18, జూన్ 2020, గురువారం

అతుకుల బొంత

ఇక్కడ స్కూల్స్, ఆఫీసులు తెరుచుకున్నాయి కరోనా కాస్త తగ్గడంతో. మాల్స్ లో, హోటల్స్ లో సోషల్ డిస్టెన్సిన్గ్ ఫాలో అవుతున్నాము అనే భ్రమతో అందరూ తెగ తిరుగుతున్నారు, తింటున్నారు.

పోయిన వారం ఒక రోజు ఉద్యోగ రీత్యా క్లయింట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడో వ్యక్తి ని చూశాను. అతను కొరియనో, చైనీనో (చైనా వ్యక్తి అని నా ఉద్దేశ్యం) అయి ఉంటాడు అనిపించింది పేస్ చూస్తే. అతనితో మాట్లాడింది ఏమి లేదు కానీ నేను కూర్చున్న ప్లేస్ కి కాస్త దూరంలో కూర్చొని ఉండటం వల్ల పలు సార్లు చూడటం జరిగింది. 

ఆ తర్వాత కాసేపటికి క్లయింట్ మీటింగ్లో 55 ఏళ్ల పెద్దావిడను కలిశాను. మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే, ఎప్పుడో పాతికేళ్ళ క్రితమే వచ్చి ఇక్కడ సెటిల్ అయిందట. 

నా కొరియన్ కొలీగ్ తో కలిసి ఈ వారం మరో క్లయింట్ ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ, పోయిన వారం క్లయింట్ ఆఫీస్ లో చూసిన వ్యక్తి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని చూశాను. కాకపోతే ఈ కొరియన్స్, చైనీస్ అందరూ ఒకేలా అనిపిస్తారు అంతెందుకు నాతో పాటు వచ్చిన నా కొలీగ్ కూడా అలానే అనిపిస్తాడు నాకు కాబట్టి, అతను ఇతను ఒకరే కాదులే అనుకున్నా. ఆ తర్వాత లంచ్ టైం లో అతన్ని కలిసినప్పుడు పలకరిస్తే విషయం తెలిసింది అతను ఇతనే అని. ఈ వారం లోనే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడు అని. (నేను అక్కడ కన్ఫ్యూజ్ అయినట్లే మీరు కూడా ఈ పేరా అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయి ఉంటారనుకుంటా)

అక్కడ కిచెన్ లో ఫ్రిడ్జ్ పై అతికించిన నోట్ ఒకటి ఆశ్ఛర్య పరిచింది. 'దయచేసి ఇంకొకరి ఫుడ్ తినకండి' అని. కరోనా హెచ్చరికేమో 'ఒకరి ఫుడ్ మరొకరు షేర్ చేసుకొని తినకండి అని' చెప్పడానికి కాబోలు అనుకున్నా. కానీ, గతంలో ఎవరో కొందరు కక్కుర్తి వ్యక్తులు ఇంకొకరి ఫుడ్ ఖాళీ చేశారట, అప్పటి నుంచి ఆ స్టికర్ అతికించారట. ఏ దేశమేగినా కక్కుర్తి వ్యక్తులకు కొదవ లేదన్నమాట. గతంలో నేను ఇండియాలో H.P కంపనీ లో పనిచేసేప్పుడు లంచ్ బాక్సులు ఉంచుకోవడానికి అప్పట్లోనే మాకు ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు.  ఒక రోజు మధ్యాహ్నం లంచ్ కి వెళ్ళి చూస్తే నా బాక్స్ లోని చికెన్ ఫ్రై ఖాళీ చేశారు ఎవరో.  ఇంకోసారి నా కొలీగ్ కి ఇలాగే జరిగింది. ఆ తర్వాత పప్పు, సాంబార్ లాంటివి తప్పితే స్పెషల్ లంచ్ బాక్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేవాడిని కాదు.  

గతంలోంచి ప్రస్తుతానికి వస్తే, ఆ రోజు లంచ్ తర్వాత క్లయింట్ మీటింగ్ ఒకటి జరిగింది. అందులో మన తెలుగమ్మాయి కూడా ఉంది. మీటింగ్ తర్వాత మాట్లాడుతుంటే తెలిసింది, పోయిన వారం నేను కలిసిన ఆ పెద్దావిడ కూతురే ఈ అమ్మాయి అని.

