18, నవంబర్ 2019, సోమవారం

ఈ పాపం ఎవరిది? - అక్కడా ఇక్కడా విన్న మంచి కథలు

అనగనగా అదేదో ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఏలే రాజుగారికి ఏడుగురు కొడుకులు ...  ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ ఉన్నదంతా ఊరోళ్ళకు పంచిపెట్టే టైపు. అందువల్ల  ప్రతీ రోజూ పేదవాళ్లకు అన్నదానం చేసేవారు. 

ఒక  రోజు మధ్యాహ్నం భోజనం వండి వడ్డించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఒక  గద్ద కాళ్ళతో  ఒక పాముని పట్టుకొని గాల్లో  ఎగురుతూ వెళ్తోంది.  ఆ  పట్టుకున్న  పాము  నోటి నుండి జారిన  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న  అన్నం మీద  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు. ప్రతీ మెతుకు మీద తినబోయే వారి పేరు ఉంటుంది అంటారుగా ఆలా ఆ విషం పడ్డ మెతుకులమీద ఒక పేద బ్రాహ్మణుడి పేరు రాసి ఉందేమో మరి, ఆ భాగం  తిన్న ఆ  పేద బ్రాహ్మణుడు  చనిపోయాడు.  

ఈ  వార్త  రాజుగారికి  చేరింది.   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు. పిల్లిని చంపిన పాపమే గుడి కట్టించినా పోదు అంటారు అలాంటిది నా వల్ల ఒక బ్రాహ్మణుడే చనిపోయాడు. దానికి తోడు పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి అంటారు కాబట్టి ఈ పాపం నాకు మాత్రమే చుట్టుకుంటే పర్లేదు, నా రాజ్యానికి కుటుంబానికి వంశానికి చుట్టుకోకుండా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకున్నాడు.   

పైన అకౌంట్స్ రాసుకునే చిత్రగుప్తుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ  బ్రాహ్మణుడు  చనిపోవడానికి  కారణం  ఎవరు ?

విషం వదిలిన పామా ? 

లేక పాముని పట్టుకున్న గద్దా ? 

రాజా ? 

వంట చేసిన మనిషా ?    

వడ్డించిన  వ్యక్తా ?  

మరి ఈ  పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ? 

కావాలని  ఎవరూ   ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు.

అందుకని అతని మేనేజర్ అయిన యమ  ధర్మరాజును  అడిగాడు.  ఆయనకు కూడా అది భేతాళ ప్రశ్న లాగే అనిపించింది. సరే కాస్త అలోచించి చెప్తాను అని అందరు మేనేజర్స్ లాగే అప్పటికి తప్పుకున్నాడు.  

మర్నాడు దారిన  పోతున్న బ్రాహ్మణులు  కొందరు  అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  అక్కడున్న సూర్యకాంతం ని అడిగారు .  

ఆవిడ వారికి  దారిని  చూపుతూ  “ బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాపనోళ్ళు అంటే పడదు.  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపించేశారు. మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర పడ్డాయేమో ఆలోచించుకొని వెళ్ళండి నాయనా? ఊపిరుంటే ఉప్పయినా అమ్ముకొని బతకచ్చంటారు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అని ఆ రోజుకు తన కడుపు నింపుకుంది  ఖాళీ కడుపులతో ఉన్న బ్రాహ్మణుల మనస్సుల్లో అనుమానాలు మొలకెత్తించి. 

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించిన ధర్మరాజు గారు “చిత్రగుప్తా! యాదృచ్చికంగా ఏదైనా జరిగినప్పుడు దానిని ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యక్తులు చేయనప్పుడు అనవసరంగా ఆ వ్యక్తులకు అంటగట్టి, వారిని నిందించే  వారికే ఆ  మొత్తం  కర్మ  ఫలం చెందాలి అని  శాస్త్రాలు చెబుతున్నాయి అదే ధర్మం కూడా, కాబట్టి మొత్తం  పాపం  అంతా  ఆమె అకౌంట్ లో వెయ్యి”  అన్నారు.

మొత్తానికి నీతి ఏమిటంటే అనవసరంగా ఇతరులపై బురద చల్లడానికి ప్రయత్నించకండి అది మీ నెత్తి మీదే పడచ్చు అని.  దీనినే కర్మ ఫలం అదీ ఇదీ అంటారు కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, వేదాలు అవీ తిరగేసిన వారు.

