తెలిసిన జోకే అయినా ఇది సరైన సందర్భం కాబట్టి ఇక్కడది చెప్పుకుందాం.
న్యూ ఇయర్ రోజున ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు.
బాబాయ్ ఒక సిగరెట్ ఇవ్వు అన్నాడు మొదటి వాడు
రాత్రే కదా, న్యూ ఇయర్ రోజు నుంచి సిగరెట్లు మానేస్తానని నిర్ణయం తీసుకున్నావ్? అన్నాడు రెండో వాడు
అవును తీసుకున్నాను, దాంట్లో భాగంగానే మొదటి స్టేజిలో ఉన్నాను.
మొదటి స్టేజి అంటే?
సిగరెట్లు కొనేది మానేయడం.
నాకు సిగరెట్, మందు లాంటి అలవాట్లు లేవు కాబట్టి అవి మానేయాలి అనే రెసొల్యూషన్స్ లేవు గానీ, యేవో కొన్ని ఉన్నాయి. ఇవి ఏ రోజు నుంచి అయినా ఫాలో అవచ్చు, కాకపొతే న్యూ ఇయర్ రెసొల్యూషన్ అని పెట్టుకోవడం వల్ల గుర్తుండిపోతుంది కదా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా.
- కాలమతి నుంచి సుమతి గా మారడం (గత 20 ఏళ్లుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఇందులో)
- కొత్త వాళ్లతో అంత తొందరగా మాటలు కలపలేను. ఇందులో కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయడం.
- వీలయితే ఒక్క మగాడు, బ్రహ్మోత్సవం, అజ్ఞాత వాసి లాంటి సినిమాలకు దూరంగా, కామెడీ సినిమాలకు దగ్గరగా ఉండటం.
- నడక తగ్గించడం, రోజుకు 6-7 కిలోమీటర్లు నడుస్తున్నాను, వీలయితే అది కాస్త తగ్గించడం.
- 63 కిలోల నుచి 62.5 కిలోలకు తగ్గడం (500 గ్రాములు పెరగడం ఈజీ కానీ, తగ్గడం కష్టం )
- 🐓 🐑 🍕 లాంటివి మానేసి 🥑 🥕 🥦 🍄 🌽 🐟 లాంటివి ఎక్కువగా తినడం (కష్టమే, కానీ ట్రై చేస్తే ఆరోగ్యానికి మంచిది)
- జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలైన స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ నేర్చుకోవడం.
- ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి 10 నిముషాలు ముందే బయలుదేరడం, హడావిడిగా లేటుగా బయలుదేరకుండా.
- మిత్రుల, కుటుంబ సభ్యుల, బంధువులకు అన్ని రకాల విషెస్ చెప్పడం లాంటివి. (నా వరకు నాకు ఎందుకో ఈ పండుగ విషెస్, బర్త్ డే విషెస్ లాంటివి చెప్పాలంటే అంత ఇష్టం ఉండదు, దాన్ని మొహమాటం అంటారో ఏమో నాకే తెలీదు మరి)
- ఇక నుంచైనా ప్రతీ రోజూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. (చదివితే మరింత జ్ఞానం పెరిగి మంచి మంచి పోస్టులు రాస్తానని ఆశ)
- ఆ మధ్య చేయడం ఆపేసిన యోగా ను మళ్ళీ కంటిన్యూ చేయడం.
- పైన చెప్పిన లిస్ట్ అంతా నెక్స్ట్ ఇయర్ రెసొల్యూషను లిస్ట్ లోకి మూవ్ చేయడం😜
వీటిలో ఏది మిస్ అయినా చివరిది మాత్రం మిస్ కాకుండా చూసుకుంటానని మీ అందరి ఎదుట ప్రామిస్ చేస్తున్నాను.
"మీ జీవితం లో ఈ కొత్త సంవత్సరం మరింత అదృష్టాన్ని, సంతోషాన్ని, సంపదను తీసుకొస్తుందని ఆశిస్తూ 'కొత్త సంవత్సర శుభాకాంక్షలు' తెలుపుతున్నాను".
