1, మే 2019, బుధవారం

బయోపిక్స్ - మహానాయకుడు - ఒక పరిశీలన

టి.వి లో హీరో కృష్ణ సినిమా వస్తోందని తెలిసి, కాసేపు చూశాక నా ఫేవరెట్ హీరో అయిన కృష్ణ ఇంత చెత్త సినిమాలో ఎందుకు నటించాడబ్బా? అని కాసేపు దుఃఖించి, దూరదర్శన్ లో ఇలాంటి చెత్త సినిమాలే వేస్తారు, ఫైటింగ్ సినిమాలు అస్సలు వెయ్యరు అని తీర్మానించుకుని ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాను.

మనం ఈ పోస్ట్ లో బయోపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అప్పటి నా దృష్టి లో ఆ చెత్త సినిమా ఏమిటో.

అదే అల్లూరి సీతారామరాజు. అప్పట్లో ఆ టైటిలే నాకు నచ్చలేదు. మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు చేసిన మా కృష్ణ సినిమాకు మరీ ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అని అనుకున్నాను. అప్పటికి గాంధీ గారి గురించి పుస్తకాలు భోదించినంతగా లోకల్ విప్లవ వీరుడైన మన అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం గురించి భోధించకపోవడం, అలాగే పసితనం వల్ల కావచ్చు అల్లూరి సీతారామరాజు గారి గురించి బొత్తిగా తెలీదు.

తర్వాత కొన్నేళ్ళకు అదే అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం అయిదారు సార్లు స్టేజి మీద వేసి ఉంటాను స్కూల్ ఫంక్షన్స్ లో.

తర్వాత నేను హై స్కూల్ లో చదివేప్పుడు అనుకుంటా 'అశ్విని' అని ఒక మూవీ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మూవీస్ అప్పట్లో అరుదు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా.

అశ్విని నాచప్ప నిజ జీవితానికి కాస్త మసాలా దట్టించి తీసిన సినిమా అది. అలాంటి సినిమాలను బయోపిక్ అంటారని తెలీని రోజులు. అప్పట్లో అంత నాలెడ్జి లేదు కాబట్టి, ఎవరి కథ తీస్తే వారే నటిస్తారు ఆ సినిమాలో అని అనుకునేవాడిని.  

ఆ తర్వాత స్కూల్లో చూసిన 'గాంధీ' సినిమా నన్ను సంధిగ్ధం లో పడేసింది, గాంధీ ఎప్పుడో మరణిస్తే ఇప్పుడు ఆయన మీద ఎలా సినిమా ఎలా తీశారు, ఎప్పుడో తీసి ఉంటారు, ఇప్పుడు మాకు స్కూల్ లో వేసి చూపిస్తున్నారు అనుకున్నా. 

తర్వాత ఇంకొన్ని బయోపిక్ లాంటి మూవీస్ చూశాను. ఒక రకంగా ఈ బయోపిక్  మూవీలకు మన తెలుగులో కేర్ అఫ్ అడ్రస్ లాంటి విజయ చందర్ నటించిన 'శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం', 'ఆంధ్ర కేసరి', 'కరుణామయుడు'  లాంటి సినిమాలు చూశాక క్లారిటీ వచ్చింది బయోపిక్ లో ఆ  సదరు వ్యక్తే నటించాల్సిన అవసరం లేదు అని. 

సో, ఏదైనా ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా గా తీస్తున్నప్పుడు, మనం ఆ వ్యక్తి ని ఎప్పుడూ చూడనప్పుడు అతని లేదా ఆమె లక్షణాలను మ్యాచ్ చేయగల నటుడు/నటి నటిస్తే ఈజీ గా కనెక్ట్ అయిపోతాము. 

రుద్రమదేవి సినిమా చూసినప్పుడు, రుద్రమదేవి గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప, చూసింది లేదు కాబట్టి అనుష్క అయినా నయనతార అయినా లేక కాస్త ఒడ్డు పొడుగు ఉన్న ఇంకో నటి అయినా మనం ఈజీ గా కనెక్ట్ అయిపోతాం మూవీ స్టార్ట్ కాగానే. 

మొన్నా మధ్య వచ్చిన శాతకర్ణి సినిమా విషయంలో కూడా ఇలాగే కనెక్ట్ అయిపోయా. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎలా ఉంటారో నాకు తెలీదు కాబట్టి  సైరా మూవీ లో చిరంజీవి ని చూపెట్టినా లేక వెంకటేష్ ని చూపెట్టినా నాకంత ఇబ్బంది ఉండదు. 

