27, అక్టోబర్ 2019, ఆదివారం

సైరా లాస్ వెంచర్ అయిందా?

సైరా సినిమా నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలకు నా పైత్యం కొంత కలిపి పులిహోర వండాను, నచ్చితే ఎంజాయ్ చెయ్యండి లేక పులుపు ఎక్కువైపోయి ఉంటే మన్నించండి. 

కొందరేమో సైరా క్యారెక్టర్ లో మా బాలయ్య అయితే బాగుండేవాడు.   రాజసం అంటే బాలయ్యదే, గౌతమీ పుత్ర శాతకర్ణి లో అదరగొట్టాడు. అంతేకాదు చిరంజీవి డైలాగులు బాగా చెప్పలేదు, వాయిస్ బాగా దెబ్బ తిన్నట్లుంది మా బాలయ్య నోట్లోంచి వచ్చి ఉంటే బాగుండేది అన్నారు. 

మొన్నొక సారి బాబూమోహన్ 'గుర్రం మీద స్వారీ చేయడం అంటే అది బాలయ్య బాబే చెయ్యాలి చిరంజీవి గిరంజీవి బలాదూర్' అన్నాడట భైరవద్వీపం సినిమాలో బాలయ్యతో పని చేసిన అనుభవాలు పంచుకుంటూ ఒక ఇంటర్వ్యూ లో.  మరి బాబూమోహన్ సైరా సినిమాలో చిరంజీవి గుర్రం మీద స్వారీ చేయడం చూశాడో లేదో, కానీ చిరంజీవి ఫాన్స్ మాత్రం కొదమ సింహం సినిమాలో చిరంజీవి స్టైలిష్ గా గుర్రం మీద స్వారీ చేసిన వీడియోలు బాబూ మోహన్ గారికి షేర్ చేస్తున్నారట.

రామాయణం లో పిడకల వేటలా సైరా గురించి మాట్లాడుతూ ఎటో వెళ్ళిపోయా.

మళ్ళీ సైరా విషయానికి వస్తే ఇంకొందరేమో స్క్రీన్ నిండా చిరంజీవే కనపడుతున్నాడు, అంత లావుగా ఉండే వ్యక్తిని హీరో గా accept చెయ్యలేం అంటున్నారు. మన తెలుగులోనే కొందరు అలా ఫీల్ అవుతున్నారంటే ఇక మిగతా భాషల వాళ్ళు ఎలా ఫీలవ్వాలి? అందుకే ఒక్క తెలుగులో తప్ప మిగతా భాషల్లో సినిమా బోర్ల పడినట్లుంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఈ వయసులో ఆయన మనకు హీరో గానీ పక్క భాషల వారికి కాదు కదా.  అందుకే సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే కాస్తో కూస్తో కర్ణాటక నుంచి రావాలి కాబట్టి ఇది లాస్ వెంచర్ కిందే లెక్క.  

చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఆల్మోస్ట్ కల్లెక్షన్స్ డ్రాప్ అయిన సినిమాకి ఏంతో కొంత కలెక్షన్స్ వస్తే చాలని, సినిమాని నిలబెట్టడానికి ఎక్కే గడప దిగే గడప అన్నట్లు అందరి ఇళ్ల చుట్టూ తిరిగాడు తిరుగుతూనే ఉన్నాడు చిరంజీవి. 

మొన్నటికి మొన్న చిరంజీవి గారి కోడలు పిల్ల మోడీ ని నిలదీసింది మీకు ఈ  దేశంలో సినిమా నటులంటే ఉత్తరేది వారేనా, ఇక్కడి వాళ్ళు మీ కంటికి కనిపించలేదా అని. చిరంజీవి గారు మాత్రం అలాంటి మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా నా సినిమా చూడండి మొర్రో అని మోడీ గారికి  మొర పెట్టుకోబోతున్నాడట పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే అన్నట్లు.  అలాగే మొన్న ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా కలిసాడు ఈ విషయమై. ఈ తిప్పలేవో సినిమా రిలీజ్ అవ్వకముందే చేసి ఉంటే ఇంకాస్త కలెక్షన్స్ పెరిగేవేమో. అయినా ఊపిరి పట్టినంత మాత్రాన బొజ్జ నిండుతుందా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చూసినంత మాత్రానా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిండిపోతుందా? ఏమిటో మా చిరంజీవి చాదస్తం, అసలే ఈతాకు యవ్వారం ఆయనది, తన డబ్బులు పోతే ఎట్టా? అందుకే ఆయన పాట్లు యేవో ఆయన పడుతున్నారు. 

సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ పడేప్పుడు చాలా మంది స్వాతంత్ర సమరయోధులను చూపించారట కానీ అల్లూరి సీతా రామరాజుని చూపించలేదు అని గగ్గోలు పెడుతున్నారు.

సర్లే ఎప్పుడో స్వర్గస్తులైన అల్లూరిని చూపించకపోయినా పర్లేదు మొన్నీ మధ్యే మరణించిన మా రాజన్న వీళ్ళ కంటికి అనలేదా అని కొందరు, ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతున్న మా చంద్రన్న ఫోటో ఎందుకు చూపించలేదు అని మరికొందరు  వాళ్ళ వాళ్ళ అక్రోశం వెళ్ళగక్కారు అది వేరే విషయం.  

P.S: 'ఈతాకు యవ్వారం' అనే పద ప్రయోగం మా అమ్మ అప్పుడప్పుడూ వాడుతూ ఉండేది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే చెప్పింది. గాలి వీచినప్పుడో లేదంటే ఆకులు రాలే కాలంలోనో ఏ చెట్టు ఆకులైనా రాలుతూ ఉంటాయి, కానీ ఈతాకు చెట్టుకు మాత్రం ఎప్పుడూ రాలవు. తన డబ్బు ఒక్క రూపాయి కూడా రాలకుండా చూసుకునే వాడిని 'ఈతాకు యవ్వారం' తో పోలుస్తారు అంది. 

43 కామెంట్‌లు:

 1. చాలా బాగా వ్రాసారు. మీ ద్వారా ఓ కొత్త వాక్యం చదివాను. "ఈతాకు యవ్వారం"...
  ధన్యవాదములు.

  సదాశివరావు నూతలపాటి

  రిప్లయితొలగించు
 2. ఈ పొగాకు యవ్వారపు పోస్టులకేముంది గాని, లాసో మాసో వాళ్ళు చూస్కుంటారులెండి. వాళ్ళు చూసుకోవాలనేకదా! వాళ్ళు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పొగాకు యవ్వారం, ఇది కూడా ఈతాకు యవ్వారం లాంటిదే అన్నమాట.

   తొలగించు
  2. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటే పోగాకు చుట్ట కాలుస్తూ వాళ్ళగురించి వృధాగా మాట్లాడటం అన్నమాట!

   తొలగించు
  3. అర్థమైంది సూర్య గారు, మీ పద ప్రయోగం బాగుంది.

   తొలగించు
 3. నాకు మీరు వాడిన "ఈతాకు యవ్వారం" అనే నానుడి బాగా నచ్చింది. మా అమ్మమ్మ ఇదే అర్ధంతో "తొంటి చేత్తోటి కాకిని విదిల్చే రకం" అనేది.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. Thanks Jai గారు, పిల్లికి బిచ్చం వెయ్యని రకం అని కూడా అనే వారు.

   తొలగించు
  2. "ఎంగిలి చేత్తో కూడా కాకిని విదల్చడు" అంటారు. విదిల్చి తన ఎంగిలి చేతికి అంటుకునున్న ఆ నాలుగు ఎంగిలి మెతుకులు మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి .. అని.

   తొలగించు
  3. విన్నకోట వారూ, రెంటికీ ఒకటే అర్ధమండీ. ఒక భాష్యం పిసినారి వాడని ఎంగిలి చేయి గురించి చెపితే, ఇంకో వెర్షన్ వాడే ఎడమ చేతికి ప్రాధాన్యత ఇచ్చింది, ఇదే తేడా.

   పవన్ గారూ, పిల్లికి బిచ్చం అన్న నానుడి ముందు విన్నదే కానీ దీని తాత్పర్యం ఏమిటో తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి, థాంక్స్.

   తొలగించు
  4. పిల్లే చిన్నగా ఉంటుంది, దాని కడుపెంత చిన్నగా ఉంటుంది ఇక దాని తిండి ఎంత తింటుంది? ఆ మాత్రం కూడా పెట్టని పిసినారి అని అర్థం అనుకుంటా జై గారు నాకు తెలిసి.

   పెద్దలు విన్నకోట నరసింహారావు గారు చెప్పాలి మరి నేను చెప్పింది కరెక్టా కాదా అని.

   తొలగించు
  5. నానుడికి మల్లె మీ వివరణ కూడా బాగుంది. VNR సార్ కాంట్రడిక్ట్ చేయకపోతే ఇదే ఫ్రీజ్ (అమితాబ్ అన్నట్టు లాక్ కియేజాయ్) చేసుకుందాం.

   తొలగించు
  6. నాకూ సరిగ్గా తెలియదండీ 🙁.
   అయినా బిచ్చం అడగడానికి పిల్లులు కూడా వస్తాయంటారా🙄? ఆ సామెతలో ఏదో మిస్సింగో, స్పెల్లింగ్ తప్పో ఉందేమో అనిపిస్తోంది 🤔.

   తొలగించు
  7. ఏ కుక్కో, చీమో అనకుండా పిల్లే అని అన్నారంటే ఏదో ఒక కారణం ఉండి ఉండచ్చు అనుకుంటా మేష్టారు.

   తొలగించు
  8. ఇంకేం! ఓ పిట్టకథ సృష్టించేద్దాం.

   తొలగించు
  9. నాకు తోచిన పిట్టకథ .....
   ఆరుగాలం కష్టించి పండించిన పంటంతా పూర్వం
   గాదెల్లో దాచుకొనేవారు . ఇక , ఎలుకలూ పంది
   కొక్కులూ పడితే , ఏడాది గ్రాసం హరోం హరి .
   కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా పిల్లుల్ని
   పెంచేవారు . వాటికి (అంటే మన యేడాది
   గ్రాసం కాపాడేవాటికి) కూడా కూసింత తిండి
   పెట్టని పీనాసి వెధవని గూర్చిన సామెత ఇది .

   తొలగించు
  10. బహు భేషుగ్గా ఉంది రాజారావు గారు.

   తొలగించు
  11. పిట్టకథ కాదు. నిజమే కావచ్చు.

   తొలగించు
  12. పిల్లికి కూడా కూలీ ఇవ్వని పీనాసి ఎధవ అనాలి. పిట్టకథ సెట్టవ్వలేదు.

   తొలగించు
  13. శాపాలు, తాపాలు కథ సృష్టించెయ్యండి. కాదంటే పాపాలే..

   తొలగించు
  14. చిరు గారు లేవదీసిన పాయింట్ కూడా కాస్త లాజికల్ గానే ఉంది. ఈ పాయింట్ తట్టలేదు.
   ఈ శాపాలు, తాపాలు ఎక్కడి నుంచి ఊడి పడ్డాయో అర్థం కాలేదు.

   తొలగించు
  15. పోయిన జన్మలో యక్షుడు/గంధర్వుడు/దేవడు
   ముని శాపం
   పిల్లి జన్మ
   భగవంతుడి చేతిలో చావు
   శాపవిమోచనం

   ఈ పాయింట్లు తీసుకోని.. ఇక క్రియేటివిటీ చూపించడమే..
   ఎవడైనా తప్పంటే.. "దేవుడ్నే ఎదిరిస్తావా? పాపం కొట్టుకుపోతావ్..."

   తొలగించు
 4. ఎమిటి? రాజన్న,చంద్రన్నలను చూపాలా? మొహం పోయి అద్దం లో చూసుకో!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఏదో కామెడీ కోసం మేష్టారు, సీరియస్ గా తీసుకుంటే ఎలా?

   తొలగించు
 5. పవన్,
  మిమ్మల్ని గురించి, మీ టపా గురించీ కాదు గానీ రివ్యూలు వ్రాసేవారి మీద అలీ అనే ఓ సినీవాలా గారి ఈ అభిప్రాయం చూడండి (లింక్). సినిమాల గురించి ప్రేక్షకులే చెప్పాలిట గానీ రివ్యూ వ్రాసే వాళ్ళు చెప్పటం ఏమిటని అడుగుతున్నాడు ("కోన్ కిస్కా గొట్టాం గాళ్ళు" వంటి నీచపు పదప్రయోగాలతో). రివ్యూ వ్రాసే వ్యక్తి కూడా ఒక ప్రేక్షకుడేనన్న ఇంగితం ఉన్నట్లు లేదు. పబ్లీకున ఇలా మాట్లాడే సంస్కారహీనుడు తానొక "సెలెబ్రిటీ"ననుకుంటూ చెలామణీ అయిపోవడం, స్టేజ్ మీద కూడా విర్రవీగడం .. తెలుగు ప్రజల ఖర్మ.

  ఇలా మాటసంస్కారం లేని, అహంకారపూరిత అలీ లాంటి వారి సినిమాలను, టీవీషోలను ప్రోత్సహించకుండా ఉందాం, అదొక్కటే మనలాంటి సామాన్యులు చెయ్యగలిగినది.

  Ali on movie review writers

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అలీ స్టేజ్ మీద కంట్రోల్ తప్పుతూ ఉంటాడు మేష్టారు తరచుగా. రాక రాక ఒక సినిమాలో కాస్త lengthy character వచ్చింది, అది కాస్త తుస్సుమనడంతో అలా ఆవేశపడ్డాడు.

   నేనైతే ఈ రివ్యూ వల్ల సినిమాకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని నమ్ముతాను.

   ఉదాహరణకి మొన్న వచ్చిన sairaa కి బాలీవుడ్ లో మంచి రేటింగ్స్ ఇచ్చారు, war Ki bad ratings ఇచ్చారు కానీ బొమ్మ తిరగబడింది అక్కడ.

   తొలగించు
  2. రివ్యూలు రాసేవాళ్ళు కూడా పక్షపాత బుద్ధి ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి సినిమాలకి కూడా లేనిపోని వంకలు పెడుతుంటారు. తమ వర్గపు హీరో అయితే దరిద్రగొట్టు సినిమాలని కూడా ఆహా ఓహో అంటారు. అందుకే తెలుగు సినిమా రివ్యూలు నేను పెద్దగా పట్టించుకోను.

   తొలగించు
  3. రివ్యూ వల్ల సీనిమాకు ఏమైనా ఒరుగుతుందా లేదా, నిష్పక్షపాతంగా వ్రా‌స్తున్నారా లేదా ... అన్నది కాదు నేనిక్కడ ఫోకస్ చెయ్యదలుచుకున్నది. అలీ యొక్క మాటలో బయటపడుతున్న అతని సంస్కారం రాహిత్యం ఖండించదగినది అంటున్నాను. కాస్త పేరు, బోలెడంత డబ్బు వచ్చి, అవి తెచ్చిపెట్టే మదం బయటపడుతోంది.

   అఫ్కోర్స్ పలు రంగాల్లో ఉన్నట్లే రివ్యూలు వ్రాయడంలో కూడా pressures, affinity వంటి ఎన్నో factors ఉంటాయని అందరూ అనుమానించేదే. ఈ రాజకీయాలను "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు" అనే సునీల్ సినిమాలో బాగా చూపించారు.

   తొలగించు
  4. ఈ రివ్యూ లు రావడం ఒకందుకు మంచిదే అయింది నరసింహారావు గారు , లేదంటే అడ్డమైన సినిమాలు కూడా బాగున్నాయని సాయంత్రమే టి.వి లో బాకా ఊదేవాళ్ళు ఒకప్పుడు. నేను కాలేజీలో చదివే రోజుల్లో అయితే థియేటర్ బయటికి వచ్చిన ప్రేక్షకులతో సినిమా ఎలా ఉందో చెప్పనిచ్చి అది ప్రసారం చేసేవారు, ఎవరైనా బాగాలేదు అంటే ఆ పార్ట్ వరకు ఎడిట్ చేసేవాళ్ళు.


   రివ్యూ లు ఇచ్చి సినిమాని బతకనివ్వడం లేదు, కొన్ని వేల మందికి పని కల్పిస్తున్న సినిమా పరిశ్రమ కడుపు కొడుతున్నారు అంటూ సినిమా డైలాగులు వల్లిస్తుంటారు. ఆ తీసే సినిమా ఏదో కాస్త బాగా తీస్తే ఇంత తిప్పలు ఉండవుగా.

   తొలగించు
 6. బుల్ బుల్ ,చిరు - తాతు తాతి ఇద్దరు కూడా ఇరవై ఏళ్ల క్రితం వేయాల్సిన పాత్రలు ఇప్పుడు వేశారు.
  బుల్ బుల్ బయోగ్యాస్ కూడా అందుకే చెక్కలోకి పోయింది.
  చిరుకి శంకర్ దాదా, అన్నయ్య, అందరివాడు ఇలాంటీ కామెడీ టచ్ పాత్రలు బాగా సూటవుతాయి.

  బుల్ బుల్ సినిమాలలో నాకు నచ్చింది ఒక్క ఆదిత్య 369 మాత్రమే.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఇక ఈ వృద్ధ హీరోస్ రిటైర్ అయిపోవడమో లేదంటే పార్ట్ టైం (అతిథి పాత్రలు లేదా వయసుకు తగ్గ పాత్రలు) సినిమాలు చేసుకోవడమో మంచిది.

   తొలగించు
  2. వృద్ద పాత్రలేస్తామంటే.. ఫాన్స్ ఒప్పుకుంటారా? మీరు పైన చెప్పిన బాచ్చిలో ఓ బేద్ద వృద్ద హీరో.. ఒక అద్భుతమన ప్రేమ కథతో ఒక సినిమా తీసే టైంలో.. సదరు హీరోతో నేను మాట్లాడినప్పుడు.."ఈ సినిమా ఆడదండీ.. ఫాన్సుకు మేమిలా నటిస్తే నచ్చదు. అందుకే చచ్చినట్టు మాస్ పాత్రలేసుకుంటూ నెట్టుకొస్తున్నాం.". సో.. ప్రొడుసర్లు కూడా బట్టలు చించుకునే మొదటి రోజు ఫాన్సు కోసమే సినిమాలు తీసుకుంటారు. అదే వాల్ల లాభలకి గ్యారెంటీ.

   తొలగించు
  3. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది కరెక్టే అనుకున్నప్పుడు, అదీ చొక్కాలు చించుకునే ఫాన్స్ కోసమే అయితే ఒక 20 కోట్ల లోపు సినిమా తీసుకుంటే సరి, పెట్టిన డబ్బులు తిరిగొస్తాయి లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే, కాదు కూడదు అంటే బాగా డబ్బు మూలుగుతున్న వాళ్లకు కోట్లు పోయినా నష్టం లేదు అని మనం అనుకోవాలి.

   తొలగించు
  4. ఫాన్సు కోసం మాత్రమే సినిమా తీస్తున్నామని హీరో గారి కటౌట్ ఒక్కటే పెట్టి సినిమా అంతా లాగెయ్యరుగా.. స్టోరీ మీద నమ్మకంతో కూడా ఉంటారు. ఇవ్వన్నీ ఎందుకు? ఇదే వృద్ద హీరోలతోనో, వాళ్ళ కుర్ర నడీవయస్సు కొడుకులతోనో.. శంకరాభరణం తీస్తే.. మీరు చూస్తారా?

   తొలగించు
  5. 20 కోట్లా? బేద్ద హీరోగారి మే"కప్పు"లకే సరిపోవు.

   తొలగించు
  6. For your info "ఆ ప్రేమకథ సినిమా... హీరోగారు చెప్పినట్టే, 4 రోజులుకూడా ఆడలేదు"

   తొలగించు
  7. వద్దులెండి, శంకరాభరణం కంటే శంకర్ దాదా లాంటి సినిమాలే బెస్ట్ వారికి. మీరన్నట్లు వారి విగ్గులకు కూడా సరిపోదు ఆ 20 కోట్లు.

   నేనెంత ఆలోచించిన ఆ ప్రేమ కథా చిత్రం ఏమిటో గెస్ చేయలేక పోతున్నా మేష్టారు. క్లూస్ ప్లీజ్?

   తొలగించు
  8. నా మీద నమ్మకంతో ఆ హీరోగారు అలా ఓపెన్ అయ్యారు. అందుకే దానికి సంభందించి ఏమాత్రం చెప్పలేను. సారీ..

   తొలగించు
  9. బహుశా మిత్రుడు సినిమా కాఫుకదా!

   తొలగించు
 7. the real losers will be people who buy these cinemas at very high prices, heroes will not have any problem...

  రిప్లయితొలగించు