ఇలా ఒక్క వారం లోనే రెండు యాదృచ్ఛిక ఘటనలు జరిగాయి. ప్రపంచం చాలా చిన్నది అంటారు కదా ఇక దాంతో పోలిస్తే సిడ్నీ యెంత అని అనిపించింది అప్పుడు. 

ఇంకో విషయం ఏమిటంటే అదే ఆఫీస్ లో ఇద్దరు ఇండియన్ అమ్మాయిలు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య నా కొరియన్ కొలీగ్ కి కన్ఫ్యూషన్ఏర్పడింది. ఇందాకే కదా ఆ అమ్మాయి లంచ్ చేస్తూ ఉండేది, ఇప్పుడిలా ఇక్కడ మీటింగ్ రూమ్ లో ఎలా ఉంది అన్నాడు. 

'మన ఊరి నుంచి వాళ్ళ ఊరికి యెంత దూరమే, వాళ్ళ ఊరి నుంచి మనూరికి అంతే దూరం కదా' అనే విషయం గుర్తొచ్చింది. మనం కొరియాన్స్ ను గుర్తు పట్టడం లోనే కాదు, మన ఇండియన్స్ ని గుర్తు పట్టడంలో వారికీ ఇదే కన్ఫ్యూషన్ ఉంటుందని. ఇలాంటి కన్ఫ్యూషనే నాకు  చిన్నప్పుడు పల్లెల్లో జీవాల విషయంలో ఉండేది. చూడ్డానికి అన్ని గొర్రెలు, ఆవులు, కోళ్లు, మేకలు ఒకేలా ఉండేవి కానీ పల్లెలో వారు గుర్తు పట్టేవారు, నాకు మాత్రం అన్నీ ఒకేలా అనిపించేవి. 

ఒక్క టాపిక్ మీద బ్లాగ్ పోస్ట్ రాయకుండా పుల్లగూరలా అన్ని విషయాలు కలగాపులగం చేసావు ఏంటీ 'అతుకుల బొంత చదవాల్సిన ఖర్మ మాకు' అని అంటారా?

నిన్న నాకూ  అదే అనిపించింది 'యెంత మంచి వాడవురా' సినిమా చూసినప్పుడు. అదేంటో ఆ సినిమాలో సీరియల్ లోని ఎపిసోడ్స్ లాగా ఒక స్టోరీ మొదలవుతుంది కాసేపటికి అది ముగిసి మరోటి మొదలై అదీ ముగుస్తుంది. సినిమా అంతా ఇంతే. అదేదో భాషలోని సినిమాని మనోళ్లు ఎత్తుకొచ్చి తెలుగీకరించినట్లు ఉన్నారు అన్ని మసాలాలు కలిపేసి.

రాజీవ్ కనకాల విలన్ పాత్ర చేశాడు ఈ సినిమాలో. అతను హీరో ఇంటికి వెళ్లి బెదిరించినప్పుడు పూర్తి గడ్డం తో ఉంటాడు. ఆ తర్వాత మరో గంటకే హీరో వెళ్ళి రాజీవ్ కనకాలను బెదిర గొట్టినప్పుడు కొంచం గడ్డంతో ఉంటాడు, సరేలే ఈ గంటలో కాస్త గడ్డం ట్రిమ్ చేసుకున్నాడేమో అని సరిపెట్టుకుందామనుకుంటే వార్నింగ్ సీన్ ముగిసి ఫైట్ సీన్  మొదలయ్యేసరికి మళ్ళీ బాగా పెరిగిన గడ్డంతో ఉంటాడు. కంటిన్యూటీ బాగా  మిస్ అయినట్లు ఉంది ఆ సీన్స్ లో. 