కాకపోతే మహానాయకుడు విషయంలో ఇక్కడే తేడా కొట్టింది. ఎందుకంటే నా ఒకప్పటి అభిమాన నటుడు, నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అయిన ఎన్టీయార్ గారి స్థానం లో బాలకృష్ణ ను చూడలేక పోయా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

మహానటి, యాత్ర సినిమాలు చూడలేదు కాబట్టి సావిత్రి గారి స్థానంలో కీర్తి సురేష్ ని, రాజశేఖర్ రెడ్డి గారి స్థానం లో మమ్ముట్టిని చూడగలనా లేదా అనేది చెప్పలేను. 

ఇక మహానాయకుడు సినిమా విషయానికి వస్తే, అసలే రాజకీయాలు అనేవి నాకు బోరింగ్ సబ్జెక్టు మరి, అలాంటిది సినిమా మొత్తం అదే అయ్యేప్పటికి మరీ బోర్ కొట్టేసింది. 

సాయి మాధవ్ బుర్రా సంభాషణల్లో లోపాలు వెతికే అంత స్థాయి నాకు లేదు కానీ అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు పంటి కింద రాళ్ళలా ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకు మనవడు, మనవరాళ్లతో మాటల సందర్భం లో 'ఇంకొన్ని బర్డ్స్ యాడ్ చెయ్, బాగుంటుంది' అని ఎన్టీఆర్  పాత్రధారి అయిన బాలక్ట్రిష్ణ ఒక పిల్లడు గీసిన చిత్రాన్ని ఉద్దేశించి అనడం లాంటివి. 1983 కాలం నాటికే 'యాడ్' లాంటి ఇంగ్లీష్ పదాలు మన తెలుగులో చొరబడలేదని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పైతే మన్నించగలరు. 

విలన్ అంటే నార్త్ ఇండియన్ యాక్టరే ఉండాలన్న మన తెలుగు సినిమా నిబంధనను అతిక్రమించడం నేరమన్నట్లు నాదెండ్ల భాస్కర రావ్ పాత్రకు అక్కడి నటుడినే తీసుకొచ్చారు. 

'బసవతారకం' గారి పాత్రకు విద్యా బాలనే ఎందుకు? మన తెలుగులో ఆ పాత్రకు తగ్గ యాక్టర్ ఎవరూ లేరా? అన్న సందేహం సినిమా చూస్తున్నంత సేపు వెంటాడింది. 

విద్యా బాలన్ అంటే గుర్తొచ్చింది, ఆ విషయం చెప్పకుండా ఈ పోస్ట్ ముగిస్తే అసలు అర్థమే లేదు, ఎందుకంటే 'డర్టీ పిక్చర్' ప్రభంజనం అలాంటిది మరి, చిన్నప్పుడు బట్ట సినిమాలు వేసినప్పుడు సిల్క్ స్మిత ను స్క్రీన్ మీద చూసిన కొన్ని లక్షల మందిలో నేనొక్కడిని. సో అలాంటి వారందరు కూడా విద్యా బాలన్ ను సిల్క్ స్మిత గా accept చేసినట్లున్నారు అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎందుకంత హిట్టయ్యింది అన్నది ఇక్కడ మరీ డిటైల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఒక రకంగా అయితే మన ఎన్టీవోడు నటించినన్ని బయోపిక్స్ లో యెవరూ నటించి ఉండరేమో కృష్ణుడు, రాముడు, రావణుడు, కీచకుడు, దుర్యోధనుడు, కర్ణుడు, చంద్రగుప్తుడు 😂  (అబ్బో చెప్పుకుంటూ పోతే ఇలా యెన్నో) అంటూ ఆయన కోణంలో వాళ్ళ జీవిత చరిత్రను చాలా వరకు సినిమాల్లో వక్రీకరించి చూపాడు. ఇప్పుడు ఎన్టీవోడి జీవిత చరిత్రను ఆయన తనయుడే కాస్త వక్రీకరించి చూపాడు చంద్రబాబుని హైలైట్ చేస్తూ.

మహానాయకుడు కి మొదటి భాగం అయిన 'కథానాయకుడు' సినిమా ఎప్పుడైనా భవిష్యత్తులో చూస్తే దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. 

59 కామెంట్‌లు:

 1. ముమ్ముట్టి అంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో చూడలేక చూడలేదు. విద్యాబాలన్ అంటే మరీ ఇష్టం సిల్క్ పాత్రలో చూడలేక చూడలేదు.
  విద్యాబాలన్ కోసం కధానాయకుడు (ప్రైం లో) చూసాను. రామారావు గారిని మహర్జాతకుడిగా చూపించారు. ఏది పట్టుకుంటే అది బంగారమయిపోయినట్లు చూపించారు. ఆయన జీవితంలో కష్టాలే లేనట్లు చూపిస్తే బయోపిక్ లాగా అనిపించలేదు.
  మహానాయకుడు చూడలేదు. లలితా సహస్ర నామాలులో లాగా అన్నీ మంచి లక్షణాలే ఉంటే దేవుడని పిలుచుకోవచ్చు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "ముమ్ముట్టి అంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో చూడలేక చూడలేదు. విద్యాబాలన్ అంటే మరీ ఇష్టం సిల్క్ పాత్రలో చూడలేక చూడలేదు." -- ఈ స్టేట్మెంట్ భలే బాగుంది నీహారిక గారు.

   తొలగించండి
  2. విద్యాబాలన్ చీరకడితే చీరకే అందం వస్తుంది.చిలిపిగా నవ్విందంటే ఎవరైనా ఫిదా అయిపోవలసిందే. సిల్క్ స్మిత కళ్ళకీ విద్యా బాలన్ కళ్ళకీ పోలికే లేదు. విద్యా బాలన్ లావు అయిపోతున్నదని నేను ఎక్కువగా ఫీలవుతున్నాను.చక్కనమ్మ చిక్కితే అందం కదా ?

   తొలగించండి
  3. ఆ మాట కొస్తే విద్యా బాలన్ నటన నాకూ ఇష్టమే నీహారిక గారు, మీరన్నట్లు చిక్కితే ఇంకా అందం.

   తొలగించండి
  4. చిక్కితే బాగానే ఉంటుంది, కానీ ఆవిడ శరీరతత్వం అటువంటిదేమో? ఇంకోవైపు .... లావుగా లేని హీరోయిన్లు కొంతమంది ... ఛాలెంజింగ్ పాత్ర / డిఫరెంట్ / వెరైటీ అని ఫీలయిపోయి ఆ వేషం ఒప్పుకుని, ఆ సినిమా కోసం కావాలని లావెక్కిపోవడం ... "చమించరాని, సహించరాని" తప్పు బయొలాజికల్ గా. ఉదాహరణకు "సైజ్ జీరో" లో అనుష్క శెట్టి, నిర్మాణంలో ఉన్న "జయలలిత" సినిమాలో కంగనా రనౌత్. padding ల తోటి, మేకప్ తోటి లావుగా కనిపిస్తే సరిపోయేదానికి ("కొబ్బరిబొండాం" లో రాజేంద్ర ప్రసాద్, "లడ్డూబాబు" లో అల్లరి నరేష్ లాగా) కృత్రిమంగా లావెక్కవలసిన అవసరమేమిటి? సినిమా పూర్తయిన తరువాత తిరిగి మునపటి ఆకారానికి వచ్చేస్తాం అంటారు .... సో కాల్డ్ సెలెబ్రిటీలకు అటువంటి సహాయం చేసే ఖరీదైన ఫిట్-నెస్ నిపుణులు ఉంటారేమో లెండి. నా వాదనేమిటంటే ... లావెక్కడం చాలామటుకు తేలికే (కొంతమంది ఏం చేసినా కట్టెపేడు లాగానే ఉంటారనుకోండి, అదృష్టవంతులు 🙁), కానీ తిరిగి కష్టపడి సన్నబడినా ముందు కృత్రిమంగా త్వరత్వరగా లావెక్కడం వలన శరీరం లోపల కొంత శాశ్వత డామేజ్ జరిగుండే ప్రమాదం ఉంటుందని నాకనిపిస్తుంది. కాబట్టి ఛాలెంజ్ ల పేరిట అదంతా అవసరమా??

   తొలగించండి
  5. అదేదో method acting అంటూ ఉందంట, ఇదంతా దాని ప్రభావం అనుకుంటా.

   పాత్రకు తగ్గట్టు బరువు మార్చడమే కాదు సదరు పాత్ర లక్షణాలను పాటించడం ద్వారా "ఇమిడి పోయి" నటించేసి ఇరగ దీయొచ్చని ఈ థియరీ చెప్తుంది. హీరో సుమన్ రాముని పాత్ర షూటింగ్ చేసినప్పుడు శాకాహారిగా మారాడని అంటారు. ఆయనకు ఎవరూ రావణుడి పాత్ర ఇవ్వకపోవడం వలన చుట్టుపక్కలో మహిళలు బతికి పోయారు!

