మన తెలుగు సినిమాల్లో ఒక ఇరవయ్యేళ్ళ కిందట సినిమా టైటిల్స్ విషయంలో ఒక ట్రెండ్ ఫాలో అయ్యేవారు అనుకుంటా. 'విచిత్ర' అనే పదం పేరులో ఉండే సినిమా వచ్చి హిట్ అయిందంటే ఇక విచిత్ర ను ముందో వెనుకో తగిలించుకొని కొన్ని పదుల సినిమాలు తయారయిపోయేవి.
విచిత్ర దంపతులు
విచిత్ర జీవితం
విచిత్ర కుటుంబం (మరీ అంత విచిత్రం యేమీ ఉండదు ఆ కుటుంబం లో, ఏదో ఆ సమయానికి అలా పేరు పెట్టేసి ఉండచ్చు)
విచిత్ర బంధం
విచిత్ర కాపురం
విచిత్ర దాంపత్యం
విచిత్ర పైత్యం
ఇలా అన్నమాట
డబ్బింగ్ సినిమాలైతే
విచిత్ర కలయిక
విచిత్ర గూఢచారి
విచిత్ర సోదరులు
విచిత్ర సుందరి
ఇలా ఉండేవన్నమాట.
ఇలా ప్రేమ, పెళ్ళి లాంటివి తగిలించుకున్న సినిమాలు వందల్లో ఉంటాయనుకుంటాను.
ఇక మన అన్నగారైతే "రాముడు" పేరుకు ఏదో ఒక తగిలించి ఓ డజన్ పైగానే తీసి ఉంటారు తన కెరీర్ లో.
పిడుగు రాముడు
బండ రాముడు
శభాష్ రాముడు
ఛాలెంజ్ రాముడు
అడవి రాముడు
డ్రైవర్ రాముడు
సర్కస్ రాముడు
కలియుగ రాముడు
సరదా రాముడు
అగ్గి రాముడు
బుగ్గి రాముడు
దగా రాముడు
అని ఆ పేరు అరిగి పోయే దాకా తీశారు. (చివరి రెండూ నా పైత్యం అనుకోండి )
ఇక పైత్యం ముదిరి రాముడి పేరుకు అతకని కొన్ని పదాలని కలిపేసి దొంగ రాముడు, రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు, శృంగార రాముడు లాంటివి కూడా పెట్టేసారు.
ఈ కాలం లో అయితే పోకిరి రాముడు, మార్కెట్ రాముడు, రాకెట్ రాముడు, ఇస్మార్ట్ రాముడు, D.J రాముడు అని కూడా తీసేసేవారేమో
శృంగార రాముడా? ఇలాంటి సినిమా కూడా ఉందా అని ఆశర్య పోకండి, నేను పుట్టక మునుపే ఇది పుట్టిందట, గూగుల్ చెబుతోంది. కాకపోతే అప్పట్లో అట్టర్ ప్లాప్ అయిందని విన్నాను కానీ ఆ సినిమా చూసే ధైర్యం ఎప్పుడూ చేయలేదు. "నందమూరి అందగాడా" అనే పద ప్రయోగం ఈ సినిమాలోని ఒక పాటలో వినపడుతుంది.
Note: 99% of the times my posts are neither educative nor informative. Those are intended for fun and relief from the daily routine work. Apologies if you feel like you wasted your time after reading my posts. Thanks for reading.
రాముని మించిన రాముడు
రిప్లయితొలగించండిThanks బోనగిరి gaaru, మరొకటి గుర్తు చేసినందుకు
తొలగించండిబాగానే రిసెర్చ్ చేసినట్లున్నారే. కళ్యాణరాముడు అని, భోళారాముడు అనీ తియ్యలేదా 🙂 ? మూఢనమ్మకాల మీద నడిచే రంగం అది.
రిప్లయితొలగించండిఆ పేర్లతో వినలేదు mestaaru, ఈ మాత్రం దానికి రీసెర్చ్ అవసరమా, చిన్నప్పటి నుంచి వింటున్న పేర్లయితేను
తొలగించండిరామా 😟!
తొలగించండిపైన రెండు సినిమాపేర్లు నేనన్నది lighter vein లో స్వామీ 🤘🙂.
అయితే ok మేష్టారు 😀
తొలగించండికళ్యాణ రాముడు పేరుతో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్, శ్రీదేవిల డబ్బింగ్ సినిమా. రెండు వేణు, ప్రభుదేవాల సినిమా.
రిప్లయితొలగించండిఅవి గుర్తొచ్చాయి గానీ, పెద్దాయనవి కాదు కదా అని మెన్షన్ చెయ్యలేదు బోనగిరి గారు . thanks
తొలగించండిపవన్ కుమారా,
రిప్లయితొలగించండినేను ఎవరినీ పాయింటవుట్ చెయ్యట్లేదు గానీ ఎన్.టి.రామారావు గారికి ఈ “పెద్దాయన” అనే బిరుదు ఎలా వచ్చింది (మీరే కాదు, చాలామంది అలాగే అంటారు)? ఎవరు మొదలెట్టారు? పెద్దాయన అంటే వయసులో పెద్ద అనా, తన వృత్తిలో పెద్ద అనా? మరి ఆ “రెండో కన్ను” గారు ఈయన కన్నా పెద్ద కదా వృత్తిలో, వారిని పెద్దాయన అనరే? ఈయనకు మాత్రమే పరిమితం చేశారే?
నాకు తెలిసి, జూ.ఎన్‌టీఆర్ వచ్చిందగ్గర్నుంచి, ఎన్‌టీఆర్ ని పెద్దాయన అనడం మొదలెట్టారు (జూనియర్ కాదని చెప్పడానికి). మొదట్లో కొంతమంది జూ.ఎన్‌టీఆర్ ని ఎన్‌టీఆర్ అని, ఎన్‌టీఆర్‌ని (అంటే పెద్దాయన్ని) సీనియర్ ఎన్‌టీఆర్ అని పిలిస్తే, ఇంకొంతమంది, పెద్దాయన ఎన్‌టీఆరే కాని సీనియర్ ఎన్‌టీఆర్ కాదని, కావాలంటే మనవడ్ని (అంటే చిన్నాయన్ని) జూనియర్ ఎన్‌టీఆర్ అని పిలుచుకోవచ్చనీ అభ్యంతరం చెప్పారు. అంచేత, పెద్దాయన్ని సీనియర్ అనకుండా మర్యాదకోసం పెద్దాయన అనడం మొదలెట్టారు. ఇదీ నాకు తెలిసిన పెద్దాయన-జూనియర్ల RRRR [రామారావు-రామారావు] కథ.
తొలగించండినాకు తెలిసి, జూ.ఎన్‌టీఆర్ వచ్చిందగ్గర్నుంచి, ఎన్‌టీఆర్ ని పెద్దాయన అనడం మొదలెట్టారు (జూనియర్ కాదని చెప్పడానికి). మొదట్లో కొంతమంది జూ.ఎన్‌టీఆర్ ని ఎన్‌టీఆర్ అని, ఎన్‌టీఆర్‌ని (అంటే పెద్దాయన్ని) సీనియర్ ఎన్‌టీఆర్ అని పిలిస్తే, ఇంకొంతమంది, పెద్దాయన ఎన్‌టీఆరే కాని సీనియర్ ఎన్‌టీఆర్ కాదని, కావాలంటే మనవడ్ని (అంటే చిన్నాయన్ని) జూనియర్ ఎన్‌టీఆర్ అని పిలుచుకోవచ్చనీ అభ్యంతరం చెప్పారు. అంచేత, పెద్దాయన్ని సీనియర్ అనకుండా మర్యాదకోసం పెద్దాయన అనడం మొదలెట్టారు. ఇదీ నాకు తెలిసిన పెద్దాయన-జూనియర్ల RRRR [రామారావు-రామారావు] కథ.
తొలగించండికాంత్ గారూ, వివరించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిదాసరి నారాయణరావు , రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్స్ ఆయనను పెద్దాయన అని పిలవడం రెండు మూడు సార్లు విన్నాను. బాలయ్య బాబు కి కథ చెప్పాలని వెళితే ముందు పెద్దాయన విని విశ్లేషించేవారు అని కొంత మంది నిర్మాతలు కూడా అన్నట్లు వారి ఇంటర్వూస్ లో విన్నాను.
