ఒక గాడిద గుంటలో పడిందట, నువ్వు పైకి రాలేవు కష్టపడి నీ శక్తి వృధా చేసుకోకు అన్నాయట పైనుండే తోటి మిత్ర బృందం.
కానీ అది మాత్రం ఆపకుండా అలాగే అని తన ప్రయత్నాలు అది చేసి పైకి వచ్చిన తర్వాత 'మేమంతా నిన్ను నిరుత్సాహ పరచినా నువ్వు ప్రయత్నించి పైకి వచ్చావంటే పర్లేదు, నీకు పట్టుదల ఉంది' అందట తోటి మిత్ర బృందం
'ఆ చెప్పేదేదో గట్టిగా చెప్పండి, నాకు చెవులు సరిగా వినపడవు అన్నదట' గుంటలో నుంచి పైకొచ్చిన గాడిద.
సరిగ్గా పై పిట్టకథ లోని గాడిద లాంటి వాడిని నేను, నా ప్రయత్నం ఏదో నేను చేస్తుంటాను. మొదట్లో బ్లాగ్ మొదలెట్టాలి అనుకున్నప్పుడు పది పోస్టులు పెడితే ఎక్కువ ఇంతోటి సంబడానికి బ్లాగ్ అవసరమా అని నిరుత్సాహపరచిన వాళ్ళే ఎక్కువ. నువ్వు రాస్తే మాత్రం చదివే వాళ్ళు యెంత మంది ఉంటారు? శుద్ధ దండగ అని అన్నవారు కొంతమంది.
నేను కూడా చెవిటి గాడిదలాగా ఇవన్నీ వినిపించుకోకుండా, రాయడం మొదలెట్టాను. అసలు ఏం రాయాలో కూడా తెలీదు ఎలా రాయాలో తెలీదు. ఎప్పుడూ పట్టుమని పది పుస్తకాలు కూడా చదవలేదే, కనీసం వార్తా పత్రికలలో సినిమా పేజీ తప్ప మిగతా పేజీలు ఎప్పుడూ చదివినట్లు కూడా గుర్తులేదు. ఇక వార్తలు వినడం అన్న మంచి అలవాటు కూడా లేదు లోక జ్ఞానం సంపాదించడానికి. సరే, Ignorance is bliss రాసేద్దాం ఏదో ఒకటి అని అయిదేళ్ళ క్రితం మొదలెట్టాను.
బ్లాగ్ మొదలెట్టానని తెలిసిన కొందరు మిత్రులు
నువ్వు తప్ప ఇంకెంత మంది చదువుతారు? హహ్హహ్హ
ఈ కాలం లో తెలుగు చదివే వాళ్ళు ఎవరు ఉన్నారు?
వీడేదో రైటర్ అనిపించుకోవాలని పెద్ద ఆశ.
ఇలాంటివి నేనూ రాయగలను. పెద్ద కష్టం ఏమీ కాదు.
పర్లేదు, బానే రాస్తున్నావ్.
నీలో ఈ కళ కూడా ఉందన్నమాట.
అని మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు.
తెలిసిన వాళ్ళు ఏదో మొహమాటం కొద్దీ మొదట్లో చదువుతారు. ఆ తర్వాత వీడి లొల్లి ఏమిటి అని ఆ తర్వాత సైట్ ఓపెన్ కూడా చేయరు అన్నారు కొందరు. నిజం చెప్పాలంటే నాకు తెలిసిన వారు ముగ్గురు నలుగురు తప్ప ఎవ్వరూ నా బ్లాగ్ చదవడం లేదు, వాళ్ళను చదవమని కూడా నేను రిక్వెస్ట్ చేయలేదు. ఇష్టంగా, ఎక్కువగా చదువుతున్న వారంతా నాకు ముఖ పరిచయం లేని వారే. చదివి ప్రోత్సహిస్తున్న వారికందరికీ ధన్యవాదాలు అలాగే నువ్వు తప్ప ఇంకెంత మంది చదువుతారు? అని వెక్కిరించిన వారికి కూడా. ఎందుకంటే తెగిడే వాళ్ళే లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు కాబట్టి.
