28, జులై 2016, గురువారం

రాహుల్ గాంధీని కలవడానికి సాయం చేద్దురూ

ఈ ఉద్యోగాలు ఎన్నేళ్ళు చేసినా పెద్దగా మిగలబెట్టేదేమీ ఉండదని తీర్మానించుకున్నాక నేను, నా ఫిడేల్ ఫ్రెండు కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ ను మార్కెట్ లో లాంచ్ చేద్దామనుకున్నాము. 

దీన్ని ప్రమోట్ చేయడానికి మొదట ఒక పాపులర్ హీరోయిన్ ను అనుకున్నాము. ఆవిడ గారి P.A తో మాట్లాడితే outdoor షూటింగ్ లో ఉన్నారావిడ , మీరు డైరెక్ట్ గా అక్కడికి రండి డీల్ మాట్లాడుకుందాము అన్నారు.

మేము వెళ్ళేప్పటికి ఆవిడ షూటింగ్ లో ఉండటం తో అది పూర్తయ్యేదాకా పక్కన నిల్చొని షూటింగ్ చూస్తూ ఉన్నాము

ఈ లోగా నా ఫిడేల్ ఫ్రెండు  దమ్ము లాగించాలని అనుకున్నాడు. లైటర్ ఎవరినైనా అడుగుదామని అటు ఇటు చూస్తే వెదకబోయిన తీగ కాలికి తగులుకున్నట్లుగా ఆ P.A చేతిలో అగ్గిపెట్టె  ఉండటం గమనించి అతన్ని అడిగాడు.

సార్ ఆ అగ్గిపెట్టె ఇస్తారా సిగరెట్ వెలిగించుకుని ఇస్తాను

ఇది అగ్గిపెట్టె కాదయ్యా

సార్ అది అగ్గిపెట్టె అని కనపడుతూనే ఉంది ..సిగరెట్ వెలిగించుకుని ఇప్పుడే ఇచ్చేస్తానండి

ఇది అగ్గిపెట్టే కానీ ఇందులో అగ్గి పుల్లలు లేవు... మా మేడమ్ గారి క్యాస్టూమ్స్ ఉన్నాయి అన్నాడు

ఇంతలో సన్నీలియోన్ షూటింగ్ ముగించుకొని మా దగ్గరికి వచ్చింది. మా ప్రోడక్ట్ గురించి డిస్కషన్స్ కూడా నడిచాయి. చివరకి రెమ్యూనరేషన్ అంతా O.K అయింది కానీ మేము పబ్లిసిటీ ఇవ్వబోయే ప్రోడక్ట్ కి ఆవిడ ఎందుకు అప్ట్ కాదో మాకు డిటైల్డ్ గా వివరించి వెనక్కు పంపించేసింది.

ఆ తర్వాత చాలా మంది హీరో లతో డీల్స్ జరిగాయి కానీ ఏవీ వర్కౌట్ కాలేదు. సల్మాన్ ఖాన్ ఓ.కే అన్నాడు కానీ పాపం చీమకి కూడా హాని తలపెట్టని ఆయన మీద మోపబడిన కేసు ల్లోంచి ఈ మధ్యే బయటపడినందుకు గానూ ఆరంజ్ క్రాస్, యెల్లో క్రాస్ లాంటి సంస్థలు "శాంతి దూత" లాంటి బిరుదులతో సన్మానించే కార్యక్రమాలకు అటెండ్ కావాల్సి ఉన్నందున ఈ యాడ్ చేయలేనని చెప్పారు. నోట్లో వేలు పెడితే కూడా కొరకని చంటి పిల్లాడి లాంటి సల్మాన్ ఖాన్తో ఏవో సెరిలాక్, డైపర్ యాడ్స్ చెయ్యొచ్చు గాని పెద్దవాళ్ళ బెడ్స్ లాంటివి చేయడం తగదని మేమూ నిర్ణయించుకున్నాము. 

