6, జనవరి 2019, ఆదివారం

అరె ఏందిరా భయ్ ఈ కొత్త సంవత్సరం లొల్లి

మనది కాని ఈ కొత్త సంవత్సరం అసలు జరుపుకోవడం అవసరమా? అరె ఏందిరా భయ్ ఈ కొత్త సంవత్సరం లొల్లి! దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనే పెడసరి ధోరణితో కొందరు,  'దీన్ని బహిష్కరిద్దాం, శుభాకాంక్షలు చెప్పుకోవలసిన అవసరం లేదు' అని సోషల్ మీడియాలలో క్లాసులు పీకుతున్నారు.

Be a roman, when you are in Rome అంటారుగా, మరి మనమున్నది ఈ గ్లోబల్ యుగంలో కాబట్టి ఉలిపి కట్టెలా ఉండకుండా జనవరి ఫస్ట్ కు కూడా ప్రాధాన్యత ఇద్దాం. తప్పేముంది ఉగాది ని జరుపుకుందాం, జనవరి ఫస్ట్ జరుపుకుందాం. రెండు సార్లు మితృలకు శుభాకాంక్షలు తెలుపుదాం, వీలయితే పర్సనల్ గా కలిసి మరీ చెబుదాం.

కొత్త సంవత్సరం అని చెప్పి మితృలతో కలిసి లిమిట్ వరకు తాగడం, తందనాలు ఆడటం లో  తప్పేం లేదు, ఏదో ఒక రకంగా కనీసం మిత్రులతో సరదాగా గడిపేసినట్లే కదా. After all, some times, we just need a break from the routine.

ఫ్రెండ్ ఒకతను వాళ్ళింట్లో థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ ఏర్పాటు చేస్తే దాదాపు 6 ఫామిలీస్ కలిసాము అక్కడ. పేకాట ఆడేవాళ్లు పేకాట ఆడుతూ,  ఆడని వాళ్ళు, ఆడవాళ్లు హాయిగా కబుర్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ,మ్యూజికల్ చైర్స్ లాంటి ఆటలాడుకుంటూ ఉంటే ఇక పిల్లలందరూ వాళ్ళింటిని కిష్కింధ గా మార్చేసి సంతోషంగా ఆడుకున్నారు అర్ధరాత్రి వరకు.

మగాళ్లు కాసేపు పేకాట పక్కనెట్టి, మ్యూజికల్ చైర్స్ ఆట ఆడాలని ఆడాళ్ళు డిమాండ్ చేస్తే, వారి డిమాండ్ కి తలొగ్గి ఆ ఆట ఆడి రెండు ప్లాస్టిక్ చైర్స్ విరగ్గొట్టేశాము. (మేడ్ ఇన్ చైనా చైర్స్ మరి విరగక ఛస్తాయా, ఈ ఆస్ట్రేలియా లో 50% మేడ్ ఇన్ చైనానే వస్తువులైనా, మనుషులైనా 😊)

12 కాగానే పిల్లలు కేక్ కట్టింగ్ కు రెడీ అయిపోయారు, దేనికోసమైతే వాళ్ళు వేచి ఉన్నారో ఆ పని కానిచ్చేసి (వాళ్లకు ఇష్టమైన చాకోలెట్ కేక్ తినేసి) ముసుగు తన్నేసారు. 



మరుసటి రోజు అనగా జనవరి ఫస్ట్ తారీకు రోజు అందరిలాగే యధావిధిగా దైవ దర్శనానికై గుడికి వెళ్లి ఫేస్బుక్ లో పెట్టడానికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము   😊

అదే రోజు మధ్యాహ్నం నేను తీసుకున్న రెసొల్యూషన్ లిస్ట్ లో పాయింట్ 3 ని అమలుచేయలేక పోయాను. విధి రాత తప్పించుకోలేక 'అమర్ అక్బర్ ఆంథోని' అనే అత్యంత చెత్త చిత్రాన్ని చూసాను మిత్రులతో కలిసి. 

సిడ్నీ చుట్టుపక్కల  100  బీచ్ ల దాకా ఉన్నాయి, వారానికో బీచ్ కి వెళ్లినా ఆ బీచ్ లన్నీ చూసేలోగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు దాంతో నేను తీసుకున్న రెసొల్యూషన్ లిస్ట్ లోని పాయింట్ 7 లో ఒక పార్ట్ ని కంప్లీట్ చెయ్యొచ్చు అని అనుకున్నా 😊

వెదుకుతున్న తీగ కాలికి  చందంగా మిత్రులందరూ మరుసటి రోజు Wattamolla బీచ్ కి వెళదామన్నారు. Wattamolla ఈజ్ వన్ అఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ బీచెస్ ఎవర్ ఐ హావ్ సీన్.  (Wattamolla means "place near running water") 

నేను సీ దగ్గరికి వెళ్ళగానే 'లాంగ్ టైం నో సీ' అని నన్ను పలరించినట్లైంది. సముద్రం అంటే పిల్లలు యెంత ఇష్టపడతారో, దానికి పదింతలు నేను ఇష్టపడతా.  ఆ సముద్రంలో అలలను చూడగానే నాలోని బాల్యం బయట పడింది, దానికిదే రుజువు.



ఈ బీచ్ లో ఒక వైపు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అలలు ఉండవు, కాబట్టి స్విమ్మింగ్ కి అనువుగా ఉంటుంది.  పిల్లలు హాయిగా ఆడుకున్నారు, అల వచ్చి లాక్కెళ్తుందని భయం లేకుండా. 



ఈ విధంగా కొత్త సంవత్సరం సందర్బంగా రెండ్రోజులు ఫోన్ కి దూరంగా, ఫామిలీ మరియు ఫ్రెండ్స్ కి దగ్గరగా ఉన్నాను. After all, some times, we just need a break from the routine.

ఇవాళ మరో రెసొల్యూషన్ తీసుకున్నాను అదేమిటంటే, కనీసం నెలకు నాలుగు పోస్టులు అయినా రాస్తూ ఉండాలని. అందరికి తెలిసిన విషయమైనా సరే లేక కొత్త విషయమైనా, ఏదైనా సరే రాస్తూ పోవడమే.  జస్ట్ లైక్ డైరీ లా ప్రతీ విషయం నోట్ చేద్దామనుకుంటున్నాను. 

6 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అయ్యబాబోయ్ ! "అమర్ అక్బర్ ఆంథొనీ" చూశారా? మేము సగం చూసి, ఆపేసి ఏం చూశామో ఆల్రెడీ మర్చిపోయాం.

    నెలకి నాలుగు పోస్టులు రాద్దామనే మీ resolution నచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా పూర్తిగా చూడకుండా మీరు మంచి పని చేశారు లలిత గారు.

      చూద్దాం, నేను రాయగలనో లేదో?

      తొలగించండి