23, జులై 2022, శనివారం

ఇలా కూడా నివాళి అర్పిస్తారు

రణవీర్ సింగ్ .. ఇతను మన విజయ్ దేవరకొండ కంటే పదాకులే ఎక్కువ చదివినట్లు ఉన్నాడు. ఇతని విచిత్ర వేషధారణ, ఎవరినీ లెక్కచెయ్యని ఆటిట్యూడ్ ఇతని సొంతం. తాజాగా ఇతను బర్ట్ రెనాల్డ్స్ అనే ఒక హాలీవుడ్ హీరో కి నివాళిగా నగ్నంగా ఫోటోషూట్ లో పాల్గొన్నాడట కాళ్ళు చేతులు అడ్డుపెట్టుకోవలసిన చోట అడ్డు పెట్టుకొని.  బర్ట్ రెనాల్డ్స్ అనే ఆయన ఎప్పుడో 1972 లో ఏదో పత్రిక కి అలా ఫోజు ఇచ్చాడట, 50 సంవత్సరాలు గడిచిన సందర్బంగా ఈయన ఆయనకి నివాళి అర్పిస్తూ ఈ పని చేశాడట. సరే ఎవరి పిచ్చి వారికానందం. 

ఈ రణవీర్ సింగ్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ విష్ణు విశాల్ అనబడే ఒక సౌత్ ఇండియన్ హీరో కూడా నా భార్య జ్వాలా గుత్తా ఓ ఫోటో గ్రాఫర్ గా మారి నా పిక్చర్ ని యెంత అందంగా తీసిందో చూడండి అని బెడ్ షీట్ కప్పుకున్న ఒక దరిద్రమైన ఫోటో తో దర్శనమిచ్చాడు. ఇంకెంత మంది ఈ ట్రెండ్ ని ఫాలో అవుతారో చూడాలి మరి. 

ఇలాంటి నగ్న ప్రదర్శనలు మన బాలీవుడ్ లో కొత్త విషయం కాదనుకోండి, ఇంతకుముందు మిలింద్ సోమన్ అనే అతను నగ్నం గా బీచ్ లో పరిగెట్టి, అమీర్ ఖాన్ లాంటి హీరో రేడియో లాంటివి అడ్డుపెట్టుకొని పీకే సినిమాలో నటించడం లాంటివి మనకి కొత్తేమీ కాదు. ఇకపై హీరోయిన్స్ కి హీరోస్ కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఎవరన్నా ఏమన్నా అంటే ఫ్యాషన్, ట్రెండ్ తెలియని మీరు రాతి యుగం లాంటి మనుషులు అంటూ వెక్కిరిస్తూ అదే రాతి యుగం నాటి వారికి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతున్నారు వేషధారణలో. 

                                                          ****************

ప్రస్తుత ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం లో నిలిచిన ఎలాన్ మస్క్ తండ్రి అయిన ఎర్రోల్ మస్క్ వీర్యం కోసం పోటీ పడుతున్నారట కొంతమంది మహిళలు(లేదంటే వారి భర్తలు వెనక నుండైనా ప్రోత్సహిస్తూ ఉండచ్చు). వినడానికే కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ఇది నిజం అని 76 ఏళ్ళ ఎర్రోల్ చెప్తున్నాడు. (అమితాబ్ బచ్చన్ కూడా ఇలా వీర్య దాతల లిస్ట్ లో ఉన్నట్లు కొన్ని పత్రికలు అప్పట్లో కోడై కూశాయి, అమితాబ్ బచ్చన్ గారు తనకై తాను ఎక్కడా చెప్పలేదు కాబట్టి దాని గురించి నో కామెంట్స్)   ఈ ఎర్రోల్ మస్క్ కి మొత్తం ముగ్గురు భార్యల ద్వారా ఆరుగురు పిల్లలు. ఎలాన్ మస్క్ తప్పించి మిగిలిన అయిదుగురు యెంత శాతం సక్సెస్ సాధించారో తెలీదు మరి.  