P.S: పాత సినిమాల్లో ఏదైనా గయ్యాళి భార్య లేదా గయ్యాళి అత్త  లాంటి పాత్ర ఉంటే వారు గయ్యాళి అని చూపెట్టడానికి అనవసరంగా రెండు మూడు  సీన్స్ పెట్టాలి దానికో రీల్ వృధా ఖర్చు ఎందుకని ఆ పాత్రకు సూర్యకాంతాన్ని తీసుకునేవారట. ఆల్రెడీ ఆవిడ అలాంటి పాత్రలు ఎన్నో సినిమాల్లో చేసింది కాబట్టి ఆవిడని తెర మీద చూడగానే ఈ పాత్ర గయ్యాళి పాత్ర లేదంటే చాడీలు చెప్పే పాత్ర అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు కాబట్టి. అందువల్ల నేను కూడా సూర్యకాంతం అనే పేరుని వాడాను తప్పితే ఆ పేరు గల (ఎవరైనా అలాంటి పేరు గల వాళ్ళు ఈ పోస్ట్ చదువుతుంటే..ఛాన్స్ ఉండకపోచ్చు ఒక వేళ ఉంటే ) వాళ్లను కించపరచాలని కాదు. 

51 కామెంట్‌లు:

  1. మీరు గంభీరమైన పోస్ట్ వ్రాశారు. నేను సరదాగా చెబుతాను ... ఆ అన్నం డేగిసా మీద మూత పెట్టనివాడిది తప్పంతా
    🙂.

    మన కథలు చాలా మటుకు బ్రాహ్మణుడికి ‌అన్వయించి చెబుతారేమిటో 🤔? ఆ అన్నదాన కార్యక్రమంలో ఇతరులు కూడా ఉండే ఉంటారుగా?

    btw అవతలి వాళ్ళ మీదకు తోసేసే అలవాటు / విద్య మీరు కూడా ప్రాక్టిస్ చెయ్యండి. మేనేజర్ అవడానికి, అయ్యి రాణించడానికీ పనికొస్తుంది 👍😃.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూత పెట్టని వాడి అకౌంట్లో వేసెద్దాం అయితే మేష్టారు.

      బ్రాహ్మణులు అయితే powerful అని వారిని involve చేసేవారో ఏమో మరి పెద్దలు.

      తొలగించండి
  2. పాము & డేగ తమ సహజ ప్రవృత్తి పాటించాయి కనుక ఏ దోషం అంటదు.

    చనిపోయిన బాపనయనది ఇక్కడ కస్టమర్ హోదా. అతను మామూలుగా పాటించాల్సిన caveat emptor (buyer beware) సూత్రం ప్రకారం తగు జాగ్రత్తలు (all reasonable precautions e.g. inspecting the goods) తీసుకొన్నా force majeure కారణంగా పోయాడు కనుక అతన్నీ ఏమీ అనలేము.

    వంటవాళ్లు & ఇతర పనోళ్ళు ఇవ్వబడిన పనిని నిర్దేశించిన విధానంలో చేసే జీతగాళ్ళు. పని బాగుంటే కాస్త మెప్పుకోలు (ఉ. "వంట అదుర్సురా నర్సిగా") అనే చిన్న బెనిఫిట్ తప్ప పెద్దగా ఇంకేమీ రాదు. ఇటువంటి నా పని బాగా చేయాలి అన్న ప్రొఫెషనలిజం ఉంటే పైకి వస్తారు లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కెరీర్ ఏడుస్తుంది.

    Task oriented limited contracts చేస్తున్నప్పుడు మాక్సిమం పెనాల్టీ ఉద్యోగం ఊడడం, వారిని consequential damages అడగడం భావ్యం కాదు.

    రాజు ఇక్కడ మేనేజర్ అనగా మంచి జరిగితే పుణ్యం పుచ్చుకుందామన్న లాభోపేక్షతో యవ్వారం మొదలెట్టాడు. జవాబుదారీ సిద్ధాంతం (accountability principle) ప్రకారం అన్నదాతా సుఖీభవ దీవెనల క్రెడిట్ కొట్టేసే రాజు "విషాన్నదాతా మరణంభవ" అన్న శాపం కూడా స్వీకరించాలి. అలాగే జరిగిన non-conformance పై root cause analysis చేసి పునరావృత్తం కాకుండా corrective action తీసుకోవాలి.