   తొలగించండి
  6. తరచుగా లావు అవ్వడం సన్నబడడం వల్ల శరీరానికి మంచిది కాదు నరసింహా రావు గారు

   తొలగించండి
  7. కొందరు నటులు (ఉ. జూనియరు, చిరంజీవి కూడా?) ఆపరేషన్ చేయించుకొని సన్నబడ్డాడు ఇదీ చాలా రిస్కీయే. ఇటీవల ఆవిడెవరో ఆపరేషన్ వికటించి చనిపోయింది.

   తొలగించండి
  8. హహ.. రావణుడి పాత్ర :-)

   తొలగించండి
 2. ఎవరిదైనా సరే జీవిత చరిత్రను మెప్పించేలా సినిమాతెరకెక్కించడం కష్టమైన పని, పవన్ గారూ. లోపాలు / లోట్లు తప్పవు. బాలకృష్ణ ఏదో ప్రయత్నం అంటూ చేశాడుగా, కానివ్వండి. NTR, ANR లాంటి వారి జీవితం, వృత్తి సుదీర్ఘ ప్రయాణం. అనేక సంఘటనలు, పరిణామాలతో నిండున్నది. పూర్తి న్యాయం చెయ్యాలంటే కష్టమే.

  విలన్ విషయంలో మీరన్నది కరక్ట్ .... రావు రమేష్, నాగినీడు లాంటి తెలుగు నటుడెవరితోనయినా చేయించుడచ్చని నా అభిప్రాయం కూడా.

  అన్నట్లు పైన మీరన్న "బట్ట సినిమా" అంటే ఏమిటి పవన్ గారూ? నేనెప్పుడూ వినలేదు 🙁.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బట్ట సినిమా అనేదే మా పల్లెల్లో వాడే మాట నరసింహా రావు గారు. నా చిన్నతనం మొత్తం పల్లెల్లోనే గడిచింది. అక్కడ థియేటర్స్ ఉండేవి కాదు కాబట్టి నెలకోసారి మంచి హిట్టయిన సినిమాలు తెచ్చి వేసేవారు . ఏదైనా స్కూల్ గ్రౌండ్ లోనే, ఖాళీస్థలం లోనే గోడ కు తెల్ల బట్ట కట్టి దాని మీద సినిమా ప్రాజెక్ట్ చేసేవారు. ఆ సినిమా చూడాలంటే రూపాయో, రెండురూపాయలో ఎంట్రీ టికెట్ పెట్టవాళ్ళు. మా కడప చుట్టుపక్కన పల్లెల్లో వీటినే బట్ట సినిమాలు అని పిలుచుకునేవాళ్ళు . రిలీజ్ అయిన సినిమా చూడాలంటే మటుకు పక్కనుండే టౌన్ కి వెళ్ళేవాళ్ళము.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. థాంక్స్. వినోదం పంచడానికి అనేక ఉపాయాలన్నమాట. బాగుంది.

   తొలగించండి
 3. కొన్ని సినిమాలు అభిమానుల కొరకు తీస్తారు, వాటిని అభిమానులే చూస్తారు.

  ఇంకొన్ని సినిమాలు అరివీర భయంకర వీరాభిమానుల కొరకు తీస్తారు, వాటిని అరివీర భయంకర వీరాభిమానులే చూస్తారు. ఈ సినిమా ఈ రెండో కోవ లోనిదని అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాపం ఆ వీరాధి వీరాభిమానులను కూడా స్వంత డబ్బులెట్టుకొని మరీ చంద్ర బాబు గారు సినిమాకు తోలినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి జై గారు.

   తొలగించండి
  2. ఈ సినిమా నేను చూశాను. మొదటి భాగం (NTR : కథానాయకుడు) కూడా చూశాను. కానీ మీరన్న "అరివీర భయంకర వీరాభిమానుల" కోవకు చెందిన వాడిని కాను .... ఇప్పుడే కాదు, ఏనాడున్నూ. ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని ఎలా తెరకెక్కించారో చూద్దామన్న ఆసక్తితోటే సినిమా చూశాను. వర్మ సినిమా కూడా చూస్తాను ... అదీ టీవీ మీద వచ్చినప్పుడే. నేను సినిమాహాలుకు వెళ్ళి చూడను, వెళ్ళడం మానేసి కొన్ని దశాబ్దాలు అయింది .... నేను "అరివీర భయంకర వీరాభిమాని" కాదని చెప్పుకోవడానికి ఇదే ఋుజువు.