సినిమా అంతా ఏదో సీరియల్ లాగా 10 ఎపిసోడ్స్ ఉన్నట్లు ఉంటుంది.  కథ అంతా ముక్కలు ముక్కలు గా ఉంటుంది. కాస్తో కూస్తో ఉన్నంతలో తనికెళ్ళ భరణి ఎపిసోడ్ మాత్రమే బాగుంటుంది. ఇక శరత్ బాబు, సుహాసిని ఉండే ఎపిసోడ్ అయితే మాత్రం సీరియల్ కంటే దారుణంగా హింసిస్తుంది.

హీరోయిన్ కి హీరో ని ప్రేమించడం తప్ప వేరే జీవితాశయాలు లాంటివి తెలుగు సినిమాల్లో ఉండవు కాబట్టి, ఈ సినిమాలోనూ చిన్నప్పటి నుంచి హీరో ని తెగ ప్రేమిస్తూ ఉంటుంది.

సరేలే, అంత ఖర్చు పెట్టి తీసిన సినిమానే అలా తీయగా లేనిది నేను ఈ పోస్ట్ ఇలా అతుకుల బొంతగా రాస్తే పోయేదేముంది అని రాసేశా. అదీ సంగతి, చిత్తగించగలరని మనవి.

అన్నట్లు, హీరో హీరోయిన్స్ పేరు చెప్పనే లేదు కదూ పైన మెన్షన్ చేసిన సినిమాలో.  హీరో ఏమో నందమూరి నట వారసుల్లో ఒకడు, హీరోయిన్ ఒక తెల్లతోలు పిల్ల.  ('తిరుమల వెళ్లి 'గుండాయన నా మొగుడు, కనపడటం లేదు మీరు ఎవరైనా చూసారా?' అనేది మీకు గుర్తొస్తే నాకు సంబంధం లేదు)

58 కామెంట్‌లు:

  1. ఎంతమంచివాడవురా అన్నారు. హీరో హీరోయిన్లు ఎవరో రాయలేదు. ఎలా తెలుస్తుంది. మళ్ళీ గూగుల్ లో వెతుక్కోవాల్సి వచ్చింది. క్లయింట్ కంఫర్ట్ గురించి బొత్తిగా ఆలోచన లేదు మీకు☺️☺️

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమిటి, ఆ సినిమా చూసేద్దామనే, సూర్యా 😳???
      మీ ఇష్టం (వేరే పదం ఉంది గానీ అది వాడటం లేదు ఇక్కడ 🙂). All the best, you will need it.

      తొలగించండి
    2. నాకు మల్లే, అందరు పాఠకులకి మంచి సినిమా పరిజ్ఞానం ఉంటుందని భ్రమ పడటం నా పొరపాటేమో సూర్య గారు :)

      తొలగించండి
    3. విన్నకోటాచార్యా.. "మీఖర్మ.." అందామనుకున్నారు కదూ. అనేయండి ఏం పరవాలేదు!! ప్రతీ సినిమాని చూసే తీరిక ఇప్పుడు లేదులెండి.
      సినిమా పేరు వార్తల్లో విన్నాను కనుక గుర్తుంది కానీ తారాగణం గుర్తులేదు.

      తొలగించండి
    4. దాన్లో వీరో.. పెపంచికం మొత్తానికి తానే అసలైన అమాయకుడిలా పియ్యేసు పెడుతుంటే... మా అపార్ట్మెంటుకు బావి లేదుగానీ... వుంటే దూకేద్దునో ఏమో.. మీకు ఆ సినిమా చూడమని ఎవడైనా రిఫర్ చేశాడంటే మాత్రం.. వాడు మీ హత్యకు కుట్ర పన్నాడన్నమాటే!

      తొలగించండి
    5. వారసుల నుంచి ఎక్కువ నటన ఆశించకూడదు చిరు గారు. తప్పక అలవాటు పడిపోతాం నిదానంగా.

