"పెంపుడు రాళ్ళు" అన్న మాట ఎప్పుడైనా విన్నారా?
ఏంటి మమ్మల్ని పిచ్చోళ్లనుకున్నావా? నువ్వు రాసే ప్రతీ చెత్త మేము చదవడానికి అని నా పోస్ట్ క్లోజ్ చేయాలని మీరు అనుకుంటే పప్పులో కాలు, ఉప్పులో చెప్పు వేసినట్లే.
"పెంపుడు రాళ్ళు" అనే మాట పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఆ పిచ్చి ఊహే నాలుగు రాళ్ళు వెనకేసుకునేలా చేసింది ఒక వ్యక్తి విషయంలో.
అప్పుడెప్పుడో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో గాలి బొక్కల చొక్కా, తుపుకు తుపుకు డిజైన్ షర్ట్ అని అమ్మితే జనాలందరూ ఎగబడి కొన్నట్లు చూపిస్తే సినిమా కాబట్టి అలా చూపిస్తారు నిజ జీవితం లో అలాంటి జనాలు ఎవరుంటారు అని అనుకునే వాళ్ళము కదా! కానీ నిజ జీవితం లో అంతకంటే క్రేజీ పీపుల్ ఉంటారని మీరు ఈ పోస్ట్ చదివిన తర్వాత అనుకుంటారు.
ఇక నాన్చుడు లేకుండా డైరెక్ట్ గా విషయానికి వస్తాను.
గారీ రోస్ దాల్ ..వద్దులే అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇప్పుడు నేను మార్చడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ లోనే చెప్తాను Gary Ross Dahl అనే పేరున్న ఇతన్ని మనం Gary అని పిలుచుకుందాం క్లుప్తంగా.
1975 టైములో ఈ Gary అనే వ్యక్తి అమెరికా లో "ఫ్రీలాన్స్ కాపీ రైటర్" అనబడే ఉండీ లేని జాబ్ ఏదో వెలగబెడుతున్న రోజులవి. బార్లో కూర్చొని బీర్ తాగుతూ ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్, తను ఊరెళ్ళినప్పుడు తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి యెంత కష్టపడ్డదీ, యెంత ఖర్చుపెట్టిందీ తలచుకొని బావురుమన్నాడు. ఇక మిగతా వారు కూడా ఈ పెంపుడు జంతువుల విషయం లో తాము ఊర్లో లేనప్పుడు వాటి సంరక్షణ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టారు. అసలే డబ్బులు లేక కరువు లో అల్లాడుతున్న మన Gary కి ఈ సమస్య ఏదో బంగారు బాతులా అనిపించి "పెంపుడు రాళ్ళు" అనే ఐడియా వచ్చేలా చేసింది.
అట్టపెట్టెలలో కాస్త మందంగా ఎండు గడ్డి పేర్చి అట్టపెట్టె సైడ్ లో కాస్త పెద్ద సైజు రంధ్రాలు చేసి లోపల Rosarito అనే బీచ్ దగ్గర దొరికే నున్నటి ఓవల్ షేప్ లో ఉన్న రాళ్ళను ఉంచి ఆ అట్టపెట్టె మీద 'Pet Rock' అని ముద్రించి ఒక్కొక్కటి నాలుగు డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. ఈ రాయితో పాటు దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెబుతూ ఒక instruction బుక్ కూడా పెట్టాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మకాల్లో ఈ instruction బుక్ కీ లాగా పనిచేసింది. ఈ బుక్ లో ఆ పెంపుడు రాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే జాగ్రత్తలు బాగా హాస్యాన్ని తెప్పించాయట. 'వీటికి బద్ధకం ఎక్కువ, కూర్చున్న చోటి నుంచి కదలవు. మీరే బయటికి తీసుకెళ్ళాలి. అలాగని చెప్పి స్విమ్మింగ్ కి మాత్రం తీసుకెళ్ళద్దు వాటికి ఈత రాదు మునిగిపోతాయి' అంటూ హాస్యాన్ని కురిపించాయట.
మొత్తానికి అలా ఈ రాళ్ళ వ్యాపారం 1975 మధ్యలో మొదలైంది. అలా మొదలైన వ్యాపారం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా ఫేమస్ అయిన 'టు నైట్ షో' అనే పాపులర్ అమెరికన్ టీవీ షో లో పాల్గొనడం, పేపర్లో పబ్లిసిటీ ఇవ్వడం వీటికి తోడూ 'నేను నా పెట్ రాక్ తో ప్రేమలో ఉన్నాను' అనే ఒక సాంగ్ ని కూడా షూట్ చేయించి రిలీజ్ చేయడం చేశాడు.