నిన్నరాత్రి పోయిన వారం పేపర్ చదువుతూ ఒక్క సారిగా హుర్రే అని అరిచాను

బజ్జున్న మా బుడ్డమ్మ ఒక్క సారిగా ఆ అరుపుకు లేచి కెవ్వుమంది

ఎవరూ చూడటం లేదనుకొని గోడ వైపు తిరిగి చేతి వేలు నోట్లో పెట్టుకొని చప్పరిస్తున్న మా బుడ్డోడు ఉలిక్కిపడ్డాడు

గుమ్మడికాయ తో గుత్తివంకాయ ఎలా వండాలో నేర్పే ప్రోగ్రాం చూస్తున్న మా ఆవిడ నా వైపు తిరిగి చూసి గుర్రుమంది.

అవేమి పట్టించుకోకుండా తిరిగి పేపర్లోకి తలదూర్చాను. హుర్రే అన్ననా అరుపుకు కారణమైన ఫోటో ఇదిదొరికేసాడు నా యాడ్ కు కరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్.  లోకసభ లో గోల గోలగా అంత సీరియస్ విషయం మీద డిస్కషన్ జరుగుతున్నపుడు కూడా నిద్ర పోతున్న యువరాజు గారు తప్ప ఇంకెవరూ సూటబుల్ కాదు అని డిసైడ్ అయ్యాను.

చింత లేనమ్మ సంత లోనూ సక్కగా నిద్దరోయిందని సామెత చెప్పినట్లు మన ఫారెక్స్ కూడా బేబీ పార్లమెంట్ లో ప్రశాంతంగా పడుకున్నాడు ఇంతకంటే కరెక్ట్ పర్సన్ ఇంకెవ్వరూ కనపడలేదు నా బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి. 

ఆయన్ని ఎలా అప్రోచ్ కావాలో మీలో ఎవరి కైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోరూ ప్లీజ్. మీకూ ఒక ఐదు పైసల వాటా ఇస్తాను లాభాల్లోంచి. 

నేను చెప్పనేలేదు కదూ ఆ ప్రోడక్ట్ ఏమిటో "Sleep Always" అనే కొత్త రకం పరుపులు విత్ ది కాప్షన్ 'You Will Get The Sleep Even After Getting Up From The Bed'. 

అలాగే ఆయన్ను కలిస్తే కొన్ని చిట్కాలు తీసుకోవాలి నిద్ర బాగా పట్టడానికి. 

ఏడ్చినట్లు ఉన్నాయి  ఈ "Sleep Always" బెడ్స్.  దీని మీద నిద్ర పట్టి చావట్లేదు ఆ పాత బెడ్ తీసుకొచ్చి వేయండి అని మా ఆవిడ గొణుగుతోంది ...  నేను వెళ్ళాలి.  తర్వాతి బ్లాగ్ లో కలుద్దాం. 

20 కామెంట్‌లు:

 1. అసలు ఏంటండీ మీరు :) పూర్తిగా టపా చదవకుండానే టైటిల్ చూసాక తాగుతున్న తేనీరు కూడా ఫౌంటెన్ లాగా బయటికి వచ్చేసింది నాకు… ‘గుమ్మడికాయ తో గుత్తివంకాయ’ హైలైట్ కదా అసలు. ఏకం గా రాహుల్ గాంధీ మీదే మీ టపా!! యువ రాజా వారు అన్న భయము భక్తి కూడా లేకుండా ?ఈ రోజు మీ పని అయిపొయింది ఇంక… అంతే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ కామెంట్స్ కు సంతోషమండీ. రాహుల్ గాంధీ విషయం లో మరీ భయపెట్టేస్తున్నారు :)

   తొలగించండి
 2. onion బ్యాచ్, అమ్మలక్కల బ్యాచ్ , కొబ్బరి చిప్పల బ్యాచ్ చాలా ఇంకా ఏవైనా బ్యాచ్ లు ఉన్నాయా ? LOL

  రిప్లయితొలగించండి
 3. ఉందండీ మరో‌ బేచ్ Z-N బేచ్.

