పారు బ్లాగ్ గురించి నీహారిక గారు.
తొలగించండిఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అయితే,ట్విట్టర్ కాకి గోల !
రిప్లయితొలగించండిఇది సరైన పోలిక నీహారిక గారు
తొలగించండిదూరపుకొండలు నునుపు
రిప్లయితొలగించండిదగ్గరకెళ్తే కుదుపు
😊😊😊😊
భలే చెప్పారు YVR gaaru, Twitter కుదుపు కు లోనై పోయా
తొలగించండినేను రెండింటిలోనూ లేనుగా, హ్హ హ్హ హ్హ 🙂. గోలగోలగా ఉంటుందని ముందే ఊహించానన్నమాట (ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్లు .... "ఐ ఆమ్ టూ ఇంటెలిజంట్") 😎. ప్రాణానికి హాయిగా ఉంది.
రిప్లయితొలగించండిబ్లాగాయణం అంతా చదివి బ్లాగుకి...you are too intelligent (పూరించుడి).
తొలగించండిఆ తెలివి లేక మేము ఇరుక్కుపోయాము నరసింహా రావు గారు, అది పద్మవ్యూహం లాంటిది, బయటికి రాలేము 😀
రిప్లయితొలగించండిబాగా చెప్పారు పవన్ గారు. నేను ట్విట్టర్ లో లేను. రెండిటికీ తేడాఏంటో అర్ధం కాదు నాకు. నిజమే. FB ఒక పద్మవ్యూహమే.వెళ్ళామా చిక్కుకు పోతాం.
రిప్లయితొలగించండిThanks for your comments Chandrika gaaru.
తొలగించండి