మీ అందరి చలవ వల్ల ఇప్పటికి నా బ్లాగ్ కి అక్షరాలా 2 లక్షల వ్యూస్ వచ్చాయి. అయిదేళ్ళలో నేను రాసిన 143 పోస్టులకి 2 లక్షలు అంటే చాలా తక్కువే అయి ఉండచ్చు కాకపోతే నా లాంటి వాడికి అది చాలు.
లక్షలు అంటే నేను పనిచేసేచోట ఒక రోజు జరిగిన సంఘటన గుర్తొస్తోంది.
'ఫలానా సర్వీస్ ప్రొడక్షన్ లో యెంత మెమరీ తీసుకుంటోంది అని అడిగింది' ఒక తెల్లావిడ మన ఇండియన్ ని.
దానికి ఇతను 10.2 లాక్స్ కిలో బైట్స్ అన్నాడు.
సారీ, నాకు అర్థం కాలేదు అంది ఆ తెల్లావిడ.
మనోడేమో అరౌండ్ 10 లాక్స్ అన్నాడు.
పాపం అతను ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులే అయింది, తను చెప్పేది క్లయింట్ కి అర్థం కావట్లేదు, ఆవిడకి అర్థం అయ్యేట్లు ఎలా చెప్పాలి అని అతను తిక మక పడుతుంటే, నేను మధ్యలో కలుగజేసుకొని 1 మిలియన్ అన్నాను. ఇక్కడ మీరు లక్షలు అనేది వాడరు కాబట్టి మీకు అది తెలియదు, ఇండియా లో మేము లక్షలు అంటాము అని వివరించాను.
// “ నువ్వు తప్ప ఇంకెంత మంది చదువుతారు? “ // అన్నారా? ఎవరండీ వాళ్ళు, వాళ్ళకి నా పేరు చెప్పండి.
రిప్లయితొలగించండి1/5th of a million 🙂 వీక్షణలు దాటినందుకు అభినందనలు. మరెన్నో మైలు రాళ్ళు తప్పక దాటుతారు 👍.
మీ ప్రోత్సాహనికి ధన్యవాదాలు మేష్టారు.మీరు చదవడమే కాక అప్పుడప్పుడు నాకు తెలియని విషయాలు కామెంట్స్ రూపంలో రాస్తుంటారు.
తొలగించండిఏదైనా చేయాలనుకొనే వాళ్ళకి అడ్డుతగులుతూనే ఉంటారు. అవిపట్టించుకోకుండా మీపని మీరు దిగ్విజయంగా చేసుకుపోతున్నారు. మీవ్రాతలకి చదువరులున్నారు అని మీకు ఎప్పుడో తెలుసు. మరిన్ని విజయాలకిదే ఆరంభం. విజయోస్తు.
రిప్లయితొలగించండిమీలా చదివి ప్రోత్సహించే వారు దొరకడం నా అదృష్టం. ధన్యవాదాలు.
తొలగించండిCongratulations, Pavan garu! Yours is a nice and entertaining blog. Keep blogging 👏
రిప్లయితొలగించండిThanks for your wishes and encouragement Lalitha gaaru.
తొలగించండిఅభినందనలు. 💐
రిప్లయితొలగించండిధన్యవాదాలు బోనగిరి గారు
తొలగించండిఅభినందనలు పవన్ గారూ.ఎవ్వరూ చదవకపోతేనేమి, వ్రాస్తూ ఉంటే మన వ్రాతల్లో మనకే పరిణతి కనిపిస్తుంది వ్రాయగా వ్రాయగా.చాలా బాగా వ్రాస్తున్నారు, ఇలాగే హాయిగా కబుర్లు చెప్తూ ఉండండి మాకు.
రిప్లయితొలగించండిమీరన్నది నిజమే వాత్యల్య గారూ. ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
తొలగించండి