      తొలగించండి
  2. // “ ఈ పేరా అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయి ఉంటారనుకుంటా)” //

    బాగా 😳.
    చదివి, ఒక్కసారి తల తిరిగినట్లయ్యి అలాగే కూర్చుండి పోయాను 😕.
    అసలు పొద్దుటే ఏమిటి మాకీ identification parade శిక్ష ? దానికి తోడు ఆ సినిమా ... ఆ సినిమా ... చూసిన మీ బాధ మాకు కూడా అంటించడం ఏమిటి 😡?
    మీ బ్లాగు వ్రాతల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళను ఇలా హింసించడం ఏం బాగాలేదు, పవనూ☝️.
    సర్లెండి, మీ మీద లాక్-డౌన్ దుష్ప్రభావం అని సరిపెట్టుకుందాం ప్రస్తుతానికి 🙂? వారాంతం వచ్చేస్తోంది కదా, అప్పుడు తలంటి పోసుకుని రిలాక్స్ అవ్వండి, ఆ ప్రభావం నుండి కొంతైనా బయటపడతారేమో.

    (రేపు ఆదివారం నాడు సూర్యగ్రహణంట, ఇక దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఏమిటో 🤔 ?)
    jk 🙂

    రిప్లయితొలగించండి
  3. వలచిన అరటిపండు కాకుండా పనసపండు ఇచ్చినట్లున్నాను. అయితే ఈ సారి చీవాట్లు తప్పవన్నమాట. అంతేనంటారా మేష్టారు?

    రిప్లయితొలగించండి
  4. డొక్కు సినిమాలు చూసి డోకు తెచ్చుకోవడమే జీవితాశయంగా పెట్టుకున్నారా మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గతి లేనమ్మకు గంజే పానకం అంటారు కదా అలా నాకూ, ఏదో టైంపాస్ కోసం తప్పదు జై గారు.

      తొలగించండి
    2. ఇంతకీ "డొక్కు సినిమా" అన్నది సినిమా చూసి డిసైడ్ అయినట్లా చూడకుండా ముందే డిసైడ్ అయినట్లా?!

      తొలగించండి
    3. కొన్ని సినిమాల వాసన పసి గట్టేయచ్చు చూడకుండానే అదేనేమో జై గారి ఉద్దేశం

      తొలగించండి
  5. Funny post pavan garu.

    దర్శకుడు సతీశ్ వేగేశ్న శతమానం భవతి సినిమా బాగా హిట్టయ్యింది.

    అయితే ఫేమిలీ సెంటిమెంట్లు ఎక్కువ నింపి సినిమాలు వరుసగా తీయడం తో బుచికోయమ్మ బుచికి అవుతున్నాయి.🐀🐁🐀🐇

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నచ్చినందుకు ధన్యవాదాలు బుచికి గారు. శతమానం భవతి అయితే కొద్ధి వరకు కామెడీ తో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం అయితే నరకమే.

      తొలగించండి
  6. ”నీకు వుండి నాకు లేక ఒకటేలే”
    ఇద్దరు స్త్రేల మధ్య డవిలాగు.....
    అర్ధ తాత్పర్యములు, సమయ, సందర్భములు వివరించుము......ఏమా కథ
    బలే ఛాన్సులే...............10 మార్కులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1960వ దశకపు “గుండమ్మ కథ” సినిమాలో ఛాయాదేవి (“నాకు లేక”) జమునతో (“నీకు వుండి”) అనే డైలాగ్ కాదూ?

      తొలగించండి
    2. వినరావు.........5/10 మార్కులు

      తొలగించండి
    3. అజ్ఞాత గారు, మరీ డైలాగ్ హింట్ ఇచ్చి కనుక్కోమంటున్నారు, నా వల్ల అయితే కాదు, చేతులెత్తేస్తున్నాను.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. నేనిచ్చిన basic answer సరియైనదేనన్నమాట, గుడ్.🙂
      ప్రశ్నలో రెండో భాగం కూడా ఉందా? గమనించలేదు. అయితే ఈ రకంగానే పరీక్షల్లో సెకండ్ క్లాస్ వస్తుందన్నమాట? 😕

      తొలగించండి
  8. అసలు విషయం ఇప్పుడు బోధపడిందన్నమాట 😃.
    మీరే నయం మేష్టారు కనీసం సగం జవాబు చెప్పారు, నేనింకా అదేదో బూతు డైలాగ్ అనుకున్నాను ఇప్పడచ్చే సినిమాల్లో లాగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Ha ha, పవన్. ఆన్లైన్ క్లాసుల జోకు లాగా ... నేనేం చెప్పానో, మీకేం బోధపడిందో🙂? మరోసారి చెబుతాను, ఎందుకైనా మంచిది 🙂👇.

      అలనాటి “గుండమ్మ కథ” సినిమాలో ఛాయాదేవిది విధవ పాత్ర; జమున పెళ్ళయి కూడా పుట్టింట్లోనో ఉంటుంది తన తల్లి గుండమ్మ (సూర్యకాంతం) గయ్యాళితనం వల్ల. ఒకసారి ఛాయాదేవి గుండమ్మ గారింటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్న జమునను చూసి అనే డైలాగ్
      అన్నమాట అది (“నీకు ఉండీ, నాకు లేకా” = మొగుడు).

      ఇక “మీరే నయం మేష్టారు” అంటే ... అవి మా తరం సినిమాలు కదా. “ఏదీ, ఓ సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి” అనే డైలాగ్ ఏ సినిమాలో ఎవరు చెబుతారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఠకీమని చెప్పేస్తారుగా, అలాగన్నమాట 😁.

      తొలగించండి
    2. ఆన్లైన్ క్లాసులలో మీరన్నట్లు సగం అర్థమవుద్ది, మిగతాది అర్థమవదు.

      విడమరచి చెప్పినందుకు ధన్యవాదాలు మేష్టారు. మీరు మాత్రం అన్ని తరాలను పట్టేసారుగా. ఈ తరం సినిమాలు కూడా చూస్తున్నట్లు ఉన్నారు.

      మీరు సందర్భం కూడా వివరించారు కాబట్టి ఇప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తారేమో అజ్ఞాత గారు ఇప్పుడు.

      నాకు అర్థం కానీ విషయం ఏమిటంటే ఆ డవిలాగు ఇక్కడ ఎందుకు అడిగారు ఆ అజ్ఞాత గారు అనేది?

      తొలగించండి
    3. ఎందుకు అడిగారు అని నాకూ అర్థమవడంలేదు, పవన్ 🤔.
      ఇక ఏమిటంటే, ఛాలెంజ్ చేశారు కాబట్టి వీరోచితంగా take up చేశానన్నమాట 😎.

      తొలగించండి
    4. వినరావు......
      Old marks 5+3 marks new=8/10
      Good answer.

      తొలగించండి
    5. అయ్యా / అమ్మా (“Anonymous”), ఇంకా ఏం బాకీ ఉంది 🤔?

      తొలగించండి
  9. వినరావు......
    Delayed and answers with books won't carry full marks.

    రిప్లయితొలగించండి
  10. బుక్స్ చూసి జవాబు చెప్పవలసిన అవసరం నాకు లేదు. తెలియకుండా మాట్లాడకండి.

    ఆలస్యంగా స్పందిస్తున్నది మీరు (time zone తేడాలేమన్నా ఉన్నాయేమో?). నా మొదటి సమాధానం వెంటనే ఇచ్చాను. ప్రశ్నలో ఇంకా ఉంది అని మీరన్న తరువాత రెండోభాగానికి జవాబిచ్చాను. ఆలస్యమెక్కడుంది? “ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదు” అంటూ అన్యాయపు నిబంధన విధిస్తున్న విద్యాశాఖాధికారుల తీరులాగా ఉంది మీరు మాట్లాడుతున్నది. అయినా ఈ ముక్క మీ ప్రశ్నతో పాటే మొదటే చెప్పుండాల్సింది మీరు. అసలు బ్లాగులు చూస్తూ కూర్చేవడమే కాదు నా పని.

    Enough is enough.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎక్కడైనా అనాథలకు మనం బిచ్చమెయ్యాలిగాని అనాథలు మనకి మార్కులు వెయ్యట్లేదని బాధపడటం ఏమిటండీ మరీనూ.
      మీ సమాధానం కరెక్టే అని గుండమ్మ కథ సినిమా గుర్తున్న నేను కూడా గుర్తిస్తున్నా!

      "We are not here because we are free. We are here because we are not free"
      ఇది ఏ సినిమాలో డైలాగో చెప్పుకోండి చూద్దాం!