ఎర్రోల్ మస్క్ కి ముగ్గురు భార్యలు అన్నాను కదా అందులో Jana Bezuidenhout అనే ఆవిడ ఈ ఎర్రోల్ మస్క్ మూడవ భార్య మరియు ఎర్రోల్ మస్క్ రెండవ భార్య కూతురు. సొంత కూతురు కాదులేండి,   ఈవిడ ఎర్రోల్ మస్క్ రెండవ భార్యకి ఆవిడ మొదటి భర్త కి పుట్టిన బిడ్డ. అంటే ఒక రకంగా ఈయన స్టెప్ డాటర్ నే పెళ్లి చేసుకున్నట్లు. జీర్ణించుకోవడం కాస్త కష్టం కాకపోతే వారి కల్చర్ లో ఇవన్నీ పెద్ద విషయాలు కాకపోవచ్చు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు నివాళి అంటూ మన రణవీర్ లాగా ముందుకు వస్తే ఆశ్చర్య పోకండి. 

                                                            ****************

కర్ణాటక లోని ఒక కాలేజీ విద్యార్థులు నడి రోడ్డు మీద 'లిప్ లాక్ ఛాలెంజ్' పేరిట నానా హడావిడీ చేశారట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ముద్దు పెట్టుకుంటుంటే తక్కిన విద్యార్థులు అందరూ చుట్టూ చేరి ప్రోత్సహించారట. మరో 50 ఏళ్ళ తర్వాత నివాళి అంటూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఇలా చేసే సంస్కృతి రాకపోతే అదే పది వేలు. 

9 కామెంట్‌లు:

  1. స్వంత కూతురు కానంత మాత్రాన కూతురు వరస అమ్మాయిని పెళ్ళి చేసేసుకోవటమేమిటండీ? వీళ్ళ ఛండాలపు పనుల గురించి చదివితే మనం “ఎర్రోళ్ళం” అవుతాం.

    అవునూ, అమితాభ్ బచ్చన్ గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదా ? టీవీ మీద ప్రజలకు చాలా సూక్తులు చెబుతుంటాడుగా?

    పబ్లిసిటీ పిచ్చితో మన వినోదరంగపు “రణ”రంగ వీరుల లాంటి వాళ్ళు చేస్తున్న వెర్రిమొర్రి పనులు అన్నీ ఇన్నీ కావు. Disgusting.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేస్టారూ, మీరూ రాతియుగం మనుషుల కిందే లెక్క ప్రెసెంట్ సొసైటీ లో ఇలా మాట్లాడితే.

      అమితాబ్ గారి విషయం కరక్ట్ గా తెలీదు మేష్టారు, పుకార్లయినా అయి ఉండచ్చు.

      ఎవరో అనామకుడు ఇలాంటి పనులు చేస్తే ఎవరూ పట్టించుకోరు కానీ ఇలా బాగా పేరున్న సినిమా హీరోస్ ఇలా చేస్తే "సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు" అని అల్లు అర్జున్ స్టైల్ లో అడగాలనిపిస్తుంది.

      తొలగించండి
    2. ఒక సింగర్ భర్త అయిన నందు కూడా ఈ ట్రెండ్ లో కి ఎంటరయ్యాడట. ఈ ట్రెండ్ ముదిరేలా ఉంది.

      తొలగించండి
  2. విన్నకోట వార్ని రాతి యుగం‌మనిషి‌ అంటారా! ఎంత అగుమానం‌! ఎంత అగుమానం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ అగుమానం, మరక కూడా మంచిదే అనే టైప్ లెండి, ఇందులో అభ్యంతరం ఏమీ లేదు.

      తొలగించండి
  3. నాపై మీ వ్యాఖ్యను ఖండించిన “అజ్ఞాత” గారికి థాంక్స్ చెబుదామని అనుకున్నాను, ఆ పని చేసేలోగా మీ సమర్ధింపు కనబడింది, భావం బోధపడింది (మీ పోస్ట్ మరోసారి చదివాక) 🙂.

    ఈ “అగుమానం” అన్న పదప్రయోగం ఎవరో బాగా ప్రాచుర్యంలో ఉండిన బ్లాగర్ గారిదో వ్యాఖ్యాత గారిదో లాగా ఉందే. ఎవరై ఉంటారు చెప్మా 🤔?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగ్ లోకంలో మీరు సీనియర్స్ కాబట్టి మీకు ఈ పాటికే అర్థమయి ఉంటుంది మేష్టారు, నాకే ఇంకా కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది వారో కాదో అని.

      తొలగించండి