దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు రివ్యూ ఏమిటి అని అనుకోకండి. అయినా సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల గురించి రాయకుండా ఎప్పుడో సినిమాకి ఇప్పుడు రివ్యూ ఏమిటి అని కూడా అనుకోకండి. ఇది రివ్యూ కాదు 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమా చూసినప్పుడు ఏర్పడ్డ మైండ్ డిస్టర్బెడ్ అండ్ డీవియేటెడ్ డిసార్డర్. (కొత్త డిసార్డర్ పేరు కనిపెట్టా)
జనవరి ఫస్ట్ రోజు మిత్రులందరితో కలిసి గుడి నుంచి వచ్చాక అందరూ లంచ్ తినేసి కాసేపు పడుకున్నారు. నేను, ఇంకో మిత్రుడు మాత్రం నిద్ర రాలేదని మేల్కొని ఉన్నాము.
శ్రీనువైట్ల, రవితేజ కొత్త సినిమా నెట్ ఫ్లిక్స్ లో పెట్టారు చూద్దామా అన్నాడు మిత్రుడు.
నిద్ర ఎలాగూ రాలేదు చూద్దాం అన్నా.
కాసేపటికి 'ఈ హీరోయిన్ లో కాస్త ఇలియానా పోలికలు కనపడుతున్నట్లున్నాయి' అన్నాను.
ఆవిడ ఇలియానానే అన్నాడు.
అదేంటి? కరువు కంట్రీ కి బ్రాండ్ అంబాసిడర్ లా, ఇసుకలో ఎండేసిన ఎండు చేపలా ఉంటదే ఇలియానా అనే అమ్మాయి.
ఒకప్పటి అబ్బాయిలం అయిన నువ్వు, నేను ఇప్పుడు అంకుల్స్ అయినట్లు, ఆ అమ్మాయి ఇప్పుడు ఆంటీ లా మారిపోయింది అంతే.
ఏంటో! సినిమా మరీ సుత్తిగా ఉంది మేష్టారు అన్నాను.
సగం పైగా చూసేసాం గా, పూర్తిగా చూసేస్తే నష్టమేముంది. మీకు నచ్చకపోతే కాసేపు పడుకోండి అన్నాడు.
సినిమాలో సునీల్ ఉన్నాడన్నారు కదా, సునీల్ ఎంటర్ అయితే కామెడీ ఉంటుంది కదా కనీసం ఆ కామెడీ అయినా ఎంజాయ్ చేస్తాలెండి. అంతదాకా ఎలాగోలా వెయిట్ చేస్తాను.
మేష్టారు మీరు అద్దాలు పెట్టుకునే చూస్తున్నారుగా?
అవును, ఎందుకా డౌట్? అన్నాను అతని వైపు చూసి
ఏయ్! ఇదేంటి ఇలా ఉన్నావ్? ఆ జుట్టేంటి అలా పీక్కున్నావ్?
సినిమా అర్థం కావట్లేదు ఆ ఫ్రస్ట్రేషన్ లో తెలీకుండానే పీక్కున్నట్లున్నానేమో అన్నాను.
సునీల్ ఎంటర్ అయి పది నిముషాలు అయింది. ఇంకా సునీల్ కోసం వెయిట్ చేయడం ఏమిటి? ఇప్పుడు వస్తున్న ఆ సీన్ లో కూడా సునీల్ ఉన్నాడు.
సునీలా ఎక్కడబ్బా నాకు కనపడడే?
అదిగో బస్తాలా ఉన్నాడుగా, రవితేజ ఎదురుగా కూర్చొని.
ఆడు సునీల్ ఏంటండీ బాబు, ఫామిలీ ప్యాక్ వాడూనూ. మాంఛి సిక్స్ ప్యాక్ తో ఫిట్ ఉంటాడు సునీల్. మొన్ననే పూల రంగడు మూవీ లో చూశానుగా.
మొన్న అంటే
మొన్న అంటే ..అదే మూడేళ్ళ క్రితం
అదీ విషయం. సిక్స్ ప్యాక్ నుంచి ఫామిలీ ప్యాక్ కి మారడానికి మూడేళ్లు చాలా ఎక్కువ.
నాన్నా! నా కార్ బొమ్మ ఎక్కడ పెట్టావ్? అని వచ్చారొకరు ఆడుకుంటున్న పిల్లల గుంపు లోంచి.