   మీరు ఈ కామెంట్ చెయ్యడంలో ఆశ్చర్యం ఏమీ లేదు లెండి. NTR గారి బయోపిక్ (మీ దృష్టిలో "భయోపిక్" ) పట్ల మీ అకారణ విముఖతను, ఎగతాళిని ఆల్రెడీ చూపించేశారుగా బ్లాగుల్లో. కాబట్టి కొత్తగా వింతేమీ లేదు.

   తొలగించండి
  3. ఆయన అభిమానిగా నా బాధ మేష్టారు, ఆ సినిమా మెదలెట్టినప్పటినుంచే అది తేడా కొట్టుద్ది అని నా ప్రగాఢ నమ్మకం.

   తొలగించండి
  4. పవన్ గారూ, కూల్. పైన నా కామెంట్ (2 May 2019 at 00:54) మిత్రుడు జై గొట్టిముక్కల గారి వ్యాఖ్యకు నా స్పందన. సరే, నా స్పందనకు వారి ప్రతిస్పందన కూడా వచ్చేసిందిగా 👇.

   తొలగించండి
 4. విన్నకోట వారూ, మీరు టీవీలో చూస్తారు కనుక "అరివీర భయంకర వీరాభిమానులు" అన్న టాగ్ మీకు అంటదు లెండి :)

  రామారావు జీవితంలో మిగిలిన భాగం (అనగా పోస్ట్-నాదెండ్ల ఉదంతం) బాలయ్య ఎప్పుడు తీస్తాడో ఏమో? ఎంచక్కా మూడో నాలుగో సినిమాలు తీయొచ్చు. అన్నీ అయ్యేసరికి మోక్షజ్ఞ బాలయ్య భయోపిక్కు మొదలెట్టేందుకు ముహూర్తం దొరికినా ఆశ్చర్యం లేదు.

  రిప్లయితొలగించండి
 5. మొదటి భాగం థియేటర్లో చూసాను. రెండో భాగం అమెజాన్లో చూసాను.
  అసలు ఈ సినిమాలకి బసవతారకం పాత్రే కీలకం. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సినిమా అయ్యింది. లేకపోతే డాక్యుమెంటరీ అయ్యేది. ఈ పాత్రని విద్యా బాలన్ బాగానే చేసింది.
  కాని నాకు అందరికంటే బాగా నచ్చింది, NTR తమ్ముడి పాత్ర. ఈ ఒక్క పాత్రే సహజంగా ఉందీ సినిమాలో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిగిలిన వారికి పోలిస్తే రామారావు మొదటి భార్య & తమ్ముడు ప్రవైట్ వ్యక్తులు కనుక ఈ రెండు పాత్రలకే curiosity value ఉంది. పైగా ఆమె చనిపోవడం & అతను పెద్దగా పైకి రావకపోవడం human interest quotient మూలాన కాస్త ఎక్కువే.

   దేవిక & కృష్ణ కుమారి పాత్రలు సినిమాలో ఉండుంటే ఇంకొంచం నడిచేదేమో?

   తొలగించండి
  2. దేవిక, కృష్ణ కుమారి పాత్రలకు అంత importance ఉందా జై గారూ రామారావు గారి రాజకీయ జీవితంలో?

   తొలగించండి
  3. రెండు సినిమాలు బసవతారకం గారి కోణంలోనే నడుస్తాయి, విద్యా బాలన్ గారు బాగా చేశారు, కాకపోతే ఎవరైనా తెలుగు నటి అయింటే బాగుండేది అని నా అభిప్రాయం bonagiri గారు

   తొలగించండి
  4. పవన్ గారూ, భయోపిక్కు మొదటి భాగం అతని సినిమా జీవితం గురించి కదండీ. ఈ రెండు పాత్రలు దానికి చెందినవి.

   తొలగించండి
  5. దేవిక, కృష్ణకుమారి అంటే కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవదు అని పెట్టి ఉండరు, అదే శ్రీదేవి, జయప్రద అయితే కాస్త గ్లామర్ పెట్టొచ్చు, కాసులు కురుస్తాయి అని వారి అభిప్రాయం అవొచ్చు.

   తొలగించండి
  6. దేవిక & కృష్ణ కుమారి బదులు జయప్రద & శ్రీదేవి: నాట్ ఆ ఛాన్స్!

   రేపెప్పుడో శ్రీదేవి భయోపిక్కు తీస్తారనుకుందాం. బోనీ కపూర్ గ్లామర్ సరిపోదు కాబట్టి అతని బదులు రాజమౌళిని చూపిస్తామంటే కుదురుతుందా? ఇదీ (కొన్ని తేడాలతో) అంతే. గ్లామర్ కంటే గ్రామర్ ముఖ్యం.