  రిప్లయితొలగించండి
 4. Dear Sirs,
  I think that is a psycho, and psychological disturbed character. When ever some one criticised his or her beloved ones, the pathological strain in it will be aggravated and released in different **batches** as you said.
  In my opinion, to counter that psychic attack, we better to ignore completely, as, that character was not present in this blog world, until some psychiatric treatment taken place to it.
  Those are outbursts of a lunatic brain, that's all.
  Hope you understand.

  రిప్లయితొలగించండి
 5. యువరాజు విలువ ఇంకా అర్ధం కాలేదనుకుంటా.. పాదుకల బ్యాచ్ అంటే సోదివాగుడు వాగే బ్యాచ్ కాదు ! మీకు ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టం. ప్రతిపక్షం లో ఉన్నా హై సెక్యూరిటీ ఉంటుంది.మీరు ముందుగా ఫోన్ ద్వారా ప్రయత్నించాలి.కాంగ్రెస్ వెబ్ సైట్ లో నంబర్ ఉంటుంది. మీరెవరు అన్నది ఎంక్వైరీలన్నీ పూర్తయ్యాక మీ ఇంటికి వాళ్ళు కాల్ చేసి ఎపుడు రావాలో చెపుతారు.

  మీరడిగే పనికైతే మోడీలాంటి గోష్పాదం గాళ్ళు (హరిబాబుగారి భాషలో మీరే అన్వయించుకోండి)సరిపోతారు. పైగా టీకొట్టు నడిపిన అనుభవం కూడా ఉంది కూడానూ !

  మీరుండేది విదేశంలో ట్రంప్ లాంటివాళ్ళు మీకు ఎలాగూ దొరకరు. వచ్చే సెప్టెంబరులో గోష్పాదం మళ్ళీ అమెరికా వస్తున్నాడు.ఇప్పటినుండే ట్రై చేస్తే మీకు సహాయం చేయవచ్చు.స్టార్ట్ అప్ కంపెనీలను తెగ ప్రోత్సహిస్తున్నాడు కూడానూ...(మీరు ఫీలవుతారని తెలిసినా వాడిని గౌరవించే పరిస్థితులు లేవు.) కామెడీగా చెప్పడం లేదు సీరియస్‌గానే చెపుతున్నా..మోడీని చూసి పిల్లి(పులి కాదు) కూడా భయపడదు. మీరు భయపడకుండా వెళ్ళండి.

  కాంగ్రెస్ వాళ్ళే కావాలి అని మీరు పట్టుబడితే మీ పులివెందుల దొంగ దొరుకుతాడేమో కనుక్కోండి,ఒకవేళ మీ బిజినెస్సు బ్లా..బ్లాష్టయినా ఓదార్చడానికైనా వాడుకోవచ్చు ! మరింకేవీ భయాలూ పెట్టుకోకండి,ప్రొసీడ్ !

  http://www.indiatimes.com/news/india/prime-minister-narendra-modi-caught-sleeping-during-parliament-session-pmjetlag-becomes-a-national-issue-247767.html

  ధైర్యే సాహసే "నీహారికా" అనుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళడమే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాడు వీడు అంటే బాగోదండి. ఆయన పదవికి, హోదాకి గౌరవం ఇవ్వకపోయినా కనీసం వయసుకు గౌరవం ఇచ్చినా బాగుండు అని నా ఉద్దేశ్యం

   తొలగించండి
 6. క్లారిటీ ఇవ్వాలి పాఠకులకి :

  మిర్చి బ్యాచ్ = కృష్ణా జిల్లా వాస్తవ్యులు, కొంచెం రెచ్చగొట్టినా రెచ్చిపోయేవారు.

  కొబ్బరి చిప్పల బ్యాచ్ = గోదావరి జిల్లా,కేరళ వాస్తవ్యులు, బ్రాహ్మణులు (మంత్రిగారి వియ్యంకులు)

  పాదుకల బ్యాచ్ = వంశపారంపర్యంగా రాజ్యాధికారాన్ని అనుభవించేవారు.(రాజులు)

  సుబ్బిశెట్టి బ్యాచ్ = గుజరాత్ వాస్తవ్యులు,వ్యాపారం తప్ప సరసం తెలియని వారు.