అతని ప్రయత్నాలు వృథా కాలేదు. అమెరికాలో ఆ సంవత్సరం క్రిస్మస్ కి చలితో పాటు ఈ పెట్ రాక్స్ వ్యాపారం కూడా అమాంతం పెరిగింది. ఈ క్రేజీ ఐడియా 6 నెలలే పని చేసింది గానీ అప్పటికే అతను పది పదిహేను లక్షల రాళ్ళ దాకా అమ్మి సొమ్ము చేసుకున్నాడట.
ఇందులో మనకు అంత విచిత్రం ఏమీ కనపడకపోవచ్చు, ఎందుకంటే జాతి రత్నాలపేరు చెప్పి మన దేశంలో ఇప్పటికీ బోలెడన్ని రాళ్ళు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఆ పెంపుడు రాళ్ళ వ్యాపారం మూలపడ్డాక అలాంటివే ఇంకొన్ని పిచ్చి పిచ్చి వ్యాపారాలు మొదలెట్టాడు గానీ ఏవీ క్లిక్ అవలేకపోయాయి. ఏదైతేనేం మార్కెట్టింగ్ లో తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 'Advertising For Dummies' అనే బుక్ కూడా రాశాడు ఇతను.

ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పిచ్చి ఐడియా ఉండి దాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే "పెంపుడు రాళ్ళు" కాన్సెప్ట్ లాగా మీరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.
అదేదో సినిమాలో "రాయినయినా కాకపోతిని" అనే పాట ఉంది. రాళ్లు కూడా పెంపుడు జంతువుల స్థాయికి ఎదగడం వాటి పూర్వ జన్మ సుకృతం.
రిప్లయితొలగించండిఅమెరికన్స్ పిచ్చి కి నిదర్శనం అనుకుంటా జై గారూ, రాళ్లు పెంపుడు జంతువుల స్థాయికి ఎదగడానికి .
తొలగించండిఅంత క్లియర్గా కామెడీ రాసినా.. అతని క్రియేటీవిటీకి మెచ్చి కొన్నట్టున్నారు..
రిప్లయితొలగించండిఅంతే అయి ఉండచ్చు. అందుకే నెక్స్ట్ టైం అతని ప్రొడక్ట్స్ ఇగ్నోర్ చేసినట్లు ఉన్నారు.
తొలగించండితెల్లోళ్ల దగ్గరే తప్ప తెలుగోళ్ల దగ్గర ఐడియాలు లేవనుకోకండి.
రిప్లయితొలగించండిఆ మధ్య మనోళ్ళచేత కరక్కాయలు పొడికొట్టించి మరీ బోలెడు వెనకేసుకున్నాడు ఎవడో!
ఈ విషయం గురించి వినలేదే ఎప్పుడూ, ఈ మధ్యే జరిగిందా సూర్య గారు?
తొలగించండిhttps://www.andhrajyothy.com/artical?SID=894035
తొలగించండికిలో కరక్కాయలు1000కి కొని పొడిచేసి తిరిగి ఇస్తే 300 బోనస్ ఇస్తామని చెప్తే జనాలు వెర్రిగా ఎగబడ్డారు. పదో పాతికో ఇచ్చి వాడే ఏ మిల్లులోనో ఆడించుకోక మనకి 300 ఇచ్చి దంచిపెట్టమనడానికి మనమేం వాడి మేనత్త కూతుళ్ళం కాదుగా అని ఎవడూ ఆలోచించలేదు. బయట వందకు దొరికే కరక్కాయలని ఒక్కొక్కడూ1000 పెట్టి వాడి దగ్గర కొన్నాడు.
వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు సూర్య గారు. తేరగా డబ్బులు వస్తాయి అని తెలిస్తే మన తెలివి అటక ఎక్కి కూర్చుంటుంది, ఇంకేం ఆలోచిస్తాం.
తొలగించండిసరదాగా ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ఎవరిదగ్గరైనా ఉంటే షేర్ చెయ్యండి.
రిప్లయితొలగించండికామెడీ ప్రియులు, అలాగే భారీకాయ అభిమానులు అందరికీ శుభవార్త వచ్చేసిందోచ్!
రిప్లయితొలగించండిhttps://www.eenadu.net/newsdetails/16/2019/10/26/119032458/Nandamuri-Balakrishna-new-movie-title-fixed-as-Ruler
పండుగ పూట కూడా ప్రశాంతంగా ఉండనియ్యరు
బాలయ్య, చిరు, నాగయ్య, వెంకీ మామ, -- ఈ తాతబ్బాయి లంతా తమ వయసుకు తగ్గ వేషాలు వేయకుండా మనవరాలి వయసున్న పడుచు అమ్మాయిలతో వెర్రి గంతులు వేయడం ఏమిటి.
తొలగించండిబుల్ బుల్ చేతి తో సుత్తి చూస్తే కామిడీగా అనిపిస్తుంది.
అది సుత్తికాదు మటన్ షాపు మస్తాన్ దగ్గర ఎత్తుకొచ్చిన కత్తి! సరిగా చూడండి
తొలగించండిసారీ నాదే మిస్ అండర్ స్టాన్డింగ్. మీరు సుత్తి పట్టుకున్న ఫోటో చూసారు, నేను కట్టిపట్టుకున్న ఫోటో చూసా.
తొలగించండిసుత్తి పట్టుకున్న ఫోటో లో బాలయ్య బాలేడు. సుత్తి మాత్రం బాగుంది.
కత్తి పట్టుకున్న ఫోటోలో బాలయ్య బావున్నాడు. కత్తిమాత్రం బాలేదు. జక్కన్నని కత్తిలాంటి కొత్త ఆయుధం కనిపెట్టమనాల్సింది.
కత్తి పట్టినా సుత్తి కొట్టినా తాత తాతే!
తొలగించండిబుల్ బుల్ , చిరు కలిసి "తాతు-తాతి" అనే సినిమాలో నటిస్తే బాగుంటుంది.
తొలగించండితెలుగు రాష్ట్ర జనాలు అన్యాయం అయిపోతారు ఇద్దర్నీ చూడలేక
తొలగించండిAnonymous 26 October 2019 at 04:05 గారు,
రిప్లయితొలగించండిమీరెవరో మరీ అమాయక చక్రవర్తిలా ఉన్నారే? అలా గంతులెయ్యడం తెలుగు సినిమారంగంలో రివాజే కదండీ. పైగా అది తమ వారసత్వపు హక్కు అని కూడా వారిలో కొంతమంది భావనేమో అనిపిస్తుంది. తెలుగు సినిమారంగానికి రెండు కళ్ళు అనబడే ఆ ఇద్దరు అతి సీనియర్ హీరోలు మొదలెట్టిన ధోరణి, ఈనాటికీ కొనసాగుతోంది.
మన ఖర్మ.
Jai,
రిప్లయితొలగించండి// "పండుగ పూట కూడా ప్రశాంతంగా ఉండనియ్యరు"" //
"పచ్చ" పత్రికలు చదవనేలా? చదివితిరి బో అక్కడే మర్చిపోక, ఆ తరువాత కూడా తలుచుకుని తలుచుకుని ... తిట్టుకోనేల? 😀😀
తొలగించండితిట్టుకొంటిరిపో ఆ పై బ్లాగాడనేల :)
జిలేబి
Well said, "జిలేబి" గారు 👏😀.
తొలగించండిఅది అభిమానులకు ప్రేమతో వారిచ్చే దీపావళి కానుక నరసింహా రావు గారు, మీరు ఇలా కించపరచ డం ఏం బాలేదు
తొలగించండిబ్లాగాడితిరిపో ఆపై ఇంత చర్చించనేల!
తొలగించండిచర్చింతిరి పో, ఆ చర్చను మరిన్ని కామెంట్లతో పొడిగించనేల ? :)
తొలగించండిపవన్ (26 October 2019 at 13:49),
తొలగించండి// ".... నరసింహా రావు గారు. మీరు ఇలా కించపరచడం ఏం బాలేదు" //
మీ కామెంట్లో "నరసింహా రావు" బదులు "జై గొట్టిముక్కల" అని వ్రాయాలి. "పండగ పూట" అంటూ వాపోయినది జై గారు కదా, మరోసారి చూడండి.
ఎనీవే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఇదంతా జై గారి పనా, అయితే వార్నింగ్ వారికే. మీరు క్షమించాలి.
