8, జనవరి 2019, మంగళవారం

సంక్రాంతి సినిమాలు

ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా సంక్రాంతి కి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది, విడుదల అవుతోంది 'కథానాయకుడు' సినిమా. ఎన్టీవోడి సినిమా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే కాకపొతే దాన్ని క్రిష్ మరింత ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉంటారు అనే నమ్మకమే ఈ సినిమా చూడాలని అనిపిస్తుంది. 

కాకపొతే, దీనితో పాటే అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్ కూడా రిలీజ్ అవుతుండటం యాదృచ్ఛికం. నాగేశ్వర రావు బయోపిక్ అంత ఇంటరెస్టింగ్ గా అనిపించదు, తీయడం వృధా అని నాగార్జున అన్నాడు కానీ మరి ఎవరు తీస్తున్నారబ్బా ఆయన బయోపిక్? అయినా నాగేశ్వర రావు బయోపిక్ లో మాయావతి కారెక్టర్ ఎందుకు వచ్చింది. ఏంటీ? కాదంటారా? కావాలంటే కింది ఫోటో చూడండి.

నాగేశ్వర రావు బయోపిక్ లో మాయావతి ఎందుకుంది?
ఈ మధ్య కాలంలో ఇలా ఈ సినిమా మీద వచ్చినన్ని వెటకారాలు ఇంకే సినిమా మీద వచ్చి ఉండవు. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే పై ఫొటోలో బాలకృష్ణ కంటే సుమంత్ బాగా సెట్టయ్యాడు. 

సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా లోని బాలకృష్ణ స్టిల్స్ మీద చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు. నేను కూడా inspire అయి మచ్చుకు ఒకటి తయారుచేశా. 

ఇది ఎవరి బయోపిక్ చెప్మా?

బాలకృష్ణ కాకుండా ఇంకో పదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎన్టీవోడి పాత్రకు బాగా సూట్ అయ్యేవాడేమో అనిపిస్తోంది.

పౌరాణిక సినిమాల్లో నటించాక కిరీటాలు, విగ్గులు, గదలు, చెప్పులతో సహా ఎన్టీఆర్ వాటిని తనతో పాటు తీసుకెళ్ళి పోయి తన స్టూడియో లో భద్రపరిచేవారని, వాటినే ఇప్పుడు బాలకృష్ణ ఈ సినిమాలో వాడారని అంటున్నారు కొందరు.

మామూలుగా అయితే బాలకృష్ణ కు సంక్రాంతి కొంచెం బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అయిన వాటిల్లో ఎక్కువ సినిమాలు హిట్ కూడా అయ్యాయి. అయితే ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ అనేంత కాకపోచ్చు గానీ క్రిష్ మార్కు తో కాస్త క్లాస్ గా ఉండచ్చు అని  నా అభిప్రాయం.

ఇక నెక్స్ట్ క్యూ లో ఉండేది రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి mostly ఇది రంగస్థలం రేంజ్ అంచనాలు అందుకునే స్థాయిలో ఉండకపోవచ్చు. 'ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకి కొత్త కాదు కానీ నాకు కొత్త' అని రామ్ చరణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టే ఊహించచ్చు ఇది కొత్తదనం లేని బోయపాటి స్టైల్ ఊర మాస్ సినిమా అని. పాటలు కూడా పెద్ద బాలేవు కాబట్టి ఈ సినిమాను కేవలం మాస్ ప్రేక్షకులే నిలబెట్టాలి.

ఇక తర్వాత రేసులో ఉన్న సినిమా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనబడే ''F 2'. సినిమాలో ఫన్  కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉందంటే సినిమా ఢమాలే.  మంచి కామెడీ సీన్స్ పడితే చెలరేగి పోయే వెంకీ, అందుకు తగ్గ కామెడీ తన సినిమాల్లో చూపించిన అనిల్ రావిపూడి కనుక మాజిక్ రిపీట్ చేయగలిగితే సినిమాలో మంచి ఫన్ expect చెయ్యొచ్చు. 