    ఇక చివరిగా సూర్యకాంతం ఆంధ్రజ్యోతి పేపర్ మారిగా బురద జల్లే బాపతు. అటువంటి వారు ఎంత చెత్త వెధవాయిలయినా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలి తప్ప కోర్టులు కేసులంటే దాన్ని కూడా ప్రచా(సా)రం చేసుకుంటారు.

    PS: తిండి పెట్టడానికి దేశంలో బడుగులే లేనట్టు అగ్రవర్ణాలే దొరికారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ విశ్లేషణ బాగుంది జై గారు.

      బ్రాహ్మణులు అయితే కథ మరింత రక్తి కడుతుందనేమో పెద్దల ఆలోచన అంతే కానీ వారిని తక్కువ చెయ్యాలని కాదేమో.

      తొలగించండి
    2. కథ రాసిన సదరు "పెద్దలు" తమ కులపోళ్ళకే దానాలు దక్కాలన్న భావనతో నిమ్నకులస్తులకు అన్నదానం చేస్తే పుణ్యం దక్కదని శాస్త్రాలు చేసారంటారా, అయితే వాకే.

      వేమారెడ్డి శతకంలో కూడా ఎక్కడో "పనోళ్ల కన్న బాపనోళ్ళు మేలయా" అని ఉండే ఉంటుంది లెండి. ఏదేమయినా "అనగా అనగా" కథలన్నీ for, by and of the "మనవాళ్ళు" కదా.

      తొలగించండి
  3. సీ బీ ఎన్ చంద్రజ్యోతి అయితే విషాహారం తిన్న బ్రాహ్మడిని దోషిగా నిలబెట్టి గోబెల్స్ ప్రచారం చేస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ప్రచారం రాజు గారి పుట్టు పూర్వోత్తరాలపై (ఉ. "కాకా"తీయ వంశజుడా కాదా) ఆధారపడి ఉంటుందేమోనండీ?

      తొలగించండి
    2. జగనే ఆపని క్రైస్తవులకోసం చేపించాడని "వైసీపీ" నాయకులు అనుకుంటున్నారని, తన చెత్తపలుకులులో రాస్తుంది.

      తొలగించండి
  4. తెదేపా అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే తెదేపా. వేరే వ్యక్తిని ఆప్లేసులో ఊహించుకోలేము.

    రిప్లయితొలగించండి
  5. పాపం రాజుగారి అకౌంట్‌లో వెయ్యాలి.
    ఎందుకంటే, తన ప్రజలు గౌరవంగా సంపాదించుకుని ఇంట్లో తిని బతికే స్థితిలో కాకుండా, అడుక్కుతినే స్థితిలో ఉండడానికి కారణం రాజు గారి పాలసీలే కాబట్టి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజు గారిది vicarious liability. కాబట్టి కొంచెం వారి ఖాతాలో కూడా తప్పక పడుతుంది 🙂.

      తొలగించండి
    2. బోనగిరి గారు చెప్పింది లాజికల్ గానే ఉంది.

      తొలగించండి
  6. Original story here
    https://kastephale.wordpress.com/2012/08/24/

    రిప్లయితొలగించండి
  7. సినిమా కమర్షియల్ గా ఫ్లాపయినా నైతికంగా విజయం సాధించిందన్నట్లు ఆర్టీసీ సమ్మె ఆపేసినా నైతికంగా గెలిచారంట! ఎం చేస్తారో ఆ గెలుపుని!. నేతిలో వేయించుకుంటారా!

    రిప్లయితొలగించండి
  8. ఆర్.టి.సి. సమ్మె నైతిక విజయాన్ని రెవెన్యూ ఉద్యోగులు కూడా నమ్ముకోరు. ఆ సమ్మె నిజంగా సక్సెస్ అయితే తాము కూడా సమ్మె చెయ్యొచ్చని రెవెన్యూ ఉద్యోగులు అనుకున్నారు.

    రిప్లయితొలగించండి
  9. ఉద్యమానికీ, సమ్మెకీ తేడా తెలియకుండా చేస్తే, ఇలానే పరువు పోగొట్టుకోవాలి. యూనియన్లు తెలంగాణా ఉధ్యమ కిక్కునుంచి ఇప్పటికైనా బయటపడి, భేషజాలు పక్కనపెట్టి, కేసీఆర్ కి భహిరంగంగా క్షమాపణ చెబితే తప్ప, ఆర్ టీ సీ కార్మికుల భవిష్యత్ అంధకారమే. ఆమేరకు కార్మికులు తమ నాయకులపై ఒత్తిడి తేవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇప్పుడు కనీసం కొలువులు మిగిల్తే చాలనే పరిస్థితి దాపురించింది. "మీరు ముందుండి సమ్మె చేయండి, మీ ఎంబడి నిలబడి దొర మదం అణిచేస్తాం" అంటూ గప్పాలు కొట్టిన రాజకీయ నాయకులు సమ్మె చతికిలపడ్డంక బెల్లం కొట్టిన రాయోలె చడీచప్పుడు చేయడం లేదు.

      పాపం ఆర్టీసీ కార్మికులు!

      తొలగించండి
    2. పదిహేనేళ్ళ క్రితం ఒక ఫార్మా కంపెనీ ఉద్యోగి జీతం నెలకి ఎనిమిది వేలు. ఇప్పుడు అతని జీతం నెలకి పదిహేను వేలు. పదిహేనేళ్ళ క్రితం ఒక ఆర్.టి.సి. కండక్టర్ జీతం నెలకి మూడు వేలు. ఇప్పుడు అతని జీతం సీనియారిటీని బట్టి నెలకి ఇరవై నుంచి నలభై వేలు. పైడిభీమవరం రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగులు యూనియన్ పెట్టకుండా ఉండేందుకు ఆ కంపెనీ యాజమాన్యం వాళ్ళని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఒక్క ఎర్ర పార్టీ కూడా స్పందించలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే మాత్రం వాళ్ళకి మద్దతుగా వెంటనే ముందుకొచ్చేస్తాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సుగర్ ఫాక్టరీ ఉన్నప్పుడు దానిలో పని చేసి కొన్ని వేల మంది బతికారు. ఆ ఫాక్టరీ మూతపడిపోయిన తరువాత దాని కార్మికులు ఎక్కడెక్కడికో వలస వెళ్ళి ఎ.టి.ఎం. సెక్యూరిటీ గార్డులుగా, అపార్ట్మెంట్ వాచ్‌మేన్‌లుగా మారారు. ఆముదాలవలస సుగర్ ఫాక్టరీ మూతపడడానికి కారణం అందులో ముక్కూముఖం తెలియనివాళ్ళకి షేర్ కేపిటల్ ఇచ్చి డైరెక్టర్లని చెయ్యడం. ఆ డైరెక్టర్లు ఆ ఫాక్టరీకి చెందిన చెరుకుని దొంగతనంగా వేరే ఫాక్టరీలకి అమ్ముకున్నారు. ఆ ఫాక్టరీ మూతపడకముందు కూడా అందులో ఒక్క ఎర్ర పార్టీకీ అనుబంధ కార్మిక సంఘం లేదు. బ్లూ కాలర్ కార్మికుల మీద లేని శ్రద్ధని ప్రభుత్వ ఉద్యోగుల మీద చూపిస్తున్నాయి ఈ ఎర్ర పార్టీలు.

      తొలగించండి
  10. ఆర్.టి.సి. కార్మికుల సమ్మెకి మద్దతు ఇచ్చినవాళ్ళ అసలు ముఖాలు బయటపడుతున్నాయి. రోజుకి 300-500 సంపాదించే లారీ డ్రైవర్ల జీవితాల గురించి ఆలోచించకుండా నెలకి ముప్పై వేలు సంపాదించే ఆర్.టి.సి. డ్రైవర్ల గురించి ఎందుకు బాధపడుతున్నారని నేను అడిగితే నా వర్గ చైతన్యాన్నే అనుమానించారు. ఒరిస్సాలో గ్రామ సేవక్ జీతం నెలకి ఎనిమిది వేలే అయినా అక్కడి గ్రామ సేవకులు గ్రామాల్లో పని చెయ్యకుండా పట్టణాల్లో ఇళ్ళు అద్దెకి తీసుకుంటున్నారు. పని చెయ్యని ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎవరూ కంప్లెయింట్ ఇవ్వడం లేదెందుకు అని కూడా అడిగాను. ఇప్పుడు వాళ్ళు ముసుగులు తీసారు. ఆర్.టి.సి. సమ్మె విఫలమైతే రెవెన్యూ ఉద్యోగులు & టీచర్ల సమ్మెలు కూడా విఫలమవుతాయని బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 2002 బేచ్ సీనియర్ టీచర్ల జీతం డబ్బై వేలు నుంచి ఎనభై వేలు. ఇంత జీతం తీసుకునే టీచర్లు క్లాస్ మధ్యలో బయటకి వెళ్ళి సిగరెట్లు తాగుతున్నారు. వీళ్ళకి జీతాలు పెంచడం ఎందుకు, ఉద్యోగాల నుంచి పీకేస్తే పోదా? తెలంగాణాలోని ప్రభుత్వ టీచర్లైతే పల్లెటూర్లలో పని చెయ్యడానికి కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళు పట్టణాలకి ట్రాన్స్‌ఫర్‌లు చెయ్యించుకోవడం వల్ల అక్కడ 900 స్కూల్‌లలో ఒక్క టీచర్ కూడా లేడు. ఆ స్కూల్‌లని మూసెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఆ టీచర్ల చేత పని చెయ్యించగలిగే స్థితిలో ప్రభుత్వం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొత్తానికి సమ్మె/ఉద్యమం ముగిసింది అంటారు. ఇంతకీ ఇది విన్-విన్ సిట్యుయేషన్ అంటారా ఆర్టీసీ కార్మికులకు మరియు కెసిఆర్ గారికి?

      తొలగించండి
    2. క్లాస్ మధ్యలో సిగరెట్ తాగితే ఉద్యోగం లోంచి తీసేస్తావా? అయితే క్లాసు మధ్యలో ఒంటేలు కోసం అడిగితే పిల్లాడిని కూడా డిబార్ చేస్తావా?

      తొలగించండి
    3. ఒంటెలు వస్తే ఎవరు ఆపుకోగలరు? సిగరెట్ తాగాలనుకుంటే ఆపుకోగలరు కానీ......

      తొలగించండి
    4. Jai,
      // " ముందుండి సమ్మె చేయండి, మీ ఎంబడి నిలబడి దొర మదం అణిచేస్తాం" అంటూ గప్పాలు కొట్టిన రాజకీయ నాయకులు సమ్మె చతికిలపడ్డంక బెల్లం కొట్టిన రాయోలె చడీచప్పుడు చేయడం లేదు." //


      “It doesn’t take a hero to order men into battle. It takes a hero to be one of those men who goes into battle.” – General Norman Schwarzkopf, U.S. Army
      ------------
      “Always do everything you ask of those you command.”
      – General George S. Patton, U.S. Army
      ------------

      తొలగించండి
    5. విన్నకోట వారూ, కొటేషన్లు అదుర్స్!

      తొలగించండి
    6. ఒంటేలు కూడా ఒకటో అంకె వేసి ఆపుకోవచ్చు.

      తొలగించండి
  11. మా దగ్గర ఇప్పుడు టైము రాత్రి 7:30 అవుతోంది. కానీ
    మీ వైపుల అప్పుడే కొత్త సంవత్సరం ప్రవేశించినట్లుందిగా. మీకు,మీ కుటుంబసభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 👍.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు మేష్టారు. రాత్రి మీ మెసేజ్ చూసాను కానీ అప్పుడు వీలవ్వలేదు రెస్పాండ్ అవడానికి. రాత్రి కాస్త ఆఫీస్ పనిలో బిజీ.
      నూతన సంవత్సర శుభాకాంక్షలు మేష్టారు.

      తొలగించండి
    2. మీకు, మీ కుటుంబీకులకు, మీ సహోద్యోగులకు (మేనేజరు సుబ్బారావు మినహా?), మీ క్లయంట్లకు & మీ దేశంలో అందరికీ (కెంగరూలతో సహా) హాపీ న్యూ ఇయర్.

      2020లో మీరు కారు కొనుక్కొని, సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ అలా షికారుకు వెళ్లి బ్రాడ్మాన్ మ్యూసియం చూసొచ్చి, సదరు తీర్థయాత్ర విశేషాలు బ్లాగులో రాస్తే మాబోంట్లు చదివి మేమే వెళ్లినంత సంతోషించాలని నా అభిలాష.

      తొలగించండి
    3. Yes, Jai. అలాగే PR కోసం అప్లికేషన్ కూడా పెట్టి 😉👍.

      తొలగించండి
    4. PR వస్తే మహద్భాగ్యం కానీ అది కావాలంటే అదేదో యాగం చేయాలేమో గురువు గారూ. మన వంటికి వడియాలు తప్ప యాగాలు పడుతాయా చిన్న డౌటనుమానం!

      తొలగించండి
    5. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కాబట్టి ఇంకో సుబ్బారావు, కాకపోతే పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంతకు ముందు విజయ్ కాంత్ సినిమా భరిస్తున్నట్లు ఉండేది ఇప్పుడు బాలకృష్ణ సినిమా అన్నట్లు ఉంది.

      మీ దీవెనలు ఫలించి ఆ కారేదో నేను ఈ సంవత్సరమే కొనెస్తే బాగుంటుంది.

      తొలగించండి
    6. కారు కొంటే సరిపోదు మిత్రమా, ఆ మొక్కు బ్రాడ్మాన్ మ్యూజియం వేంచేసి తీర్చికోరూ ప్లీస్ లేకుంటే సచిన్ మీద ఒట్టే.

      ఈ తడవ వచ్చే ప్రాజెక్ట్ రాజేంద్ర ప్రసాద్/అల్లరి నరేష్ సినిమా తరహాలో ఆహ్లాదంగా ఉల్లాసంగా సాగిపోవాలని దర్శకేంద్ర స్వామి, రాజమౌళీశ్వర స్వామి లాంటి కోట్లాది మీ/మా సినీ దేవతలకు ప్రార్థిస్తున్నాను. నేనసలు నాస్తికుడిని కాబట్టి "దేముడు" తప్పక కరుణిస్తాడు.

      తొలగించండి
    7. నేను వద్దనుకున్నా మీరు వది లే ట్లు లేరు జై గారు కాబట్టి బ్రాడ్ మాన్ మ్యూజి యం చూసేస్తా

      తొలగించండి
  12. హ్హ హ్హ హ్హ, ఆ వడియాల యాగమే చేస్తే సరి, రెండూ కలిసొస్తాయి 😀.

    రిప్లయితొలగించండి
  13. ఇక్కడ ఇప్పుడు PR బాగా కష్టం అయిపోతోంది మేస్టారూ, కాంపిటీషన్ పెరిగిపోయి.

    రిప్లయితొలగించండి
  14. ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా మీరుంటున్న సిడ్నీ నగర దరిదాపుల్లే మంటలు చెలరేగుతున్నాయిట, ఏమిటి సంగతి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఏముంది ?

      మొన్నటి గ్రహాల కూటమి యే కారణం

      జిలేబి

      తొలగించండి
    2. బుష్ ఫైర్ అన్నది ఇక్కడ ప్రతీ వేసవిలో జరిగేదే మేష్టారు, కాకపోతే ఈ సంవత్సరం మోతాదు మించి జరుగుతోంది. వర్షాలు కురవకపోవడం వల్ల ఈ బుష్ ఫైర్ కంట్రోల్ లోకి రావడం లేదు.

      తొలగించండి
    3. జిలేబి గారూ, మీ ఆలోచనా తరంగాలు కూడా కరక్టే అయి ఉండచ్చు.

      తొలగించండి
    4. బోడి బుష్ ఫైర్ కంట్రోల్ చెయ్యడానికి వర్షమే కురవాలా? బుస్సుమని ఒంటేలు పొయ్యడానికి ఊరందరూ ఆవైపుకే పోతే చాలదూ?

      తొలగించండి
    5. అంత సులువైతే బాగుండేది సూర్య గారు :)

      తొలగించండి
  15. కురిసింది వాన // మా ఊరిలోన // పెను మంటలే ఆరగా //

    అని పాడుకుంటున్నారా, పవన్ ? 🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును మేస్టారు, వర్షాలు పడుతున్నాయి, మంటలు తగ్గిపోయాయి 😀
      ప్రకృతి కి తనను రక్షించుకోగలిగే శక్తి ఉందని మరో సారి నిరూపించుకుంది.

      తొలగించండి


  16. ఐదు వేల ఒంటెల్ని నీళ్లెక్కువ తాగేస్తున్నాయని మీ దేశం లో కాల్చేసేరంటగా నిజమేనాండి ? ఏ బ్లూ‌క్రాసూ నోరు విప్పినట్టు లేదే ?




    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నోర్లు లేచాయి గానీ అందరికీ వినపడలేదు

      మా దేశమా? మేము ఉంటున్న దేశం :) అంతే జిలేబి గారు

      తొలగించండి

    2. మనముంటున్న దేశాలంతా మనదేనండీ ! కాకుంటే అక్కడెట్లా వుంటాం :)



      తొలగించండి
  17. పనిలేని బార్బర్లుండరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారు కాకపోతే ఇక్కడ కూసింత తక్కువ అనుకుంటాను

      తొలగించండి