16, మే 2019, గురువారం

వయసెప్పుడూ అడ్డంకి కాదు - ఏర్చి కూర్చిన కథలు

"నాకు చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలని తెగ కోరిక, కానీ ముప్పయ్యేళ్ల వయసులో కరాటే  క్లాస్ కెళ్తే అందరూ నవ్వరూ?" అని సిగ్గు. 

"నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రస్ట్ ఉండేది, కానీ పదేళ్ల వయసులో నేర్చుకోవాలింది ఈ నలభయ్యేళ్ళ వయసులో ఏం నేర్చుకుంటాం?" అని బెరుకు. 

"కాలేజ్ లో చదివేప్పుడు  కథలు, కవితలు అంటూ తెగ రాసేవాడిని, ఆ తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అంటూ యాభయ్యేళ్ళు వచ్చేశాయ్, ఇప్పుడేం రాస్తాను" అని ఒక నిర్లిప్తత. 

వయసులో ఉన్నప్పుడు స్టేజి మీద ఎన్ని నాటకాలు వేసేవాడిని, ఒక్క సినిమాలో అయినా నటించాలన్న కోరిక మాత్రం అట్లాగే మిగిలి పోయింది.... జాబ్ లోంచి రిటైర్ అయిన అరవయ్యేళ్ళ వ్యక్తి మనసులోంచి బయటపడిన ఒక నిరాశ. 

"అసలు నాకున్న ఐడియాలు సరిగ్గా వర్కౌట్ చేసి ఉంటే నా చివరి దశలో వైద్యానికి సరైన డబ్బు లేక ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంత ఇబ్బంది పడేవాడిని కాదు" అనే ఆవేదన. 

ఎప్పుడో ఒకప్పుడు మనలో చాలా మంది పైన చెప్పిన ఏదో ఒక స్టేట్మెంట్ తో relate చేసుకునే ఉంటారు. 

కానీ ఒక వ్యక్తి మాత్రం 'ఈ వయసులో ఇప్పుడేం చేయగలం?' అని అందరిలా అనుకొని చేతులు కట్టుకు కూర్చోలేదు. 

ఆ దానిదేముంది, అతని విషయం వేరు, మన విషయం వేరు అని కుంటి సాకులు చెప్పడానికి వంద కారణాలు వెతుక్కుంటాం కానీ ఒక్క ప్రయత్నం కూడా చేయం.

"అదేం కాదు, నేను కనీసం ఒక వంద సార్లు ట్రై చేసి ఉంటాను." అనేవాళ్ళు ఉంటారు. మరొక్క ప్రయత్నం నిన్ను విజయానికి చేరువ చేసేదేమో ఎవరు చెప్పొచ్చారు. నువ్వు చేస్తున్న ప్రయత్నం 101 సారికే ఫలిస్తుంది అని నీ తల రాత లో రాసి ఉంటే? నువ్వు ఓడిపోయినట్లేగా.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో వ్యక్తి కూడా 1009 సార్లు ప్రయతించి ఫెయిల్ అయ్యాడు. మరి అతను 1010 సారి ప్రయత్నించకుండా అక్కడితోనే ఆపేసి ఉంటే అతను కూడా మనలో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు, ఈ రోజు అతని కథ మనం చదివే వాళ్ళం కాదు.

అతనే ఈ రోజు మన కథలో హీరో, పేరు Harland Sanders. అతను ఎక్కడ పుట్టాడు, ఏం చేసాడు, ఏం చదివాడు అన్న సోది ఈ పోస్టుకి అవసరం లేదు. ఒక చిన్న ఇంట్లో ఉంటూ అరవయ్యేళ్లు పైబడ్డ వయసుతో పెన్షన్ లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతూ,  ఓ డొక్కు కారు కలిగి ఉన్న అతని ఇంట్రడక్షన్ చాలు.


తను చేసిన చికెన్ తిని అందరూ మెచ్చుకుంటున్నారు కదా అని అక్కడితో ఆగిపోలేదు అతను. దాన్ని మరింత పెద్ద రేంజ్ కి తీసుకెళ్ళి తద్వారా తన ఫైనాన్సియల్ రేంజ్ కూడా పెంచుకోవాలి అనే సంకల్పం అతని వయసుని గుర్తుకురానివ్వలేదు.