  ఫినాయిల్ బ్యాచ్ = ప్రతిదీ ఉచితంగా దొరకాలి అని కోరుకునేవారు.

  సుబ్రహ్మణ్యం బ్యాచ్ = కాపురం కూడా కంప్యూటర్ తోనే చేసే రోబోలు.

  ఆనియన్ బ్యాచ్ = వంటిల్లే లోకంగా పతిపద సేవయే లోకంగా బ్రతికేసే సీతామహాలక్ష్ములు.

  కెవ్వుకేక బ్యాచ్ = కష్టంలోనూ సుఖంలోనూ ఆనందంగా గడిపేసేవాళ్ళు.

  దేశ నికృష్టుల బ్యాచ్ = స్వలాభం కోసం దేశాన్ని విడిచి వెళ్ళి స్వదేశం లోని దేశభక్తులపైనే నిందలు వేసేవాళ్ళు.

  దేశ భక్తుల బ్యాచ్ = వ్యవసాయం చేసేవారు,దేశం కోసం తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన వారు.(జైజవాన్...జై కిసాన్)

  రిప్లయితొలగించండి
 7. @Anonymous,

  నీ రైటింగ్ స్కిల్స్ చూస్తే నిన్ను నేను గుర్తుపట్టలేననుకున్నావా ? నేను ఇగ్నోర్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి నిన్ను అపుడు వదిలేసాను.ఇపుడు వదిలే ప్రశక్తి లేదు.అపుడు నీ టైం నడిచింది.ఇపుడు నా టైం నడుస్తోంది. కొబ్బరి చిప్పల బ్యాచ్ ని అంటే నువ్వెందుకు ముందుకు వచ్చావో తెలియదనుకున్నావా ? ముసుగు వేయొద్దు బ్లాగు పైనా....

  రిప్లయితొలగించండి
 8. 'చింత లేనమ్మ సంత లోనూ సక్కగా నిద్దరోయిందని' బాగుంది ఈ సమెత. పాపం అలసి పోయి కాస్త కునుకు తీసినట్టున్నాడు మన యువరాజు.

  రిప్లయితొలగించండి
 9. 60 ఏళ్ళుగా మొద్దు నిద్రపోతున్న జనాలను వదిలి ప్రశాంతంగా నిద్రిస్తున్న యువరాజుని మళ్ళీ నిద్రలేపకండీ అని మొత్తుకుంటూనే ఉన్నా... మేసే గాడిదొచ్చి కూసే గాడిదని చెడగొట్టినట్లున్నదీ యవ్వారం !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆయనొక్కడే నిద్ర పోతే చాలా? ఆయన్ను ఒక సారి విమర్శించితే మాకూ చక్కగా నిద్రపట్టుద్ది :)

   తొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీనివాసుడు30 జులై, 2016 5:45 PMకి

  బెమ్మాండం పవన్ గారూ!
  "ఇది అగ్గిపెట్టే కానీ ఇందులో అగ్గి పుల్లలు లేవు... మా మేడమ్ గారి క్యాస్టూమ్స్ ఉన్నాయి’’
  .....సింప్లీ సూపర్బ్! అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన మన దేశానికి అన్నే దుస్తులు ధరించే సంస్కృతి అందించిన నివాళి.
  ’’చీమకి కూడా హాని తలపెట్టని ఆయన మీద మోపబడిన కేసు ల్లోంచి ఈ మధ్యే బయటపడినందుకు గానూ ఆరంజ్ క్రాస్, యెల్లో క్రాస్ లాంటి సంస్థలు "శాంతి దూత" లాంటి బిరుదులతో సన్మానించే కార్యక్రమాలకు అటెండ్ కావాల్సి ఉన్నందున ఈ యాడ్ చేయలేనని చెప్పారు. నోట్లో వేలు పెడితే కూడా కొరకని చంటి పిల్లాడి లాంటి సల్మాన్ ఖాన్తో ఏవో సెరిలాక్, డైపర్ యాడ్స్ చెయ్యొచ్చు గాని పెద్దవాళ్ళ బెడ్స్ లాంటివి చేయడం తగదు’’
  .........ఒక్కగానొక్క తెలుగు బ్లాగు వ్యాఖ్యగానీ, బ్టాగు పోస్టుగానీ సల్మాన్ ఖాన్ అమాయకత్వం, నిర్దోషిత్వం గురించి ప్రస్తావించని ఆదర్శ, ప్రగతిశీల భావజాల పైత్యాన్ని ఎండగడుతూ ఎంత అద్భుతంగా తిట్టేరు సార్!
  ఇక రాహుల్ గురించి ఎంచుకున్న ఇతివృత్తం, చెక్కిన తీరు అమోఘం!