ఏమండీ అమర్ గారు, మీ అమ్మాయి ఏదో కంప్లైంట్ చేస్తోంది చూడండి అన్నాను పక్కన నిద్రపోతున్న మా ఫ్రెండ్ ని లేపి.
అమర్ ఎవరు? అని అటువైపు తిరిగి పడుకున్నాడు.
సారీ, మీరు అక్బర్ కదా! ఏమండీ అమర్ గారూ! ఈ అమ్మాయి ఏదో కంప్లైంట్ చేస్తోంది చూడండి అని ఇటు పక్కన నిద్రపోతున్న ఫ్రెండ్ ని లేపా.
అక్బర్ ఎవరు? అని లేచాడు
సారీ, మీరు ఆంథోని కదా, ఈ అమ్మాయి
అమ్మాయి ఎక్కడ, అబ్బాయి కదా అక్కడ ఉండేది.
ఎవరో ఒకరు లెండి, వాళ్ళ నాన్న కోసం వచ్చాడండీ. ఇంతకీ ఇతను ఎవరి అబ్బాయి మేష్టారు? ఇంతమంది పిల్లల్లో ఎవరు ఎవరి పిల్లలో తెలియట్లేదు.
మీ అబ్బాయిని పట్టుకొని ఎవరి పిల్లాడో అంటారేమిటి మేష్టారు. ఏంటి!ఏదో మూవీ చూస్తూన్నట్లున్నారు అన్నాడు T.V వైపు తిరిగి.
అంతే! ఒలింపిక్ రన్నర్ లా పరిగెత్తి రిమోట్ అందుకొని T.V ఆపేస్తూ, పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్లు మీరు, వాళ్ళకు అన్యాయం చేయకండి అని అన్నాడు.
'మీకీ, మీకీ గొడవలు వస్తే మాకీ మిక్సీ ఎందుకు ఆపేస్తారు? నేను పులిహోర బిర్యాని చేసుకొని మీకీ ఇవ్వకుండా నాకీ మాత్రమే తినేస్తాను, యెవర్రా అది, కిచెన్ లో పెద్దాడివి నీకీ ఏమీ పని?' అని అక్బర్ క్యారెక్టర్ లోకి అట్నుంచి మైండ్ డిస్టర్బెడ్ అండ్ డీవియేటెడ్ డిసార్డర్ కి వెళ్ళిపోయాడు పక్కన మూవీ చూస్తున్న ఫ్రెండ్ .
పూర్తి సినిమా చూడలేదు కానీ, నాకు మాత్రం ఒక్క డౌట్ ఉండిపోయింది. అమలాపురం లో తీసినా సరిపోయే సినిమాని అమెరికా లో తీయాల్సిన అవసరం ఎందుకు అని? మూవీ రిచ్ గా ఉంటుందనా?
ఈ పోస్ట్ చదివాక మీకు కూడా 'మైండ్ డిస్టర్బెడ్ అండ్ డీవియేటెడ్ డిసార్డర్' వచ్చిందేమోనని చిన్నడౌటనుమానం , ఏదీ మీ పేరు చెప్పండి?
అయ్యయ్యో! అంత పనీ చేసేశారా?!
రిప్లయితొలగించండితప్పలేదండి లలిత గారు.
తొలగించండిఅలా అడుగుతారేమిటి, నా పేరు పవన్ కుమార్ కాదా? 🤔
రిప్లయితొలగించండిపంచ్ వేశారుగా నరసింహారావు గారు :)
తొలగించండి🙂😎.
