గురువు గారూ, మీరిది విన్నారా?
ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుందిరా శుంఠా?
శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడే మీకు ఇవి తెలియకపోవటమేమిటి స్వామీ?
అసలు విషయం చెప్పకుండా నస పెట్టక క్లుప్తంగా వివరించు.
అదే స్వామీ,మొన్న రెండు విషయాలు జరిగాయిగా వాటి గురించి.
ఏదీ మన గోలయ్య చేతిలో గుత్తి పట్టుకొని వదిలిన 'రోలర్' సినిమా పోస్టర్, కాంరోగాల్ ఖర్మ వదిలిన 'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' సినిమా టీజర్ ఇవేగా.
అవి కాదు స్వామీ, రివర్స్ లో జరిగిన రెండు విషయాలు.
"ఎప్పుడూ ఈ చేతిలోకి డబ్బు రావడమే తప్ప ఈ చేతిలోంచి డబ్బు పోగొట్టుకోవడం తెలీదు అలాంటిది మొన్న గోవా వెళ్ళినప్పుడు కాసినో లో కాసులు మొత్తం పోగొట్టుకోవడం వీడికి ఎలా తెలిసిందబ్బా?', దాంతో పాటు 'కొంపదీసి నాకున్నవక్ర దశ మారడానికి రెమెడీ ఏదో కనుక్కోవడానికి అదే గోవా లోని 'గోచీ బీచీ స్వామి' ఆశ్రమానికి మారు వేషంలో వెళ్ళడం వీడికి తెలిసిందా ఏమిటి?"
ఏమిటి స్వామీ, శూన్యం లోకి చూస్తూ పలకరు?
అదే, నువ్వు దేని గురించి చెబుతున్నావో అది తెలుసుకోవడానికి.
సరే చెప్తాను వినండి. జింకను వేటగాడు చంపడం, యువతి మీద యువకుడు ఆసిడ్ దాడి చేయడం మనం వింటూ ఉంటాం కదా?
అవును అది లోకంలో సహజం గా జరుగుతున్నవే కదా నాయనా?
కానీ తన మీద వేటకు వచ్చిన వేటగాడిని జింక చంపడం, గొడవపడిన ప్రియుడిపై ప్రియురాలు ఆసిడ్ పోయడం జరిగాయి స్వామీ నిన్న.
మరిప్పుడు ఏమంటావు నాయనా?
మీరు ఈ మధ్యే ఈ లోకానికి పోగాలం దాపురించింది అన్నీ రివర్స్ లో జరుగుతాయి అన్నారు, దీని గురించే అనుకుంటాను కదా గురూజీ.
సరిగ్గా ఊహించావు శిష్యా?
ఎందుకిలా జరుగుతున్నాయి స్వామీ?
వీటికి కారణం గురుడు, శుక్రుడు వారి వారి కక్షలు మార్చుకొని తిరుగుతున్నారని గ్రహాల స్థితిని ఔపోసన పట్టిన నా మేధస్సు చెబుతోంది.
మరి దీనికి రెమెడీ ఏమీ లేదా స్వామీ?
'అసలే కాసులు లేక కట కట లాడుతున్నాను, కాసులు రాల్చే ఐడియా ఇచ్చావురా శిష్యా, ఈ దెబ్బకు బొక్క పడిన బొక్కసాన్ని కాసులతో పూడ్చచ్చు ఈ ఐడియా సరిగ్గా వర్కౌట్ అయితే''
మళ్ళీ శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడుతున్నారు కదా స్వామీ?
అవును నాయనా, దీని కోసం 'రివర్స్ ట్రెండ్ - బ్యాన్డ్ బాజా బారాత్' అనే హింగ్లీష్ యాగం తలపెట్టాలి, కాబట్టి ఈ విషయాలన్నీ మన భక్తులకు తెలియజేస్తూ విరాళాలు పంపమని చెప్పు.
ఏ విషయాలు స్వామీ?
అదేరా నేను రెమెడీ కోరడం, కాసినో లో కాసులు పోగొట్టుకోవడం.
ఏమిటి స్వామీ మీరనేది?
అదే శిష్యా, రివర్స్ లో జరిగిన ఆ రెండు విషయాలు, అలాగే నువ్వు లోక కళ్యాణానికి నన్ను రెమెడీ కోరడం, అసలు ఎవరి మీదా ఆసిడ్ దాడులు జరగకుండా చూడటం లాంటి వాటి కోసం యాగాన్ని చేస్తున్నామని వివరిస్తూ వాట్సాప్ చెయ్యి మన భక్తులకు.
అలాగే స్వామీ..కానీ చిన్న అనుమానం.
కాంరోగాల్ ఖర్మ సినిమాకి ముందు వివాదాలు రావడం, విన్న ప్రతీ విషయానికీ నీకు అనుమానాలు రావడం చాలా కామన్ శిష్యా. అడుగు ఆలశ్యం చేయక అవతల నాకు దేవుడి సేవ కి వేళయ్యింది.
అసలే ఈ సోషల్ మీడియా వచ్చాక మన స్వామీజీల మీద విమర్శలు ఎక్కువయ్యాయి. యాగాలు, హోమాలు అంటే నమ్ముతారా?
సోషల్ మీడియాలు, సైన్స్ మీడియాలు అంటూ ఇంకో పది మీడియాలు వచ్చినా ఈ జనాల్లో ఉండే పాపభీతి ఎప్పటికీ పోదు అలాగే మెజారిటీ జనాల్లో ఉండే ఆ వేపకాయంత వెర్రి తగ్గేదాకా మనకు ఎదురు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ భూమి అంతమయ్యేదాకా మా లాంటి స్వామీజీలకు భక్తుల కొరత ఉండదు.
మిమ్మల్ని నమ్మినా, విరాళాలు ఎవరూ పంపక పోతే?
జనాలు ఎవరూ చూడకపోతే అని కాంరోగాల్ ఖర్మ 'ఐ స్క్రీం' సినిమా తర్వాత అలోచించి ప్రయత్నాలు ఆపివుంటే ఇప్పుడు 'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' అంటూ మరో సినిమాతో వచ్చేవాడు కాదు. ఆయనెంత చెత్త సినిమాలు తీస్తున్నా చూసే వాళ్ళు ఉన్నట్టే మనకూ విరాళాలు పంపే భక్తులు ఉంటారు. ఎప్పుడూ వినేదే కానీ నా మాటల్లో మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో 'ప్రయత్నం ఆగిపోవాల్సింది ప్రాణం పోయినప్పుడే, నీకు నువ్వుగా కాదు' .
మిమ్మల్ని నమ్మినా, విరాళాలు ఎవరూ పంపక పోతే?
జనాలు ఎవరూ చూడకపోతే అని కాంరోగాల్ ఖర్మ 'ఐ స్క్రీం' సినిమా తర్వాత అలోచించి ప్రయత్నాలు ఆపివుంటే ఇప్పుడు 'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' అంటూ మరో సినిమాతో వచ్చేవాడు కాదు. ఆయనెంత చెత్త సినిమాలు తీస్తున్నా చూసే వాళ్ళు ఉన్నట్టే మనకూ విరాళాలు పంపే భక్తులు ఉంటారు. ఎప్పుడూ వినేదే కానీ నా మాటల్లో మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో 'ప్రయత్నం ఆగిపోవాల్సింది ప్రాణం పోయినప్పుడే, నీకు నువ్వుగా కాదు' .
అర్థమైంది స్వామీ.
వెళ్ళిరా నాయనా, 'శుభం భూయాత్, రివర్స్ ట్రెండ్ బ్యాన్డ్ బాజా బారాత్'
P.S: వేటగాడిని జింక చంపడం, యువకుడిపై యువతి ఆసిడ్ దాడి అన్న వార్తలు ఒకే రోజు చదివిన తర్వాత వీటి మీద సరదాగా ఏదో రాద్దామని రాసిందే తప్ప ఎవ్వరినీ కించపరచడానికి కాదని మనవి.
"బ్యాన్డ్" అనగా banned (ఉ. "సరస్వతీస్ ఎంజీయార్" సినిమా అంధ రాష్ట్రంలో బాన్ చేసారు) లేదా band (పెళ్లిళ్లలో వాయించేది) అని రెండు అర్ధాలు వస్తాయి.
రిప్లయితొలగించండిఅదే రకంగా "రివర్స్" అంటే కూడా rivers (ఉ. మహద్గురు అగ్గి కాసుదేవ స్వామి నదులు శుభ్రం చేయండహో అంటూ పామరులకు పిలుపివ్వడం) లేదా ఎనక్కు (ఉ. గోలవరం ప్రాజెక్ట్ reverse tender) అని వేర్వేరు నిర్వచనాలు కలవు.
ఈ టపాలో మీరు వాడిన అర్ధం ఏమిటో సెలవిస్తే అటుపిమ్మట వ్యాఖ్యలు రాయగలము.
ఇట్లు భవదీయుడు మొక్కజొన్నవిత్తుల కాం భోపాల్ ఖర్మ
అంతా తొండి మొక్కజొన్నవిత్తుల కాం భోపాల్ ఖర్మ గారూ, ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి అనవసరంగా మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు.
తొలగించండిమొక్కజొన్న విత్తుల వారికి ఖర్మ గారు సూచించిన సలహా కూడా ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చెయ్యలేదు
అర్ధాలు ఎక్కువయితే అనర్ధాలు వస్తాయి, తప్పదు!
తొలగించండిబస్సు వెళ్లి కారుని గుద్దినా కారు జోరుమీదొచ్చి బస్సుని గుద్దినా పెద్ద సొట్టపడేది కారుకే కదా స్వామీ!
రిప్లయితొలగించండిఇప్పుడంతా పాతబడిన, చిన్నగాలికే ఊడిపొయ్యే తుప్పిపట్టిన బస్సులేనంటగా.. కారు కాస్త జోరుగా బస్సు పక్కనుంచి వెళ్ళినా చాలు.
తొలగించండిఈ కారు, బస్సు గోల మా పక్క రాష్ట్రం గురించా ఏమిటి మేష్టారు?
తొలగించండికారు బస్సుతోనేమో "నేను ప్రయివేట్. నిన్నూ నాలా ప్రయివేట్ పరం జేస్తా" అంటోంది. బస్సు కారుతోనేమో "నేను పబ్లిక్. నాతో పెట్టుకుంటే తొక్కిపడేస్తా" అంటోంది.
తొలగించండిదత్త పుత్రుడు కుప్పి గెంతులు. పప్పు మిత్రుడు కప్ప గంతులు.
రిప్లయితొలగించండిరెండో వాక్యం అర్థమైంది, మొదటి దాని తాత్పర్యం ఏమిటి చెప్మా?
తొలగించండిఎంవీపీ జంక్షన్ నుండి ఆర్కే బీచు గాంధీ బొమ్మ వరకు షార్ట్ డ్రైవా మజాకా! ప్రమోషన్ అదుర్స్, కొంచం గ్రాఫిక్స్ వాడి మాజీ పోలీసు అధికారిని కూడా స్టేజీ మీద కూచున్నట్టు చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది.
తొలగించండిఅదేదో సామెత చెప్పినట్టు ఒకే ఒక్క చోట ఓడిపోయిన సొంత కొడుకు కంటే రెండు సెంటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన దత్తపుత్రుడే మేలు అన్నట్టుంది.
దత్త పుత్రుడి 'పవర్' అలాంటిది మరి. జై గారు, థాంక్స్ అర్థమైంది దత్త పుత్రుడెవరో.
తొలగించండిపవన్ గారు,
రిప్లయితొలగించండి(మీ టపాకు సంబంధం లేని వ్యాఖ్య)👇
Twitter, Facebook, e-mail ద్వారా గానీ AP CM గారికి వ్రాశారా మీరేమైనా (నేను "జిలేబి" గారి బ్లాగ్ లో ప్రతిపాదించినట్లుగానూ, అందరూ వ్రాస్తే బాగుంటుందని కోరినట్లుగానూ)?
లేకపోతే ఇప్పుడు వ్రాయమని మీకు నా మనవి (that is, AP State Formation Day and State name మార్పు గురించి నేను ప్రతిపాదించిన దానితో మీరు ఏకీభవిస్తే). ఎంతమంది వ్రాస్తే అంత ప్రభావం ఉండచ్చని ఆశ. మీకు తెలిసిన వారితో కూడా వ్రాయించే ప్రయత్నం చేస్తే సంతోషం.
YVR గారి బ్లాగు whyweare2066.com లో letter format పెట్టాను, దాన్ని copy & paste చేసుకోవచ్చు. దాంట్లో తేదీ వేసి, క్రింద మీ పేరు వ్రాసి సీఎం గారికి పంపించవచ్చు.
మీరు CM గారికి వ్రాస్తే గనక Done అని ఒక్కమాట మీ బ్లాగ్ లో కామెంట్ గా పెడితే సంతోషం. Thanks.
పంపుతా కానీ, email లో అంటే అడ్రస్ ఏమిటి మేష్టారు?
తొలగించండిఅయ్యో, YVR గారి బ్లాగ్ లో నేను పెట్టిన letter format లో ఇచ్చానే. Anyway, please mail to cm@ap.gov.in
తొలగించండిఅలాగే మెయిల్ లో పైన సబ్జెక్ట్ లైన్ లో AP Formation Day and State name అని పెడితే అందరి మెయిళ్ళకు uniform గా ఉంటుంది.
Thanks Pavan.
Done Mestaaru.
తొలగించండిThanks Pavan gaaru.
తొలగించండి