తను వండిన ఫ్రైడ్ చికెన్ తీసుకొని లోకల్ రెస్టారెంట్స్ చుట్టూ తిరిగాడు డీల్ కోసం. ఆ డీల్ ప్రకారం, ఆ చికెన్ తయారు చేయడానికి అవసరమయ్యే 11 రకాల herbs, spices (మసాలా దినుసులు) అంతా కలిపి ఒక ప్యాకెట్ లో ఇస్తాడు. దాన్ని రెస్టారెంట్ వాళ్ళు యూజ్ చేసి ఫ్రైడ్ చికెన్ తయారు చెయ్యొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మసాలా ఆ పెద్దాయనది, చికెన్ ఏమో రెస్టారంట్ వారిది. మసాలా లో వాడే దినుసుల గురించి సీక్రేసీ మెయింటైన్ చెయ్యడానికే  తను ఇలా అన్నీ ముందే కలిపి వాళ్లకు ఒక ప్యాకెట్ లో అందిస్తాడు. ఆ రెసిపీ వాడి రెస్టారెంట్స్ అమ్మిన ప్రతీ చికెన్ మీద ఒక నికెల్ (5 సెంట్స్) ఇతనికి ఇచ్చే ఒప్పందం ఇది.

లోకల్ రెస్టారెంట్స్ వారందరూ రుచి చూసి బాగుందన్న వాళ్ళే గానీ డీల్ ఓకే చేసుకోలేదు.  వాళ్ళు ఓకే చెయ్యలేదని ఆగిపోలేదు ఆ పెద్ద మనిషి. తన డొక్కు కారు వేసుకొని యునైటెడ్ స్టేట్స్ మొత్తం తిరిగాడు ఏదో ఒక రెస్టారెంట్ తనతో డీల్ చేసుకోదా అని.

ఇలా 1009 సార్లు నో అనే రెడ్ సిగ్నల్స్ తర్వాత 1010 సారి ఎస్ అనే గ్రీన్ సిగ్నల్ ఎదురైంది. ఆ చికెన్ కోసం అమెరికా లోని చాలా మంది జనాలు  ఎగబడ్డారు, ఆ తర్వాత ప్రపంచంలో చాలా మంది.

అలా మొదలైన ప్రస్థానం 1964 నాటికి 600  ఫ్రాంచైజీలలో ఆ చికెన్ అమ్మడం దాకా వెళ్ళింది.
ఇక ఆ చరిత్ర గురించి మరింత చెప్పాల్సిన అవసరం లేదు, KFC (Kentucky Fried Chicken) బ్రాండ్ చెబుతుంది ఆ వ్యాపారం యెంత పాపులర్ అయిందో.

65 ఏళ్ళ దగ్గర చాలా మంది తమ విజయ యాత్ర ను ముగిస్తే, అతను మాత్రం అదే 65 ఏళ్ళ దగ్గర మొదలెట్టాడు ప్రపంచం నలుమూలలా తన KFC సామ్రాజ్యాన్ని విస్తరించే జైత్ర యాత్రని.

ఇక చాలు, ఈ వయసులో ఇంకేం చేస్తాం అనుకునే వారందరికీ ఈ కథ చెప్పేది ఒక్కటే Never Give-up, It’s never too late to chase your dreams అని.

35 కామెంట్‌లు:

  1. అవునండీ, వయసెప్పుడూ అడ్డంకి అవదు.

    ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గారు తన 80వ యేట బోటనీ నేర్చుకోవడం మొదలెట్టారట (తన వ్యాపారంలో ఏదో పరిశోధన చెయ్యవలసిన అవసరం వచ్చే లెండి; కారణమేదైతేనేం, వయసు అడ్డంకి అనుకోలేదుగా)

    కల్నల్ శాండర్స్ గారి KFC ఫ్రైడ్ చికెన్ కూడా అలాగే పట్టుదలకు మరో ఉదాహరణ.