      తొలగించండి
    2. మళ్ళీ ఇంకో క్విజ్జా? నా వల్ల కాదు సూర్య గారు.

      తొలగించండి
  11. సూర్య,
    Thanks for the marks on గుండమ్మ కథ.
    ఇక “అనాథ”లంటారా, సినిమా మోజు. ఎంత పనైనా చేయిస్తుంది కదండీ. అయితే ఈ “అజ్ఞాత” గారి పదగుంఫనం చూస్తే ఎవరో పరిచయమున్న వ్యక్తే అనిపిస్తున్నారు, కాని గుర్తు రావడం లేదు.

    సరే పోనివ్వండి గానీ .... మీరు కోట్ చేసిన ఆ ఆంగ్ల డైలాగ్ Richard Attenborough గారి “గాంధీ” (Gandhi) చిత్రంలోనిది. సినిమాలో దక్షిణాఫ్రికాలో తనిచ్చిన ఒక ఉపన్యాసంలో గాంధీ గారు అన్న మాటలివి. Ok నా?

    Note :- మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం నేనే “బుక్కూ”నూ రిఫర్ చెయ్యలేదు, గూగులించలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేష్టారు, మీ memory చాలా బలంగా ఉన్నట్లు ఉందే.

      తొలగించండి
    2. థాంక్స్, పవన్. Toast is the secret of my memory 👍 .... 😁😁 (ఆహా, ఏదైనా కంపెనీ వారు వాళ్ళ వ్యాపార ప్రకటనకు నన్ను మోడల్ గా తీసుకుంటారేమో 🙂🙂?)

      నిజానికి ఇక్కడ ఇచ్చిన డైలాగులు నాకు గుర్తుకు రావడం కాకతాళీయంగా జరిగిందే గానీ చూసిన అన్ని సినిమాల డైలాగులు (ముఖ్యమైనవి) అంతేమీ బుర్రలో అతుక్కుపోలేదు.

      సరే గానీ, నేనిచ్చిన జవాబు సరియైనదా కాదా confirm చెయ్యవలసిన ప్రశ్నడిగిన పెద్దమనిషి ఏమీ చెప్పలేదే 🤔? వారు సరేనన్న తరువాత కదా celebrate చేసుకునేది (ఇదే పనా అని వారు అనక ముందే వారు బహుశః భూగోళానికి అవతలి వైపు నివాసి యేమో, time zone తేడాలు ఉన్నాయేమో అనుకుని benefit of doubt ఇచ్చేద్దాం 🙂).

      తొలగించండి
    3. toast ఏమిటి మేష్టారు? నాకు తెలీని మీనింగ్ ఏమైనా ఉందా ఏమిటి? కాస్త వివరిస్తారా.

      సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే ఫలితాలు తేలకుండానే విజయోత్సవాలు జరుపుకుంటున్నారుగా ఇదీ అంతే అనుకోండి.

      తొలగించండి
    4. సినిమా ఫట్ అనుకుంటాను, పవనూ 👎😕. నేనిచ్చిన సమాధానం (గాంధీ) తప్పనీ, ఎవడో మాట్రిక్స్ చెప్పాడనీ ఇందాక ఓ మిత్రులు ఇ-మెయిల్ ద్వారా తెలియజేశారు. మాట్రిక్సులూ, అవతారాలూ లాంటి సినిమాలు నేను చూడను, కాబట్టి అటు వైపు ధ్యాస మరలలేదు అన్నమాట.

      సో, అదీ సంగతి. మరీ ఘనమైన మెమరీ కాదని తెలిసిపోయింది ... సూర్య వేసిన గుగ్లీ వలన 😒 (బహుశః సూర్య కూడా అందుకే నా జవాబు గురించి diplomatic గా సైలెంట్ గా ఉండిపోయినట్లున్నాడు 👌).

      https://youtu.be/nYTDwZFupe4

      తొలగించండి
    5. పర్లేదులెండి మేష్టారు, ప్రయత్నించి ఓడటంలో తప్పు లేదు.

      తొలగించండి
    6. విన్నకోటవారూ , కాస్త పని ఒత్తిడివలన బ్లాగ్దర్శనం ఆలస్యమైంది మన్నించగలరు.
      గాంధీ సినిమాలో ఆ డైలాగ్ ఉందో లేదో తెలియదండీ. మీరు చెప్తే ఒప్పేసుకుంటాను. నేను మాత్రం matrix రెండో భాగం లో చూసాను. ఏజెంట్ స్మిత్ హీరో నియో తో అన్న డైలాగ్. అక్కడ జరిగే ఫైట్ చూసి నచ్చి మెగాస్టార్ గారు స్టాలిన్ సినిమా క్లైమాక్స్ లో అలాంటిదే ఓ ఫైట్ పెట్టుకున్నారు. వందమందితో ఒక్కడన్నమాట!☺️

      తొలగించండి
    7. పవన్ జీ మీ బ్లాగులో లింకుని కాపీ చెయ్యడం కుదరట్లేదు. CMM level5 సెక్యూరిటీ యా ఏమిటి?
      పైన మాస్టారు ఇచ్చిన లింకు ఓపెన్ చెయ్యడం ఎలాగో అర్థం కాక బట్టతల వచ్చేస్తోంది!

      తొలగించండి
    8. సూర్య గారు, అలాంటిదే అనుకోండి.

      స్టాలిన్ లో నచ్చనిది ఆ లాస్ట్ ఫైట్, అదీ కాపీ బాగోతం అన్నమాట.

      తొలగించండి
  12. హహహ హిలేరియస్ పవన్ గారూ :-) ఆ సినిమా చూడ్డమే కాక రాజీవ్ కనకాల గడ్డం కంటిన్యుటీ కూడా గమనించారంటే మీరు కరోనా లాక్ డౌన్ ని పూర్తిగా వినియోగించుకున్నట్లు కనిపిస్తుంది :-))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నచ్చినందుకు ధన్యవాదాలు వేణు గారు.
      అదేం పిచ్చో తెలీదు కానీ, సినిమా ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా చూడాలి అన్నది నా అలవాటు అది సుత్తి సినిమా అయినా సరే.

      తొలగించండి
    2. హహహహ ఈ ప్రమాదకరమైన అలవాటు నాక్కూడా ఉందండీ ఏం చేస్తాం సినిమా మీద ప్రేమ అంతే :-)

      తొలగించండి
    3. మీరిద్దరూ చాలా నయం. పాత రోజుల్లో సినిమా హాల్లో మొట్టమొదట స్లైడ్స్ (పొగ త్రాగరాదు, ఎదుటి సీటుపై కాళ్లు పెట్టరాదు, నిశ్శబ్దం ... లాంటి హెచ్చరికలు, లోకల్ షాపుల అడ్వర్టైజ్మెంట్లు (షాపు ఓనరుడి బొమ్మతో సహా 😕) వగైరా లన్నమాట)), తరువాత Films Division (Govt of India) వారి Newsreel, ఆ తరువాత అసలు సినిమా వేసేవారు. చివర్లో జాతియగీతం వేసేవారు, అందరూ లేచి నిలబడాలి. “మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏమిటంటే” (🙂), ఆ రోజుల్లోని కొంతమంది అరివీర భయంకర సినిమాప్రియులు మొదటి స్లైడ్ నుండీ చివర్లో జాతీయగీతం వరకూ వదలకుండా చూసి తీరవలసినదే అని పట్టు పట్టేవారు, హహహహ. వాళ్ళకు అప్పుడే సినిమా పూర్తిగా చూసినట్లు లెక్క 🙂.
      ఈ కాలపు సినిమా హాళ్లల్లో అటువంటివి ఇంకా ఉన్నాయో లేదో తెలియదు.