లాస్ట్ బట్  నాట్ ది లీస్ట్, సంక్రాంతి కి రిలీజ్ అవబోతున్న నాలుగవ సినిమా 'పెట్టా'  గురించి చెప్పే ముందు ఒక చిన్న జోక్ చెప్పుకుందాం. 

ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సెట్లో మాట్లాడుకుంటున్నారు. 

అదేంటి? హీరో గారు ఇవాళ షూటింగ్ కాన్సుల్ చేసుకొని వెళ్లిపోయారు హడావిడిగా?

హీరో గారి కూతురికి ఇందాకే మనవడు పుట్టాడని ఫోన్ వచ్చిందట, అందుకని . 

ఇది ఇప్పటికి జోక్ లాగే అనిపిస్తుంది గానీ, రజనికాంత్ విషయంలోనే కాక మన తెలుగు సినిమా సీనియర్ హీరోల విషయం లో కూడా ఇది  ఎప్పుడో ఒకసారి నిజమయ్యే అవకాశం ఉంది. ఏంటో మన ఖర్మ కాకపొతే ముసలాళ్లను కూడా హీరోలలాగా చూడాల్సి రావటం. చిన్నప్పుడు నేను చూసిన ప్రేమాభిషేకం సినిమాలో కూడా 58 ఏళ్ళ అక్కినేనిని లవర్ బాయ్ గా చూడాల్సి వచ్చింది అదీ 20 ఏళ్ళ యంగ్ శ్రీదేవి పక్కన. కాబట్టి ముసలాళ్ళు హీరోలు గా ఉండటం అనేది ఎప్పటినుంచో మన తెలుగు సినిమాలకు పట్టుకున్న దరిద్రం.

ఇక పెట్టా గురించి చెప్పడానికి పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. థియేటర్లు దొరకలేదని ఆ నిర్మాతలు చేస్తున్న గొడవ తప్ప. అయినా సంక్రాంతికి ఇన్ని తెలుగు సినిమాలు ఉండగా ఈ అరవ సినిమా గోల అవసరమా అన్నట్లు తెలుగు ప్రేక్షకులు కూడా ఎవరూ పెద్ద ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అనిపించట్లేదు నాకైతే. 

చూద్దాం మరి, మెజారిటీ ప్రేక్షకుల ఓటు దేనికో?

7 కామెంట్‌లు:

 1. వైయస్సార్ బయోపిక్ విడుదలైనపుడు కూడా మీరో పోస్ట్ రాయలండి లేదంటే సమన్యాయం దెబ్బతింటుంది.

  సినిమా చూస్తే గనక "ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి"డైలాగు బాలయ్య ఎలా చెప్పాడో వివరించండి!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. తప్పకుండా ప్రయత్నిస్తాను సూర్య గారు. లేదంటే మీరన్న సమన్యాయం దెబ్బతింటుంది.

   చూసే అంత ఉత్సాహం ఈ మధ్య ఉండటం లేదండీ. ఏదో T.V లో చూడటమే.

   మీరు చూస్తే మీ అభిప్రాయం తెలియజేయండి.

   తొలగించు
  2. ట్రైలర్ చూసా. బావున్నట్లుంది.

   తొలగించు
 2. పవన్-గారూ,భలే ఐడియా ఇచ్చారు. మాయావతి చిన్నచిన్న మార్పులతో ఈ సినిమాని తన బయో-పిక్ గా యూపీ మీదకి డబ్ చేసి వదుల్తుందేమో. 😀
  //హీరో గారి కూతురికి ఇందాకే మనవడు పుట్టాడని ఫోన్ వచ్చిందట, అందుకని//
  హీరోగారు ఇది చూస్తే బాగుండు 🤣


  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. 'డబ్ చేసి రిలీస్ చేయడం' మంచి జోక్ YVR గారు.

   Thanks for your comments.

   తొలగించు
  2. డబ్ చేయడం ఎందుకండీ సినిమా రైట్స్ కొనడం డబ్బులు దండుగ. బొటాక్స్ (గ్లిసరిన్ & గ్రాఫిక్స్ వంటివి కూడా) ఎక్కడయినా చవకగానే దొరుకుతాయి.

   తొలగించు