7, జులై 2016, గురువారం

జూన్ నెల కబుర్లు

వరుసగా ఏడేళ్ళు జాగ్రత్తగా దాచి ఉంచిన వస్తువుని  పారేసిన మర్నాడే దాని అవసరం ఉంటుంది అని పెద్దలు చెప్పినట్లు ఇక పాత మిక్సీ అవసరం లేదు ఇంట్లో Place waste అని పారేసిన పది రోజుల్లోనే కొత్తది రిపేర్ కు వచ్చింది. 

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్లు మొన్న అర్జెంట్ గా రూపీస్ అవసరపడి ఇక్కడి నుంచి ఇండియా కు ట్రాన్స్ఫర్ చేసుకుందామనుకునే లోపు యూ.కె యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయింది. దాని effect తో ఆస్ట్రేలియాన్ డాలర్ రేట్ లో బాగా తేడా వచ్చి 49.05 రేట్ తో పంపించాల్సి వచ్చింది.

ఇక్కడ వీకెండ్ ఎలెక్షన్స్ జరిగాయి.  ఎవరికి ఓట్ వేస్తున్నావ్ అని నా  మిత్రుడ్నిముందు రోజు అడిగితే ఇంకా decide చేసుకోలేదు అన్నాడు.ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఎలా ఉంటారో అర్థం కాదు నాకు. నీకిష్టమైన స్వీట్ ఏది అని నన్ను అడిగితే 'జిలేబి, కజ్జి కాయలు, అప్పచ్చులు, బెల్లం మిఠాయి, పీచు మిఠాయి, పూత రేకులు, బాదుషా, బర్ఫీ, లడ్డు, చక్కెర పొంగళి, పాకం పప్పు, హల్వా, బెల్లం పాయసం, గులాబ్ జాము, మైసూర్ పాకు, పాల కోవా, గవ్వలు, తీపి గారెలు, కాజాలు, బొబ్బట్లు, జీళ్ళు, జాంగ్రీ, కేకు, నువ్వుల ఉండ, పూర్ణం బూరెలు' అని చెప్పగలను. అంత క్లారిటీ ఉంటుంది  నా వరకు నాకైతే.

ఈ మధ్య ఇలియానా చాలీ చాలని బట్టలు వేసుకుంటూ మళ్ళీ తెలుగు సినిమా న్యూస్ లో కనపడుతుందే అంది నా భార్య. 

తెలుగు సినిమాల్లో చోటిస్తారనేమో అన్నాను. 

వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం నువ్వన్నా నీ బ్లాగ్ లో చోటివ్వచ్చుగా అంది.


స్కూల్లలో "మాతృభాష భోధన" అని  సిడ్నీ లో జరిగిన ఒక సభ గురించి ఇక్కడొక వీక్లి లో కొన్ని ఫోటోలు వేశారు. ఒక్క తెలుగు తప్ప తమిళ్, కన్నడ, మలయాళం లాంటి భాషలన్నీ ఉన్న ఒక పోస్టర్ వేశారు ఆ స్టేజ్ మీద. కనీసం తెలుగు తరపున  ఆ సభలో ఎవరన్నా ఉన్నారో లేదో తెలీదు మరి. ఉన్నా పట్టించుకోలేదేమో. ఇలాగే పోతే ఇంకొన్ని సంవత్సరాలకు తెలుగు లో మాట్లాడేవాడిని పిచ్చివాడి కింద జమకడ్తారేమో.

బిచ్చగాడు సినిమా సాధించిన విజయాన్ని క్యాష్ చేసుకుందామని "ముష్టివాడు" అనే టైటిల్ తో సినిమా తీసేసి క్రేజ్ కొట్టేద్దామని అనుకుంటే ఆల్రెడీ ఎవరో ఆ పేరుతో రిజిస్టర్ చేసేశారని తెలిసి  "వీర ముష్టివాడు" అని టైటిల్ మార్చి 'వీడో మిలియనీర్' అనే  టాగ్ లైన్ తో సినిమా పేరు రిజిస్టర్ చేసుకున్నాను. జూన్ 31 వ తేదీన ఆడిషన్స్ ఏర్పాటు చేసాను. ఎందుకో మరి ఎవరూ రాలేదు ఆ రోజు తో సహా. ఇప్పటికీ మించిపోలేదు ఎవరికైనా ఇంట్రస్ట్ ఉంటే ఫోన్ నంబర్ $#$$@#$%#$% ను కాంటాక్ట్ అవ్వచ్చు. 
3 కామెంట్‌లు:

  1. Neeku ishtamina sweet Enti ante, nuvvu cheppina list sutti veera bhadra rao ni gurtuki techindi .. ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాస్తున్నప్పుడు నాకూ ఆ మూవీ గుర్తొచ్చింది. Especially బీచ్ లో బ్రహ్మానందాన్ని మెడ దాకా పూడ్చిపెట్టి సుత్తి దంచే సీన్. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి