8, అక్టోబర్ 2019, మంగళవారం

అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు

మొన్న ఉదయాన్నే అప్రైసల్ డిస్కషన్ కి  మా మేనేజర్ సుబ్బారావ్ పిలవగానే ఉత్సాహంగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళాను . 

నేను - డిస్కషన్ ముందు
"పవన్, ఈ ప్రాజెక్ట్ లో గత సంవత్సర కాలంలో నీ అచీవ్మెంట్ గురించి చెప్పు" అని అడిగాడు మా సుబ్బారావ్ (మేనేజర్). 

సీ మిస్టర్ సుబ్బారావ్, సైరా ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి చేతికి వెళ్ళినప్పుడు ఇతను హేండిల్ చేయగలడా అని అందరూ సందేహించినట్లే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు చాలా మంది 'పవన్ ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలడా?' అని అనుమాన పడ్డారు.  అందరి నోళ్ళు మూయించేలా నేను ఈ ప్రాజెక్ట్ లో పొడిచేసాను, దంచేసాను, రుబ్బేసాను, ఉతికి ఆరేశాను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒంటి చేత్తో నిలబెట్టాను. ఇంతకంటే అచీవ్మెంట్ ఇంకేం కావాలి అన్నాను సినిమా సక్సెస్ అయిన తర్వాత జరిగిన అభినందన సభలో హీరోలా రెట్టించిన ఉత్సాహంతో. 

నా ఉత్సాహం మీద నీళ్లు చల్లేస్తూ "అభినందన్ గురించి నీకేం తెలుసు?" అన్నాడు. 

మన టీం లో అలాంటి పేరు ఎప్పుడూ వినలేదే?

టీం లో కాదు టీవీ లో చూసి ఉంటావ్ గా అతన్ని.

అతనెందుకు తెలీదు సర్, మన దేశం పరువు నిలబెట్టిన వీర సైనికుడు.

మరి దేశ పరువు నిలబెట్టిన అతనిది గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నావా? లేక ప్రాజెక్ట్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన నీదా?

ముమ్మాటికీ అతనిదే?

మరి నీది అసలు అచీవ్మెంట్ కానే కాదని ఒప్పుకున్నట్లేగా?

నేనొప్పుకోను, అయినా మోకాలికి బోడి గుండుకి ముడిపెడతారేంటి?

అదే కదా మేనేజర్ మొదటి క్వాలిఫికేషన్, అది లేకే నువ్వలా ఉండిపోయావ్ నేనిలా మేనేజర్ లా ఎదిగిపోయా. 

అది కాదు సుబ్బారావు గారు, ఎప్పుడో మా అమ్మాయి పుట్టక ముందు నుంచి ఇస్తున్న శాలరీ ఇది, మా అమ్మాయి పెరిగిపోయింది కానీ, నా శాలరీ మాత్రం ఒక్క సెంట్ కూడా పెరగలేదు. అంతెందుకు విజయ్ దేవరకొండ నిక్కర్లు వేసుకునే వయసులో నేను ఈ కంపెనీ లో చేరాను. ఇప్పుడతను అవే నిక్కర్లు, చొక్కాలు తన బ్రాండ్ నేమ్ తో అమ్ముకునే స్థాయికి ఎదిగాడు, నేనేమో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అదే పొజిషన్ లోనే ఉన్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలు ఆపేసినప్పడు చేరాను నేనీ కంపెనీలో. ఇప్పుడాయన 150,151 వ సినిమా కూడా పూర్తి చేసి 152 వ సినిమా మొదలుపెట్టాడు, నేనేమో ఏ శాలరీతో ఈ కంపనీలో నా ప్రయాణం మొదలెట్టానో అక్కడే ఆగిపోయాను. 

శాలరీ, ప్రమోషన్ అని అంటున్నావ్ గానీ, యెంత శాలరీ పెంచినా మనిషికి సంతృప్తి అనేది ఉండదు పవన్, సరే సంతృప్తికి డెఫినిషన్ ఇవ్వు ముందు, తర్వాత ఆలోచిద్దాం.

నెక్స్ట్ వీక్ నుంచి నేనుండే ఇంటికి వీక్లీ రెంట్ పది డాలర్స్ పెరుగుతోంది  అంటే నెలకు 40 డాలర్లు, కనీసం ఆ మాత్రం శాలరీ పెరిగితే అదే తృప్తి, సంతృప్తి అన్నాను ఒక సారి.

మరీ ఎక్కువ ఆశిస్తున్నావ్, ఫ్యూచర్ లో లోకేష్ బాబు C.M అవ్వచ్చు, పాల్ P.M అవ్వచ్చు,  అంతెందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలెట్టచ్చు గానీ ఇది జరగడం అసాధ్యం. వేరే ఏదైనా చెప్పు. 

ఇప్పుడు నేను ఆఫీస్ కు సైకిల్ లో వస్తున్నానుగా, కనీసం దాని మైంటెనెన్సు ఖర్చులు 20 డాలర్లు వస్తోంది, కనీసం ఆ మాత్రం నెలకు పెరిగితే సంతృప్తి .

ట్రైన్లోనే, బస్సు లోనో వస్తే కనీసం 120 డాలర్లు అవ్వుద్ది, కాబట్టి ఇంకా నువ్వు డబ్బులు మిగిలిస్తున్నావ్. ఇంకోటి చెప్పు.

కనీసం బయట కాఫీ తాగాలంటే 5 డాలర్లు ఖర్చు అవుతుంది, ఆ మాత్రం నెలకు పెరిగితే... 

థూ! సిగ్గుండాలయ్యా, 5 డాలర్లు పెరిగితే మాత్రం సిగ్గు లేకుండా ఎవరితో మాత్రం ఎలా చెప్పుకుంటావ్ 5 డాలర్లు పెరిగిందని.

అర్థమైంది మహానుభావా, ఈ సారి కూడా పెరగదు అనేగా.

అంతేగా! అంతేగా! కాబట్టి 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అని  అనుకో.

మరి ప్రమోషన్?

సంపూర్ణేష్ బాబు రేంజ్ మహేష్ బాబు రేంజ్ ని దాటొచ్చు అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు గానీ ... 

మళ్ళీ అర్థమైంది మహానుభావా, ఈ మాత్రం దానికి ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు సుబ్బారావ్ గారు.

ఫార్మాలిటీ అమ్మా ఫార్మాలిటీ, ఫాలో అవ్వాలి. పద డిస్కషన్ అయిపోయింది.

అపజయం ఎరుగని రాజమౌళిలా ఠీవీగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిన నేను పరాజయానికి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన మెహర్ రమేష్* లా మీటింగ్ రూమ్ లోంచి బయటపడ్డాను.

నేను - డిస్కషన్ తర్వాత

పోస్ట్ పెద్దది అవుతోంది మిగతాది తర్వాత పోస్ట్ లో కంటిన్యూ చేస్తా.

P.S: మెహర్ రమేష్ గురించి తెలియని వాళ్ళు 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు చూడండి, జన్మలో అతని పేరు మర్చిపోలేరు.

67 కామెంట్‌లు:

  1. మరీ insensitive గా ఉన్నట్లున్నారు ఈ కార్పొ"రెట్ట"ల్లో పనిచేసే మానేజర్లు? కార్పొ"రెట్ట"ల సంస్కృతికి మా తరం బలవలేదు లెండి, అందువల్ల మాకంత ఐడియా లేదు. సరే, ఎవరైనా గానీ కూర్చోపెట్టి జీతం ఇవ్వరు agreed, అయినా appraisal ప్రక్రియ మరీ రక్తసిక్తంగా జరుగుతున్నట్లుంది? మానేజర్లు ఇండియన్లైతే ఓవరాక్షన్ మరీ ఎక్కువేమో అక్కడక్కడ?

    అవునూ, మానేజర్ ని అతని/ఆమె మానేజర్ appraisal చేస్తుంటే .. నీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు మొత్తం ఎంత మంది, వాళ్ళలో ఎంత మందిని నువ్వు బాగా హింసించావు, సోదాహరణముగా వివరింపుము .. అనే అంశం కూడా ఉంటుందాండి 😀😃?

    మీరీ పోస్ట్ వినోదం కోసం మాత్రమే వ్రాసారని అనుకుంటున్నాను. అలా కాదు అంటారా ... మీకు, మీలాంటి వారికి నా సానుభూతి ("ఓదార్పు యాత్ర" చెయ్యలేను లెండి, ఏమనుకోకండీ 😀😀).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంటే హర్ట్ అవుతారు గానీ మేష్టారు మీరన్నది నిజమే, కాస్త overaction ఉండనే ఉంటుంది.


      వంగి వంగి దండాలెట్టేవారికే కాస్త బెనిఫిట్ ఉంటుంది ఈ అప్రైసల్ విషయంలో.

      మానేజర్ ని అతని/ఆమె మేనేజర్ చేసే అప్రైసల్ రివ్యూ ఎలా ఉంటుందో జై గారే చెప్పాలి లేదంటే మేనేజర్ పోస్ట్ లో ఉండే వాళ్ళు చెప్పాలి.

      రాసింది వినోదానికే కానీ రాసిన విషయం మాత్రం అక్షరాలా నిజం.

      తొలగించండి
    2. "మానేజర్ ని అతని/ఆమె మేనేజర్ చేసే అప్రైసల్ రివ్యూ ఎలా ఉంటుందో"

      మేనేజర్ బాసు కూడా మేనేజరే కదండీ. ఇదే తరహాలో లేదా ఇంకాస్త అధ్వాన్నంగానే ఉంటాయి!

      ఇంకొంచం ముందుకు వెళితే మేనేజర్ టీములో ఒకే ఒక్కడు ఉన్నాడనుకోండి. అప్రైసల్ మొత్తం అదే బాదుతారు ఉ. మీ టీములోని ఫలానా ఎల్లయ్య మూలాన కస్టమర్ ముందు పరువు పోయింది, అంతా నీ తప్పే కనుక ఇంక్రిమెంట్ హుళక్కే అంటారు. నా టీములో మిగిలిన 19 మంది బ్రహ్మాండంగా పని చేసి కంపెనీకి లాభాలు & మాంచి పేరు గడించారంటే అందులో నీ గొప్పేమిటి, వాళ్ళే బాగా పెర్ఫామ్ చేసారని వాదిస్తారు.

      సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి!

      తొలగించండి
    3. యే హుయీ నా బాత్👌.
      రెండు వైపులా‌ పదునున్న కత్తులు అన్నమాట ⚔️.

      తొలగించండి
  2. జై గారూ, మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. మీరన్న సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్న దాంతో ఏకీభవిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాస్త సీరియస్సుగా వ్యాఖ్య:

      అప్రైసల్ పద్దతిలో పారదర్శకత ఉండడం చాలా అవసరం. ఐఎస్సో/సీఎంఎం కంపెనీలలో ముందుగా నిర్ధారించబడిన (అంగీకరించబడిన) టార్గెట్లు (క్వాలిటీ ఆబ్జెక్టివ్ లేదా కీ రిసల్ట్ ఏరియా i.e. KRA లాంటి పేర్లు కూడా ఉండవచ్చు) తప్పక ఉండాలి. అప్రైసల్ రివ్యూలో మూడు అంశాలు ఉండాలి: 1. గత టార్గెట్లు వెర్సిస్ పెర్ఫార్మన్స్, 2. తరువాతి అప్రైసల్ పీరియడ్ కోసం తాజా టార్గెట్లు & 3. ఇంక్రిమెంట్.

      ఈ మూడింటిలో ఇంక్రిమెంట్ అనేది అన్నటికంటే తక్కువ ప్రాధాన్యత కలది. Only increment without performance evaluation is meaningless.

      సదరు టార్గెట్లు ఆబ్జెక్టివ్ గా & గణాంకాల ఆధారాల పైనే ఉండాలి. ఉ. కోడర్లకు సమయపాలన (punctuality i.e. delay of delivery as a percentage of planned elapsed time), నాణ్యత (e.g. defects/kLoC) & సమయవ్యయం (e.g. kLoC/man-month) ముందుగానే ప్రకటించవచ్చును. ఒక వర్క్ పాకేజీ ఆలోకేట్ చేసేటప్పుడే expectations/baseline చెప్పాలి, ఇందులో ఏకాభిప్రాయం కుదరకపోతే (ఉ. కొందరు నాకు రెట్టింపు సమయం కావాలంటే) తగాదా తీర్చేందుకు
      redress/escalation mechanism ఉండాలి. Baselines depend on various factors including programming language, complexity of domain and/or requirements, metrics computation methods (e.g. do we count comment lines? how do you define "defect"), amount of training, quality of software engineering assets available, type of contract (T&M or FP), project charter etc.

      తొలగించండి

    2. అప్రయిజలనేది మరో పెద్ద "బిజి" నెస్టు కావాలంటారు కామోసు :)



      జిలేబి

      తొలగించండి
    3. Jai గారు, Appraisal పద్ధతి ఇలాగే follow అయితే బాగుండు, కాకపోతే కొన్ని చోట్ల ఫాలో అవరు అదే problem

      తొలగించండి
    4. "Fix it or exit" పాలిసీ పాటిస్తే సరి. ఎగ్జిట్ ఇంటర్వ్యూల సమరీ మానేజిమెంట్ దాకా వెళ్తే శాడిస్టు బాసుల గురించిన ఫీడుబాక్ పైవారికి తెలుస్తుంది.

      తొలగించండి
    5. ఇంకో సీరియస్ వ్యాఖ్య:

      అప్రైసల్ సిస్టం బాలేకపోయినా సరిదిద్దుకోవొచ్చు కానీ కనీస ప్రాసెస్ (ఉ. సాఫ్త్వేర్ సైజింగ్, ఎస్టిమేషన్, డిఫెక్ట్ అనాలిసిస్, గోల్ సెట్టింగ్ & మానిటరింగ్) కూడా లేకుంటే ఘోరాతిఘోరం. ఇవేవీ లేకపోతే బాడీ షాపింగ్ లేదా మైంటెనెన్సు పనులు తప్ప ఏవీ దొరకడం కష్టం.

      తొలగించండి
    6. Fix it or exit or leave it. ఈ పాలసీనే బెస్ట్ జై గారు. మేనేజర్ నాతో మాట్లాడుతూ ఈ సారి కూడా ప్రమోషన్ , హైక్ లేవు అన్నప్పుడు నేను కూడా లైట్ తీసుకున్నా. కష్టపడ్డం వరకే నా వంతు ఫలితం ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోను.

      తొలగించండి
    7. అప్రయజల్ అయ్యాక మీ ఎక్స్ప్రెషన్ ఈ వీడియో లో 2:07:50 దగ్గర ప్రకాష్ రాజ్ ఇచ్చినట్లుగానే ఉంటుందనుకుంటా!

      https://youtu.be/CVCxbun_4Eo

      ఇక పోతే మిస్టర్ జై చెప్పిన థియరీ వినడానికి బానే ఉంటుందిగాని ప్రాక్టికల్ గా అప్రయజల్ అంటే ఇవ్వాల్టి సమ్మెలు ఉద్యమాల్లానే ఉంటుంది!

      తొలగించండి
    8. సూర్య గారూ, అప్రైసల్ సిస్టం ఎంత "ఫర్ఫెక్ట్" అయినా కొంతయినా లుకలుకలు ఉంటాయన్నది జగత్ప్రసిద్ది పొందిన వాస్తవం. రెవెన్యూ పెరుగుదల పరిమితం (లేదా శూన్యం), కోరికలు అనంతం, రెంటినీ బాలెన్స్ చేయడంలో ఎన్నో వైరుధ్యాలు తప్పనిసరిగా ఉంటాయి.

      కాకపొతే ఏడాది దాటి ఏడాది మరీ అధ్వాన్నమయిన అప్రైసల్ చేసే మేనేజర్ ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేడన్నదీ వాస్తవమే.

      ఉ. ఎల్లయ్య మరీ దారుణం, అతగాడి కంటే మల్లయ్య మంచి మేనేజర్ అనుకుందాం. ప్రతిభ & సామర్త్యం ఉన్న టీము మెంబర్లు మల్లయ్య ప్రాజెక్టులో చేరేందుకే ఆసక్తి చూపుతారు. ఎల్లయ్య టీములో మోటివేషన్ తక్కువవడం మూలాన మొదలు కస్టమర్, అటెన్క అప్పర్ మానేజిమెంట్ దగ్గర చీవాట్లు పెరుగుతాయి. SBU లాభాలు & వ్యాపార అవకాశాలు పడిపోవడం కూడా కద్దు. This is a vicious cycle that flushes out bad managers.

      ఇంకో పాయింటు: terrible man management is incompatible with excellent customer relations. సొంత టీమును సరిగ్గా అర్ధం చేసుకోలేని basically bad listener అయిన ఎల్లయ్య కస్టమర్ దగ్గర మాత్రం పొడిచేదేమి ఉండదు.

      తొలగించండి
    9. Expression బాగా పట్టుకున్నారు సూర్య గారూ సరిగ్గా సరిపోయేలా

      తొలగించండి
  3. Companies are moving away from the individual appraisal system. It serves no purpose. I would rather have a "Team-based" appraisal in place of individual. But then, I am an agile coach, you see :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ప్రొసీజర్ నాకు తెలీదు కానీ టీం-అప్రైసల్ అంటే మళ్ళీ టీం లో వాడి కంటే నేను బాగా వర్క్ చేశాను, ఇద్దరికీ same హైక్ ఇచ్చారు అనే లొల్లి ఉండచ్చు కదా భరద్వాజ్ గారు.

      తొలగించండి

    2. Agile Coach అనగా

      ఉపన్యాసములిచ్చి తన్నుకు చావండ్రా కార్పొరేటు బకరాల్లారా అను కామోసు :)

      అవునాండి ? :)


      జిలేబి

      తొలగించండి
    3. భరద్వాజ్ గారు చెప్పిన ట్రెండులో వినూత్నత ఉంది, నా అభిప్రాయంలో ఇది మంచి పరిణామం.

      అజైల్ టీములు చిన్నవిగా ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ తరహాలలో అయితే ఇద్దరే సభ్యులు. ఉ. ఇద్దరం కలిసే రిక్వయిర్మెంట్లు తెలుస్తాము, నా కోడు మీరు & మీ కోడు నేను టెస్ట్ చేస్తాము. టీములో ఎవరు ఏ పని చేసారో బయటి వారికి (బాసు/కస్టమర్ మినహాయింపు కాదు) తెలిసే చాన్సు కూడా ఉండకపోవొచ్చును.

      Just for clarity: here the term "team" means "agile working unit". A single "project team" can consist of several "teams", each of which is responsible for one or more separate modules, functions or user stories depending on the WBS.

      తొలగించండి


    4. నేనొక ఎజైలు కోచుని
      నేననెదను నేదయిన పనేమియు లేకన్
      కానీ నిర్ణేతలు మీ
      రేనండీ దాని కెట్లు రెక్కలు చేర్చన్ :)


      నారదా!

      జిలేబి

      తొలగించండి
    5. " నా కోడ్ మీరు & మీ కోడ్ నేను టెస్ట్ చేస్తాము."
      లోగడ ఒకసారి ఇలాంతి తమాషా ఒకటి చూసాను. కొద్దిమంది సభ్యులున్న ఒక టీమ్‍లో నేనూ ఉన్నాను. ఉన్నట్లుండి ఒకసారి బోలెడు మార్పులు కోడ్ కమిట్‍ చేయటం గమనించాను. అంత వేగంగా ఎలాగు జరిగిందీ, ఏమి జరిగిందీ అని శోధిస్తే విడ్డూరం ఒకటి వెలుగులోనికి వచ్చింది. ఇద్దరు సభ్యులు ఒక సర్కస్ ఫీట్ చేసారు. ఇద్దరూ కలిపి ఒక పెద్ద మార్పును చేయవలసి ఉంది. అందులో అనేక చోట్లు పెద్దవీ చిన్నాచితకావీ మార్పులుంటాయి. మొదటి వ్యక్తి చేసిన మార్పులను రెండవవ్యక్తి మూకుమ్మడిగా ఆమోదించి కమిట్ చేస్తూ పోయాడు. రెండవ వ్యక్తి చేసిన మార్పులను కూదా మొదటి వ్యక్తి అంతే వేగంగా నిర్మొగమాటంగా కమిట్ చేస్తూ పోయాడు. మధ్యలో బోలెడు తప్పులు జరిగాయి. వాళ్ళల్లో వాళ్ళే టెష్టు చేసుకుంటూ సరిచేసికుంటూ గుంపులు గుంపులుగా మార్పులు చెసిపారేసారు కోడ్ అంతటా. అది పధ్ధతి కాదు. ఇద్దరూ కలిసి డెవలప్ చేస్తున్నప్పుడు బయటి వారు ఒకరిద్దరు రివ్యూ చేయాలి తప్పనిసరిగా. ఈ భాగోతం పయటపడ్డాక హోల్‍సేల్‍గా అవన్నీ రివర్ట్ చేయలేం కాబట్టి కోడ్‍బేస్‍నే ఒక వెర్షన్ వెనక్కు తిప్పవలసి వచ్చింది.

      తొలగించండి
    6. శ్యామలీయం గారన్నది కరక్టే, ఆ ఇద్దరు తోడు దొంగలైతే ఆ ప్రాజెక్ట్ గతి అంతే, అలాంటప్పుడు కోడింగ్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడకపోవడం మంచిది.

      తొలగించండి
    7. శ్యామలీయం మాస్టారు ఉటంకించిన ఉదంతం వంటివి అజైల్ (లేదా ఐటరేటివ్) నమూనాలలో ఎప్పుడో కొన్ని సార్లు జరిగుండవచ్చును. ఈ ఒక్క రిస్క్ మూలాన ప్రతి సన్నివేశంలోనూ వాటర్ఫాల్ మోడలే ఉత్తమమని నిర్ధారించడం మాత్రం సరికాదు. ఉ. వాటర్ఫాల్ మాడెల్లో రిక్వయిరుమెంట్ స్టేజీలో వచ్చే రిస్కుల ముందు rogue agile developer రిస్క్ ఏపాటీ చేయదు.

      కుమ్ముక్కు/కూడబలుకుల కారణంగా ఒకవేళ కోడు వెనక్కు తీసుకోవాల్సి వచ్చినా దాన్ని ఆయా యూసర్ స్టోరీలకు మాత్రమే పరిమితి అయ్యేటట్టుగా ఆర్కిటెక్ట్ నియంత్రించగలగడం సరైన పరిష్కారం. The architect can (and, in my opinion, must) design a robust system that prevents (or at a minimum detects prior to first use) systemic abuse.

      తొలగించండి
    8. "నా కోడ్ మీరు & మీ కోడ్ నేను *టెస్ట్* చేస్తాము"

      సందేహ నివృత్తి కోసం: పై వ్యాఖ్యలో "టెస్ట్" అన్న పదానికి యూనిట్ (లేదా వైట్ బాక్స్) టెస్టింగ్ అని *మాత్రమే* అర్ధం. వాటర్ఫాల్ మాడెల్లో కోడరే తన కోడుకు తానే యూనిట్ టెస్టింగ్ చేస్తాడు: దానికంటే ఇదే నయం అనుకుంటా.

      తొలగించండి
    9. జై గారు మీరన్నది కరెక్టే, కాకపోతే అజైల్ మెథడాలజీ బానే ఉంటుంది కానీ మళ్ళీ కొందరు దాన్ని customization అని చెప్పి వారి సొంత పైత్యాన్ని రుద్దడం చూశాను

      తొలగించండి
  4. ఇవన్నీ బాగా సాంకేతిక అంశాలు, మనకు అంతగా తెలియవు. అయితే ఇక్కడ నాకు బా...గా.. నచ్చిన విషయం ఒకటుంది ..అదే భరద్వాజ చెప్పిన team appraisal. దీంట్లో ఒక సౌలభ్యం ఉంటుంది. అదేమిటంటే ... రివ్యూ‌ పూర్తయిన తరువాత టీం సభ్యులు అందరూ ఒకరినొకరు పట్టుకుని మూకుమ్మడిగా భోరుమనచ్చు, హా హా హా 😃😃.

    (☝️పూర్తిగా jk 🙂)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాస్త సీరియస్ గా పోతున్న కామెంట్స్ ని మీ సెన్స్ అఫ్ హ్యూమర్ తో కాస్త కూల్ చేశారు మేష్టారు. బాగుంది మీరు చెప్పిన పద్ధతి, ఏడవడానికి తోడుంటారు.

      తొలగించండి
    2. "నలుగురితో చావు పెండ్లితో సమానం, నలుగురితో పెండ్లి చావుతో సమానం" అని ఎక్కడో చదివాను. ఇదీ కాస్త అదే తరహాలో ఉంది!

      PS: ఫలానా మతస్తులు మన్నించాలి
      PPS: నేను కొన్ని వ్యాఖ్యలు సీరియస్సుగా రాసినా, "serious comment notice" ఇచ్చాను కనుక ఫరవాలేదని ఆశిస్తాను. Back to my usual flippancy from now!

      తొలగించండి
    3. ఈ వాక్యం బాగుంది జై గారూ , నేను ఇదే వినడం ఫస్ట్ టైం.

      మీ సీరియస్ వాఖ్యలు కూడా బాగున్నాయ్, ఎడ్యుకేట్ చేసేవే కాబట్టి వెల్కమ్.

      తొలగించండి
    4. అజైల్, iterative, పెయిర్ ప్రోగ్రామింగ్ వగైరాలు క్రమశిక్షణా రహిత ఇష్టారాజ్యం దైవాధీనం మోటార్ సర్వీసుకు మారు పేర్లని చాలా మంది అనుకుంటారు. దురదృష్టం కొద్దీ అజైల్ విధానం వాడే వారిలో కూడా ఇదే తరహా అపోహలు ఉన్నాయి. అదే ఆటిట్యూడ్ ఉంటే స్టాండప్ మీటింగులు స్టాండప్ కామెడీలుగా మారుతాయి, స్ప్రింటులు మెల్ల (స్క్వింటు) పోతాయి, Scrum స్కామ్ అవుద్ది.

      నిజానికి జలపాత పద్దతితో పోలిస్తే ఇందుట్లోనే ఎంతో క్రమశిక్షణ (ఉ. చాలా గట్టి కాన్ఫిగరేషన్) కావాలి. భరద్వాజ్ గారి లాంటి నిపుణులు అరాచకాలను అంతమొందించడం, అలాగే అపోహలను తొలగించడానికి తోడ్పడతారని ఆశిద్దాం.

      తొలగించండి


    5. ఇందులో సాంకేతికాంశాలు ఏమీ లేవండీ విన్నకోట వారు సేఠు బేంకులో ఆవుల రుణ మేళాయే నేటి ఎజైలు :)



      జిలేబి

      తొలగించండి
    6. ఏమయినా, I will put you in "a jail" అని అప్పుడప్పుడు అంటూ ఉండినా మా జనార్థన పూజారి పద్ధతే వేరు "జిలేబి" గారూ :).

      తొలగించండి
    7. నరసింహా రావు గారూ, ఇక్కడ పెద్ద క్లిష్టమయినది లేదండీ. కంప్యూటర్ కి మనం అనుకున్న పని ఎల్లా చెయ్యాలో దాని భాషలో చెప్పటం. చెప్పిన తర్వాత దానికి మనము చెప్పినది అర్ధమయినదో లేదో టెస్ట్ చేసి అర్ధం కాకపోతే సవరించటం. ఒకానొకచో మాలాంటివాళ్ళం చెప్పటం, దానికి అర్ధమయిందో లేదో చూడటం చేసే వాళ్ళం. దీనికి ఇప్పుడు మధ్యవర్తులు చేరి ఏవో పేర్లు పెట్టి రొచ్చు రొచ్చు చేస్తున్నారు. 

      తొలగించండి
    8. థాంక్స్ లక్కరాజు వారూ.
      సింపుల్ గా ఉన్నదాన్ని క్లిష్టతరం చెయ్యడం .. వ్యాపార మార్గం కదా. ఎంత హైప్ చేస్తే అంత గొప్పదనం.

      తొలగించండి
    9. ఈ అజైల్ concept చాలా సింపుల్ కాకపోతే అదేదో రాకెట్ సైన్స్ అన్నంత బిల్డ్ అప్ ఇస్తారు దాన్ని క్లిష్టంగా చూపడానికి

      తొలగించండి
    10. "సభికుల" సమాచారం కొరకు అజైల్ కాన్సెప్ట్ గురించి సీఎంఎం నిర్వచనం (extract from SEI Technical Report on "CMMI for development" v1.3):

      The phrases “Agile environment” and “Agile method” are shorthand for any development or management approach that adheres to the Manifesto for Agile Development [Beck 2001].

      Such approaches are characterized by the following:

      - Direct involvement of the customer in product development
      - Use of multiple development iterations to learn about and evolve the product
      - Customer willingness to share in the responsibility for decisions and risk

      తొలగించండి
  5. // "Back to ... flippancy " //
    అలాగా? ok. అయితే ఇది చూడండి 👇.
    --------------
    పవన్ చెయ్యవలసిన వందన సమర్పణ అన్నమాట:-
    (టీవీ ఛానెల్ ఏంకరిణి ఫక్కీలో)👇

    శ్యామలీయం గారు, "జిలేబి" గారు, జై గారు, సూర్య గారు, భరద్వాజ గారు, నరసింహారావు గారు ... మీరందరూ మా స్టూడియోకు(బ్లాగుకు) వచ్చి, ఈ discussion లో participate చేసి, ఈ టాపిక్ మీద ఛాలా details ఛాలా చ్ఛక్కగా explain చ్చేశారు. మేనేజర్లు పెట్టే torture తో start అయింది ఈ discussion. అక్కడి నుండి వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగూ, కోడల్ల** కుమ్మక్కులు వరకు అన్నీ .. అన్నీ మొత్తం matter కవర్ చేశారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న viewers కు కూడా ఈ టాపిక్ మీద ఛాలా clarity వచ్చిన పరిస్ధితి కనబడుతోంది మాకొచ్ఛిన ఫోన్ కాల్స్ ఛూస్తే. ఛాలా హేపీ అండి. మా స్టూడియో (బ్లాగ్) side నుండి మీకందరికీ ఛాలా ఛాలా thanks. నమస్తే అండీ 🙏.
    -------------
    ** "కోడల్లా"?? మీ ఉద్దేశం కోడళ్ళు అనా (ఎలాగూ "ళ" పలకదుగా). ఈ సందర్భంలో ఆ పదం కోడళ్ళు కూడా అవదమ్మా, అది "కోడర్లు' అనాలి తల్లీ.
    ---------
    ఏంకరిణుల భాష బాగా వఛ్ఛిందా ... ఛ ఛ, మనక్కూడా అదే వస్తోంది 🙁 ... వ.చ్చిం.దా?

    (☝️ పూర్తిగా jk, పవన్ అండ్ తదితరులూ 🙂)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజంగానే ధన్యవాదాలు అందరికీ తమ ideas share చేసుకున్నందుకు

      తొలగించండి
  6. విన్నకోట వారు, ఇక్కడ సులభంగా ఉన్నదాన్ని కష్టతరం చేయటం జరగటం లేదండీ. కంప్యూటర్‍ అప్లికేషన్ అనేదాని పరిధి కాలానుగుణంగా చాలా విస్తరించింది - ఇంకా చాలా చాలా విస్తరిస్తుంది కూడా. అందుచేత అప్లికేషన్ అనేదాని యొక్క క్లిష్టత కూడా చాలా వేగంగా ఒకరిద్దరు కొంచెం ఆలోచించి తప్పులుంటే సరిచేసేంత సులభస్థాయని ఎప్పుడో దాటిపోయింది. అందుచేత అ క్లిష్టతను ఒకపధ్ధతి ప్రకారం ఎదుర్కొనక తప్పదు. ఐతే ఆ పధ్ధతి ఫలానా అని చెప్పలేము. ఒకటికంటే హెచ్చు మోడళ్ళుంటాయి దానికి. ఒక్కో విధానానికి దాని ప్రత్యేకత దానిదిగా ఉంటుంది. మన చేతిలో ఉన్న ప్రాజెక్టు యొక్క పరిధి, పరిమాణం, సమయం వగైరా అనేక అంశాల ఆధారంగా ఎటువంటి విధానాన్ని అనుసరించాలీ అనేది ఆ ప్రాజెక్టును బట్టీ, అయా విధానాల్లో మనకున్న అవగాహనా, అనుభవాలను బట్టీ ముందే నిర్ణయించుకోవటం జరుగుతుంది. అది చాలా చాలా ముఖ్యమైన సంగతి. ఏ విధానాన్ని ఎంచుకున్నా దాని మీద మన వాళ్ళెవరూ అతితెలివిని ప్రయోగించకుండా జాగ్రతగానూ నిబధ్ధతతోనూ వ్యవహరించటం అంతే ముఖ్యం. సిస్టం ధీరీలో ఒక సూత్రం ఏమిటంటే a machine is as strong as its weakest component అని. మన టీములో ఎవరన్నా వీక్ ఐతే (నిబధ్ధత విషయంలో ఐనా, సమర్ధత విషయంలో ఐనా) వారి వీక్‍నెస్‍ అనేది ప్రాజెక్ట్ బలాన్ని బాగా తగ్గిస్తుంది జాగ్రత. అందుకే ఏ ప్రాజెక్ట్ లోనూ ఎవరూ అముఖ్య్లులూ కారు ఎవరూ ముఖ్య్లులూ కారు - అందరూ ముఖ్యులే. అందరూ జాగ్రతగా బాధ్యతగా విలువలకూ సమయపాలనకూ కట్టుబడి సమర్థత చూపాలి. అతినమ్మకాలూ అపనమ్మకాలూ కూడా కొంపముంచుతాయి. ఒక ప్రాజెక్టు ఉంది. చాలా కాంప్లికేటెడ్ మరియు చాలా పెద్దది. అందుకే మేము ఎవరు ఏమి డెవలప్ చేసినా మార్పు చేసినా ఆ ఏరియా అవల ఉన్న వాళ్ళు కనీసం ముగ్గురు రివ్యూ చేసి ఓకే అంటే కాని కోడ్ కమిట్ కాదని నియమం చేసాము. ఆ కమిట్ అవకాశం కూడా డెవలపర్ కాక రివ్యూయర్‍ చేతికే. రివ్యూ అంటే చూసి బాగుందనటం కాదు! స్టాండర్డ్స్, టెస్టింగ్ రిపోర్ట్స్, ఆల్టర్నేటివ్ అప్రోచులు ఏవన్నా ఉంటే డెవలపర్ తన పధ్ధతికి మధ్ద్దతుగా టెక్నికల్ సమర్థనలూ వగైరాలు ఇవ్వటమూ తప్పదు. అన్నిటికంటే ముఖ్యం తాను ఎక్కడా తస్కరించిన కోడ్ వాడలేదని నమ్మకం కలగాలి. ఇంత తతంగం ఉంది. ఇదంతా సమయానికి కావలసిన క్వాలిటీతో ప్రోడక్టు రావటానికీ అది మన ఒరిజినల్ అనీ కష్టమరుకు సేఫ్ అనీ నమ్మకం కుదరటానికీ తప్పనిసరి.

    రిప్లయితొలగించండి
  7. శ్యామలీయం గారు,
    వివరణకు ధన్యవాదాలు.
    ఈ ప్రోజెక్టుల్లో ఉన్న సంక్లిష్టతను, పనిభారాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు (లక్కరాజు వారిదీ ఇదే అభిప్రాయమని అనుకుంటున్నాను).

    విస్తారం అయింది / ఇంకా అవుతుంది. ఆ పెరుగుతున్న complexity తో బాటు కొంతమంది చేసే hype కూడా ఎక్కువవుతున్నట్లుంది అని చెప్పడమే నా భావం. అంతకు మించి మరేమీ లేదు.

    (abacus తో (computer అని నా కవిహృదయం 🙂) నా పరిచయం స్వల్పమూ, చాలా యేళ్ళ క్రితందీనూ లెండి. UNIX and COBOL ఎక్కువగా వాడకంలో ఉన్నప్పటిది. ఇంకా చెప్పాలంటే విస్తృతమైన networking కు ముందరి కాలం - ఏదో Novell Netware తో చిన్న LAN నడుపుకోవడం మినహా. కంప్యూటర్ రంగం నా ఉద్యోగంలో నా core functional area కాదు, కాబట్టి దాంట్లో నేను పెద్దగా update అవ్వాల్సిన అవసరం రాలేదు, ఇతర విధుల్లో మునిగిపోయాం. ఏదో అలా గడిచిపోయింది కాలం. నేను contribute చెయ్యకపోయినా ఇక్కడ వచ్చిన వ్యాఖ్యలన్నీ ఆసక్తితో చదివాను, సందేహం లేదు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహా రావు గారు, పాత technology మీద పని చేయాలంటేనే కాస్త బుర్ర షార్ప్ గా ఉండాలి, ఇప్పుడున్న technologies అన్నీ అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు ఉంటాయి.

      తొలగించండి
    2. అవును పవన్,కాస్త ఛాలెంజింగ్ గానే ఉండేది. PC ల్లో (IBM Compatible అనేవారు) RAM 64K మాత్రమే ఉండేది, అది గుర్తు పెట్టుకుని ప్రోగ్రాములు వ్రాయాల్సి వచ్చేది. Hard Disk 20MB ది మాగ్జిమమ్ (దానికి
      Winchester అని పేరు, మన PC కు అది ఉందంటే మహా గొప్పగా కాలర్ ఎగరేసి చెప్పుకునేవాళ్ళు). Disk space, memory ల విషయంలో పొదుపు పాటించాల్సుండేదన్నమాట, ఇప్పటిలాగా పుష్కలంగా విచ్చలవిడిగా వాడడానికి లేదు 😀.

      GUI ఇంకా భారతదేశానికి అప్పుడే రావడం మొదలవుతున్న రోజులు. Icons, లింకులు క్లిక్కులు లేవు. MS.DOS కానివ్వండి, UNIX కానివ్వండి ... commands ను చచ్చినట్లు గుర్తు పెట్టుకుని స్క్రీన్ మీద command prompt దగ్గర టైప్ చెయ్యాల్సిందే.

      Those were the days, my friend అని ఓ పాత ఆంగ్ల పాటలో అన్నట్లు.. నోస్టాల్జియా.

      ఈ విషయాలన్నీ శ్యామలీయం గారు ఇంకా బాగా చెప్పగలరు, వారు ఆ కాలంలోనే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు.

      ఎనీవే, మీ కాంప్లిమెంట్ కు థాంక్స్ పవన్.

      తొలగించండి

    3. హేవిటో ఈ‌పాతకాలపు ముసలోళ్ల‌సోది :) ఇరవై ఎమ్ బీ హార్డ్ డిస్కట :) దానికింత పొడవాటి బిల్డప్పు ఈ కాలంలో ఓ ఫోటో సైజు దానికన్న పెద్ద

      హు హు ! ఆల్ ఓల్డీస్ సత్యానాష్


      జిలేబి

      తొలగించండి
    4. Old is Gold కదా జిలేబి గారూ, నేటి యువత కూడా రేపటి ఓల్డ్ కదా. మరీ అలా ఎలా తీసి పారేస్తారు?