తొలగించండిమీ వ్యాఖ్య చూడడం ఆలస్యం అయింది. మీ ఊళ్ళో జరుగుతున్న క్రికెట్ ఆటని టీవీ మీద చూస్తూ కూర్చోడం వల్ల గమనించలేదు. ఆస్ట్రేలియా జట్టు ఏమిటండీ బాబూ, ఒకప్పటి భారతదేశ జట్టులాగా ఆడుతోంది? 1967లో పటౌడీ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించి, బాబ్ సింప్సన్ / బిల్ లారీ టీం చేతిలో ఘోరపరాజయం పొందిన సీరీస్ గుర్తొచ్చింది (నాలుగు టెస్ట్ లు ఆడి 4-0 తో భారతదేశ ఓటమి). తరవాత రోజుల్లో కూడా చాలాకాలం ఆస్ట్రేలియా బలమైన టీంగానే వెలిగింది. ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును అనే సామెత నిన్నో మొన్నో “ప్రజ” కొండలరావు గారు, నేనూ గుర్తుకు తెచ్చుకున్నాం వేరే సందర్భంగా ... అలా తయారయింది ఆస్ట్రేలియా పరిస్ధితి. అన్నట్లు ఆ రోజుల్లో భారతదేశానికి టీవీ అంత విరివిగా రాలేదు. రేడియో కామెంటరీ మహత్తరంగా ఉండేది, మైదానంలో జరుగుతున్న ఆటని కళ్ళక్కట్టించే వారు కామెంటేటర్లు. ముఖ్యంగా రేడియో ఆస్ట్రేలియా (ABC) నుండి వి.ఎమ్.చక్రపాణి, అలన్ మెక్-గిల్వ్రే (Alan McGilvray) అద్భుతంగా రన్నింగ్ కామెంటరీ (బాల్-బై-బాల్ కామెంటరీ అనేవారు) అందించేవారు. మరి కొంతమంది కూడా అటువంటి లెజెండ్స్ ఉండేవారు. ఇప్పటి టీవీ కామెంటేటర్లు వాళ్ళ ముందు దిగదుడుపే.
సర్లెండి, ఏదో ఘోష .... నా వ్యాఖ్య నిడివి మరీ ఎక్కువయిపోతోంది.
పాత విషయాలు తెలియజేసిందందుకు ధన్యవాదాలు మేస్టారు.
తొలగించండిఇప్పుడు ఆస్ట్రేలియ టీమ్ వీక్ గా ఉందో లేక ఇండియా టీమ్ స్ట్రాంగ్ గా ఉందో నాకు తెలీదండి, ఎందుకంటే క్రికెట్ చూడటం మానేసి ఆరేళ్లు దాటిపోయింది. నేను ఒలింపిక్ పార్క్ ఆఫీస్ బ్రాంచ్ లో పని చేసెప్పుడు చాలా మంది ఇండియన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఈవ్నింగ్ జాగింగ్ చేస్తూ కనపడేవారు. అప్పుడు మనవాళ్ళు వారితో ఫోటో దిగాలని ఉబలాటపడటం చూశాను గానీ ఇక్కడి ఆస్ట్రేలియన్ వాళ్ళు మాత్రం వాళ్ళ క్రికెటర్స్ తో ఫోటోస్ దిగటానికి ఎగబడటం లాంటివి పెద్దగా చూడలేదు. అంతే కాదు T.V adds లో కూడా వాళ్ళు పెద్దగా కనపడరు. వీళ్ళకు క్రికెట్ కు మాత్రమే కాక మిగతా గేమ్స్ కు importance ఇస్తారు.
మేం “డిఫరెంట్” కదండీ. క్రికెటర్లు మాకు దేవుళ్ళు. సినిమా వాళ్ళు దేవాదిదేవుళ్ళు. వాళ్ళు కనిపిస్తే, వాళ్ళ మాట వినిపిస్తే మాకు మైమరపు వస్తుంది. ఇందుగలడందులేడన్నట్లుగా పత్రికలలో వాళ్ళే, టీవీలో వాళ్ళే, వ్యాపారప్రకటనల్లో వాళ్ళే. వాళ్ళే మాకు సర్వస్వం. తెల్లవారడం ఆలస్యం, రోజంతా ఏదో ఒక సినిమా-బేస్డ్ ప్రోగ్రాం, సినిమా క్విజ్ లు, సినిమా వాళ్ళతో చిట్-చాట్ లు, సినిమా వారి భజన చెయ్యడమే మా టీవీల సృజనాత్మకత.
తొలగించండిఆఖరికి టీవీ ఏంకరులు ఏంకరిణులు, జబర్దస్త్ లాంటి అసభ్య టీవీ షోలల్లో వెకిలిహాస్యం చేసే వాళ్ళు కూడా మాకు సోకాల్డ్ సెలెబ్రిటీలే. అప్పుడెప్పుడో ఏదో ప్రకటనలో తరచూ అన్నట్లు We are like that only 🙂.
మేం అనాకండి, మనం అనండి. నేను మీ జాతి వాడినే, కాకపోతే ఏదో బతుకు తెరువు కోసం ఇటు వైపు వచ్చాను. :)
తొలగించండిఅలాగంటారా? అయితే ఓకే 👍. అలాక్కానివ్వండి ☺.
రిప్లయితొలగించండి