  ..........మీ వ్యంగ్యం, అధిక్షేపం మరింత పదునెక్కాలని ఆశిస్తూ
  ..........శ్రీనివాసుడు.
  ___________________________________________________
  ఈ వార్త గురించే ట్విట్టర్ లో బోలెడు జోకులు పేలేయి. మచ్చుకు కొన్ని అవధరించండి.
  God, grant me the sleep when I shouldn’t
  Courage to sleep where ever I wish,
  And wisdom to sleep over everything”#SleepingBeautyRahul

  — Ra_Bies (@Ra_Bies) July 20, 2016

  Martin Luther King: I have a dream.
  Rahul Gandhi: Me too. pic.twitter.com/8pkdiT9cXG

  — Ramesh Srivats (@rameshsrivats) July 20, 2016

  Please don’t make fun of Rahul Gandhi sleeping in the Parliament. This is his best contribution to the nation. pic.twitter.com/K1HcjJe0eD

  — The-Lying-Lama ☔️ (@KyaUkhaadLega) July 20, 2016

  It needs guts to sleep in Parliament when whole country is watching u, I can’t even sleep in office fearing my manager. Respect Rahul Gandhi

  — EngiNerd. (@mainbhiengineer) July 20, 2016

  Baby ko nap pasand hai.. http://t.co/1Jf3r2rra5

  — Rach (@bits_bytes_) July 20, 2016

  @Being_Humor ki is harkat ko dekhke rahul ji ki sharam se aankh neeche ho gayi pic.twitter.com/fgvX1l1VXv

  — yogi- trump Baba (@indiamangetrump) July 20, 2016

  Waking up in the parliament is an eye opening experience for Rahul Ji …

  — Paresh Rawal (@SirPareshRawal) (పరేష్ రావల్) July 20, 2016

  Poor Rahul Gandhi is like that child in school who doesn’t get enough sleep at night but mama wakes him up & ses that he goes to school

  — FEKU☔ (@PT4Swamy) July 20, 2016

  LOL. Let’s all sleep & be good listeners!

  #SleepingRaga
  I love sleep. My life has the tendency to fall apart when I’m awake, you know?
  – Ernest Hemingwayhttp://t.co/9P3D28fzI0

  @@Yash Sehgal

  So what if he slept..
  If he would have pulled up his sleeves,have torn some papers u wud jave criticized
  If he wud have read an articl instead of speech, u wud have laughed
  Uf he wud have sung a song u wud have slept
  Now when he slept so that all Parliament works undisturbed, even than u criticized
  Plesse appreciate that he slept..
  ____________________________
  @tina: no, Kejriwal will say Modi drugged him. Congress will say he was strategizing about Modi. But the reality is he was watching Chota Bheem all night.

  @tina: The calm before the storm !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీనివాసుడు గారూ, ధన్యవాదాలండి. ఎదో ఒక రకంగా కోర్ట్ ఇచ్చిన తీర్పును విమర్శించాలని లాస్ట్ మినిట్ లో సల్మాన్ ఖాన్ ను ఇరికించానండి ఈ పోస్ట్ లో. ట్విట్టర్ జోకులు కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి