19, జులై 2022, మంగళవారం

నట ధనవంత

మొన్న రాత్రి 21 hours అని ఓ కన్నడ మూవీ చూశా, అందులో ప్రధాన పాత్రధారి 'పుష్ప' లో ఒక పాత్ర పోషించిన ధనుంజయ్ అనే నటుడు.  అతనికి ఉన్న బిరుదు "నట రాక్షస" అట, ఈ లెక్క ప్రకారం ఇకపై వచ్చే మాస్ హీరోస్ నట క్రూర, నట కింకర, నట తాటక అని లేదంటే పాజిటివ్ గా అయితే నట దేవర, నట విరాట, నట పోరాట  ఇలా పెట్టుకుంటారేమో. 

నిన్నే"ది లెజెండ్" అనబడే  ఒక సినిమా పోస్టర్ చూశా


మరి ఈ హీరోకయితే నట ధనవంత, నట బలవంత, నట వాంతి, నట భ్రష్ట, నట దుర్భర, నట వికార, నట వంకర, నట కంకర లాంటి బిరుదులు ఇవ్వచ్చేమో కానీ తనకి తానే "లెజెండ్" అని పెట్టుకున్నట్లున్నాడు. "డబ్బులుంటే కొండ మీద కోతినయినా హీరో చెయ్యొచ్చు" అనే మాట ఫిలిం ఇండస్ట్రీ లో వినబడుతూ ఉంటుంది దానర్థం ఇదేనేమో మరి. 

"బంగారు పళ్ళ వాడు కూడబెడితే పాచి పళ్ళ వాడొచ్చి పోగొట్టినాడనే" సామెత మా ఊరి వైపు బాగా పాపులర్. శరవణ స్టోర్స్ కొట్లలో కోట్లలో బంగారం అమ్మి తండ్రులు తాతలు కూడబెట్టిన సొమ్మంతా ఈ లెజెండ్ గారు తగలెడుతున్నారేమో, లేక ఈయనే తెగ సంపాదించాడో తెలీదు మరి.   

అందం గురించి అయితే పెద్దగా వర్రీ అవసరంలేదు, ఎందుకంటే హీరో అనబడే పదార్ధం అందాన్ని ఎప్పుడో కోల్పోయింది, కనీసం ఒక పర్సనాలిటీ, కాస్తో కూస్తో నటన ఆశిస్తే తప్పు లేదని నా ఉద్దేశ్యం. 

వీధిలో ఏనుగు వెళ్తూ ఉంటే నా లాంటి కుక్కలు ఇలాగే మొరుగుతూ ఉంటాయి. సర్లే ఆయన డబ్బులు, ఆయన ఇష్టం మధ్యలో నేనెవడిని అనటానికి. 

నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఉల్లాసం సినిమా రిలీజ్ టైం లో జేడీ జెర్రీ అనబడే ఈ దర్శక ద్వయం పేరు విన్నాను , ఆ పేరు  కొంచెం డిఫరెంట్ గా ఉండటం వల్ల బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత రెండో మూడో సినిమాలు డైరెక్ట్ చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లెజెండ్ వీళ్ళను పట్టుకొచ్చినట్లు ఉన్నాడు తన సినిమా డైరెక్షన్ కి. technical గా కూడా మంచి పేరున్న వారినే పెట్టుకొని ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అని తెలుస్తూనే ఉంది. 

మా చిన్నతనంలో హీరో నచ్చకపోతే మొహం మీద పేడ కొట్టేవాళ్ళు, హీరో బాలేకపోతే మనం కొట్టాల్సిన అవసరంలేదురా గేదెలే వచ్చి వేసి పోతాయి అనే వాళ్ళు, ఇప్పుడలా జరిగినా జరగొచ్చు. 

ఏదైతేనేం మొహానికి మేకప్ వేసుకొని హీరోగా చెయ్యాలి అని పట్టు పట్టి, సినిమా తీసి ఇంకో వారంలో జనం మీదికి వదులుతున్న ఆయన పట్టుదలకు జోహార్లు. 

5 కామెంట్‌లు:

  1. నట భయంకర కూడా లిస్టులో చేర్చవచ్చు. .

    రిప్లయితొలగించండి
  2. నట భయంకర కూడా లిస్టులో చేర్చవచ్చు.

    - విన్నకోట నరసింహారావు

    రిప్లయితొలగించండి
  3. రావుగోపాలరావు గారిని నట విరాట్ అనేవారు.

    రిప్లయితొలగించండి