    KFC గురించి క్రింద ఇచ్చిన ఫన్నీ ఫొటో చూడండి సరదాగా 🙂. ఆ మధ్య వాట్సప్ లో తిరిగింది కాబట్టి ఇంతకు ముందు చూసే వుంటారు లెండి.

    KFC store ఆవరణలో తిరుగుతున్న కోడి 😀

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది ఫోటో మేష్టారు. నేను వాట్స్ అప్ కు కాస్త దూరం మెయింటైన్ చేస్తుంటాను, కాబట్టి ఈ ఫోటో చూడటం ఇదే మొదటి సారి.

      ఎడిసన్ గారి విషయం తెలియ జేసినందుకు థాంక్స్.

      తొలగించండి
    2. వాట్సప్ కు దూరంగా ఉంటున్నారా? మీరు చాలా తెలివైనవారు సుమండీ 👌👏.

      తొలగించండి
    3. ఏదో ఈ ఒక్క విషయం లోనే కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నా మేష్టారు 😊

      తొలగించండి
    4. ఇంతకుముందు ఇదే చిత్రం సర్కులేట్ అయింది "గట్స్ అంటే ఇలా ఉండాలి"అని చెప్తూ!

      తొలగించండి
    5. అవును, ఈ కాప్షన్ బాగా కుదిరింది 👌.

      తొలగించండి
  2. మా మేనత్త తన అరవై ఐదవ యేట, చిన్నప్పటినుంచీ కల గానే మిగిలిపోయిన వయొలిన్ నేర్చుకుంటున్నారు. నా స్నేహితుడొకడు నలభై ఐదేళ్ళొచ్చాకా గిటార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు.
    హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు అన్నారోసారి, ముప్ఫైయవ పడిలో పడేవరకూ తను ఏమైనా రాయగలనని తనకే తెలియదట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరిన్ని మంచి inspiring విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మాధవ్ గారు.

      ఈ వయసులో మీ మేనత్త గారు వయొలిన్ నేర్చుకోవడం మరింత inspiring.

      తొలగించండి
  3. రెండో ప్రపంచ యుద్ధం లో చాలా దేశాలు సంకనాకిపోయి ప్రజల జీవితం బహు దుర్భరమైపోయింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో ప్రయత్నించి ఎంతోమంది నిరుపేదలే వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు, కొత్తకొత్త ఆవిష్కరణలు చేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for adding some more information to this context Surya gaaru

      తొలగించండి
    2. మన జిలేబి గారు , తన కరవై దాటి
      పద్య రచన నేర్చి , బ్లాగు బద్ద
      లుగ వెలార్చుట లెటులు మరచితిరి ? , మహా
      మహుల పనుల కడ్డ మగున వయసు ?

      తొలగించండి
    3. కరక్ట్, మాస్టారూ 👌. వయసు దేనికీ అడ్డంకి కాదు అనడానికి "జిలేబి" గారి పద్యరచన కూడా ఒక ఉదాహరణ 👏.

      తొలగించండి
    4. రాజా రావ్ గారూ, మీ పద్యం బాగుంది. ఇంతకీ దాన్ని పద్యమే అంటారా? లేక వేరే పేరు ఏమైనా ఉందా?

      ఇంక మీ పద్యాన్ని బట్టి ఈ జిలేబి గారు కాస్త పెద్ద వయసు వారిలా అర్థమవుతోంది.

      తొలగించండి


    5. రాజారావు గారి పద్యాన్ని పట్టుకుని దీన్ని పద్యమే అంటారా అని అడిగేసాడే ఈ మానవుడు ! హన్నా ! హన్నా ! ఎంత అప్రతిష్ట !


      మీ పద్యము రాజన్నా
      సూపరు ! పద్యమనియే హుజూరనెదరొ వే
      రే పేరేమైనా వుం
      దా!పద! యిట్లా అడిగిన దాంతుండితడే :)



      నారాయణ
      జిలేబి

      తొలగించండి
    6. పెద్దలు క్షమించాలి, పెద్దగా జ్ఞానం లేని వాడిని. పద్యాలు, కవితలు, సాహిత్యం లాంటి వాటి గురించి బొత్తిగా తెలీదు.