      తొలగించండి
    4. హహహహ నరసింహారావు గారు.. నిజమేనండీ నా మిత్రుల్లో కూడా ఇలాంటి వారున్నారు. నాకు మరీ ఇంత కాదు కానీ నే వెళ్ళేసరికి సినిమా మొదలైతే మాత్రం చూసినట్లు ఉండదు. మీరు చెప్పిన వాటిలో న్యూస్ రీల్, జాతీయగీతం తప్ప మిగిలినవి అన్నీ ఇప్పటికీ ఉన్నాయండీ. వీటికి తోడు సెల్ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి బయట తినుబండారాలు అనుమతించబడవు లాంటివి అదనం కూడానూ :-)

      తొలగించండి
    5. మొదట వెల్కం బిట్ వేస్తాడు. ఆ తరవాత "నోర్మూసుకో, సెల్ మడిచి లోపల పెట్టు, తినేటప్పుడు DTS ఎఫెక్ట్ అక్కర్లేదు, పక్కవాడిని కెలక్కు" అనే మెసేజ్ లు స్లైడ్స్ గానో యానిమేషన్ రూపం లోనో వేస్తాడు.
      ఇంక ఆతరువాత 10నిముషాలు రాబోయే సినిమాల యాడ్స్. "హ్యారీపోటర్ తీసినోడే తీసిన సినిమా, అదిగో ఐరన్ మాన్, ఇదిగో బ్యాట్మాన్, ధానోస్ తన్నులు తింటాడా, ఎక్స్ మెన్ సంగతేంటి, చిరాకేస్తే ఇదిగో స్పేస్ షిప్ లో interstellar ప్రయాణం" ఇలా ఒక్కో ట్రైలరూ ఒక్కో అనుభూతిని పంచుతుంది. అసలు ఆ సౌండ్ ఎఫెక్టూ విజువల్సు ఉన్నాయి చూసారూ. కథానాయకుడు ట్రైలర్ చూసినా బాహుబలి రేంజిలో అనిపిస్తుంది. ఇలా నెక్స్ట్ ఎప్పుడెప్పుడు థియేటర్ కి రావాలో ఆలోచిస్తుండగానే లైట్స్ డిమ్ అవుతాయి. సినిమా మొదలవుతుంది. ఇక ఆ తరువాత ఎవరి ఖర్మ వారిది. కొందరికి రస సిద్ధి కలుగుతుంది. కొందరికి కోక్ కిందకి జారి ప్రకృతి పిలుస్తూ ఉంటుంది!
      ఏదేమైనా అసలు సినిమాని థియేటర్ లో చూస్తేనే మజా అంటాన్నేను!

      తొలగించండి
    6. భలే భలే సూర్య గారు, కోక్ కిందకు జారడం మాత్రం కేక, నవ్వు తెప్పించింది ఆ వాక్యం. కొంతమంది ముందే వెళ్ళి రారో ఏమో తెలీదు కానీ సినిమా మొదలైన పది నిముషాలకే గంట కొట్టి రావడానికి బయల్దేరతారు అందరి కాళ్ళు తొక్కుకుంటూ.

      తొలగించండి
  13. "ఎంత మంచివాడవురా" సినిమా చూస్తే ఎలా వుంటుందో చూడకుండానే తెలిసిపోయింది నాకు :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరీ బ్యాడ్ కాదు కానీ ఏదో ఒక సినిమా చూడాలి అని అనిపిస్తే చూసేయచ్చు లలిత గారు.

      తొలగించండి
    2. అంతేకాని గుండమ్మ కథ సినిమా చూస్తానని మాత్రం అనరు!

      తొలగించండి
    3. అవును సూర్య గారు, పాత క్లాసిక్స్ కొన్ని చూడలేదు ఇప్పటిదాకా.. గుండమ్మ కథ, మిస్సమ్మ, పాటల భైరవి లాంటివి. ఎందుకో మరి ఇప్పటికీ చూడనేలేదు.

      తొలగించండి
    4. "పాటల భైరవి" అనేది పాత సినిమా కాదండీ. కొత్త షార్ట్ ఫిలిం. మన బాలయ్య బాబు నటించారు☺️☺️

      తొలగించండి
    5. 😁😁😁. చాలా రోజులే ఆడినట్లుంది కూడా 😁😁.
      More seriously, తన “బోల్డన్నికబుర్లు” బ్లాగులో పాటల మీద తను వ్రాసిన పోస్టులకు చివర లలిత గారి సిగ్నేచర్ కూడా “పాటల భైరవి” యే 🙂.

      తొలగించండి