      తొలగించండి

    5. మొత్తం మీద పవన్ గారు విన్నకోట గారిని ఓల్డీ చేసి పారేసారన్న మాట !



      జిలేబి

      తొలగించండి
    6. మీ మాటల్ని ఎదుటివాళ్ళ పైకి భలే తోసేస్తారండి మీరు "జిలేబి" గారూ.

      తొలగించండి
    7. జిలేబి గారూ, అప్పుడప్పుడూ వాఖ్యల్లో నారద అంటూ ఉంటారు, ఇప్పుడు అర్థమైంది విషయం.

      తొలగించండి
    8. వారు అగ్గిపుల్ల బాచ్ అని ఇప్పటికైనా మీకు అర్థమవడం సంతోషం, పవన్ 😃. కాబట్టి తస్మాత్ జాగ్రత్త🤘.

      తొలగించండి


    9. వారు అగ్గిపుల్ల బ్యాచని మీకర్థ
      మయ్యె నదియె మేలు మాకు పవను
      గారు కాస్త మీరు గవనము గా మెలు
      గ వలయును జిలేబి గారి తోడు :)


      జిలేబి

      తొలగించండి
    10. జిలేబి గారూ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌటనుమానం. మీరు రాస్తున్నవి నిజంగానే పద్యాలా లేక ఒక వాక్యాన్ని నాలుగు లైన్లుగా విడగొట్టి రాస్తున్నారా?

      తెలుగులో అత్తెసరు మార్కులతో పాసైన వాడిని కాబట్టి ఈ పద్యాలంటేనే భయం నాకు ఒక పట్టాన అర్థమయి చావవు నాకు.

      తొలగించండి


    11. నాకెప్పటినుంచో డౌ
      టూ! కాస్తా వాక్యములను టూకీ గా బై
      టూ కానిచ్చేసి జిలే
      బీ కవనంబని యొకింత వేసేస్తారో?


      జిలేబి

      తొలగించండి


    12. హతచిత్తుడనైతిని నా
      తతాయి యే పేర్చె గాద తరమగు కవితన్
      వితరణచేయ వరుస శో
      ధిత పదముల పేర్చెదన్ ముదితకు సవాలై!



      జిలేబి

      తొలగించండి
    13. పద్యాలు వ్రాయడానికి మంచి ఆరంభం చేశారు మీరు, పవన్😃😃😄. Keep it up 👍😄.

      తొలగించండి


    14. పద్యాలు వ్రాయ డానికి
      విద్యార్థి! పవనకుమార ! వేగము గా నై
      వేద్యమును సమర్పించుము
      చోద్యము గా డిగనురుకుల చొక్కారు నదే!


      జిలేబి

      తొలగించండి
    15. డిగనురుకుల ?? చొక్కారు??

      ఇవి సంస్కృత పదాలు కాదు కదా?

      తొలగించండి
    16. హ్హ హ్హ, పవన్, తెలుగు పదాలే😀. గతంలో మీకు "ఆంధ్రభారతి" నిఘంటువు లింక్ ఇచ్చాను గదా. వాడండి. "జిలేబి" గారి పద్యాలు చదువుతున్నప్పుడు నిఘంటువు పక్కన పెట్టుకోవడం చాలా అవసరం☝️🙂. కాబట్టి, టీవీలో వచ్చే గ్రీన్ టీ ప్రకటనలో ఆ మోడల్ పిల్ల ఎప్పుడూ చెప్పినట్లు "అలవాటు చేసుకోండి."🙂

      "ఆంధ్రభారతి" నిఘంటువు

      తొలగించండి
    17. థాంక్స్ మేష్టారు సమయానికి గుర్తు చేశారు, ఈ లెక్కన నేను జిలేబీ గారి శిష్యరికం చేయాల్సిందే ఈ గ్రాంథిక తెలుగు మీద పట్టు రావాలంటే.

      తొలగించండి


    18. నాయన! శిష్యరికమ్మున
      కీ యాల శుభదినమౌ! టకీల్మని దీక్షన్
      చేయగ వెసరా వలె సు
      మ్మీ యుమ్మిగ పద్యమున మమేకము గానన్ !:)


      జిలేబి

      తొలగించండి
    19. మొత్తానికి శిష్యుడిగా ఒప్పుకున్నట్లా లేదా అర్థం కాలే.

      తొలగించండి

    20. ధారాళముగా :) వెంఠనే శంకరాభరణం బ్లాగుకొచ్చేయండి రోజూ ఓ పద్యం కొట్టి పారేయొచ్చు :)



      వెల్ కం బెక బెక :(



      జిలేబి

      తొలగించండి
    21. అట్నే అట్నే గురువు గారు Thanks

      తొలగించండి
    22. బ్లాగులోకపు "భువనవిజయం"లో మరొక ఔత్సాహికుడి ప్రవేశం అన్నమాట. ఆల్ ది బెస్టూ ... మీకు, మీ గురువు గారికీ :)

      తొలగించండి
  8. ఆ కాలంలో PC లో 20MB hard disk అంటే చాలా గొప్పండీ "జిలేబి" గారూ ... మీరు హాహా హోహో అన్నా కూడా.

    ఏమిటీ, "ఆల్ ఓల్డీస్ సత్యానాష్" అంటారా? అలాగే, అలాక్కానివ్వండి. మీరూ ఒక "ఓల్డీ"యే కాబట్టి (నేనన్నది unchivalrous గా అనిపించినప్పటికీ) మీరు కూడా మాకు ... ఇతర "ఓల్డీ" లకు ... తోడుంటారుగా, ఆయితే ఓకే :)

    రిప్లయితొలగించండి