   తొలగించండి
  7. ఆ గ్రామర్ మిస్ అయినందుకే రెండు సినిమాలు బోల్తా కొట్టి నట్లున్నాయేమో జై గారు.

   తొలగించండి
  8. ఉద్యోగుల బలవంతపు "పదవీ విరమణ" పాపాన్ని నాదెండ్ల భాస్కరరావు గారి నెత్తికి చుట్టారు. ఆయనకే ఈ అఫైర్స్ (అలాగే షూటింగ్ సామాగ్రి ఇంటికి తోలుకపోవడం కూడా) అంటకట్టుంటే పోయేదేమో!

   తొలగించండి
  9. ఆ షూటింగ్ సామాగ్రి మొదటి పార్ట్ లో ఉపయోగపడి ఉంటాయిలెండి. పదవీ విరమణ ఎవరి ఆలోచన అన్నది ఎవరిదో వాళ్ళలో వారికే తెలియాలి.

   తొలగించండి
  10. బలవంతపు పదవీ విరమణ పాపాన్ని నాదెండ్ల భాస్కర రావు & అప్పటి చీఫ్ సెక్రెటరీ బీఎన్ రామన్ గార్ల (ఆయనది రామారావుకు నచ్చని కులం, పైగా తమిళుడు) మీద నెట్టాలని రామారావు ముఠా అప్పటినుండే ప్రయత్నించింది.

   Excerpt from affidavit:

   The Chief Minister charged that Mr. N. Bhaskara Rao, the then Finance Minister and the then Chief Secretary Mr. B.N. Raman *had misled him* when his Government decided to reduce the age of superannuation from 58 to 55.

   ఈ వాదనను గౌరవ న్యాయమూర్తి చిన్నపు రెడ్డి గారి నేతృత్వంలోని హైకోర్టు
   త్రిసభ్య బెంచ్ చీవాట్లు పెట్టి మరీ తిరస్కరించింది:

   It may be a *sorry confession* to make on the part of a Chief Minister, especially when it was a *momentous decision involving the lives and future* of thousands of employees. One wonders how a decision concerning the lives and the future of civil servants, who all their lives in the past, had loyally served the Government, could have been taken in *such a hasty and haphazard fashion*.

   Case: B. Prabhakar Rao & Ors. Etc vs State Of Andhra Pradesh & Ors, 19 August, 1985

   https://indiankanoon.org/doc/1066060/

   తొలగించండి
 6. అది బయో పిక్ కాదు. బుల్ బుల్ బయో గ్యాస్

  రిప్లయితొలగించండి
 7. కథానాయకుడు ఎలాగోలా చివరివరకూ చూడగలిగాం కానీ మహానాయకుడు ఒక్క పదినిముషాల తర్వాత చూడడం మా వల్ల కాలేదు. మీ ఓపిక్కి మెచ్చుకోవాలి, పవన్‌గారు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ బ్లడ్ వేరే ఆ బ్రీడ్ వేరే ఆ ఓపికే వేరే!

   తొలగించండి
  2. లలిత గారూ, ధన్యవాదాలు. మొన్నా మధ్య "వినయ విధేయ రామ" సినిమా కూడా పూర్తిగా చూశాను. ఇక మీరే ఊహించుకోవచ్చు నా ఓపికను.


   అయ్యా! జై గారు , ఆ పేటెంట్ హక్కులన్నీ బాలకృష్ణ గారికి వారి వంశానికి చెందినవి అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 😊

   తొలగించండి
 8. పవన్ గారూ వినయ విధేయ రామా సినిమా పూర్తిగా చూసినందుకు మీకో అవార్డు ఇవ్వొచ్చు. నా వరకూ నాకు "భద్ర" సినిమా కాకుండా బోయపాటి సినిమా ఏది చూడాలన్నా భయంగానే ఉంటుంది. ఆ భీభత్సమైన కథలు .. యాక్షన్ సీక్వెన్సులు .. భరించలేనంత భయంకరమైన హీరోయిజం...

  మొన్నామధ్య తిరుపతినుండి తిరిగొస్తుంటే బస్సులో "జయజయ నాయక" అనే చిత్ర రాజాన్ని బస్సులో ప్రదర్శించేశారు. బస్సులోనుండి కిందకి వెల్లలేం ఆ భయంకర చిత్రాన్ని చూడలేం. ప్రతీ ఫైటు క్లైమాక్స్ ఫైటునూ ప్రతీ సీనూ "దేశములో" ప్రభుత్వాలూ, పోలీసులూ గట్రా ఏమీలేకుండా ఒక రకమైన ఆటవిక సమాజములో బతుకుతున్నాం అన్నదాన్ని మనకు చెబుతూ ఉంటే చూడ్డం ఎంత కష్టమో..