హమ్మయ్య కాస్త లేటయినా పైన చెప్పిన శుభాకాంక్షలతో తొమ్మిదవ పాయింట్ లో మొదటి స్టేజి కంప్లీట్ చేయగలిగాను నా రెసొల్యూషన్ లిస్ట్ లో నుంచి.
నేనేదో రాంగ్ ఫోటో పెట్టానని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే, ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగే సిడ్నీ fireworks లో భాగంగా జరిగిన పొరపాటు అది. హ్యాపీ న్యూ ఇయర్ 2019 అని కాకుండా 2018 అని డిస్ప్లే చేయడం.
మీ చివరి రిసల్యూషన్ బావుంది. దానికే నావోటు. పోతే విష్ చేయడం గురించి మీరు చేస్తున్నదే సరైన పని అని నా అభిప్రాయం. మీకు నచ్చినప్పుడు చెప్పితే సహజంగా ఉండి మీకు సంతృప్తినిస్తుంది.
రిప్లయితొలగించండిమీ కామెంట్స్ కి ధన్యవాదాలు అన్యగామి గారు. బర్త్‌డే విషస్ చెప్పకపోతే కొందరు ఫీల్ అవుతున్నారు, ఏదో formality కోసం చెప్పాలి కొన్ని సార్లు అన్యగామి గారు.
రిప్లయితొలగించండి>>>బర్త్‌డే విషస్ చెప్పకపోతే కొందరు ఫీల్ అవుతున్నారు.>>
రిప్లయితొలగించండిపెళ్ళాం, పిల్లలకు కూడా విషెస్ చెప్పకపోతే ఫీలవమా ?
మనం ఎవరిమీదయితే శ్రద్ధపెడుతున్నామో వారు మనల్ని తిరిగి ప్రేమిస్తున్నారో లేదో చూసుకుంటాం కదా ?
పెళ్ళాం, పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్తాం లెండి. ఫ్రెండ్స్ కి బందువులకి చెప్పలేదని కొందరి ఏడుపు.
తొలగించండిThanks for the కామెంట్స్ నీహారిక గారు.
మీకు పోస్ట్ వ్రాసే అలవాటు ఉంటే నాకు కమెంట్స్ వ్రాసే అలవాటు ఉంది. మీరు మంచి పోస్ట్ వ్రాస్తే చదివి ఆనందిస్తాం, బాగుంది అని అంటాం కానీ ధన్యవాదాలు చెప్పము కదా ?
తొలగించండిఅలాగే నా సలహానో, సూచనో మీకు నచ్చితే ధన్యవాదాలు చెప్పండి. నేను కమెంట్ వ్రాసిన ప్రతిసారీ మీరు ధన్యవాదాలు చెపుతుంటే ఫీలవుతున్నానండీ 😌
Noted :)
తొలగించండి@నీహారిక గారు
తొలగించండిభలేవారే, ధన్యవాదాలు చెప్పడం మంచి అలవాటే కదండి? రచయితకు (బ్లాగర్ కు) ప్రోత్సాహాన్నిచ్చేది, ఫీడ్-బాక్ నిచ్చేది కామెంట్లేగా. అందువల్ల ధన్యవాదాలు చెప్పడంలో ఆక్షేపణేమీ లేదని నా ఇభిప్రాయం. I appreciate it. అటువంటి మంచి అలవాటు చాలా మంది బ్లాగర్లకు ఉండి ఉండచ్చు, అయితే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ... క్రమం తప్పకుండా ధన్యవాదాలు చెప్పేవారిలో ఈ పవన కుమారుడు ఒకరు, పాటల బ్లాగ్ వేణుశ్రీకాంత్ గారు, “నెమలికన్ను” బ్లాగర్ మురళి గారు ... నాకు వెంటనే గుర్తొస్తున్న ఉదాహరణలు. అన్నట్లు, మీకు బ్లాగ్-శత్రువు అయిన వారికొకరికి కూడా ఈ అలవాటు ఉందండోయ్ 🙂.
@ 🦁 గారూ,
తొలగించండికమెంట్స్ కి ధన్యవాదాలు నాకు నచ్చదండీ ! రచయతలదే కష్టం కదండీ ? సదరు రచనని ప్రోత్సహిస్తూ ఎన్ని కమెంట్స్ వస్తే అంత ఉత్సాహం రచయతకు వస్తుంది.వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేసినందుకు మనమే కృతజ్ఞతలు చెప్పాలి.