      తొలగించండి
    7. వవన్ కుమార్ గారూ ,
      మనమంతా వొకటే , మీ రడగడం తెలుసుకోవాలనే తప్ప ,
      తదితరం కాదని తెలుస్తూనే ఉంది .
      " పెద్దలు ..... తెలీదు " లాంటివి మన మధ్య
      అసలొద్దు . అంతరాలూ , వివాదాలూ లేకుండా
      హేపీగా మాటాడుకోడమే నే కోరుకునేది . ధన్యవాదాలు .

      తొలగించండి
    8. లక్కాకుల వారూ, మీ వ్యాఖ్య స్ఫూర్తిదాయకంగా ఉంది. Very positive spirit sir!

      తొలగించండి
    9. Yes It was really nice Rajarao gaaru. Let us have a healthier environment.

      తొలగించండి
    10. పవన్ గారూ మగాడి జీతం, పద్యానికి అర్థం, జిలేబి గారి వయసు అడక్కూడదు.
      షాపులో మాత్రం "ఈ జిలేబీ ఫ్రెష్షేనా"అని అడిగినా తప్పులేదు!

      తొలగించండి
    11. ఈ జిలేబీ అంటే ఎవరబ్బా? ఆడ లేడీసా లేక మగ జెంట్సా?

      తొలగించండి
    12. ఈ జిలేబి యెవురొ ? యింత వరకు తెల్దు ,
      ఆడొ ~ మగయొ కూడ నదియు తెల్దు ,
      సింగపూరు వాసి , చెన్నయి సహవాసి
      యండ్రుగాని , నిజము , అసలు తెల్దు .

      తొలగించండి


    13. ఎవరో జిలేబి యెవరో
      జవరాలా? లేక నరుడ? సరిసరి తెలుపన్!
      పువుబోడియా! పురుషుడా!
      భవానియా? పరమశివుడ? పర్పంబెచటన్ ?


      జిలేబి

      తొలగించండి
    14. # పవన్
      // "ఈ జిలేబీ అంటే ఎవరబ్బా? ఆడ లేడీసా లేక మగ జెంట్సా?" //
      -------------------
      మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటారు, తెలుసుగా? ఇది అదేనన్నమాట ☝🙂.

      తొలగించండి
    15. మీరన్నది కరెక్టే మేష్టారు, సరైన పదం వాడారు.

      తొలగించండి
  4. // "రాజారావు గారి పద్యాన్ని పట్టుకుని దీన్ని పద్యమే అంటారా ......... " //

    "జిలేబి" గారూ, ఇటువంటి వ్యాఖ్య వ్రాసినప్పుడు చివరలో సాధారణంగా మీరు "నారదా" అంటారు కదా, ఇప్పుడేమిటి నారదుడి తాతగారిని పిలుస్తున్నారు?🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నారదుడి తాతగారు, అర్థం చేసుకోవడానికి కాస్త time పట్టింది నరసింహారావు గారు

      తొలగించండి
  5. పైన మాధవ్ గారు ప్రస్తావించిన హాస్యరచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసిన "పెళ్ళిళ్ళలో చదివింపులు" అనే ఒక హాస్యభరిత వ్యాసం ఆదివారం 19-05-2019 "ఆంధ్రజ్యోతి" ఆదివారం అనుబంధ పుస్తకంలో వచ్చింది. ఆ కాలపు పెళ్ళిళ్ళలో చదివింపుల కార్యక్రమంలో అనౌన్స్-మెంట్లు అలాగే ఉండేవి 🙂. వ్యాసం సరదాగా ఉంది. ఈ క్రింది లింక్ లో చదవచ్చు.

    పెళ్ళిళ్ళలో చదివింపులు (శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పక చదువుతాను మేష్టారు., థాంక్స్ ఫర్ రిఫరింగ్. ఈవిడ గారి నవలలతో 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే సినిమా కూడా తీసినట్లున్నారు.

      తొలగించండి
    2. ఇవాళ చదివాను మీరు సూచించిన కథ, బాగుంది మేష్టారు. చివర్లో బామ్మ గారి చమక్కు మరీ బాగుంది. థాంక్స్.

      తొలగించండి