  ఆ టార్చర్ మాటల్లో చెప్పలేనిది. కానీ బోయపాటికి కథలు, ఐడియాలు ఇచ్చేవాల్లెవరో కానీ వారికి ప్రత్యేక అవార్డులు ఏవన్నా ఇప్పించాలి. అంత వైల్డుగా ఎలా అలోచిస్తారో ఏంటో.. !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మీ ఓపిక కు వీరతాళ్ళు శ్రీకాంత్ గారు. నేనైనా టీవీ లో చూసా కాబట్టి మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటా. కానీ మీరు బలి అయిపోయారు అయితే.


   "Take it for granted" అనే మెంటాలిటీ తగ్గేవరకూ మనం ఇలాంటి సినిమాలను భరించాల్సిందే.

   తొలగించండి
  2. జయ జానకి నాయక సినిమాని మా ఊరికి దగ్గరలో ఉన్న హంసలదీవిలో తీసారు. బుద్ధ ప్రసాద్ గారు కొన్ని రోజులు షూటింగ్ ఏర్పాట్లు చేసారు. బోయపాటి శ్రీనుగారు ముచ్చటపడి వారి మనుమరాలికి వినయ విధేయ రామ లో చిన్నపిల్లల కేరక్టర్ ఒకటి ఇచ్చారు. VVR నచ్చలేదు కానీ JJN నచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కోసం చూసాను. నాకు నచ్చింది.

   తొలగించండి
  3. శ్రీకాంత్ గారూ,
   భద్ర నా ఫేవరెట్ మూవీ,ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. అందులో కూడా వయొలెన్స్ ఎక్కువే అయినా సెంటిమెంట్ మరీ ఎక్కువ కాబట్టి నచ్చింది.
   మొన్న తెలంగాణాలో ఒకడు శ్రీనివాస్ రెడ్డి అనే అతను అమ్మాయిలను చంపేసి స్పైడర్ లో విలన్ లాగా చాలా సంతోషంగా గడిపేవాడంట. గ్రామస్థులు పట్టించేదాకా తెలంగాణా పోలీసులు పట్టించుకోలేదు. అంతా అయిపోయాక టీ వీ లోకి వచ్చి వాళ్ళే పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
   దేశం, ఆటవికం,వయొలెన్స్ ....వీటన్నిటికీ ఈ సంఘటన పరాకాష్ట కాదా ?

   తొలగించండి
  4. నీహారిక గారూ,
   *రకుల్ ప్రీత్ సింగ్*
   ఆ మాత్రం నేత్రానందం దొరికినా సంతోషించి ఉండే వారమండీ, కానీ, సినిమాలో కాసేపటి తరువాత ఆవిడగారు "నందితా దాసును" మించి పోయేలా డీ-గ్లామర్ రోలులోకి వెల్లి పోయారు. అదింకో పెద్ద టార్చరు, యాక్టింగ్ వచ్చిన వాల్లు ఎవరన్నా చేసుంటే కాస్తో కూస్తో బావుండేది. ఈవిడకు యాక్టింగ్ సున్నా, క్యారక్టర్ ఏమో యాక్టింగును బాగా డిమాండు చేస్తోంది, ఇక హీరోగారి యాక్టింగు స్కిల్స్ గురించి వర్ణించే సాహసన్ నేను చేయలేను. ఒక పక్క ఈవిడ, మరో పక్క ఈహీరో తమ వచ్చీ రాని హావభావ ప్రదర్షనలతో కనిపిస్తుంటే.. నాకు రక రకాలుగా అనిపించింది.

   ఇవన్నీ వదిలేద్దాం సినిమా స్టోరీ, తీసిన విధానం బావుంది అనుకుందామనుకుంటే.. "బోయపాటి" తనదైన శైలిలో తల "బొప్పి కట్టించేటి" మేటి కదా ! ఇంకేం ఎంజాయ్ చేస్తాం..

   **JJనాకు నచ్చింది**
   మీది మామూలు గుండె కాదండీ బాబూ "ఎక్స్ట్రా లార్జు గ్రానైటు గుండె".

   తొలగించండి
  5. హరిబాబుగారినే బ్లాగొదిలేసిపోయేలా చేసిన మీ యాంక్టింగ్ టాలెంట్ ముందు నా గుండె ధైర్యమేపాటిదిలెండి.