పద్మార్పిత అందరికీ కలిపి ఒకేసారి ధన్యవాదాలు చెప్తారు. ప్రతి కమెంట్ కీ ధన్యవాదాలు చెప్పుకుంటే ఆగ్రిగ్రేటర్ నిండా అవే కనపడతాయి. మురళిగారు కూడా ఒకేసారి అందరికీ ధన్యవాదాలు చెపుతారు.
ఖర్మ ! నాదే తప్పేమో క్షమించేయండి.
మొదలుపెట్టి ఆపేసినవాటిల్లో 5,7 ఉన్నాయి సాధించలేనేమో అని కూడా అనిపిస్తుంది.
రిప్లయితొలగించండిI wish You A Very Happy New Year !
స్విమ్మింగ్ కాకపోయినా డ్రైవింగ్ అనేది ఈ రోజుల్లో కనీస అవసరాల్లో ఒకటి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను.
తొలగించండిహాపీ న్యూ ఇయర్ నీహారిక గారు
అదేమిటి పవన కుమారా? డ్రైవింగ్ రాకుండా ఇంతకాలం ఆస్ట్రేలియాలో ఎలా నెట్టుకొస్తున్నారు? మీరంటే “నటరాజా సర్వీస్” (రోజుకు 6-7 కిలోమీటర్లు నడుస్తున్నానని అన్నారు కదా పైన 🙂) చేసుకుంటున్నారేమో గానీ కుటుంబాన్ని బయటకు తీసుకు వెళ్ళడం ఎలా మేనేజ్ చేస్తున్నారు (Uber రంగప్రవేశం చెయ్యకముందు పరిస్ధితి గురించి నేనడిగేది)? మీ దేశంలో పబ్లిక్ రవాణా సౌకర్యాలు అంత బాగా ఉన్నాయా అయితే?.
రిప్లయితొలగించండిడ్రైవింగ్ రాకపోతే అమెరికా లో ఇబ్బంది కానీ, ఆస్ట్రేలియ లో అంత ఇబ్బంది లేదండీ నరసింహారావ్ గారు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా బాగుంటుంది
తొలగించండిమంచి ఐడియా ఇచ్చారు, దీని మీద ఒక పోస్ట్ రాసేయొచ్చు. థాంక్స్
మీ ప్రశ్నలోనే జవాబు ఉంది ఉగ్రనరసింహావతారా!
తొలగించండిడ్రైవింగ్ రాదు కాబట్టే "నెట్టు"కొస్తున్నారు!!☺️
// “నెట్టు"కొస్తున్నారు!!☺️“ //
తొలగించండి👌 😀
బైదివే నేను చాలా సౌమ్యుడినండీ, అస్సలు ఉగ్రుడిని కాదు, కానంటే కాను 😡😡
సౌమ్యనరసింహావతారం 🐯
తొలగించండిపెద్దలు నరసింహరావు గారికి పేరు ముందు చాలా
తొలగించండిప్రొఫిక్సులొస్తున్నవి . ప్రమాదమేమీ రాదు గద !
@నీహారిక గారూ
తొలగించండి// “సౌమ్యనరసింహావతారం” //
————————-———————-
అనేగా నే చెబుతున్నది, ఆఁయ్ 👹👺
🦁
🙂
@ రాజారావు మాస్టారూ
తొలగించండి// “ప్రమాదమేమీ రాదు గద !” //
—————————————-
రాకపోవచ్చు లెండి . అభిమానులు ఇస్తున్న బిరుదులు కదా 🙂.
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 🌹.
రిప్లయితొలగించండిHappy new year mestaaru.
తొలగించండిమీ లిస్టులో ఆఖరిది బహుబాగు :) మా ఇంట్లో దాని గురించే చెప్పుకుని నవ్వుకున్నాము. Happy New Year, Pavan garu!
రిప్లయితొలగించండినచ్చినందుకు ధన్యవాదాలు లలిత గారు.
రిప్లయితొలగించండి