తొలగించండిమా హీరోలు రాత్రనక పగలనక కష్టపడి దీపావళి కానుక అభిమానులకోసం ఇస్తే మీరు కామెంట్ చేయడం మా అభిమానులను hurt చేసింది.
బ్లాగ్ రీడర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
తొలగించండివిన్నకోట వారూ, పచ్చ పత్రికలు చదివితేనే బోలెడంత ఫ్రీ ఎంటర్టైన్మెంట్.
తొలగించండిపవన్ గారూ, ఆ లుక్కు వేరు ఆ కిక్కు వేరు అంటారా అయితే వాకే!
"మడిచి లోపల పెట్టుకో" అనే పిచ్చి డైలాగ్ నుంచి కూడా శాంసంగ్ కంపెనీ ప్రేరణ తీసుకున్నట్లుంది. వరసగా మడటపెట్టే ఫోన్లు విడుదల చేసే పనిలో ఉంది☺️
రిప్లయితొలగించండిమడత పెట్టుకునే టివి కూడా ఏదో కంపెనీ తయారుచేస్తోందని విన్నాను సూర్య గారు.
తొలగించండిఒకప్పుడు మడత మంచాలకు గిరాకీ ఉండేది. ఇప్పుడు మడత ఫోనులు/టీవీలు వచ్చాయా? ఇదేం మడత పేచీయో ఏమో!
తొలగించండిమడత పెట్టడం అంటే ఒక సంఘటన గుర్తొచ్చింది.
తొలగించండిఒకప్పుడు floppy disk లు అని వాడేవారు, ఈ తరం వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇవి removable storage devices అన్నమాట. ఇప్పటి కంప్యూటర్లకు అసలు floppy disk డ్రైవే ఇవ్వటం లేదనుకుంటాను. ఇవి మూడు సైజుల్లో వచ్చాయి (పరిణామ క్రమం) ... 8 inches, 5.1/4 inches, 3.5 inches. 8 inches చిన్న చాటంత ఉండేది. 5.25 inches స్కూల్ పిల్లల నోట్ బుక్ అంత ఉండేది. 3.5 inches మాత్రం చొక్కా జేబులో పట్టేది. పలచగా flimsy గా ఉండేవి. వేడి తట్టుకోలేకపోయేవి, దుమ్ము అసలు తగలకూడదు, కాస్త నలిగినా పాడయిపోయేవి. చేతిలోంచి క్రింద పడినా మూగపోయేవి. పూర్తిగా సుకుమారం :)
వేరే చోటికి వెడుతున్నప్పుడు వీటిని బాగులో పెట్టుకుని తీసుకువెళ్ళే వారు.
ఒకసారి కొత్తగా కంప్యూటర్ డిపార్ట్మెంట్ కు వచ్చిన ఒక ఉద్యోగిని కొన్ని files ఉన్న ఒక floppy disk ను వేరే ఆఫ్హిసుకు తీసుకువెళ్ళి ఇవ్వమని పంపించారు. వెళ్ళినవాడు తిరిగి వచ్చి floppy read అవటం లేదటండీ అన్నాడు. ఇక్కడ computer లో పెట్టి చూసినా read అవలేదు. ఎందుకో అనుమానం వచ్చి ఈ floppy ని ఎలా తీసుకువెళ్ళావు అని అడిగారు. జేబులో పెట్టుకుని వెళ్ళాను అన్నాడు. అది 5.25 inches floppy disk. జేబులో 5.25 inches disk ఎలా పట్టిందయ్యా అని అడిగితే ... మడిచి జేబులో పెట్టుకున్నాను అన్నాడు అతగాడు :(
ఏమిటో, ఆ రోజులే వేరు :)
మీరుకూడా దాన్ని మడిచి 3.5 ఇంచి డ్రైవ్ లో పెట్టి ఉంటే read అయ్యేదేమో!☺️
తొలగించండిGood idea, Surya 😃😃. అయితే అవి 3.5 కొత్తగా వస్తున్న రోజులు. ఆ కాలంలో ఒకే కంప్యూటర్ కు రెండు డ్రైవ్ లూ (5.25 and 3.5) ఉండటం కాస్త అరుదు 🙁. కలిగిన వారి వ్యవహారం అన్నమాట ☝️.
తొలగించండిమీరు చెప్పిన మడత drive సంఘటన బాగుంది మేష్టారు.
తొలగించండి