పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఎవరికి?
నీకే? మూడేళ్ళ క్రితం ఇదే రోజు బ్లాగ్ వైన నువ్వు పుట్టావు. నీలో మొదటి పోస్ట్ రాశాను.
ఓహ్! పెద్ద రాశావులే, అదీ ఒక పోస్టేనా?
ఎవరికి?
నీకే? మూడేళ్ళ క్రితం ఇదే రోజు బ్లాగ్ వైన నువ్వు పుట్టావు. నీలో మొదటి పోస్ట్ రాశాను.
ఓహ్! పెద్ద రాశావులే, అదీ ఒక పోస్టేనా?
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది
రోమ్ వాజ్ నాట్ బిల్ట్ యిన్ ఎ డే లాంటి కామన్ సేయింగ్స్ మాకు తెలుసు అయితే ఏంటంట?
విన్నవి విని వదిలిపెట్టకుండా ఆచరించడం మొదలెట్టింది ఆ ఒక్క మొదటి పోస్ట్ తోనే.
విన్నవి విని వదిలిపెట్టకుండా ఆచరించడం మొదలెట్టింది ఆ ఒక్క మొదటి పోస్ట్ తోనే.
మూడేళ్ళు రాసినందుకే మురిసిపోతున్నావే? అక్కడ పదేళ్ళ నుంచి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అలాంటి వాళ్ళే నాకు ఆదర్శం.
దీన్నే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం, బాహుబళి లాంటి సినిమా తీయాలనుకొని బొక్క బోర్లా పడటం, 'ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాను అనటం' అంటారు.
ఒక మూడ్నెల్లు రాయగలిగితే గొప్ప అనుకున్నా అలాంటిది మూడేళ్లు కంప్లీట్ చేశా. ఇలాగే ముప్పయ్యేళ్లు, మూడొందల ఏళ్ళు కంప్లీట్ ...
ఆపేయ్ అక్కడే! మూడొందల ఏళ్ళు .. అంటే నీ తర్వాత వచ్చే ఇంకో ఐదు తరాల వాళ్ళు కూడా రాస్తూనే ఉండాలి. ఇదేమైనా నువ్విచ్చిన ఆస్థి అనుకుంటున్నావా నిలబెట్టుకోవడానికి, ఇప్పటి తరం వాళ్ళే చదవడానికి ఇష్టపడట్లేదు, ఇక మహా అయితే నీ పిల్లలకు తెలుగు నేర్పించగలనేమో ఆ తర్వాత వాళ్ళు 'What is Telugu'? అని గూగుల్ నో, బోగూల్ నో అడుగుతారు నెక్స్ట్ జనరేషన్ నుంచి.
సరేలే, నేను రాయగలిగిన రోజులైనా రాస్తా.
ఏం రాస్తావ్? మొదటి సంవత్సరానికి, రెండో సంవత్సరానికి నువ్వు రాసిన పోస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
పోస్టుల quantity తగ్గి ఉండచ్చేమో కానీ, quality విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు. వీలైనంత వరకు ఇంటరెస్టింగ్ టాపిక్స్ మీదే రాస్తూ వచ్చాను అవి సీరియస్ అయినా కామెడీ అయినా సెటైర్ అయినా సెట్యూబ్ అయినా మరోటైనా. అలాగే రాస్తూనే ఉంటాను.
కానీ, మొదట్లో నువ్వు పండిస్తున్నంత హ్యూమర్ ఇప్పుడు పండించలేకపోతున్నావేమో అని నా ఫీలింగ్.
చిన్నప్పుడు స్కూల్లోనో, కాలేజీ లోనే ఆర్ధిక శాస్తంలో క్షీణోపాంత సిద్ధాంతం అని చదివి ఉంటాం. దాని ప్రకారం మొదటి స్వీట్ కంటే రెండవ స్వీట్ రుచి తక్కువగా ఉంటుంది అన్నది దాని మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఆయా సిద్ధాంతం ప్రకారం అలా అనిపించి ఉండచ్చు, నా ప్రయత్నం ఆపను, రాస్తూనే ఉంటాను వీలైనంతవరకు.

అంత నమ్మకమా?
అవును, చివరిగా ఒక చిన్న కథ చెప్తా విను. అందరికీ తెలిసిందే, కానీ అప్పుడప్పుడూ మనందరం మననం చేసుకోవసిన కథ.
నేనొద్దంటే ఆపేస్తావా ఏంటి? చెప్పు.
ఒక ఊరిలో నెలల తరబడి ప్రతీ నెలా తప్పకుండా హోమాలు చేస్తున్నారు. కానీ ఒక రోజు మాత్రం హోమం జరుగుతున్నప్పుడు హోరున వర్షం మొదలైంది.
స్వామి, ఇన్ని రోజులు కురిపించకుండా ఇవాళే ఎందుకు ? అడిగింది దేవత దేవుడిని.
అదిగో ఆ ఒక్కడు జనాల్లో అక్కడొకడు ఉన్నాడు చూశావా?
అవును, చూశా .
వచ్చిన ప్రతీసారీ వర్షం పడుతుందనే నమ్మకంతో గొడుగు పట్టుకొస్తున్నాడు. ఒక్కసారి కూడా గొడుగు తీసుకొని రాని రోజు లేదు. ఇప్పటికైనా వాడి నమ్మకం వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వర్షం కురిపించాను అన్నాడు.
అదీ కథ.
ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పావ్?
కథలో గొడుగు తీసుకొచ్చాడే వాడి లాంటి వాడినే నేను కూడా, ఏదైనా గట్టిగా నమ్ముతాను. ఇంకో కొన్నేళ్లు రాయగలనని నమ్ముతున్నాను, నా నమ్మకం కచ్చితంగా నిలబడుతుంది.
కథలో హోమం అంటే గుర్తొచ్చింది, అప్పుడేదో స్థిర యోగ హోమం చేస్తున్నానన్నావ్? యెంత వరకొచ్చింది?
అందరూ అదే అడుగుతున్నారు, హోమం పూర్తయ్యింది, ఫలితాల కోసం వెయిటింగ్ ఇక్కడ. అదయ్యాక చెబుతా.
P.S: ఈ బ్లాగ్ మొదలెట్టి మూడేళ్లు అయింది అందుకే ఈ ఊకదంపుడు పోస్ట్.

కంగ్రాట్స్ పవన్ గారూ
రిప్లయితొలగించండిThanks Jai gaaru
తొలగించండిHappy birthday, blog.
రిప్లయితొలగించండిGood job Pavan. Keep it up 👍.
Thanks mestaaru
తొలగించండిమేము కమెంట్స్(సమిధలు) వ్రా(వే)స్తూనే ఉన్నాం. మీ చూపు మాత్రం ఎక్కడో గొడుగు మీదనే ఉంది.
రిప్లయితొలగించండిHappy Blogging !
Comments రాస్తున్నందుకు thanks నీహారిక గారు.
తొలగించండినా చూపు గొడుగు మీదే ఉందా, అర్థం కాలేదు.