వయస్సులో చిన్నవారైనా, సైజు పరంగానే కాక ఇమేజ్ పరంగా కూడా నాగేశ్వర రావు గారికి ఒక మెట్టు పైనే ఉంటారు కాబట్టి ఆయనని అలా అని ఉండచ్చేమో. లేదంటే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అలా పిలవడం మొదలై ఉండచ్చేమో. ఇవన్నీ మీకు తెలియదు అని కాదు గానీ, అలా కొంతమంది ఆయన్ని పెద్దాయన ని చేసేరేమో మేష్టారు.
మీరు టాక్సీ రాముడు మరిచిపోయారు (ఈ కాలంలో అయితే దాని పేరు ఓలా రాముడు అనో ఊబరోడు అనో ఉండొచ్చు)
రిప్లయితొలగించండిఈ టాక్సీ రాముడు సినిమా గురించి వినడం ఫస్ట్ టైం కాంత్ గారూ, తెలియజేసినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఇప్పుడు ఆ జూ. అన్నది కూడా పీకేసారుగా. ఉత్త NTR అనే వ్రాయించుకుంటున్నాడు. “యమదొంగ” సినిమాలో నరకానికి వెళ్ళిన జూ. పాత్రతో యముడిచే ఆవాహన చెయ్యబడ్డ “పెద్దాయన” ఆత్మ ఏం మనవడా, నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాంగా అంటాడు (అంటుంది?) చూశారా, అందువల్ల అలాగే పిలిపించుకోవాలి అనుకుంటుంటాడేమో జూ. ?
రిప్లయితొలగించండిసీనియర్ నటుడి పేరుని పూర్తిగా వెనక్కు తోసేసిన ఉదాహరణ మరొకటి ఉంది. బాలయ్య అని చాలా సీనియర్ నటుడు ఉండేవారు తెలుసుగా, ఒకప్పుడు హీరో కూడా (ఈ మధ్యే పోయారు). మా తరానికి బాలయ్య అంటే ఆయనే గుర్తొచ్చేవాడు. ఆ పేరుని ఇప్పుడు బాలకృష్ణ ముద్దుపేరుగా మార్చుకున్నారు (ఇంట్లో అలా పిలుస్తారేమో? దాన్ని ఇప్పుడు పబ్లిక్ చేసేసారు). మనకు అట్టర్ కన్ఫూజన్, ఆ సీనియర్ నటుడికి అవమానమున్నూ (నా అభిప్రాయం).
“పెద్దాయన” అన్న పదం బాగా పట్టేసినట్లుంది జనాలకి. ఓసారి రైలు ప్రయాణంలో నాది లోయర్ బెర్త్. అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ లు ఇద్దరు యువకులు - స్నేహితులో బంధువులో అనుకుంటాను. తెల్లవారిన తరువాత అప్పర్ బెర్త్ అతను క్రిందకు దిగాడు అప్పటికే నాకు మెలకువ వచ్చేసి, పడుకునే ఫోన్ చూస్తున్నాను. మిడిల్ బెర్త్ మనిషితో నువ్వు లేచి బెర్త్ మడిచేస్తే పెద్దాయన లేచి కూర్చుంటాడు అన్నాడు అప్పర్ బెర్త్. పెద్దాయన అంటే ఎవరి గురించా అనుకున్నాను 🤔. నా గురించే అని ఓ క్షణం తరువాత వెలిగింది. ఔరా అని విస్తుపోయాను 😟😟.
(నా కామెంట్ సినిమాహాళ్ళ పరిభాషలో “లెంగ్త్” కాస్త ఎక్కువైంది, ఏమనుకోకండి 🙂.)
బాగుంది మీ పెద్దాయన అనుభవం మేష్టారు
రిప్లయితొలగించండినిజమే, బాలయ్య చనిపోయారు అన్నది విని కొందరు కన్ఫ్యుజ్ అయ్యారట