   తొలగించండి
  6. హరిబాబును నేను బ్లాగులు వదిలేసి పోయేలా చేయడమా..
   మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు అని అందామనుకున్నా, ఎవరు ఎవరో మీకు బాగా తెలుసాయె ! మిమ్మల్ని మోసం చేయడం ప్రస్తుతం కుదరపని (నాకున్న లిమిటెడ్ వనరుల దృష్ట్యా..).

   కాబట్టి, ఇది కేవలం మీరు నామీద అభాండాలు వేసే మరో పని అని మాత్రమే నేను భావిస్తున్నాను. కానివ్వండి, మీ చిత్తం .. మా ప్రాప్తం.

   తొలగించండి
  7. అసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి తెలియాలి ఆ ఆ

   తొలగించండి
 9. హ్హ హ్హ హ్హ హ్హ, నడుస్తున్న బస్సులో “జయ జానకీ నాయకా” సినిమా వేసాడా బస్సువాడు 😀? ప్రయాణీకుల అవస్ధ వర్ణనాతీతం అయ్యుంటుంది. ఓపిక / ఓర్పు మించి బలి అవుతున్న ప్రాణికి కలిగే నిర్లిప్తత లాంటిది కలిగుంటుంది. మనిషికి అంతకన్నా helpless situation ఉండదు గాక ఉండదు 😳. శ్రీకాంత్ గారన్నట్లు అటువంటి కథలు / ఐడియాలు ఇచ్చేవారికి “ప్రత్యేక అవార్డులా” ఇంకేమన్నానా? వాళ్ళ లాగే “వైల్డ్” గా ఆలోచించి దేశబహిష్కరణ చెయ్యాలి (ఆస్ట్రేలియాకు పంపించేస్తే ఎలాగుంటుంది పవన్ 😀😀, ఒకప్పుడు ఇంగ్లండ్ నుంచి ఆ దేశానికి పంపించేసినట్లుగా ? )

  helpless situation అంటే బాపు గారి కార్టూనొకటి గుర్తొచ్చింది. పరిగెడుతున్న ట్రెయిన్లో ఒక పెద్దాయన ప్రయాణిస్తుంటాడు. ఆయన ముందు సీట్లో కూర్చున్న చిన్న కుర్రాడొకడు ఆయనతో “నాకు ఒకటి నుంచి వెయ్యి దాకా అంకెలొచ్చు తెలుసా. చెప్తానుండు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు ....................................” అంటున్నట్లు ఆ కార్టూన్ 😀.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పటికే సాఫ్ట్వేర్ అని చెప్పి మన ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చినందువల్ల ట్రైన్స్ కిట కిటలాడిపోతున్నాయని మొత్తుకుంటున్నారు, ఇప్పుడు సినిమావాళ్లను కూడా పంపిస్తారా?
   ఈ కార్టూన్ గురించి ఫస్ట్ టైం వింటున్నా, భలే బాగుంది.


   ఆ మధ్య మా బంధువుల ఇంటికి వెళితే వాళ్ళ ఫామిలీ ఫొటోస్, వీడియోస్ వరస బెట్టి మరీ T.V లో వేసి చూపించాడు.

   తొలగించండి
  2. విన్నకోట గారూ,
   మామూలుగా లేదు సీను బస్సులో అసలు. అదృష్ట మేమిటంటే స్మార్టు ఫోన్లు జనాల్ని కొంత వరకూ బ్రతికించేశాయి. చాలా మంది ఫోనులో తలెట్టేశారు. నా ఫోను చార్జింగు లేక నేను "తలంటించు" కున్నాను.

   తొలగించండి
  3. My sympathy to you శ్రీకాంత్ గారూ.
   Sorry but...😃😃😃😃

   తొలగించండి
  4. ఎవరి ఇంటికైనా వెళితే ముందుగా అడిగేది ఫోటో ఆల్బం గురించే..లక్షల్లో ఖర్చుపెట్టి డ్రోన్ కెమేరాలను పెట్టి మరీ ఫోటోలు తీయించుకునేది ఎందుకటా ? నేను తీసిన ఫోటోల్లో బాగా వచ్చిన ఫోటోలను ఎన్లార్జ్ చేసి వాళ్ళకు గిఫ్ట్ గా పంపిస్తాను కూడా..

   తొలగించండి
 10. ఇంటికొచ్చిన వారికి ఫొటో ఆల్బమ్స్ చూపించడం captive audience ను పెట్టే టార్చర్ కు మరొక ఉదాహరణ. టీవీ స్క్రీన్ మీద వేసి చూపించడం కూడానా 😲 ? అది పరాకాష్ఠ కదా.‌

  రిప్లయితొలగించండి